హోమ్ / ఇ-పాలన / డిజిటల్ ఇండియా / డిజిటల్ ఇండియా దార్శనికత (విజన్)
పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

డిజిటల్ ఇండియా దార్శనికత (విజన్)

డిజిటల్ ఇండియా దార్శనికత (విజన్) మరియు దార్శనికత రంగాలు (విజన్ ఏరియాస్) గురించిన సమాచారం

భారతదేశాన్ని డిజిటల్ పరంగా శక్తిమంతమైన సమాజంగా, నాలెడ్జి ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చేయడమే డిజిటల్ ఇండియా దార్శనికత (విజన్).

డిజిటల్ ఇండియా దార్శనికత రంగాలు (విజన్ ఏరియాస్)

డిజిటల్ ఇండియా కార్యక్రమం మూడు కీలక దార్శనికత రంగాలపై దృష్టిపెట్టింది:

1. ప్రతి పౌరుడికి సాధనంగా డిజిటల్ మౌలిక వసతులు:

దేశంలోని అన్ని ప్రాంతాలు ఇతర ప్రాంతలతో బాగా అనుసంధానించబడి ఉండడం అనేది గొప్ప సేవలు అందించే దేశానికి పూర్వావశ్యకత కాగలదు. భారతదేశంలో అత్యంత మారుమూలల్లో ఉన్న పల్లెలు బ్రాడ్‌బ్యాండ్, హై స్పీడ్ ఇంటర్నెట్‌ల ద్వారా డిజిటల్‌గా అనుసంధానించబడితే, ప్రతి పౌరుడికి ఎలక్ట్రానిక్ మార్గంలో సేవలను, లక్షిత సాంఘిక ప్రయోజనాలను, ఆర్థిక సమ్మిళితాన్ని వాస్తవికంగా సాధించవచ్చు. డిజిటల్ ఇండియా కేంద్రంగా ఉన్న దార్శనికతలో కీలక రంగాలలో ఒకటేమిటంటే...”ప్రతి పౌరుడికి ప్రయోజనంగా డిజిటల్ మౌలిక వసతి.

ఈ దార్శనికత కింద ఓ కీలకమైన భాగంగా వివిధ సేవలను ఆన్‌లైన్ మార్గంలో సరఫరా చేయడానికి వీలు కల్పించేలా హై స్పీడ్ ఇంటర్నెట్‌ను ఓ కీలకమైన ప్రయోజనంగా చేశారు. డిజిటల్ గుర్తింపు, ఆర్థిక సమ్మిళితం కోసం మౌలిక వసతులను ఏర్పాటు చేయాలని ప్రణాళిక వేయబడింది. వీటికోసం ఉమ్మడి సేవల కేంద్రాలు సులభంగా అందుబాటులో ఉండేలా చూశారు. పబ్లిక్ క్లౌడ్‌పై వాటా చేయగల ప్రైవేటు ప్రదేశాలుగా ఉండే “డిజిటల్ లాకర్ల”తో పౌరులకు అందించాలని కూడా ప్రతిపాదించబడింది. ప్రభుత్వ శాఖలు, ఏజెన్సీలు జారీ చేసిన దస్తావేజులను సులభంగా ఆన్‌లైన్‌లో అందుకునే ఏర్పాటు చేశారు. సైబర్‌స్పేస్‌ను సురక్షితమైనదిగా, భద్రత కలిగినదిగా చేసేందుకు కూడా ప్రణాళిక రూపొందించారు.

 • ప్రతి పౌరుడికి సేవల బట్వాడా కోసం ఓ కీలక సాధనంగా హైస్పీడ్ ఇంటర్నెట్‌ లభ్యత
 • ప్రతి పౌరుడికి విశిష్ఠమైన, జీవితకాలమంతా సాగే, ఆన్‌లైన్ ద్వారా జరిగే ప్రమాణీకకరమైన తీవ్ర స్థాయి డిజిటల్ గుర్తింపును పొందడానికి ఊయల
 • డిజిటల్ మరియు ఆర్థిక రంగంలో మొబైల్ ఫోన్ & బ్యాంకు ఖాతా కలిగిన పౌరుడి భాగస్వామ్యం
 • ఉమ్మడి సేవా కేంద్రానికి సులభ ప్రవేశం
 • పబ్లిక్ క్లౌడ్ పై పంచుకోగలిగిన ప్రైవేటు రంగం
 • సురక్షిత, భద్రమైన సైబర్ స్పేస్.

2. డిమాండ్‌పై పరిపాలన & సేవలు:

ఏళ్ల తరబడిగా, ఇ గవర్నన్స్ శకంలో దూసుకెళ్లడం కోసం వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర మంత్రిత్వ శాఖలు పెద్ద స్థాయిలో కార్యక్రమాలను చేపడుతున్నాయి. ప్రజా సేవల బట్వాడాను మెరుగుపరచి, వాటిని అందుకునే ప్రక్రియను సులభతరం చేసేందుకు అనేక స్థాయిల్లో నిలకడైన ప్రయత్నాలు చేస్తున్నారు. పౌర కేంద్రీకృతం, సేవ పునశ్చరణ, పారదర్శకత లాంటి పరిపాలనలోని సున్నితమైన అంశాలను కలిగిన ప్రయత్నాలకు ప్రభుత్వ శాఖలు కంప్యూటరీకరణను అమలు చేస్తుండడంతో భారతదేశంలో ఇ-గవర్నన్స్ నిలకడగా పరిణామక్రమాన్ని సంతరించుకుంటోంది.

దేశం నలుమూలలా ఇ-గవర్నన్స్ ఆలోచనలను పవిత్రమైన దృష్టితో చూసి, వాటిని ఓ ఉమ్మడి దార్శనికతలోకి ఏకీకృతం చేయాలనే ఆలోచనతో నేషనల్ ఇ-గవర్నన్స్ ప్లాన్ (ఎన్.ఇ.జి.పి)కి 2006లో ఆమోదం లభించింది. ఈ ఆలోచన చుట్టూ, ఓ భారీ స్థాయి దేశవ్యాప్త మౌలిక వసతులను అత్యంత మారుమూల గ్రామానికి కూడా చేరుకునేలా అభివృద్ధి చేస్తున్నారు. ఇంటర్నెట్‌లో సులభమైన, నమ్మకమైన యాక్సెస్ చోటు చేసుకునేలా భారీ స్థాయిలో రికార్డుల డిజిటలైజేషన్ చోటు చేసుకుంటోంది. కామన్ సర్వీసీ డెలివరీ అవుట్‌లెట్ల ద్వారా అన్ని ప్రభుత్వ సేవలు సామాన్యుడికి అతనున్న చోటే లభించేలా చేయడం, సామాన్యుడి ప్రాథమిక అవసరాలకు వాస్తవరూపం ఇచ్చేందుకు చౌక ధరకు సమర్థవంతంగా, పారదర్శకంగా, విశ్వసనీయత ఉండేలా చూడాలన్నదే దాని అంతిమ ఉద్దేశ్యం".

దేశంలోని పౌరులు, వినియోగదారులందరికీ డిమాండ్‌పై పరిపాలన, సేవలు అందేలా చూసేందుకు ఆరు మూలకాలు కీలకంగా ఉన్నాయి.

 • వివిధ శాఖలు, అధికార పరిధుల మీదుగా క్రమరహితంగా సమగ్ర సేవలు
 • ఆన్‌లైన్ మరియు మొబైల్ వేదికల నుంచి సకాలంలో సేవల అందుబాటు
 • పౌరహక్కులు పూర్తిగా మార్పిడీ చేయబడి, క్లౌడ్‌లో అందుబాటులో ఉంటాయి
 • కార్యకలాపాలను నిర్వహించడాన్ని మెరుగుపరచడానికి డిజిటల్‌గా రూపాంతరం చెందిన సేవలు
 • ఆర్థిక లావాదేవీలను ఎలక్ట్రానిక్ మార్గంలో, నగదు రహితంగా చేయడం
 • నిర్ధయ తోడ్పాటు వ్యవస్థలు & అభివృద్ధి కోసం జియో స్పేషియల్ సమాచార వ్యవస్థలను సానుకూలం చేయడం.

౩. పౌరుల డిజిటల్ సాధికారత:

డిజిటల్ కనెక్టివిటీ అనేది ఓ గొప్ప స్థాయి సాధనం. జనాభాపరంగానూ, సామాజిక ఆర్థిక స్థితుల పరంగా విడిపోయినప్పటికీ, భారతీయులు డిజిటల్ నెట్‌వర్క్‌ ల మీదుగా ప్రయాణం చేస్తూ మొబైల్ ఫోన్లు, కంప్యూటర్ల ద్వారా ఒకరితో ఒకరు సంబంధాలను కలిగి, సంభాషించుకోవడం పెరుగుతోంది. డిజిటల్ అక్షరాస్యత, డిజిటల్ వనరులు, సహకార డిజిటల్ వేదికలపై దృష్టిని కేంద్రీకరించడం ద్వారా డిజిటల్ ఇండియా కార్యక్రమం తనంతతానుగానే భారతదేశాన్ని ఓ డిజిటల్ సాధికారత కలిగిన సమాజంగా రూపాంతరం కాగలననే నమ్మకాన్ని కలిగిస్తోంది. ఇది సార్వజనీన డిజిటల్ అక్షరాస్యతపైనా, భారతీయ భాషల్లో డిజిటల్ వనరులు/సేవలు అందుబాటులో ఉండేలా చేయడంపై కూడా దృష్టి పెడుతోంది.

 • సార్వజనీన డిజిటల్ అక్షరాస్యత
 • డిజిటల్ వనరులకు సార్వజనీనంగా ప్రాప్తి
 • భారతీయ భాషల్లో డిజిటల్ వనరులు/సేవల అందుబాటు
 • భాగస్వామ్య పరిపాలనలో సహకార డిజిటల్ వేదికలు
 • ప్రభుత్వ దస్తావేజులను/ధృవపత్రాలను పౌరులు భౌతికంగా సమర్పించాల్సిన అవసరం లేదు.

ఆధారం: డిజిటల్ ఇండియా వెబ్ సైట్

3.04430379747
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు