డిజిటల్ ఇండియా కార్యక్రమం కోసం కార్యక్రమ నిర్వహణా యంత్రాంగం
కేంద్ర మంత్రివర్గం ఆమోదం పొందిన డిజిటల్ ఇండియా కార్యక్రమం కోసం కార్యక్రమ నిర్వహణా యంత్రాంగం:
1. డిజిటల్ ఇండియా కార్యక్రమాన్ని ప్రభావశీలంగా నిర్వహించడం కోసం, ప్రధానమంత్రి అధ్యక్షతన ఏర్పాటు చేసిన డిజిటల్ ఇండియా పర్యవేక్షణ కమిటీ, కమ్యూనికేషన్లు, ఐ.టి శాఖ మంత్రి అధ్యక్షతన పనిచేసే డిజిటల్ ఇండియా సలహా బృందం, క్యాబినెట్ కార్యదర్శి అధ్యక్షతన ఉన్న అత్యున్నత కమిటీలు ప్రోగ్రామ్ నిర్వహణ వ్యవస్థలో భాగంగా ఉంటాయి. ఈ నిర్మాణానికి అవసరమైన కార్యదర్శక/పర్యవేక్షక/సాంకేతిక తోడ్పాటు ఉంది. అధికారాలు తగిన రీతిలో వికేంద్రీకరించబడ్డాయి. అమలు చేస్తున్న విభాగాలు/బృందాల ద్వారా వివిధ ప్రాజెక్టులు/విడిభాగాల ప్రభావశీలంగా అమలు జరిగేలా చూసే బాధ్యత కూడా ఉంది.
2. కార్యక్రమ నిర్వహణా యంత్రాంగంలోని కీలక భాగాలు కింది విధంగా ఉన్నాయి:
- ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన క్యాబినెట్ కమిటీ కార్యక్రమ స్థాయి విధాన నిర్ణయాల కోసం (CCEA).
- జూమ్ ప్రధాన మంత్రి అధ్యక్షతన డిజిటల్ ఇండియా పర్యవేక్షణ కమిటీ నాయకత్వాన్ని, సూచిత సేవలు, మైలురాళ్ళను అందించి, డిజిటల్ ఇండియా కార్యక్రమం అమలును కాలానుగుణంగా పర్యవేక్షించడం కోసం సంబంధిత మంత్రిత్వ శాఖలు/విభాగాలకు ప్రాతినిధ్యం కల్పిస్తూ ఇది రూపొందించబడింది.
- జూమ్కమ్యూనికేషన్లు, ఐటీ శాఖా మంత్రి అధ్యక్షతన డిజిటల్ ఇండియా సలహా బృందం కొనసాగుతుంది బయటి పాత్రధారుల అభిప్రాయాలను గౌరవించి, డిజిటల్ ఇండియాపై పర్యవేక్షక కమిటీకి ఇన్‌పుట్లను అందించడం, విధానంపై ప్రభుత్వానికి సలహా ఇవ్వడం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు/విభాగాలలో డిజిటల్ ఇండియా కార్యక్రమం అమలును వేగవంతం చేయడానికి అవసరమైన వ్యూహాత్మక జోక్యాలు చేసుకోవడం లాంటివి చేస్తుంది. సలహా బృందం కూర్పులో ప్రణాళిక సంఘం నుంచి కూడా ప్రాతినిధ్యం ఉండాలి. రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి ఎనిమిది నుంచి తొమ్మిది మంది ప్రతినిధులకు చోటుండాలి. ఇతర సంబంధింత మంత్రిత్వ శాఖలకు/విభాగాలకు రొటేషనల్ ప్రాతిపదికన ప్రాతినిధ్యం కల్పించాలి.
- ఓ అత్యున్నత సంఘం కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తూ, పాలసీని, దాని అమలు కోసం వ్యూహాత్మక విధానాలను అందించడం, అంతర్-మంత్రిత్వ సమస్యలను పరిష్కరించడం కోసం క్యాబినెట్ కార్యదర్శి అధ్యక్షతన ఏర్పాటు చేయబడింది. దీంతోపాటు అవసరమైన ప్రదేశాల్లో డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్ కింద అది సేవల ఏకీకరణకు సంబంధించిన వైవిధ్యభరితమైన ప్రయత్నాలు, కోణాలను ఎం.ఎం.పిల రీ ఇంజనీరింగ్, సేవా స్థాయిల ఎండ్ టు ఎండ్ ప్రక్రియ రీఇంజనీరింగ్ సేవా స్థాయిలను సమ్మిళిత పరచి, సంఘటిత పరుస్తుంది.
- వ్యయ ఆర్థిక కమిటీ/ప్రణాళికేతర వ్యయంపై కమిటీ ప్రస్తుత ఆర్థిక అధికారాల ప్రతినిధుల బృందం ప్రకారం ప్రాజెక్టులను ఆర్థికంగా మదింపు వేసేందుకు/ఆమోదించేందుకు సి.ఎన్.ఇ. ఖర్చుల కార్యదర్శి నేతృత్వంలోని ఇ.ఎఫ్.సి/సి.ఎన్.ఇ సంస్థలు ఎంఎంపిలు/ఇగవర్నెన్స్ ప్రయత్నాలు అమలు చేయాల్సిన విధానంతో పాటు రాష్ట్రాల భాగస్వామ్యానికి సంబంధించిన ఆర్థిక నిబంధనలను సి.సి.ఇ.ఏకు కూడా సిఫార్సు చేస్తుంటాయి. ఇ.ఎఫ్.సి/సి.ఎన్.ఇ సంస్థలు రెండింటిలోనూ ప్రణాళిక సంఘం ప్రతినిధిని చేర్చుతారు.
- జూమ్డిజిటల్ ఇండియాపై మిషన్ లీడర్ల మండలి డిజిటల్ ఇండియా కింద ప్రస్తుతమున్న, కొత్త ఇగవర్నన్స్ ప్రయత్నాలలో అత్యుత్తమ ఆచరణలను పాలు పంచుకోవడానికి, ఎలక్ట్రానిక్స్, ఐటి మంత్రిత్వ శాఖ ఐ.సి.టి ప్రాజెక్టుల గురించి వివిధ ప్రభుత్వ ఏజెన్సీలను సున్నితం చేసేందుకు ఓ వేదికగా ఎలక్ట్రానిక్స్, ఐటి మంత్రిత్వ శాఖ కార్యదర్శి అధ్యక్షతన ఏర్పాటు చేయబడింది. ఇంటగ్రేటడ్ ప్రాజెక్టులు/ఇగవర్నన్స్ ప్రయత్నాలకు సంబంధించిన అంతర్ శాఖల, ఇంటగ్రేషన్, ఇంటరాపరబుల్ సమస్యలను డిజిటల్ ఇండియాపై క్యాబినెట్ కార్యదర్శి అధ్యక్షతన ఏర్పాటు చేసిన అత్యున్నత కమిటీ పరిష్కరిస్తుండగా, కౌన్సిల్ ఆఫ్ మిషన్ లీడర్ల ద్వారా ఇంటగ్రేటడ్ ప్రాజెక్టుల సాంకేతిక అంశాలు పరిష్కరించబడుతాయి.
- అంతేకాక, డిజిటల్ ఇండియా కార్యక్రమ పరిధిని, పూర్తి సాంకేతికత వాస్తురూపం, కార్యాచరణ, ప్రమాణాలు, భద్రతా విధానం, నిధి వ్యూహం, సేవల బట్వాడా యంత్రాంగం, ఉమ్మడి మౌలిక వసతుల పంపకం మొదలైన అంశాలను పరిశీలించాల్సిన అంశాలను దృష్టిలో పెట్టుకుని, ఇ.ఎఫ్.సి/సి.ఎన్.ఇ(EFC/ CNE) సమక్షంలో సమర్పించడానికి ముందుగా డిజిటల్ ఇండియా ప్రాజెక్టులన్నిటికీ ఎలక్ట్రానిక్స్, ఐ.టి మంత్రిత్వ శాఖ (DeitY )సాంకేతిక మదింపును చేపడుతుంది. ప్రమాణాల స్వీకరణ, క్లౌడ్, మొబైల్ వేదికల సార్థకం, భద్రతా అంశాల పరిగణన తదితరాలను చేర్చడానికి సంబంధించిన అంశాలను ఈ మదింపు చేపడుతుంది. మెషీన్ మోడ్ ప్రాజెక్ట్స్(MMPs) మదింపు వేసి, ఆమోదం తెలిపే ఇ.ఎఫ్.సి/సి.ఎన్.ఇ(EFC/ CNE) సమావేశాలన్నిటికీ ఎలక్ట్రానిక్స్, ఐ.టి మంత్రిత్వ శాఖ (DeitY ) కార్యదర్శి లేదా ఆయన ప్రతినిధిని ప్రత్యేక ఆహ్వానితుడిగా చేర్చుతున్నారు. తమ శాఖకు సంబంధించిన మెషీన్ మోడ్ ప్రాజెక్ట్స్/ఇ-గవర్నన్స్ కార్యక్రమాలను ఆవిర్భవింపజేసి, అభివృద్ధి చేసి, మదింపు వేసి, అమలు చేసి, పర్యవేక్షణ చేయడం కోసం వివిధ శాఖలకు తోడ్పాటు అందించేలా ఎలక్ట్రానిక్స్, ఐ.టి మంత్రిత్వ శాఖ (DeitY ) ఇప్పటికే నేషనల్ ఇ-గవర్నన్స్ డివిజన్ (NeGD) పేరుతో ఓ కార్యక్రమ నిర్వహణా విభాగాన్ని ఏర్పాటు చేసింది.
- రాష్ట్ర స్థాయిలో డిజిటల్ ఇండియా సంస్థాగత యంత్రంగానికి సారధ్యం డిజిటల్ ఇండియాపై రాష్ట్ర కమిటీ ముఖ్యమంత్రి ద్వారా. డిజిటల్ ఇండియాపై రాష్ట్ర/కేంద్ర పాలిత ప్రాంత అత్యున్నత కమిటీలు అవసరమైన వనరులను కేటాయించేందుకు, ప్రాజెక్టుల మధ్య ప్రాధాన్యతలను నిర్దేశించేందుకు, రాష్ట్ర స్థాయిలో శాఖల మధ్య తలెత్తే సమస్యలను పరిష్కరించడానికి ప్రధాన కార్యదర్శుల అధ్యక్షతన రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలలో ఏర్పాటు చేయబడుతాయి.
3. డిజిటల్ ఇండియాను ప్రభావశీలంగా నిర్వహించడం కోసం, ఆ ప్రాజెక్టు పురోగతి గురించి దాదాపు తాయా సమాచారాన్ని పట్టుకునేలా కొత్త, ప్రస్తుత మిషన్ మోడ్ ప్రాజెక్టులలో ప్రాజెక్టు మేనేజ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ తప్పనిసరి చేయబడ్డాయి. ఆవిర్భావం, అభివృద్ధి, అమలు, అమలు తర్వాతి పనులు పేరుతో ప్రాజెక్టులోని ప్రతిదశలోనూ పరామితులను బంధించడానికి ఈ ఉపకరణం తగిన రీతిలో పని చేస్తుంది. వివిధ వరుస మంత్రిత్వ శాఖలు/విభాగాలు మరియు ఎలక్ట్రానిక్స్, ఐటి మంత్రిత్వ శాఖతో సంప్రదింపులు జరిపిన తర్వాత ఈ పరామితులను నిర్ణయించబడవచ్చు.
4. “ఇ-క్రాంతి: జాతీయ ఇగవర్నన్స్ ప్రణాళిక 2.0ను ఇప్పటికే డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్‌తో ఏకీకృతం చేసినందున, .జాతీయ, రాష్ట్ర స్థాయి రెండింటిలోనూ జాతీయ ఇగవర్నన్స్ ప్రణాళిక కోసం ఏర్పాటు చేసిన ప్రస్తుత కార్యక్రమ నిర్వహణ నిర్మాణాన్ని కూడా జాతీయ, రాష్ట్ర/కేంద్ర పాలిత ప్రాంతాలలోని డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్ కోసం ఊహించిన ప్రాజెక్టు నిర్వహణ నిర్మాణంతో సముచితంగా ఏకీకరించాలని నిర్ణయించబడింది.
ప్రస్తుత స్థితి:
క్యాబినెట్ కార్యదర్శి అధ్యక్షతన డిజిటల్ ఇండియాపై అత్యున్నత కమిటీ, కమ్యూనికేషన్లు, ఐ.టి శాఖ మంత్రి అధ్యక్షతన డిజిటల్ ఇండియా సలహా బృందం ఏర్పాటు చేయబడ్డాయి.
డిజిటల్ ఇండియా ప్రోగ్రాంపై ఏర్పాటు చేసిన అత్యున్నత కమిటీ మొదటి సమావేశం 26.11.2014లో జరిగింది. డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్‌పై అత్యున్నత స్థాయి కమిటీ రెండో సమావేశం 09.02.2015న జరిగింది. అత్యున్నత కమిటీ తీసుకున్న నిర్ణయాలపై చర్యలు ప్రారంభమయ్యాయి.
ఆధారం: డిజిటల్ ఇండియా వెబ్ సైట్