অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ఆధార్ నమోదు (ఎన్రోల్మెంట్)

ఆధార్ నమోదు (ఎన్రోల్మెంట్)

ఆధార్ నమోదు (ఎన్రోల్మెంట్) ప్రక్రియకు ఆధార్ నమోదు (ఎన్రోల్మెంట్) సెంటరును సందర్శించవలసి ఉంటుంది, ఎన్రోల్మెంట్ ఐడిను కలిగివున్న రసీదు పొందడానికి ఎన్రోల్మెంట్ ఫారం నింపి, డెమోగ్రాఫిక్ మరియు బయోమెట్రిక్ డేటా క్యాప్చర్ చేసి, ఐడెంటిటీ (గుర్తింపు) మరియు అడ్రస్ (చిరునామా) డాక్యుమెంట్లను సమర్పించవలెను.

ఎక్కడ నమోదు (ఎన్రోల్మెంట్) చేసుకోవాలి: ఎన్రోల్మెంట్ కేంద్రాల జాబితాను ఆన్లైన్లో ఇక్కడ చూడవచ్చు

ఆధార్ స్టేటస్ (స్థితిని) చెక్ (తనిఖీ) చేసుకోవడం: ఆధార్ నమోదు ప్రక్రియ పూర్తయిన నివాసులు వారి ఆధార్  లేదా ఇంకా జనరేషన్ కింద ఉందా అను స్టేటస్ (స్థితిని) ఈ లింక్ లోకి వెళ్లి వారి ఎన్రోల్మెంట్ రసీదు స్లిప్ పైన ఉండే తాత్కాలిక ఎన్రోల్మెంట్ ఐడి - ఇఐడి (14 అంకెల ఎన్రోల్మెంట్ సంఖ్య మరియు 14 అంకెల ఎన్రోల్మెంట్ తేదీ మరియు సమయం) వివరాలను అందించడం ద్వారా తెలుసుకోవచ్చు https://resident.uidai.net.in/web/resident/check-aadhaar-status

ఇ-ఆధార్ డౌన్ లోడ్: ఇప్పుడు మీరు మీ ఆధార్ యొక్క ఎలక్ట్రానిక్ వెర్షన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇ-ఆధార్ అసలైన ఆధార్ ఉత్తరం వలే చెల్లుతుంది మరియు మీ ఆధార్ లేదా ఎన్రోల్మెంట్ రసీదు స్లిప్ పైన ఉండే తాత్కాలిక ఎన్రోల్మెంట్ ఐడి - ఇఐడి (14 అంకెల ఎన్రోల్మెంట్ సంఖ్య మరియు 14 అంకెల ఎన్రోల్మెంట్ తేదీ మరియు సమయం) వివరాలను సమర్పించి డౌన్ లోడ్ చేసుకోవచ్చు https://eaadhaar.uidai.gov.in/

ఆధార్ ఎన్రోల్మెంట్ ముఖ్యాంశాలు:

  • ఆధార్ నమోదు ఉచితం.
  • మీరు ఐడెంటిటీ (గుర్తింపు) మరియు అడ్రస్ (చిరునామా) డాక్యుమెంట్లతో భారతదేశం లో ఎక్కడైనా ఏ అధికారిక ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్ కు అయినా వెళ్ళవచ్చు.
  • ఐడెంటిటీ (గుర్తింపు) మరియు అడ్రస్ (చిరునామా) డాక్యుమెంట్లను యుఐడిఎఐ విస్తృత పరిధిలో అంగీకరిస్తుంది. దేశవ్యాప్తంగా చెల్లుబాటు అయ్యే డాక్యుమెంట్ల జాబితా కోసం ఇక్కడ క్లిక్ చేయండి. సాధారణంగా ఐడెంటిటీ (గుర్తింపు) మరియు అడ్రస్ (చిరునామా) డాక్యుమెంట్లకు ఎన్నికల (ఎలక్షన్ ఐడి కార్డు) ఫోటో గుర్తింపు కార్డు, రేషన్ కార్డు, పాస్ పోర్ట్ మరియు డ్రైవింగ్ లైసెన్స్ లు నిరూపణలు (ప్రూఫ్).
  • పాన్ కార్డు మరియు గవర్నమెంట్ ఐడి (గుర్తింపు) కార్డులు వంటి ఫోటో ఐడి కార్డులు ఐడెంటిటీ (గుర్తింపు) నిరూపణ (ప్రూఫ్) కోసం అనుమతించబడతాయి. ఆఖరి మూడు నెలల నీటి - విద్యుత్ - లాండ్ లైన్ టెలిఫోన్ బిల్లులు అడ్రస్ (చిరునామా) ప్రూఫ్ డాక్యుమెంట్లుగా కూడా  ఉన్నాయి.
  • ఫోటో కలిగిన ప్యాన్‌కార్డు, ప్రభుత్వం ఇచ్చే గుర్తింపు కార్డులు వ్యక్తిగత గుర్తింపుకు ఆధారాలుగా అంగీకరించబడుతాయి. నీటి బిల్లులు, విద్యుత్ బిల్లులు, టెలిఫోన్ బిల్లులు మొదలైనవి మూడునెలల క్రితం నుంచి ఉన్నట్లైతే వాటిని ధృవీకరణ పత్రాలుగా స్వీకరిస్తారు.
  • పైన పేర్కొన్న సాధారణ ధృవీకరణ పత్రాలు ఏవీ మీ దగ్గర లేనట్లైతే మీ గుర్తింపును ధృవీకరిస్తూ గెజిటెడ్ ఆఫీసర్ / తహసీల్దార్‌లలో ఎవరైనా వారి లెటర్‌హెడ్‌పై ఇచ్చే పత్రాన్ని మీ గుర్తింపు పత్రంగా అనుమతిస్తారు. చిరునామా ధృవీకరణ పత్రానికి ఇటువంటి నిర్ధారిత పత్రాన్ని మీరు ఒక ఎం. పి. నుంచి గానీ, ఎం. ఎల్. ఏ. నుంచి గానీ, గెజిటెడ్ ఆఫీసర్ నుంచి గానీ, తహసీల్దార్ నుంచి గానీ వారి లెటర్‌హెడ్‌పై రాసినది సమర్పించవలసి ఉంటుంది. గ్రామీణ ప్రాంతాలలో అయితే గ్రామ పంచాయితీ అధ్యక్షులు గానీ, వారితో సమానమైన హోదా కలిగినవారు ఇచ్చిన ధృవీకరణ పత్రాన్ని గానీ అనుమతిస్తారు.
  • ఒక్క కుటుంబంలోని ఒక వ్యక్తి ప్రమాణ గుర్తింపు ధృవీకరణ పత్రాలు కలిగి ఉండకపోయినప్పటికీ తమ కుటుంబ ధృవీకరణ పత్రంలో అతని / ఆమె పేరు ఉన్నట్లైతే అతను / ఆమె ఆధార్ కోసం నమోదు చేసుకోవచ్చు. ఇటువంటి సందర్భాలలో కుటుంబ యజమాని తనకు సంబంధించిన ప్రమాణ వ్యక్తిగత గుర్తింపు మరియు చిరునామా ధృవీకరణ పత్రాలతో మొదటగా ఆధార్‌కోసం నమోదు చేసుకోవాలి. ఆ తర్వాత తన కుటుంబంలోని ఇతర సభ్యులందరిని ఆధార్ నమోదుకు కుటుంబ పెద్దగా తానే పరిచయం చేయవచ్చు. భా. వి. గు. ప్రా. సం. వ్యక్తిగత సంబంధాలు, చుట్టరికాలకు సంబంధించిన 8రకాల గుర్తింపు పత్రాలను అనుమతిస్తుంది. జాతీయ స్థాయిలో ఎక్కడైనా అనుమతించబడే ప్రమాణ పత్రాల జాబితాకోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • ఆధార్ నమోదుకు సంబంధించి ఒక నివాసి వద్ద ఎటువంటి ప్రమాణ ధృవీకరణ పత్రం లేకపోతే అతను / ఆమె ఆధార్ నమోదు కేంద్రం వద్ద అందుబాటులో ఉండే ఆధార్ పరిచయ కర్తల సహాయం ద్వారా నమోదు చేసుకోవచ్చు. ఇటువంటి పరిచయ కర్తలను రిజిస్ట్రార్ ఒక ప్రకటన ద్వారా అందరికీ తెలియజేస్తారు. ఇందుకు సంబంధించిన అదనపు సమాచారంకోసం సంబంధిత రిజిస్ట్రార్ కార్యాలయాన్ని సంప్రదించవచ్చు.
  • నమోదు కేంద్రం వద్ద లభించే దరఖాస్తు ఫారంలో దయచేసి మీ వ్యక్తిగత వివరాలను నింపండి. నమోదు ప్రక్రియలో భాగంగా మీ ఫోటో, వేలిముద్రలు మరియు హైరీస్ స్కాన్ మొదలైనవి కూడా సేకరిస్తారు. నమోదు ప్రక్రియలో భాగంగానే వీరు ఈ వివరాల అన్నింటిని సరిచూసుకోవచ్చు. తప్పులు ఉంటే వాటిని సరిదిద్దుకోవచ్చు. నమోదులో సేకరించిన సమాచారం తాత్కాలిక నమోదు సంఖ్య మొదలైన వివరాలతో కూడిన ఎక్నాలెజ్‌మెంట్ రశీదును నమోదు కేంద్రం వద్ద మీకు ఇస్తారు.
  • మీరు ఒక్కసారే నమోదు చేసుకోవాలి. మరల మరల నమోదు చేసుకోవడం దండుగ పని, వృథా. దీనివల్ల మీరు సమయాన్ని నష్టపోతారు. మీరు ఎన్నిసార్లు నమోదు చేసుకున్నా ఒక్క ఆధార్ నంబర్‌నే పొందగలుగుతారు.
  • మీరు ఇచ్చిన సమాచారంపై ఆధారపడి మీ వివరాలు కేంద్రీకృత పద్ధతిలో తనిఖీ చేయబడుతాయి. ఒకవేళ మీ దరఖాస్తు విజయవంతమైతే, మీ పేరున ఒక ఆధార్ నంబర్ ఉత్పత్తి చేయబడి, మీ చిరునామాకు పంపబడుతుంది.
  • సి. ఐ. డి. ఆర్‌. కు నివాసుల సమాచారం చేరిన తరువాత ఆధార్ కార్డుల పంపిణీకి సుమారుగా 69 – 90 రోజులు పట్టవచ్చు. అయితే, ఎన్. పి. ఆర్. పద్ధతిలో మీ వివరాలను నమోదు చేసినట్లైతే ఆధార్ కార్డును పొందడానికి ఇంకా ఎక్కువ సమయం పట్టవచ్చు.

నమోదు ప్రక్రియ పూర్తయిన తర్వాత, సేకరించిన వివరాల నాణ్యతను నమోదు కేంద్ర సూపర్‌వైజర్‌లు పరిశీలిస్తారు. ఎక్కడైనా తప్పులను సరిచేయాల్సిన అవసరం కలిగితే వాటిని సమాచార కేంద్రీకృత ప్రక్రియలో సరిచేస్తారు. వెంటనే నమోదు ఏజెన్సీ ఈ సమాచారాన్ని భా. వి. గు. ప్రా. సం. సమాచార కేంద్రానికి పంపుతాడు. సి. ఐ. డి. ఆర్. లో ఈ సమాచారం వివిధ దశలలో వడపోతకు గురై విలువల మదింపు చేయబడుతుంది. సేకరించిన సమాచారం యొక్క నాణ్యతను, విలువను మరియు డూప్లికేట్‌కాని విధంగాను ఈ ప్రక్రియ నిర్ధారిస్తుంది. నివాసుల నుంచి సేకరించిన డెమోగ్రఫిక్ / బయోమెట్రిక్ సమాచారాలలో సంక్షిప్త నాణ్యత పరీక్షను నిర్వహించబడతాయి. దీనితోపాటు ఆపరేటరు / సూపర్‌వైజర్ / పరిచయ కర్త / నమోదు ఏజెన్సీ మరియు రిజిస్ట్రార్‌ల వద్దనున్న ప్రతి ప్యాకెట్‌లోని సమాచారం యొక్క విలువను మదింపు చేయబడుతుంది. ఇలా సమాచారం యొక్క నాణ్యత తనిఖీలు, ఇతర విలువల నిర్ధారింపులు జరిగిన తర్వాతనే డీ – డూప్లీకేషన్ పంపబడి ఆ తర్వాత ఆధార్ నంబర్ ఉత్పత్తి చేయబడుతుంది

ఒకవేళ ఏవైనా తప్పులు ఉన్నట్లైతే, ఆ తప్పులు ఉన్న సమాచారం కలిగిన ప్యాకెట్ల విలువల మదింపు ప్రక్రియ నిలిపి వేయబడుతుంది. ఉదాహరణకు ఒక నివాసి వివరాలను నమోదు చేయడంలో ఆపరేటర్ తప్పులు చేసినట్లైతే ఫోటో, వయస్సు, లింగం (చిన్నపిల్ల వాడి ఫోటో వయసు యాభై సంవత్సరాలుగా నమోదైతే) మొదలైన వాటి నమోదులో తప్పులు ఉన్నట్లైతే ఈ ప్యాకెట్‌లోని సమాచార అసలు విలువలను నిర్ధారించడానికి, సమాచారంలోని పొసగుదల కోసం తిరిగి సమీక్షించమని, తనిఖీ చేయమని కోరడం జరుగుతుంది. ఇలా సమాచారంలో తప్పులు కలిగి ఉన్న ప్యాకెట్‌లలోని తప్పులను సరిచేయడానికి, సాధ్యమైన అన్నిచోట్ల చర్యలు తీసుకోబడుతాయి. కుదరనప్పుడు నివాసికి తిరిగి ఆధార్‌కోసం నమోదు చేసుకోమని లేఖ పంపడం జరుగుతుంది. ఆధార్‌కు సంబంధించిన లేఖల ముద్రణ మరియు పంపిణీలకు సంబంధించి ఇండియా పోస్ట్ బాధ్యత వహిస్తుంది. ఇప్పటికే ఉన్నపని అంటే, లేఖల ముద్రణ వీటిని నివాసులకు పంపిణీ చేయడం మొదలైన పనులను దృష్టిలో ఉంచుకొని ఇండియా పోస్ట్ సాధారణంగా 3-5 వారాల సమయాన్ని తీసుకుంటుంది.

ఈ పద్ధతిలో సేకరించిన సమాచారం యొక్క విలువల మదింపుకు ఆధార్ సంఖ్య ఉత్పత్తి చేయడానికి పైన నిర్దేశించిన 60-90 రోజుల సమయం కన్నా ఎక్కువ సమయం పడుతుంది. నివాసులు తమ రిజిస్ట్రార్‌ను నమోదు కేంద్రం వద్ద తనిఖీ చేసుకోవచ్చు లేదా నమోదు చేసుకున్న తర్వాత తమకు ఇచ్చే ఎక్నాలెజ్‌మెంట్ మీద చూసుకోవచ్చు. ఒకవేళ రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా వద్ద మీ రిజిస్ట్రార్ అయినట్లైతే తదుపరి వివరాల కోసం రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా కార్యాలయాన్ని సంప్రదించండి.

క్రింది రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాల నివాసితులు / జిల్లాల్లో చదువుతున్నారు నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ (ఎన్పిఆర్) సిద్ధమవుతున్న నిర్వర్తించే భారతదేశం రిజిస్ట్రార్ జనరల్ కార్యాలయం నిర్వహించిన ఉంది గమనించండి ఉండవచ్చు. నివాసితులు విడిగా ఆధార్ నమోదు చేయాల్సిన అవసరం ఉంది.

  • రాష్ట్రాలు: అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, జమ్మూ & కాశ్మీర్, మేఘాలయ, మిజోరం, ఒడిశా, తమిళనాడు మరియు పశ్చిమ బెంగాల్
  • కేంద్రపాలిత ప్రాంతము: అండమాన్ మరియు నికోబార్ దీవులు, దాదర్, నగర్ హవేలీ, లక్షద్వీప్
  • కర్ణాటక జిల్లాలు:ఉడిపి, గడగ్, ఉత్తర కన్నడ, హవేరి, దేవనగరి, బెంగుళూర్ గ్రామీణ, చిక్కబల్లాపూర్ మరియు కొడగు

 

ఆధారము: యుఐడిఎఐ వెబ్ సైట్

చివరిసారిగా మార్పు చేయబడిన : 5/28/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate