অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মণিপুরী   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ఆధార్ గురించి

ఆధార్ గురించి

వ్యక్తిగత గుర్తింపు, చిరునామాలకు భారతదేశంలో ఎక్కడైనా ఈ సంఖ్య ఆధారంగా పనికివస్తుంది. ఆధార్ లెటర్ భారతీయ తపాలా శాఖ ద్వారా బట్వాడా అయినా లేక ఇంటర్నెట్ లో యు.ఐ.డి.ఎ.ఐ వెబ్ సైట్ ద్వారా డౌన్ లోడ్ చేసుకున్న ఇ-ఆధార్ కూడా సమానమైన యోగ్యత కలిగినవి.

భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ పేర్కొన్న తనిఖీ ప్రక్రియకు లోబడి, భారతదేశంలో నివసించే ప్రతి వ్యక్తి ఆధార్ కోసం ఉచితంగా ఒకసారి నమోదు చేసుకోవచ్చు.

ప్రతీ ఆధార్‌ సంఖ్య ప్రతి వ్యక్తికీ విశిష్టమైనది, ఆ వ్యక్తి జీవిత కాలానికి విలువైనది. బ్యాంకింగ్‌, మొబైల్‌ ఫోన్ కనెక్షన్‌లు, ప్రభుత్వ, ప్రభుత్వేతర సేవలను పొందేందుకు ఆధార్ మీకు సహకరిస్తుంది.

ఆధార్‌ ఎలా ఉంటుందంటే:

  • ఆన్‌లైన్‌లో సులభంగాను, ఉచితంగానూ తనిఖీ చేసుకోవచ్చు.
  • ప్రభుత్వ, ప్రైవేటు సమాచార నిధులలో ఎక్కువ సంఖ్యలో ఉన్న డూప్లికేట్‌, ఫేక్‌ గుర్తింపులను తొలగించగలిగే విశిష్టత మరియు సత్తా కలిగినది.
  • ఆధార్‌ మాషాగా ఉత్పత్తి చేయబడే సంఖ్య. ఇది కుల, జాతి, మత, భౌగోళిక విభాగాలను సూచించేది కాదు.

చివరిసారిగా మార్పు చేయబడిన : 5/28/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate