డిజిటల్ ఇండియా అనేది వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలను కలిగిన ఒకే గొడుగు కిందికి వచ్చే కార్యక్రమం. పెద్ద సంఖ్యలో ఆలోచనలను, భావాలను ఒక సమగ్రమైన దార్శనికతలోకి అల్లడం ద్వారా వాటిలో ఒక్కొక్కదానిని ఒక పెద్ద లక్ష్యంలో భాగంగా చేయవచ్చు. ప్రతి వ్యక్తిగత మూలకం తనంతతానుగా నిలబడుతున్నా ఓ పెద్ద దృశ్యంలో కూడా భాగంగా ఉంటుంది. ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ సంపూర్ణ సమన్వయంతో డిజిటల్ ఇండియా కార్యక్రమాన్ని ప్రభుత్వం పూర్తిగా అమలు చేయాల్సి ఉంటుంది. డిజిటల్ ఇండియా బ్రాడ్‌బ్యాండ్ హైవేలు, మొబైల్ కనెక్టివిటీకి సార్వజనీన ప్రవేశం, పబ్లిక్ ఇంటర్నెట్ యాక్సెస్ ప్రోగ్రామ్, ఇ-గవర్నెన్స్:సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ప్రభుత్వాన్ని సంస్కరించడం, ఇ-క్రాంతి, ఎలక్ట్రానిక్ మార్గంలో సేవల బట్వాడా, అందరికీ సమాచారం, ఎలక్ట్రానిక్స్ తయారీ, ఉద్యోగాలకు ఐ.టి, త్వరిత దిగుబడి కార్యక్రమాలు మొదలైనవాటి వృద్ధికి సంబంధించిన తొమ్మిది పునాదులకు మరింత ఊతం ఇవ్వాలనే ఆశయంతో భారత్ ముందుకుసాగుతోంది. ఈ రంగాల్లోని ప్రతి అంశం తమంతతాముగా జటిలమైనవి. వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలతో ముడిపడి ఉంటాయి.
డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్ కింద కీలకమైన ఐ.సి.టి మౌలిక వసతులను ఏర్పరచి, విస్తరించడం, సేవల బట్వాడా తదితరాలు సహా అన్ని ప్రయత్నాలు నిర్ధిష్ఠమైన గడువు లక్ష్యాలను కలిగి ఉంటాయి. చాలావరకు ప్రయత్నాలు మరో మూడేళ్లలోపు కార్యరూపం దాల్చేలా ప్రణాళిక రూపొందించారు. త్వరితగతిన పూర్తి చేసేలా ఆ ప్రయత్నాలకు (“సత్వర పంటకాపు కార్యక్రమాలు) ప్రణాళిక రూపొందించారు. పౌర కమ్యూనికేషన్ ప్రయత్నాలు (“అందరికీ సమాచారం”) ఇప్పటికే ప్రత్యక్షంగా కనిపిస్తూ, ముగింపు దశకు చేరుకుంటున్నాయి.
ప్రస్తుతమున్న పలు పథకాలను ఒక చోటుకు తీసుకురావడమే డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్ ఉద్దేశ్యం. ఈ పథకాలు పునర్నిర్మించబడి, ప్రక్షాళన చేయబడి, కొత్తగా దృష్టి కేంద్రీకరించబడుతాయి. ఓ పద్ధతి ప్రకారం అది అమలు చేయబడుతుంది. అనేక మూలకాలు తక్కువ ఖర్చు ప్రభావాలతో చేసిన ప్రక్రియ మెరుగుదలలు మాత్రమే. డిజిటల్ ఇండియా లాంటి కార్యక్రమాల ఉమ్మడి బ్రాండింగ్ తమ రూపాంతర ప్రభావాన్ని వెలుగులోకి తెస్తాయి. డిజిటల్ ఇండియా ద్వారా కోరుకున్న ఫలితాలను సాధించడం కోసం వినూత్నమైన పరిష్కారాలు కనుగొనేలా ఈ కార్యక్రమాన్ని అమలు చేసే క్రమంలో ప్రభుత్వం, పరిశ్రమ వర్గాలు, పౌర సమాజం, పౌరుల మధ్య విస్తృత సంప్రదింపులు జరుగుతున్నాయి. "మై గవ్" అని పిలిచే డిజిటల్ ప్లాట్ఫారంను ఎలక్ట్రానిక్, ఐ.టి మంత్రిత్వ శాఖ ఇప్పటికే ప్రారంభించిందిhttp://mygov.in/) ద్వారా సహకార, భాగస్వామ్య పరిపాలనకు వీలు కల్పించబడింది. అంతేకాక, డిజిటల్ ఇండియా దార్శనిక రంగాల అమలు విధానం గురించి చర్చించడం కోసం పలు సంప్రదింపులు మరియు శిక్షణాశిబిరాలు నిర్వహించడమైనది.
అందరికీ బ్రాడ్‌బ్యాండ్-రూరల్, అందరికీ బ్రాడ్‌బ్యాండ్-అర్బన్, నేషనల్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (ఎన్.ఐ.ఐ) పేరుతో మూడు ఉప విభాగాలున్నాయి.
i) అందరికీ బ్రాడ్‌బ్యాండ్-రూరల్: నేషనల్ ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ కింద 2016 డిసెంబర్ నాటికల్లా 2.50,00 పంచాయతీలను తీసుకురానున్నారు. టెలీకమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ దీనికి నోడల్ ఏజెన్సీగా వ్యవహరించనుంది.
ii) అందరికీ బ్రాడ్‌బ్యాండ్-అర్బన్: సేవా బట్వాడా కోసం వర్చువల్ నెట్వర్క్ ఆపరేటర్లకు బాధ్యతలు అప్పగించారు. కొత్త పట్టణ అభివృద్ధి కేంద్రాలు, భవనాలలో కమ్యూనికేషన్ మౌలిక వసతులు తప్పనిసరి చేయబడ్డాయి.
iii) నేషనల్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (ఎన్.ఐ.ఐ): వివిధ ప్రభుత్వ శాఖల్లో పంచాయతీ స్థాయి వరకు హైస్పీడ్ కనెక్టివిటీ మరియు క్లోడ్ ప్టాట్ఫారంలను అందించడం కోసం ఎన్.ఐ.ఐ దేశంలోని నెట్వర్క్ మరియు క్లౌడ్ మౌలిక వసతులను కలుపుతుంది. స్టేట్ వైడ్ ఏరియా నెట్వర్క్ (ఎస్.డబ్ల్యు.ఏ.ఎన్), నేషనల్ నాలెడ్జి నెట్వర్క్ (ఎన్.కె.ఎన్), నేషనల్ ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ (ఎన్.ఓ.ఎఫ్.ఎన్), గవర్నమెంట్ యూజర్ నెట్వర్క్ (జి.యు.ఎన్), మేఘ్రాజ్ క్లౌడ్ లాంటి నెట్‌వర్క్‌లను ఈ మౌలిక వసతుల భాగాలు కలిగి ఉంటాయి. ఎస్.డబ్ల్యు.ఎ.ఎన్లు, ఎన్.కె.ఎన్, ఎన్.ఓ.ఎఫ్.ఎన్, జి.యు.ఎన్ మరియు జి.ఐ క్లౌడ్ లాంటి అన్ని ఐ.సి.టి మౌలిక వసతుల భాగాలను కలపాలని ఎన్.ఐ.ఐ ఆశిస్తోంది. రాష్ట్ర్రం, జిల్లా, బ్లాక్, పంచాయతీ స్థాయిల్లో వరుసగా 100, 50, 20, 5 ప్రభుత్వ కార్యాలయాలు/సేవా కేంద్రాలకు సమతల కనెక్టివిటీ కోసం సౌలభ్యం ఉంటుంది. ఎలక్ట్రానిక్, ఐ.టి మంత్రిత్వ శాఖ ఈ ప్రాజెక్టుకు నోడల్ శాఖగా ఉంటుంది.
దేశంలోని నెట్వర్క్ వ్యాప్తి, కనెక్టివిటీలో వెలుతులను నింపడంపై ఈ ప్రయత్నం దృష్టి సారిస్తుంది.
దేశంలో సుమారు 55,619 గ్రామాలకు మొబైల్ కవరేజీ లేదు. ఈశాన్య భారతంలో సమగ్ర అభివృద్ధి ప్రణాళికలో భాగంగా ఇప్పటివరకు మొబైల్ కవరేజీలేని గ్రామాలకు మొబైల్ కవరేజీని అందించడం ప్రారంభమవుతుంది. దశల వారీ గ్రామాలకు మొబైల్ కవరేజీ అందించబడుతుంది.
టెలీకమ్యూనికేషన్ల శాఖ నోడల్ శాఖగా వ్యవహరిస్తుంది. 2014-18 మధ్యలో ఈ ప్రాజెక్టుకోసం సుమారు రూ. 16వేల కోట్లను వెచ్చిస్తారు.
పబ్లిక్ ఇంటర్నెట్ యాక్సెస్ కార్యక్రమం యొక్క రెండు ఉప భాగాలు ఉమ్మడి సేవా కేంద్రాలు(CSCs) మరియు పోస్ట్ ఆఫీస్ మల్టి-సర్వీస్ కేంద్రాలు.
ఉమ్మడి సేవా కేంద్రాలు(CSCs): ప్రతి గ్రామ పంచాయతీలో ఒక సియస్సి బలోపేతం మరియు వాటి సంఖ్య 250,000 వరకు పెంచవచ్చు. సియస్సిలు ప్రభుత్వ మరియు వ్యాపార సేవలు అందించడంలో అనుకూలమైన మరియు బహుళ ఉపయోగాలు కలిగిన అంత్య బిందువులగా (ఎండ్ పాయింట్స్) తయారవుతాయి. ఐటి&సి డిపార్టుమెంట్ ఈ పథకాన్ని అమలు చేయడానికి నోడల్ శాఖ. మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
బహుళ సేవా కేంద్రాలుగా తపాలా కార్యాలయాలు: మొత్తం 150,000 తపాలా కార్యాలయాలను బహుళ సేవా కేంద్రాలుగా మార్చాలని ప్రతిపాదించారు. ఈ పథకాన్ని అమలు చేసేందుకు తపాలా శాఖ నోడల్ ఏజెన్సీగా ఉంటుంది.
ప్రభుత్వ ప్రక్రియను సులభతరం చేసి మరింత సమర్థవంతంగా చేసేందుకు ఐటీని ఉపయోగిస్తున్న గవర్నమెంట్ ప్రాసెస్ రీఇంజినీరింగ్ వివిధ ప్రభుత్వ రంగాల్లో ప్రభుత్వ సేవల బట్వాడాను మరింత సమర్థవంతంగా చేసేందుకు కావాల్సిన రూపాంతరంలో కీలకంగా నిలుస్తోంది. కాబట్టి మంత్రిత్వ శాఖలు, విభాగాల ద్వారా అమలు చేయాల్సిన అవసరం ఉంది.
సాంకేతికత ద్వారా ప్రభుత్వాన్ని సంస్కరించడం కోసం మార్గదర్శక సూత్రాలు:
డేటాబేస్, సమాచారం ఎలక్ర్టానిక్ రూపంలో ఉండాలి కానీ మాన్యువల్‌గా కాదు. సమర్థవంతమైన ప్రభుత్వ ప్రక్రియలకు వీలు కల్పించడంతో పాటు పౌరులకు ఈ ప్రక్రియలను కనిపించేలా అనుమతించడానికి ప్రభుత్వ శాఖలు, ఏజెన్సీలలోపల పనితీరును యంత్రమయం(ఆటోమేట్) చేయాలి. అలాగే నిలిచిపోయిన సమస్యలను గుర్తించి, పరిష్కరించడానికి వీలుగా డేటాను యంత్రమయం(ఆటోమేట్) చేసి, స్పందించి, విశ్లేషించడానికి కూడా వీలు కల్పిస్తుంది. ఇది చాలావరకు మెరుగుదలను ప్రాసెస్ చేస్తుంది.
ఇ-క్రాంతి అనేది డిజిటల్ ఇండియాకు ముఖ్యమైన పునాది. దేశంలో ఇ-గవర్నెన్స్, మొబైల్ గవర్నెన్స్, గుడ్ గవర్నెన్స్ కీలక అవసరాన్ని పరిగణనలోకి తీసుకుని కేంద్ర ప్రభుత్వం “పరిపాలన రూపురేఖలు మార్చడం కోసం ఇ-గవర్నెన్స్‌ను రూపాంతరం చేయడం” అనే దార్శనికతతో 25.03.2015న ఇ-క్రాంతి విధానం, కీలక అంశాలకు ఆమోదముద్ర వేసింది.
అన్ని కొత్త మరియు ప్రస్తుతం కొనసాగుతున్న ఇ-గవర్నెన్స్ ప్రాజెక్టులు, ప్రస్తుతం ప్రక్షాళన జరుగుతున్న ప్రాజెక్టులతోపాటు ఇక ‘అనువాదం కాదు రూపాంతరం’, ‘వ్యక్తిగత సేవలు కావు సమగ్ర సేవలు’, ప్రతి ఎం.ఎం.పిలోనూ గవర్నమెంట్ ప్రాసెస్ రీఇంజినీరింగ్ తప్పనిసరి చేయడం’, ‘ఐసీటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆన్ డిమాండ్’, ‘క్లౌడ్ బై డిఫాల్ట్’, ‘మొబైల్ ఫస్ట్’, ‘ఫాస్ట్ ట్రాకింగ్ అప్రూవల్స్’, ‘ప్రమాణాలు, యోగ్యతలను తప్పనిసరి చేయడం’, ’భాష స్థానీకరణ’, ‘నేషనల్ జి.ఐ.ఎస్ (జియో స్పేషియల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్)’, ‘సెక్యూరిటీ, ఎలక్ట్రానిక్ డేటా సంరక్షణ’ ఇ-క్రాంతి కీలక సూత్రాలను అనుసరించాలి.
ఇ-క్రాంతి కింద 44 మిషన్ మోడ్ ప్రాజెక్టులు వివిధ దశల్లో అమలు జరుగుతున్నాయి.
నం. |
ప్రాజెక్ట్ |
బాధ్యత వహించే మంత్రిత్వ శాఖ / విభాగం |
---|---|---|
01 |
ఆదాయ పన్ను |
M/o Finance/Central Board of Direct Tax |
02 |
పాస్‌పోర్టు |
M/o External Affairs |
03 |
MCA21 |
M/o Company Affairs |
04 |
బీమా |
D/o Financial Services |
05 |
నేషనల్ సిటిజన్ డేటాబేస్ |
M/o Home Affairs/Registrar General of India (RGI) |
06 |
సెంట్రల్ ఎక్సైజ్ |
D/o Revenue/Central Board of Excise & Custom |
07 |
పెన్షన్లు |
D/o Pensions & Pensioners welfare & Dept. of Expenditure |
08 |
బ్యాంకింగ్ |
D/o Financial Services |
09 |
ఇ-ఆఫీస్ |
D/o Administrative Reforms & Public Grievances |
10 |
తపాలా |
D/o Posts |
11 |
వీసా & ఇమ్మిగ్రేషన్ |
M/o Home Affairs |
12 |
ఇ-సన్సద్# |
Ministry of Parliamentary Affairs |
13 |
పారా మిలిటరీ బలగాలకు ఉమ్మడి ఐ.టి రోడ్ మ్యాప్# |
M/o Home affairs |
నం. |
ప్రాజెక్ట్ |
బాధ్యత వహించే మంత్రిత్వ శాఖ / విభాగం |
---|---|---|
01 |
భూమి రికార్డులు |
M/o Rural Development |
02 |
రోడ్డు రవాణా |
M/o Road Transport & Highway |
03 |
ఆస్తి రిజిస్ట్రేషన్ |
D/o Land Resources and D/o Electronics and Information Technology |
04 |
వ్యవసాయం |
D/o Agriculture & Cooperation |
05 |
ఖజానాలు |
M/o Finance |
06 |
మంయికిపాలిటీస్ |
M/o Urban Development and Poverty Alleviation |
07 |
గ్రామ పంచాయతీలు |
M/o Panchayati Raj |
08 |
వాణిజ్య పన్నులు |
M/o Finance |
09 |
పోలీస్ (ప్రారంభంలో కేంద్ర పాలిత ప్రాంతాలు) |
M/o Home affairs |
10 |
ఉపాధి కల్పన |
M/o Labour & Employment |
11 |
పాఠశాల విద్య |
D/o School Education and Literacy |
12 |
ఆరోగ్యం |
D/o Health and Family Welfare |
13 |
పిడిఎస్ |
D/o Food and Public Distribution |
14 |
ఇ-విధాన్# |
Ministry of Parliamentary Affairs |
15 |
వ్యవసాయం 2.0# |
D/o Agriculture |
16 |
గ్రామీణాభివృద్ధి# |
D/o Rural Development |
17 |
స్ర్తీ, శిశు అభివృద్ధి# |
M/o Women and Child Development |
నం. |
ప్రాజెక్ట్ |
బాధ్యత వహించే మంత్రిత్వ శాఖ / విభాగం |
---|---|---|
01 |
EDI (E-Commerce)ఇ-కామర్స్ |
M/o Commerce & Industry |
02 |
ఇ-బిజ్ |
D/o Industrial Policy & Promotion |
03 |
ఉమ్మడి సేవాకేంద్రాలు (Common Services Centres) |
D/o Electronics and Information Technology |
04 |
ఇండియా పోర్టల్ |
D/o Electronics and Information Technology and D/o Administrative Reforms & Public Grievances |
05 |
ఇ-కోర్టులు |
D/o Justice |
06 |
ఇ-కొనుగోలు |
M/o Commerce & Industry/ DGS&D |
07 |
నేషనల్ సర్వీస్ డెలివరి గేట్ వే |
D/o Electronics and Information Technology |
08 |
ఆర్థిక సమ్మిళితం# |
D/o Financial Services |
09 |
నేషనల్ జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్# |
D/o Science & Technology |
10 |
సామాజిక ప్రయోజనాలు# |
M/o Social Justice and Empowerment as the leader and other welfare departments as co-owners |
11 |
రహదారులు మరియు ప్రధాన రహదరులు ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (RAHI) # |
M/o Road Transport & Highways |
12 |
ఇ-భాషా # |
D/o Electronics and Information Technology |
13 |
నేషనల్ మిషన్-ఐసిటి ద్వారా ఎడ్యుకేషన్ (NMEICT) # |
D/o Higher Education |
14 |
పట్టణ పరిపాలన # |
పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ |
విద్యారంగం కోసం సాంకేతికత- ఇ-విద్య: అన్ని పాఠశాలలను బ్రాడ్‌బ్యాండ్‌తో కలపనున్నారు. ఉచిత వైఫైను అన్ని మాధ్యమిక, ఉన్నత పాఠశాలల్లో అందిస్తారు. (సుమారు 250,000 పాఠశాలలు దీని పరిధిలో ఉంటాయి). డిజిటల్ అక్షరాస్యతపై ఓ కార్యక్రమాన్ని జాతీయ స్థాయిలో నిర్వహించనున్నారు. భారీ ఆన్లైన్ ఓపెన్ కోర్సులను (ఎం.ఓ.ఓ.సిలు) ఇ-విద్య కోసం అభివృద్ధి చేసి, వినియోగించనున్నారు.
ఆరోగ్యం కోసం సాంకేతికత-ఇ-ఆరోగ్య సంరక్షణ: ఇ-ఆరోగ్య సంరక్షణ అనేది ఆన్లైన్లో వైద్య సంప్రదింపులు, ఆన్లైన్లో వైద్య రికార్డులు, ఆన్లైన్లో మందుల సరఫరా, రోగి సమాచారం కోసం దేశవ్యాప్త మార్పిడీ తదితరాలను పరిధిలో ఉంచుతుంది. 2015లో ప్రయోగాత్మక ప్రాజెక్టులను చేపట్టనున్నారు. మూడేళ్ళలో పూర్తి స్థాయి కవరేజీని అందించనున్నారు.
రైతుల కోసం సాంకేతికత: రైతులు తాజా ధరల సమచారాన్ని పొందేందుకు, ఆన్లైన్ ద్వారా ఇన్పుట్లను ఆర్డర్ చేసేందుకు, మొబైల్ బ్యాంకింగ్‌తో ఆన్లైన్ నగదు, రుణం, పరిహారం చెల్లింపును పొందడానికి ఇది వీలు కల్పిస్తుంది.
భద్రత కోసం సాంకేతికత: మొబైల్ ఆధారిత అత్యవసర సేవలు, విపత్తు సంబంధిత సేవలను పౌరులకు ఎప్పటికప్పుడనే ప్రాతిపదికన అందిస్తుంది. తద్వారా సకాలంలో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టి, ప్రాణ, ఆస్తి నష్టాలను తగ్గించుకోవచ్చు.
న్యాయం కోసం సాంకేతికత: పరస్పరం పని చేయగల క్రిమినల్ జస్టిస్ సిస్టమ్‌ను పలు సంబంధిత అప్లికేషన్లను వినియోగించడం ద్వారా పటిష్ఠం చేయగలరు. ఉదా. ఇ-కోర్టులు, ఇ-పోలీసు, ఇ-జైళ్లు, ఇ-ప్రాసిక్యూషన్.
ఆర్థిక సమ్మిళితం కోసం సాంకేతికత: మొబైల్ బ్యాంకింగ్, మైక్రో-ఏటీఎం కార్యక్రమం, సి.ఎస్.సిలు/తపాలా కార్యాలయాలను ఉపయోగించి ఆర్థిక సమ్మిళితాన్ని పటిష్ఠం చేయగలరు.
సైబర్ సెక్యూరిటీ కోసం సాంకేతికత: దేశంలోపల సురక్షితమైన, సైబర్ స్పేస్ ఉండేలా చూసేందుకు నేషనల్ సైబర్ సెక్యూరిటీ కోఆర్డినేషన్ సెంటర్ ఏర్పాటు చేయబడుతుంది.
6. అందరి కోసం సమాచారం
ఓపెన్ డేటా ప్లాట్ఫారం (http://data.gov.in): ఓపెన్ డేటా ప్లాట్ఫారం అనేది ఉపయోగం, పునరుపయోగం, పునఃపంపిణీ కోసం మంత్రిత్వ శాఖలు, విభాగాల ద్వారా ఓపెన్ ఫార్మాట్లో డేటాసెట్లను చురుగ్గా విడుదల చేసేందుకు వీలు కల్పిస్తుంది. సమాచార ఆన్లైన్ హోస్టింగ్, దస్తావేజులు పౌరులకు సమాచారాన్ని బహిరంగంగా, సులభంగా అందుకునే వీలు కల్పిస్తుంది.
సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వం చాలా చురుగ్గా పాలుపంచుకుంటుంది: పౌరులతో సమాచారాన్ని పంచుకోవడానికి, సంభాషించడానికి ప్రభుత్వం సోషల్ మీడియా, వెబ్ ఆధారిత వేదికల ద్వారా చాలా చురుగ్గా పాలుపంచుకుంటుంది. MyGov.in, ప్రభుత్వంతో ఆలోచనలను/సూచనలను పంచుకునే మాధ్యమంగా పరిపాలనలో పౌరులు భాగస్వాములయ్యేలా పాలుపంచుకోవడం కోసం ఈ వేదికను గౌరవనీయులైన ప్రధానమంత్రి 2014 జూలై 26న ప్రారంభించారు. ఇది సుపరిపాలనను తీసుకువచ్చేందుకు పౌరులు, ప్రభుత్వం మధ్య ద్విమార్గ కమ్యూనికేషన్‌కు వీలు కల్పిస్తుంది.
ఆన్లైన్ సందేశం: ఇమెయిళ్లు, ఎస్.ఎమ్.ఎస్‌ల ద్వారా ప్రత్యేక వేడుకలు/కార్యక్రమాలలో పౌరులకు ఆన్లైన్ సందేశం ఇవ్వడం.
ఓపెన్ డెటా ప్లాట్ఫారం, సోషల్ మీడియా ఒడంబడిక మరియు ఆన్లైన్ సందేశం: ఓపెన్ డేటా ప్లాట్ఫారం, సోషల్ మీడియా ఒడంబడిక మరియు ఆన్లైన్ సందేశం చాలావరకు ప్రస్తుతమున్న మౌలిక వసతులను ఉపయోగించుకుంది. దానికి పరిమిత అదనపు వనరులు కావాల్సి ఉంది.
నెట్ జీరో లక్ష్యం దిగుమతులు అనేది ఉద్దేశ్యాన్ని సూటిగా ప్రదర్శించేవిగా ఉంటాయి.
ఈ పునాది ఉద్దేశ్యాన్ని సూటిగా ప్రదర్శించేవిగా 2020 నాటికి దిగుమతులు పూర్తిగా లేని విధంగా దేశంలో ఎలక్ట్రానిక్ తయారీని ప్రోత్సహిస్తుంది. ఆశయం సాధించడానికి కింది విధంగా పలు రకాల్లో సమన్వయంతో కూడిన చర్యను చేపట్టాల్సి ఉంటుంది:
ఇప్పుడు కొనసాగుతున్న పలు కార్యక్రమాలను బాగా సరిచేయాల్సి ఉంది. ప్రస్తుతం కొనసాగుతున్న నిర్మాణాలు ఈ లక్ష్యాన్ని నిర్వహించి, పటిష్ఠం చేయడానికి సరిపోదు.
22శాతం వార్షిక స్థూల వృద్ధి రేటుతో ఎలక్ట్రానిక్ వస్తువులకు డిమాండ్ పెరుగుతోంది. 2020 నాటికి అది 400 బిలియన్ డాలర్లను తాకుతుందని అంచనా వేస్తున్నారు. ఈ రంగంలో ఉత్పత్తిని, పెట్టుబడులను ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం పలు చర్యలను తీసుకుంటుంది. పెట్టుబడి పెట్టడానికి అనువైన ప్రదేశాల్లో భారత్‌ను ఇది ఉన్నతంగా నిలుపుతుంది.
ఎలక్ట్రానిక్స్‌పై జాతీయ విధానం (ఎన్.పి.ఇ)
భారతదేశంలో అభివృద్ధి చెందుతున్న ఎలక్ట్రానిక్స్ సిస్టమ్ డిజైన్ మరియు తయారీ రంగం (ఇ.ఎస్.డి.ఎం)లో పెట్టుబడులు పెట్టేలా జాతీయ, అంతర్జాతీయ కంపెనీలను ఆకర్షించేలా భారత ప్రభుత్వం అత్యున్నతమైన, పెట్టుబడులకు అనుకూలమైన, మార్కెట్లో దూసుకుని వెళ్ళగలిగేదిగా ఎలక్ట్రానిక్స్‌పై జాతీయ విధానాన్ని (ఎన్.పి.ఇ)ను 2012లో ఆవిష్కరించింది. ఇది ఇ.ఎస్.డి.ఎం రంగంలో భారతదేశాన్ని ఓ ప్రధాన కేంద్రంగా భావించి, ప్రపంచంలోని తదుపరి తరం ఎలక్ట్రానిక్ ఉత్పాదక కేంద్రంలో భాగం పోషించేలా కంపెనీలకు ఓ విశిష్ఠమైన అవకాశాన్ని అందిస్తుంది. అంతేకాక మధ్య, అత్యున్నత స్థాయి సాంకేతికతలను కలిగిన విలువ ఆధారిత ఉత్పత్తిని కూడా అందిస్తుంది.
(ఎన్.పి.ఇ) 2012 ముసాయిదా కోసం బలమైన పునాది ఏర్పరచడంలో భారత ప్రభుత్వం గణనీయమైన పురోగతిని సాధించింది. ఇది మధ్య స్థాయి, ఉన్నత స్థాయి సాంకేతికతలను కలిగిన విలువ ఆధారిత తయారీలో సహాయపడుతుంది. ఈ పాలసీలోని ప్రధానాంశాలను కింది వాటితో పాటు భారత ప్రభుత్వం తీసుకుంటుంది:
ఎలక్ట్రానిక్ డిజైన్, ఉత్పాదన విభాగానికి ఈ ప్రోత్సాహకాలన్నీ అందుబాటులో ఉంటాయి. విదేశం నుంచి ఉత్పాదక ప్లాంట్ స్థల మార్పుకోసం కూడా ఇది అందుబాటులో ఉంటుంది. సెమీ కండక్టర్ ఎఫ్.ఏ.బి, టెలికాం ఉత్పత్తులు, ఎల్.ఇ.డి ఫ్యాబ్ మరియు ఉత్పత్తులు, ఆటోమోటివ్ ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్ ఏటీఎంపీలు, వినియోగదారు ఎలక్ట్రానిక్స్, అప్లయన్సస్, స్మార్ట్ ఫోన్లు, టాబ్లెట్లు సహా చేతి సాధనాలు, వ్యూహాత్మక ఎలక్ట్రానిక్స్, ఇ.ఎం.సి, ఏవియానిక్స్, మెడికల్ ఎలక్ట్రానిక్స్ తదితరాలను ఈ రంగంలో కొన్నిటిగా చెప్పవచ్చు. ఉత్పత్తి ఆధారిత పరిశోధన, అభివృద్ధి వ్యయాన్ని కూడా ఎం.ఎస్.ఐ.పి.ఎస్ కింద చేర్చారు.
ఈ విధానాల వివరాలను శాఖాపరమైన వెబ్సైట్లో సూచించవచ్చు: www.deity.gov.in/esdm
ఈ పునాది ఐ.టి, ఐటి ఆధారిత సేవల రంగాల్లో ఉద్యోగ అవకాశాలను అందుకోవడం కోసం అవసరమైన నైపుణ్యాలలో యువతకు శిక్షణను అందించడంపై దృష్టి సారిస్తుంది. ఈ పునాది కింద చేపట్టే నిర్ధిష్ఠ కార్యకలాపాల పరిధితో ఎనిమిది భాగాలున్నాయి:
ఈశాన్య భారత బి.పి.ఓ ప్రోత్సాహక పథకం (NEBPS)
భారతీయ బి.పి.ఓ పరిశ్రమ గడచిన కొన్నేళ్ళుగా గణనీయమైన ప్రగతిని సాధించింది. అంతర్జాతీయంగా ప్రాధాన్యం కలిగిన బి.పి.ఓ కేంద్రాలలో ఒకటిగా భారతదేశం క్రమంగా అవతరిస్తోంది. నిర్వహణ ఖర్చు ప్రభావం, నైపుణ్యం కలిగిన మానవ వనరుల అందుబాటు, ఉద్యోగ అవకాశాల కోసం రోజురోజుకూ పెరుగుతున్న డిమాండ్ దేశంలో బి.పి.ఓ పరిశ్రమ వృద్ధి చెందడంలో పాత్ర పోషిస్తున్నయి. అయినప్పటికీ, బి.పి.ఓ పరిశ్రమ చాలావరకు పెద్ద (ప్రథమ శ్రేణి) నగరాల చుట్టూ వ్యాపించాయి.. ఈశాన్య భారతం సహా దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన నైపుణ్యం కలిగిన మానవ వనరులు ఉపాధిని కోరుకుంటున్నారు.
భారీ (ప్రథమ శ్రేణి) నగరాల్లో, ఉద్యోగులకు నివాస వసతి, ఎక్కువ ప్రయాణ దూరాన్ని దృష్టిలో పెట్టుకుంటే, కంపెనీకి నిరంతరం కొనసాగుతున్న మానవవనరుల వ్యయం ఎక్కువగా ఉండవచ్చని భావిస్తున్నారు. కాబట్టి మానవవనరుల ఖర్చులు గణనీయంగా తగ్గగలదని బి.పి.ఓ కంపెనీలు మరింత చిన్న (ద్వితీయ/తృతీయ శ్రేణి) నగరాలకు వలసలు వెళ్లడం సాగుతుంది. తద్వారా వాటి కార్యకలాపాలు మరింత లాభదాయకం కాగలవు. ఈశాన్య భారతంలో బి.పి.ఓ కార్యకలాపాలను నిర్వహించడం కోసం కీలకమైనవిగా నమ్మకమైన ఇంటర్నెట్ కనెక్టివిటీ, కరెంటు సరఫరాకు సంబంధించిన వివిధ అంశాలను చెప్పవచ్చు.
ఈశాన్య భారతంలో బి.పి.ఓలను ప్రోత్సాహించడం:
ప్రస్తుత సన్నివేశం:
మారిన సన్నివేశం
ముందు చెప్పిన నేపథ్యంలో, సముచిత ప్రోత్సాహకాల ద్వారా ఈశాన్య భారత ప్రాంతంలో బి.పి.ఓల ఏర్పాటుకు ప్రత్యేక దృష్టిని ఇవ్వాలని నిర్ణయించబడింది. ప్రస్తుతం ఓ ముసాయిదా పథకం పేరుతో, “ఈశాన్య భారత బి.పి.ఓ ప్రోత్సాహక పథకం (NEBPS)” ఈశాన్య భారత ప్రాంతంలో బి.పి.ఓ/కాల్ సెంటర్ల ఏర్పాటును సున్నితం లేకుండా చేయడాన్ని పరిగణనలోకి తీసుకోవడం కోసం. సుమారు 12000 మందికి ప్రత్యక్ష ఉపాధిని కల్పించాలని భావిస్తున్నందున ప్రస్తుత ఐదేళ్ళ ప్రణాళిక చివరి వరకు 4000 కూర్చొనే సామర్థ్యాన్ని రూపొందించడానికి ఇది ఊహిస్తుంది.
త్వరితగతి దిగుబడి కార్యక్రమం అనేది ప్రాథమికంగా తక్కువ కాలపరిమితిలోపల అమలు చేయగల ప్రాజెక్టులను కలిగి ఉంటుంది. త్వరితగతి దిగుబడి కార్యక్రమం కింద ప్రాజెక్టులు కింది విధంగా ఉన్నాయి:
సందేశాలకు ఐ.టి ప్లాట్‌ఫారమ్: ఎన్నికైన ప్రజా ప్రతినిధులు, అందరు ప్రభుత్వోద్యోగులను కలిగి ఉండేలా ఓ సామూహిక సందేశ బట్వాడా అప్లికేషన్‌ను కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ అభివృద్ధి చేసింది. 1.36 కోట్లకు పైగా మొబైళ్ళు, 22 లక్షలకు పైగా ఇమెయిళ్ళు డేటాబేస్‌లో భాగంగా ఉన్నాయి. ఈ పోర్టల్‌ను 2014 ఆగస్టు 15న విడుదల చేశారు. డేటా సేకరణ, డేటా శుభ్రత ప్రక్రియలు ప్రస్తుతం సాగుతున్నాయి.
ఇ-గ్రీటింగులుగా ప్రభుత్వ శుభాకాంక్షలు: ఇ-గ్రీటింగ్ టెంప్లెట్ల బాస్కెట్ అందుబాటులో ఉంచబడింది. మై గవ్ ప్లాట్ఫారం ద్వారా ఇ-గ్రీటింగ్‌ల క్రౌడ్ సోర్సింగ్ ఉండేలా చూడబడుతుంది. స్వతంత్ర దినం, ఉపాధ్యాయుల దినం, గాంధీ జయంతి శుభాకాంక్షలకు డిజైన్లను రూపొందించడానికి కూడా క్రౌడ్ సోర్సింగ్ ఉపయోగించబడుతుంది. ఇ-గ్రీటింగ్స్ పోర్టల్‌ను 14 ఆగస్టు 2014న ప్రత్యక్షంగా వీక్షింపజేశారు.
బయోమెట్రిక్ హాజరు: అది ఢిల్లీనుంచి మొదలై కేంద్ర ప్రభుత్వ కార్యాలయాన్నిటినీ కలిగి ఉంటుంది. 150 సంస్థలకు చెందిన 40వేలకు పైగా ఉద్యోగులు ఇప్పటికే ఉమ్మి బయోమెట్రిక్ అటెండన్స్ పోర్టల్‌లో నమోదు చేసుకున్నారు http://attendance.gov.in వైఫై యాక్సెస్ పాయింట్లు, మొబైల్ కనెక్టివిటీలతో వివిధ కేంద్ర ప్రభుత్వ భవనాల ప్రవేశ ద్వారాల వద్ద వెయ్యికి పైగా బయోమెట్రిక్ అటెండన్స్ టెర్మినల్స్ ప్రస్తుతం ప్రతిష్ఠాపన దశలో ఉన్నాయి. ఢిల్లీలోని ఏదేని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల నుంచి కూడా ప్రభుత్వ ఉద్యోగులు తమ హాజరును నమోదు చేయవచ్చు.
అన్ని విశ్వవిద్యాలయాల్లోనూ వైఫై: నేషనల్ నాలెడ్జి నెట్‌వర్క్‌పై అన్ని విశ్వవిద్యాలయాలను ఈ పథకం పరిధిలోకి తీసుకురానున్నారు. ఈ పథకాన్ని అమలు చేయడానికి కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ (ఎం.హెచ్.ఆర్.డి) నోడెల్ ఏజెన్సీగా ఉంటుంది.
ప్రభుత్వ పరిధిలో సురక్షిత ఇమెయిల్: ఇమెయిల్ అనేది ప్రభుత్వం పరిధిలో ప్రాథమికమైన కమ్యూనికేషన్ విధానం. ప్రభుత్వ ఇమెయిల్ మౌలిక వసతి తగిన రీతిలో విస్తరించి, స్థాయి పెంచనున్నారు. మొదటి దశలో పది లక్షల మంది ఉద్యోగులకు మౌలిక వసతుల స్థాయి పెంపు అనేది ఇప్పటికే పూర్తయింది. రెండో దశ కింద రూ. 98కోట్ల వ్యయంతో 2015 మార్చి నాటికల్లా 50 లక్షల మంది ఉద్యోగులను దీని పరిధిలోకి తీసుకువచ్చేలా మౌలిక వసతుల స్థాయిని మరింత పెంచనున్నారు. ఈ పథకానికి ఎలక్ట్రానిక్స్, ఐ.టి మంత్రిత్వ శాఖ నోడల్ ఏజెన్సీగా ఉంటుంది.
ప్రభుత్వ ఇమెయిల్ డిజైన్ ప్రామాణికీకరణ: ప్రభుత్వ ఇమెయిల్ కోసం ప్రామాణికీకరించిన టెంప్లెట్లు సిద్ధం చేయబడుతాయి. దానిని ఎలక్ట్రానిక్స్, ఐ.టి మంత్రిత్వ శాఖ అమలు చేస్తుంది.
బహిరంగ వైఫై హాట్స్పాట్లు: డిజిటల్ నగరాలను ప్రోత్సహించడం కోసం పది లక్షలకు పైగా జనాభా కలిగిన నగరాలు, పర్యాటక కేంద్రాలలో బహిరంగ వైఫై స్పాట్లు అందుబాటులోకి తీసుకురాబడుతాయి. ఈ పథకాన్ని కేంద్ర సాంకేతిక శాఖ, పట్టణాభివృద్ధి శాఖలు అమలు చేస్తాయి.
ఇ-పుస్తకాలుగా పాఠశాల పుస్తకాలు: అన్ని పుస్తకాలు ఇబుక్స్ గా మార్పిడీ చేయబడ్డాయి. ఈ పథకానికి కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ నోడెల్ ఏజెన్సీగా వ్యవహరిస్తోంది.
ఎస్.ఎమ్.ఎస్ ఆధారిత వాతావరణ సమాచారం, విపత్తు హెచ్చరికలు: ఎస్.ఎమ్.ఎస్ ఆధారిత వాతావరణ సమాచారం, విపత్తు హెచ్చరికలు అందించబడ్డాయి. దీనికోసమే ఎలక్ట్రానిక్, ఐ.టి మంత్రిత్వ శాఖ మొబైల్ సేవ ప్లాట్ ఫారం అందుబాటులోకి తీసుకురాబడింది. భూ శాస్త్రం (ఎం.ఓ.ఇ.ఎస్) మంత్రిత్వ శాఖ, (భారత వాతావరణ శాఖ -ఐ.ఎం.డి)/హోం మంత్రిత్వ శాఖ (ఎం.హెచ్.ఏ) (జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ -ఎన్.డి.ఎం.ఏ)లు ఈ పథకం అమలుకు నోడల్ ఏజెన్సీలుగా వ్యవహరిస్తాయి.
తప్పిపొయిన, దొరికిన పిల్లల కోసం జాతీయ పోర్టల్:
a. ఇది తప్పిపోయిన మరియు దొరికిన పిల్లల సమాచారాన్ని వెంటనే సేకరించి, పంచుకోవడానకి వీలు కల్పిస్తుంది. నేరాలను అదుపు చేసుకుని, సకాలంలో స్పందించడాన్ని మెరుగుపరచడానికి చాలా సమయం పడుతుంది. కింది విశిష్ఠతలతో ఈ పోర్టల్ కొత్తగా రూపకల్పన చేయబడింది:
b. ఈ కార్యక్రమానికి, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, స్త్రీ, శిశు అభివృద్ధి శాఖలు నోడల్ ఏజెన్సీలు పని చేస్తాయి.
ఆధారం: డిజిటల్ ఇండియా వెబ్ సైట్