অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ఇ వాలెట్ - ప్రయోజనాలు మరియు ప్రతికూలతలూ

ఇ వాలెట్ అంటే ఏమిటి

 • ప్రీపెయిడ్ చెల్లింపు పద్ధతి- మీ మొబైల్ ఫస్ట్
 • స్మార్ట్ ఫోన్ లేదా కంప్యూటర్ ను ఉపయోగించి ఆన్లైన్ ద్వారా వస్తువులను కొనుగోలు చేసినపుడు వినియోగించవచ్చు .
 • ఇ వాలెట్ లోకి నగదును బదలీ చేయటానికి వ్యక్తిగత బ్యాంకు ఖాతాను ఇ వాలెట్ కు అనుసంధానించాలి
 • ఇంచు మించు అన్ని బ్యాంకులు కొన్ని ప్రయివేటు కంపెనీలు ఇ వాలెట్ సౌకర్యాన్ని అందచేస్తున్నాయి

ఇ వాలెట్‌తో ప్రయోజనాలు

 • డిజిటల్‌ వాలెట్‌ సహాయంతో ఆన్‌లైన్‌ కొనుగోళ్లకే కాకుండా బయట దుకాణాల్లోనూ చెల్లింపులు చేయొచ్చు.
 • పలు వాలెట్ల నుంచి బ్యాంకు ఖాతాలకూ నగదు బదిలీ చేయొచ్చు.
 • డబ్బే కాదు.. డెబిట్‌, క్రెడిట్‌ కార్డులూ వెంట తీసుకెళ్లే అవసరం ఉండదు. ఇందులో కార్డు వివరాలను నిక్షిప్తం చేసుకుని అవసరమైన చోట వాటిని వినియోగించే వీలుంది.
 • కార్డులను నేరుగా స్వైప్‌ చేసేటప్పుడు వాటి సమాచారం తస్కరణకు గురయ్యే ప్రమాదం ఉంటుంది. అదే వాలెట్‌లో కార్డులను ఉపయోగిస్తే ఆ ప్రమాదం ఉండదు.
 • చెల్లింపులకు పట్టే సమయం కూడా చాలా తక్కువ.
 • చిన్నమొత్తాల చెల్లింపులకు ఇవి అనుకూలం.

ఇ వాలెట్‌ ఉపయోగించటములోసాధారణంగా ఎదురయ్యే సమస్యలు

 • ఫిర్యాదుల్లో అధిక శాతం నగదు బదిలీకి సంబంధిం చినవే ఉంటున్నాయి. అవ్యాలెట్ల మధ్య నగదు బదిలీ చేసే క్రమంలో ఒక్కోసారి లావాదేవీ విఫలమవుతుంటుంది. అప్పుడు ఆ మొత్తం పంపినవారి ఖాతాలోకే మళ్లీ పడుతుంది. ఇందులో ఆలస్యం ఏర్పడే సందర్భాలు అత్యంత అరుదు.
 • వ్యాలెట్ నుంచి బ్యాంకు ఖాతాకు డబ్బు పంపించిన ప్పుడు లావాదేవీ విఫలమైనా పంపినవారి వ్యాలెట్ ఖాతాలోకే తిరిగి చేరాలి. కానీ.. ఒక్కోసారి అలా చేరడంలో ఆలస్యమవుతుంది.
 • సంబంధిత బ్యాంకు, భారత జాతీయ చెల్లింపుల సంస్థ(ఎన్ పీసీఐ) సర్వర్లు సక్రమంగా పనిచేయనప్పుడు ఆ పరిస్థితి ఏర్పడుతుంది.
 • తిరిగి అవి పునరుద్ధరణయిన తరు వాత డబ్బు వెనక్కు వస్తుంది.
 • విఫల లావాదేవీలను వ్యాలెట్ సంస్థలు సాధారణంగా 24 గంటల్లోనే ధ్రువీకరిస్తాయి. కానీ. కొన్ని బ్యాంకులు గరిష్టంగా 8 రోజుల సమయం కూడా తీసుకుంటాయి.
 • చాలా మంది వినియోగదారులు ఒక  వాలెట్ లో చాలా ఖాతాలు అనుసంధానిస్తారు.
 • వక వ్యాలెట్లో బహుళ ఖాతాలు నిర్వహించే విని యోగదారులు ఒక్కోసారి పొరపాటు పడుతున్న సందర్భాలూ ఉంటున్నాయి.
 • విఫల లావాదేవీకి సంబంధించి డబ్బు తిరిగి జమ కావాల్చిన ఖాతా కాకుండా వేరే ఖాతాను పరిశీలించి ఆందోళన చెందుతుంటారు

పై సమస్యలకు ఏమి చెయాలి

 • బ్యాంకులకు అనుసంధానంగా ఉండే వ్యాలెట్లకు సంబందంచి ఆ యా బ్యాంకుల పరిష్కార వేదికలనే ఆశ్రయించాలి..
 • సమస్య ఏర్పడినప్పుడు వెంటనే సహాయత ఖాతాదారుల సేవా విభాగాలను. అవసరమైతే బ్యాంకింగ్ ఆంబుడ్స్మన్ను కూడా సంప్రదించొచ్చు.
 • స్వతంత్ర వ్యాలెట్ సంస్థలకు వచ్చేసరికి పరిస్థితులు వేరుగా ఉన్నాయి.
 • అక్కడి సమస్యలు ఆంబుడ్స్మన్ పరిధిలోకి రావు.
 • సహాయత ఖాతాదారుల సేవా విభాగాలనే ఆశ్రయించాలి.
 • ఫోన్లో కానీ, ఈమెయిల్ ద్వారా కానీ ఫిర్యాదు చేయొచ్చు
 • ఫేస్బుక్, ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాల్లో ఆయా సంస్థలు నిర్వహించే పేజీల్లోనూ మన సమ స్యను చెప్పుకోవచ్చు.
 • ఆయా సంస్థల స్థాయిలో పరిష్కారమయ్యేదైతే వారే మొత్తం బాధ్యత వహిస్తారు.
 • బ్యాంకులకు డబ్బు బదిలీ సమయంలో ఏర్పడే సమస్యలను అవసరమైతే ఆయా బ్యాంకులకు అప్పగిస్తారు.
 • ఎవరిని సంప్రదిం చాలో మార్గదర్శనం చేస్తారు.
 • ఇలాంటి సందర్భాల్లో ఆ ఫిర్యాదుకు ఒక సంఖ్య కేటా యిస్తారు. ఆ సంఖ్యను ప్రస్తావిస్తూ  బ్యాంకు ఫిర్యా దుల విభాగాన్ని సంప్రదించాలి.
 • అప్పటికీ కాకుంటే మొత్తం వ్యవహారాన్ని వివరిస్తూ ఆ సంఖ్యను ప్రస్తావిస్తూ న్యాయ స్థానాలకు వెళ్లే అవకాశముంటుంది

క్రింది జాగ్రత్తలు తీసుకుంటే మేలు

 • వ్యాలెట్ యాప్ సహాయంతో జరిపే ప్రతి లావాదేవీ స్థితిని తెలిపే ఆధారం ఉంచుకోవాలి.
 • ఆ లావాదేవీ సఫలమైనా, విఫలమైనా, అపరిష్కృతంగా ఉన్నా దానికి సంబంధించి ఫోన్ తెరపై చూపే వివరాలను యధాతథంగా నిక్షిప్తం(స్కీన్ షాట్) చేయాలి.
 • వ్యాలెట్ ఖాతాల స్థాయి పెంచమని(అప్గ్రేడ్) సంస్థను కోరాలి.
 • అప్పుడు బ్యాంకు ఖాతాలకు అనుసంధానించి నట్లే పాన్ కార్డు, ఆధార్ నంబర్ వంటి ధ్రువపత్రాలు అనుసంధానిస్తారు.
 • దీనివల్ల ఖాతాకు బలమైన ఆధారా లతో పాటు అదనపు వెసులుబాట్లు కలుగుతాయి.

 

ఆధారం: CSC


© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate