సమాజం లో అణగారిన వర్గాలకు అధికారిక ఆర్థిక సేవల ఉపయోగం మరియు డిజిటల్ పద్ధతిలో డబ్బును బదలాయించే విధానం తక్షణావసరము. గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో ఎక్కువ శాతం నగదును ఉపయోగిస్తున్నారని అయితే వారిని సాంకేతికత వైపు మళ్లించాల్సిన అవసరం ఉంది.
ఈ ప్రయోజనం నెరవేర్చడానికి పరిచయం చేయబడిన సేవలే డిజిటల్ కరెన్సీతోనే ఆర్థిక లావాదేవీలు అని అంటారు. ఇవి వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా రూపొందించబడ్డాయి మరియు వినియోగదారులకు సరసమైన, సరఫరాదారులకు నిలకడగా వుండే విధంగా ఎంతో బాధ్యతాయుతంగా అందించబడుతున్నాయి. ఈ డిజిటల్ ఆర్థిక సంబంధిత సేవలలో మూడు కీలక భాగాలు ఉన్నాయి: ఒక డిజిటల్ లావాదేవీల వేదిక, రిటైల్ ఏజెంట్లు, ఈ వేదిక ద్వారా లావాదేవీలు జరడానికి వినియోగదారులు, రిటైల్ ఏజెంట్లు ఉపయోగించడానికి సాధారణంగా మొబైల్ ఫోన్ లాంటి ఒక పరికరం.
బ్యాంక్ సేవలను ఇదివరకు అందుకొనని జనాభాను క్రమంగా డిజిటల్ కరెన్సీ ద్వారా ఆర్థిక సేవలకు చేరువ చేయడమే దీని పని. బ్యాంకులు, సూక్ష్మఋణ సంస్థలు, మొబైల్ ఆపరేటర్లు, మరియు తృతీయపక్షం (అన్యవ్యక్తి) సరఫరాదారులు, సంప్రదాయ బ్యాంకింగ్ అనుమతించిన దానికంటే మొబైల్ ఫోన్లు, పాయింట్ అఫ్ సేల్ పరికరాలు, చిన్న తరహా ఏజెంట్ల నెట్వర్క్ లతో సహా అన్నింటి సామర్ధ్యాన్ని ఎక్కువగా వినియోగించుకొని ఎక్కువ సౌలభ్యం, ప్రమాణం మరియు తక్కువ ఖర్చుతో అన్ని మౌలిక ఆర్ధిక సేవలను ప్రతిపాదిస్తున్నారు.
డిజిటల్ కరెన్సీతోనే ఆర్థిక లావాదేవీలను క్రింది విధంగా చర్చించారు:
కార్డులు ( Cards)
కార్డులు ఏమిటి?
ఇవి సాధారణంగా బ్యాంకులు జారీ చేస్తాయి. బ్యాంకు నిర్ధారించి ఇచ్చిన కార్డును కలిగి ఉన్నవారి వినియోగం మరియు చెల్లింపు ఆధారంగా వర్గీకరించవచ్చు. కార్డులు మూడు రకాలు. అవి డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు మరియు ప్రీపెయిడ్ కార్డులు.
వివిధ రకాల కార్డులు ఏవి?
ప్రీపెయిడ్ కార్డులు (Prepaid Cards): ఇవి వినియోగదారుని యొక్క బ్యాంకు ఖాతా నుండి ముందుగా కావలసిన డబ్బుతో నింప బడతాయి. పరిమిత లావాదేవీల కోసం వాడవచ్చు. ఈ మొబైల్ రీఛార్జ్ వంటివి చేసుకోవచ్చు. ఇవి ఉపయోగించడానికి సురక్షితం.
డెబిట్ కార్డులు (Debit Cards): ఇది మీ ఖాతా గల బ్యాంక్ జారీ చేసేది. బ్యాంకు ఖాతాకు అనుసంధానం. డెబిట్ కార్డులు (కరెంట్ / పొదుపు / ఓవర్ డ్రాప్ట్ ) ఖాతా గల వారికి జారీ చేస్తారు మరియు ఏదైనా వ్యయం అయి వెంటనే ఖాతాదారు యొక్క ఖాతానుండి తీసుకోబడుతుంది. ఖాతాదారు అతని / ఆమె బ్యాంకు ఖాతాలో ప్రస్తుతము వున్న పరిమితి వరకు నగదును ఈ కార్డు ఉపయోగించి తీసుకొనవచ్చును. దీనిని దేశంలోని ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి ఫండ్ బదిలీ కోసం కూడా ఉపయోగించవచ్చు.
క్రెడిట్ కార్డులు (Credit Cards): వీటిని బ్యాంకులు / ఆర్బిఐ ఆమోదం పొందిన ఇతర సంస్థలు జారీ చేస్తాయి. దేశీయంగా మరియు అంతర్జాతీయంగా వీటిని వాడవచ్చు (అంతర్జాతీయ వాడకం కోసం జారిచేయబడినదైతే). డెబిట్ కార్డుల వలే కాకుండా, క్రెడిట్ కార్డులతో ఖాతాదారు తన బ్యాంకు ఖాతాలో వున్న మొత్తం కన్నా ఎక్కువ సొమ్మును తీసుకోవచ్చు. కానీ ప్రతి క్రెడిట్ కార్డుకు వున్న దాని పరిమితికి లోబడే అదనపు సొమ్మును తీసుకోవలసివుంటుంది. అలాగే నిర్ణయించబడిన కాల వ్యవధికి లోబడి తీసుకోబడిన అదనపు సొమ్మును తిరిగి చెల్లించాలి. ఒకవేళసొమ్మును కార్డు జారిచేసిన వారికి నిర్దిష్ట కాలంలో చెల్లించలేక జాప్యం జరిగితే ఆ సొమ్ము మొత్తంను విధించిన వడ్డీ తో పాటుగా తిరిగి చెల్లించాలి.
డెబిట్ / క్రెడిట్ కార్డులు లను ఎలా ఉపయూగించాలి?
ఒక ఎటిఎం (ATM) నుండి డబ్బు తీసుకొనుటకు వాడుకదారు బ్యాంకు అందించిన అతను / ఆమె డెబిట్ / క్రెడిట్ కార్డు కార్డును ఎటిఎం (ATM) లోని దాని స్ధానంలో వుంచి, మీకు ప్రత్యేకంగా ఇవ్వబడిన పిన్ (PIN) నంబర్ (4 అంకెలు) ను టైప్ చేయాలి. ఒక రోజులో తీసుకోగలిగిన గరిష్ట సొమ్ము పరిమితిని బ్యాంకు నిర్ధారిస్తుంది.
డెబిట్ కార్డు వినియోగదారు బ్యాంకు శాఖను సందర్శించ వలసిన అవసరము లేకుండా ఎటిఎం (ATM) ను ఇతర ఆర్థిక, ఆర్థికేతర లావాదేవీలు కొనసాగించడానికి ఉపయోగించవచ్చు. అనగా బ్యాంకు బ్యాలెన్స్ కనుగొనటానికి, చెక్ లేదా డబ్బును జమచేయడానికి, ఖాతా వివరాల చిన్న పట్టిక మొదలైనవి పొందవచ్చును.
ప్రధాన రిటైల్ స్టోర్స్ మరియు దుకాణాల్లో షాపింగ్ చేస్తున్నప్పుడు, క్రింది ప్రక్రియను అనుసరించండి:
ఈ కార్డులు నేను ఎందుకు వాడాలి?
ఎక్కడైనా షాపింగ్ చేయడానికి మీ కార్డును ఉపయోగించవచ్చు.
దుకాణాలు, ఎటిఎం (ATM) లు, వాలెట్ల్, మైక్రో ఎటిఎంలు , ఆన్ లైన్ షాపింగ్ లలో ఉపయోగించవచ్చు.
డెబిట్ మరియు క్రెడిట్ కార్డులు రెండింటిని ఎటిఎం నుండి సొమ్ము తీసుకొనుట, పాయింట్ ఆఫ్ సేల్ (POS), ఆన్ లైన్ లో వస్తువులు మరియు సేవల కొనుగోలు కోసం ఉపయోగించవచ్చు.
అన్ని రకాల వినియోగ బిల్లులు చెల్లించడానికి ఉపయోగించవచ్చు.
వినియోగదారు టికెట్లు (వైనానిక / రైల్వే / బస్), హోటల్స్ ను బుక్ చేయుటకు, రెస్టారెంట్లకు చెల్లింపులు చేయడానికి ఉపయోగించవచ్చు.
మీ కార్డును ఒక కార్డ్ రీడర్ / POS యంత్రం ఎక్కడ వున్నా అక్కడి ఏ సేవకైనా చెల్లింపులు చేయడానికి ఉపయోగించవచ్చు.
కార్డును పొందడం ఎలా?
వినియోగదారులు డెబిట్ / రూపే / క్రెడిట్ కార్డుల కోసం అన్ని ప్రభుత్వ రంగ , ప్రభుత్వేతర బ్యాంక్ లకు ధరఖాస్తు చేసుకోవచ్చు.
పౌరులు డెబిట్ కార్డు కోస్ం వారి ఖాతావున్న బ్యాంక్ నకు ధరఖాస్తు చేసుకొని పొందవచ్చ.
పౌరులు వారి డెబిట్ కార్డును రూపే కార్డుతో మార్చుకోవచ్చు.
బ్యాంక్ ఖాతాలేని పౌరులు కార్డు కోసం ముందుగా ఒక ఖాతాను తెరవాలి.
ప్రభుత్వ నిర్దేశాల ప్రకారం జన్ ధన్ ఖాతా కలిగిన వారందరికి రూపే కార్డులు ఇవ్వబడతాయి.
యు ఎస్ ఎస్ డి (USSD)
* 99 # - నేషనల్ యూనిఫైడ్ ఎస్ ఎస్ డి వేదిక (NUUP)
యాక్టివేషన్ కి అవసరం
బ్యాంకులో ఖాతా
జీఎస్ఎం నెట్వర్క్ ఉన్న మొబైల్ ఫోన్
వినియోగదారునికి రోజుకు రూ 5000 వరకు చెల్లింపులకు వాడవచ్చు.
నమోదు
మొబైల్ నెంబర్ లింక్ మీ శాఖ సందర్శించండి మరియు బ్యాంకు account- ATM వద్ద లేదా ఆన్లైన్ చేయవచ్చు
మీరు నమోదు మీద మీ మొబైల్ మనీ ఐడెంటీఫైర్ (MMID) మరియు మొబైల్ పిన్ (పిన్) పొందుతారు
మీ MMID మరియు పిన్ గుర్తుంచుకోండి
మరో బ్యాంకు ఖాతాకు నిధులు బదిలీ:
ఎ ఇ పి ఎస్ (AEPS)
AEPS వ్యాపారం ప్రతినిధులు( బిజినెస్ కరెస్పాండంట్) సహాయంతో పనిచేసాయి పిఓఎస్ (MicroATM) ద్వారా బ్యాంకు టు బ్యాంకు లావాదేవీ అనుమతిస్తుంది (క్రీ.పూ) .
కేవలం ఆధార్ అవసరం
ఆధార్ ఎనేబుల్డ్ సర్వీసెస్
బాలన్స్ ఎంక్వయిరీ
నగదు ఉపసంహరణ
నగదు డిపాజిట్
ఆధార్ నించి ఆధార్ కు ఫండ్స్ ట్రాన్స్ఫర్
AEPS తో రేషన్ దుకాణాలు వద్ద కొనుగోలు
ఆధార్ చెల్లింపు వ్యవస్థ నమోదు ప్రక్రియ
బ్యాంకు వద్ద లేదా బ్యాంకింగ్ కరస్పాండెంట్లకు సహాయంతో మీ ఆధార్ నంబర్తో మీ ఖాతాను సీడ్ చేయించుకోండి
ఇప్పుడు మీరు ఏ పిన్ లేదా పాస్వర్డ్ లేకుండా ఏ AEPS పాయింట్లు -micro ఎటిఎంల వద్ద అనేక లావాదేవీలు చేయవచ్చు
AEPS లావాదేవీ కీ ముఖ్యమైన దశలు
ఒక microATM ఉన్న చోటు వెళ్ళండి లేదా బ్యాంకింగ్ కరస్పాండెంట్ ని కలవండి మీ బ్యాంకు పేరు మరియు ఆధార్ వివరాలు అందించండి
లావాదేవీ ఎంచుకోండి
స్కానర్ పై వేలు పెట్టండి
లావాదేవీ విజయవంతం గా పూర్తీ చేస్కుని త్రన్సచ్తిఒన్ స్లిప్ తీసుకొంది
ప్రక్రియ పూర్తి అయంది
మైక్రో ఎటిఎమ్ లావాదేవీ
యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (యు పి ఐ- UPI)
భారతదేశం లో నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ అఫ్ ఇండియా (NPIC) మార్గదర్శకత్వంలో అన్ని రిటైల్ చెల్లింపులు వ్యవస్థలు పని చేస్తాయి. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ అఫ్ ఇండియా (NPIC) ఇటీవల తదుపరి తరం ఆన్లైన్ చెల్లింపులు పరిష్కారం యూనిఫైడ్పేమెంట్ ఇంటర్ఫేస్ (UPI) విడుదల చేసింది. పెరుగుతున్న స్మార్ట్ఫోన్ మరియు మొబైల్ డేటా వాడుక దృష్టిలో పెట్టుకుని యూనిఫైడ్పేమెంట్ ఇంటర్ఫేస్ (UPI) తైయరీ చేయటం జరిగింది. UPI తక్షణ పుష్ ( చెల్లింపు) మరియు పుల్ (చెల్లింపు స్వీకరించేందుకు) లావాదేవీలు చేసాయి సౌకర్యం ద్వారా వినియోగదారులు నగదు చెల్లింపు నుండి నగదు రహిత చెల్లింపు మరింత ఉపయోగించడం జరుగుతుంది అని అంచనా.
స్మార్ట్ఫోన్ నుండి నగదు రహిత లావాదేవీలు వేదిక అవటం UPI ప్రత్యేకత. ఒక ఖాతాదారు ఇప్పుడు అతని స్మార్ట్ ఫోన్ ద్వారా నగదు బదిలీ,నగదు డిపాజిట్ మరియు నగదు చెల్లింపు చెయ్యడానికి UPI ఉపయోగించవచ్చు.
UPI లో రిజిస్ట్రేషన్ కోసం కావాల్సింది
ఇంటర్నెట్ సదుపాయంతో కూడిన స్మార్ట్ఫోన్
బ్యాంక్ ఖాతా వివరాలు ( నమోదు కోసం మాత్రమే)
UPI నమోదు ప్రక్రియ
మీ బ్యాంకు యొక్క మొబైల్ అప్లికేషన్ లేదా 3 పార్టీ అప్లికేషన్ అప్లికేషన్ డౌన్లోడ్ చేయండి .
మీ యూనిక్ ID ని (ఆధార్, మొబైల్ సంఖ్య.) వర్చువల్ చెల్లింపు (పేమెంట్) అడ్రస్ గా ఎంచుకోండి
మొదటిసారి ఖాతా వివరాలు ఇవ్వండి
లావాదేవీలు నిర్ధారించడంలో కోసం M-పిన్ సెట్ చేయండి
నమోదు ప్రక్రియ పూర్తి చేయండి
UPI నమోదు
UPI ఉపయోగించి డబ్బు పంపడం
"డబ్బు పంపించు" ఎంచుకోండి
చెల్లింపుదారు యొక్క విర్చువల్ పేమెంట్ అడ్రస్ ఎంటర్
డిజిటల్ వాలెట్ సహాయంతో ఆన్‌లైన్ కొనుగోళ్లకే కాకుండా బయట దుకాణాల్లోనూ చెల్లింపులు చేయొచ్చు.
పలు వాలెట్ల నుంచి బ్యాంకు ఖాతాలకూ నగదు బదిలీ చేయొచ్చు.
డబ్బే కాదు.. డెబిట్, క్రెడిట్ కార్డులూ వెంట తీసుకెళ్లే అవసరం ఉండదు. ఇందులో కార్డు వివరాలను నిక్షిప్తం చేసుకుని అవసరమైన చోట వాటిని వినియోగించే వీలుంది.
కార్డులను నేరుగా స్వైప్ చేసేటప్పుడు వాటి సమాచారం తస్కరణకు గురయ్యే ప్రమాదం ఉంటుంది. అదే వాలెట్‌లో కార్డులను ఉపయోగిస్తే ఆ ప్రమాదం ఉండదు.
చెల్లింపులకు పట్టే సమయం కూడా చాలా తక్కువ.
చిన్నమొత్తాల చెల్లింపులకు ఇవి అనుకూలం.
ప్రతికూలతలూ ఉన్నాయి
సరైన భద్రత విధానాలు పాటించకపోతే కొంత ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా డిజిటల్ వాలెట్ యాప్ ఉన్న ఫోన్ ఇతరుల చేతిలో పడితే మనకు తెలియకుండానే వారు అందులోని డబ్బును వినియోగించుకునే ప్రమాదముంది.
పాస్‌వర్డ్ రక్షణ ఉన్నా సరే అది ఇతరులకు తెలిసినప్పుడు, లేదంటే క్లిష్టమైనది కాకుండా సులభంగా వూహించగలిగేది, సాంకేతికత సాయంతో ఛేదించగలిగేది అయినప్పుడు వాలెట్‌లోని డబ్బుకు రక్షణ తక్కువే.
ఇతర దేశాలకు వెళ్లేవారు వీటిపై ఆధారపడే అవకాశం లేదు. బ్యాంకులు జారీ చేసే క్రెడిట్, డెబిట్ కార్డుల్లో చాలా రకాలు వివిధ దేశాల్లో వినియోగించే వీలుంటుంది. కానీ, వాలెట్ చెల్లింపుల్లో ఆ సౌలభ్యం లేదు.
డిజిటల్ వాలెట్ల నుంచి చెల్లింపులను స్వీకరిస్తున్న వ్యాపారులు, దుకాణదారులు ఇప్పటివరకు తక్కువగానే ఉన్నారు. పెద్ద నోట్ల రద్దు తరువాత మాత్రం వారి సంఖ్య వేగంగా పెరుగుతోంది.
ఈ-వాణిజ్య సంస్థలు కూడా ఆన్‌లైన్ చెల్లింపులను స్వీకరిస్తున్నా అవి ఎక్కువగా కార్డు ఆధారితమే. చాలా సంస్థలు కార్డులు, తమ సొంత వాలెట్ల నుంచి చెల్లింపులను మాత్రమే స్వీకరిస్తున్నాయి.
స్మార్ట్‌ఫోన్‌లు, కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు వంటి ఉపకరణాలు.. వాటికి ఇంటర్నెట్ సౌకర్యం ఉంటే తప్ప వీటిని వినియోగించే అవకాశం లేదు.
వాలెట్‌లో ఎంత డబ్బున్నా బయట దుకాణాల్లో చెల్లింపు చేయాల్సిన సమయంలో ఫోన్లో ఛార్జింగ్ అయిపోయినా ఇవి ఎందుకు పనికిరావు. క్రెడిట్, డెబిట్ కార్డుల వినియోగాన్ని ఇవి అధిగమించలేకపోవడానికి ఇదే ప్రధాన కారణం.
వయోధికులు, నిరక్షరాస్యులు నగదు అంత సులభంగా దీన్ని వినియోగించలేమనే భావనతో ఉంటున్నారు
ఇ వాలెట్ అప్లికేషన్లు
మొబిక్విక్
పోకెట్స్
టీఏ వాలెట్
జియోమనీ
స్పీడ్ పే
చిల్లర్
స్టేట్ బ్యాంక్ బడ్డీ
ఫ్రీఛార్జ్
పేటీఎం
వొడాఫోన్ ఎం-పేస
ఎయిర్‌టెల్ మనీ
హెడ్‌డీఎఫ్‌సీ పేజాప్
పాయింట్ అఫ్ సేల్ (POS)
పాయింట్ అఫ్ సేల్ (POS) రకాలు
ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫర్ భద్రతకు చిట్కాలు
ప్రతి లావాదేవీ ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం కోసం బ్యాంకు వద్ద మీ మొబైల్ నంబరును నమోదు చేస్కోండి
మీ పిన్ ఎవరికి చెపుద్దూ
మీకు మామ్మకం ఉన్న చోటాయ్ లావాదేవీలు చేస్కోండి
ATM వద్ద ఉండగా, కీప్యాడ్ ఎవరికి కంపించకకుండా PIN ఎంటర్ చేయండి