హోమ్ / ఇ-పాలన / డిజిటల్ ఇండియా / విధానం మరియు పద్ధతి
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

విధానం మరియు పద్ధతి

డిజిటల్ ఇండియా కార్యక్రమం కోసం విధానం మరియు పద్ధతి

డిజిటల్ ఇండియా కార్యక్రమం కోసం విధానం మరియు పద్ధతి:

  1. భారత ప్రభుత్వం పూర్తిగా ఏర్పరచిన సాధారణ, సహాయక మౌలిక వసతులను మంత్రిత్వ శాఖలు/విభాగాలు/రాష్ట్రాలు పూర్తిగా వినియోగించుకుంటున్నాయి. ఐటీ మంత్రిత్వ శాఖ ప్రమాణాలకు, పాలసీ మార్గదర్శకాలకు కూడా రూపకల్పన చేసి, సాంకేతిక, చేయూతనిచ్చే తోడ్పాటును అందించి, సామర్థ్య నిర్వహణ, పరిశోధన, అభివృద్ధి మొదలగునవి చేపడుతుంది.
  2. ప్రస్తుత లేదా కొనసాగుతున్న ఇ-గవర్నెన్స్ ప్రయత్నాలు డిజిటల్ ఇండియా సూత్రాలతో తమను కలుపుకునే రీతిలో సముచితంగా ప్రక్షాళన చేయబడ్డాయి. పౌరులకు ప్రభుత్వ సేవల బట్వాడాను విస్తరించడం కోసం పరిధి విస్తరణ, ప్రాసెస్ రీఇంజనీరింగ్, సమగ్రంగా మరియు అంతర్గతంగా నిర్వహించగల వ్యవస్థలు, క్లౌడ్ అండ్ మొబైల్ లాంటి వర్ధమాన సాంకేతికతల వినియోగాన్ని చేపడుతున్నారు.
  3. ఆయా రాష్ట్రాల సామాజిక, ఆర్థిక అవసరాలకు అనుగుణంగా నిర్ధిష్ఠమైన ప్రాజెక్టులను చేర్చడాన్ని గుర్తించడానికి రాష్ట్రాలకు స్వేచ్ఛ ఇవ్వబడింది.
  4. ప్రస్తుత లేదా కొనసాగుతున్న ఇ-గవర్నెన్స్ ప్రయత్నాలు డిజిటల్ ఇండియా సూత్రాలతో తమను కలుపుకునే రీతిలో సముచితంగా ప్రక్షాళన చేయబడ్డాయి. పౌరులకు ప్రభుత్వ సేవల బట్వాడాను విస్తరించడం కోసం పరిధి విస్తరణ, ప్రాసెస్ రీఇంజనీరింగ్, సమగ్రంగా మరియు అంతర్గతంగా నిర్వహించగల వ్యవస్థలు, క్లౌడ్ అండ్ మొబైల్ లాంటి వర్ధమాన సాంకేతికతల వినియోగాన్ని చేపడుతున్నారు.
  5. విజయాలు గుర్తించబడ్డాయి, అవసరమైన చోట తగినంత ఉత్పాదకత, వినియోగమయంతో వాటి ప్రతిరూపం ముందుకు తీసుకువెళ్ళబడుతుంది.
  6. తగినంత నిర్వహణ, వ్యూహాత్మక నియంత్రణతో ఇ-గవర్నన్స్ ప్రాజెక్టులను అమలు చేయడానికి వీలైన ప్రతి చోటా ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యాలకు ప్రాధాన్యమివ్వబడుతుంది.
  7. గుర్తింపునకు, ప్రమాణీకరణకు, ప్రయోజనాల బట్వాడాకు వీలు కల్పించేలా విశిష్ఠ ఐడీ తీసుకోవడం ప్రోత్సాహించబడుతుంది.
  8. ఎన్.ఐ.సిని పునర్వ్యవస్థీకరించడం అనేది కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లోని అన్ని ప్రభుత్వ విభాగాలకు ఐటీ తోడ్పాటును పటిష్ఠం చేసేందుకు తీసుకోబడుతుంది.
  9. వివిధ ఇ-గవర్నెన్స్ ప్రాజెక్టులను వేగంగా రూపకల్పన చేసి, అభివృద్ధి చేసి, వేగంగా అమలు చేయడానికి కనీసం పది కీలక మంత్రిత్వ శాఖలలో ప్రధాన సమాచార అధికారులు (సి.ఐ.ఓ) హోదాలు రూపొందించబడతాయి. సంబంధిత మంత్రి వర్గంలో ఐ.టిపై అధికారాలతో కూడిన అదనపు కార్యదర్శి/సంయుక్త కార్యదర్శి స్థాయిలో సీ.ఐ.ఓ హోదాలు ఉంటాయి.

ఆధారం: డిజిటల్ ఇండియా వెబ్ సైట్

3.03184713376
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు