ఇ.ఎస్.ఐ పథకం యొక్క ప్రయోజనాలు – కీలక ప్రక్రియల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (NREGA) 2005, ఆగస్టు 25న ఆమోదం పొందింది. 2005, సెప్టెంబర్ 7న దానిని నోటిఫై చేయడం జరిగింది. ఆ చట్టాన్ని 2006, ఫిబ్రవరి నుంచి 200 జిల్లాలలో క్షేత్రస్థాయిలో అమలు చేయడం ప్రారంభించారు. 2007లో మరో 170 జిల్లాలలో దానిని అమలు చేయడం ప్రారంభించారు. 2008 ఏప్రిల్ లో NREGAను పూర్తిగా పట్టణ జనాభా కలిగిన జిల్లాలు తప్పించి దేశంలోని అన్ని జిల్లాలలో అమలు చేయడం ప్రారంభమైంది. NREGAను 2009, అక్టోబర్ 2 నుంచి మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS)గా పిలవడం ప్రారంభించారు.
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (NREGA) 2005, ఆగస్టు 25న ఆమోదం పొందింది. 2005, సెప్టెంబర్ 7న దానిని నోటిఫై చేయడం జరిగింది. ఆ చట్టాన్ని 2006, ఫిబ్రవరి నుంచి 200 జిల్లాలలో క్షేత్రస్థాయిలో అమలు చేయడం ప్రారంభించారు. 2007లో మరో 170 జిల్లాలలో దానిని అమలు చేయడం ప్రారంభించారు. 2008 ఏప్రిల్ లో NREGAను పూర్తిగా పట్టణ జనాభా కలిగిన జిల్లాలు తప్పించి దేశంలోని అన్ని జిల్లాలలో అమలు చేయడం ప్రారంభమైంది. NREGAను 2009, అక్టోబర్ 2 నుంచి మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS)గా పిలవడం ప్రారంభించారు.
భారత ప్రభుత్వం చేపడుతున్న అతిపెద్ద ప్రతిష్టాత్మక పథకంగా MGNREGS పేరు పొందింది. ఈ పథకన్ని దేశవ్యాప్తంగా 613 జిల్లాలలోని 6349 బ్లాక్ లు/మండలాల్లోని 2.38 లక్షల గ్రామ పంచాయితీలలో అమలు చేస్తున్నారు. ఈ పథకం కింద 28.49 కోట్ల మంది కూలీల వద్ద 13.19 కోట్ల జాబ్ కార్డులున్నాయి. ఈ పథకం కింద ఉపాధి పొందుతున్న వారిలో 19.18% మంది ఎస్సీలు, 14.96 % మంది ఎస్టీలు ఉన్నారు. 2013-14 కాలంలో ఈ పథకం క్రింద ప్రతి కుటుంబానికి ఏడాదికి 46 వ్యక్తి-పనిదినాలు, ప్రతీ వ్యక్తికీ రోజుకు 133 రూపాయల సగటు వేతనం వంతున చెల్లించారు.
భారత ప్రభుత్వం పాత పథకాలను, కొత్త పథకాలను కలిపి గ్రామీణ ప్రజలకు అదనపు ఉద్యోగ భద్రతను కల్పిస్తుంది. దీని ద్వారా గ్రామాలలోని ప్రజలు శారీరకశ్రమతో కూడిన పనుల ద్వారా వారు వారి సంపదలను సుస్థితరం చేసుకోవడం మరియు ఆహార భద్రతను మెరుగు పరచుకుంటున్నారు. నిర్వహణ వైఫల్యాలు, ప్రణాళిక రూపకల్పన, వాటి అమలులో లోపాలు ఈ పథకంలోని ప్రధాన లోపాలు. ఈ పథకాలన్నిటిలో ఇచ్చే ప్రతిఫలం – ఆహారధాన్యాలతో కూడిన వేతనం. దీనికి మూడు దశాబ్దాల ముందు చేపట్టిన జవహర్ రోజ్ గార్ యోజన, ఉపాధి హామీ పథకం, పనికి ఆహార పథకం, జవహర గ్రామ సమృద్ధి యోజన, సంపూర్ణ గ్రామీణ రోజ్ గార్ యోజన తదితర ప్రయోగాత్మక పథకాల ద్వారా ప్రభుత్వం చివరికి ఈ పథకానికి రూపకల్పన చేసిందని చెప్పవచ్చు.
ప్రతి ఆర్థిక సంవత్సరం ప్రతి గ్రామీణ కుటుంబానికి కనీసం 100 పనిదినాలు కల్పించి వారికి జీవనోపాధి భద్రత కల్పించడం MGNREGS పథకం యొక్క ప్రధాన లక్ష్యం.
ముఖ్యాంశాలు:
MGNREGS బడ్జెట్: భారత ప్రభుత్వం 2014-15లో ఈ పథకానికి రూ. 34,000 కోట్లను కేటాయించింది. 2013-14లో దీనికి
రూ.33,000 కోట్లను కేటాయించారు. 2012-13లో రూ.40,000 కోట్లను, 2011-12లో రూ.40,000 కోట్లను, 2010-11లో
రూ.40,100 కోట్లను కేటాయించారు. 2006-09 మధ్య కాలంలో ఈ పథకానికి బడ్జెట్ కేటాయింపులు రూ.10,000 కోట్ల నుంచి
రూ.15,000 కోట్లకు మాత్రమే పెరిగాయి.
భాగస్వాములు:
కూలీలు: గ్రామీణ ప్రాంతంలో ఈ పథకం కింద కూలీలే ప్రధాన భాగస్వాములు. కూలీల హక్కులు:
ఈ పథకం కింద గ్రామసభకు ఈ క్రింది హక్కులు, భాధ్యతలు అప్పగించడం జరిగింది:
గ్రామ పంచాయతీ:
గ్రామస్థాయిలో ఓ పథకం నిర్వహణకు గ్రామపంచాయితీయే కీలకం.
గ్రామ పంచాయతీ బాధ్యతలు:
బ్లాక్/మండల/జిల్లాస్థాయి: బ్లాక్/మండల స్థాయిలో ప్రణాళికల నిర్వహణ/పర్యవేక్షణకు మధ్యంతర వారధిగా పంచాయితీ బాధ్యత వహిస్తుంది. బడ్జెట్ ను జిల్లాస్థాయి పంచాయతీ లేదా జిల్లా నీటి నిర్వహణ సంస్థ (DWMA) ఆమోదించి, జిల్లాస్థాయిలో దానిని సమన్వయం చేయాలి.
రిజిస్ట్రేషన్, ఉపాధికి అర్హత: MGNREGS కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసిన అన్ని గ్రామీణ ప్రాంతాలలోని కుటుంబాలు నమోదు చేసుకోవచ్చు. ఒక ఆర్థిక సంవత్సరంలో 100 రోజుల పనిదినాలు అన్న నియమం ఒక కుటుంబానికి వర్తిస్తుంది.
దరఖాస్తు చేసుకున్న కుటుంబ సభ్యులంతా పని కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. నమోదు చేసుకోవడానికి వారు:
గ్రామంలోని కుటుంబానికి చెందిన వయోజనులు నైపుణ్యం లేని శ్రమ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు రాతపూర్వకంగా కానీ, మౌఖికంగా కానీ స్థానిక గ్రామపంచాయతీలో దరఖాస్తు చేసుకోవచ్చు.
సాదారణంగా పని కొరకు దరఖాస్తును గ్రామ పంచాయితీకి సమర్పించాలి. దరఖాస్తును రాతపూర్వకంగా ఇవ్వాలి. దానిలో ఈ క్రింద వివరాలుండాలి:
గ్రామ పంచాయితీ లేదా బ్లాక్/మండల కార్యాలయానికి పనిని కోరూతూ ఒక దరఖాస్తును సమర్పించాలి. దానిలో ఎన్ని రోజులు పని కావాలి, ఏ సమయంలో కావాలి అన్న వివరాలు ఉండాలి. గ్రామ పంచాయతీ తీసుకున్న దరఖాస్తుకు రసీదును అందజేస్తుంది. దాని ఆధారంగా 15 రోజుల్లోగా వారికి ఉపాధి కల్పించాల్సి ఉంటుంది.
అమలు చేసే సంస్థలు:
ఈ పథకం కింద అందజేసే నిధులు 50 శాతం గ్రామపంచాయతీలే నిర్వహించాలి అని ఈ చట్టం నిర్దేశిస్తున్నందున పథకం అమలులో గ్రామ పంచాయతీయే ముఖ్యమైన సంస్థ.
మండల/బ్లాక్ మధ్యస్థ మరియు జిల్లా పంచాయత్/జిల్లా పరిషత్‌లతో పాటు – ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వరంగ సంస్థలు, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ప్రధాన వాటా కలిగిన సహకార సొసైటీలు, మంచి పేరు కలిగిన ప్రతిష్టాత్మక స్వచ్ఛంద సంస్థలు కూడా ఈ పథకం అమలులో భాగస్వామ్యం పంచుకోవచ్చు. స్వయం సహాయక బృందాలను కూడా దీని కోసం పరిశీలన చేయవచ్చు.
చేపట్టదగిన పనులు:
గ్రామీణ ప్రాంతాలలో కనీస ఉపాధి అవకాశాలు సృష్టించడం MGNREGS యొక్క ప్రధాన ఉద్దేశం.
ఏ రకమైన పనులు చేపట్టవచ్చునో ఈ చట్టంలోని మొదటి షెడ్యూల్ ప్రకారం – MGNREGS ఈ క్రింది పనులపై ప్రధానంగా దృష్టి
సారిస్తుంది.
పనులను అనుమతించడం:
పనుల కొలత:
చేసిన పనులను కొలత వేయడానికి రాష్ట్రాలు తమ స్వంత నియమాలను రూపొందించుకోవచ్చు. సంపద, పనిని అంచనా వేయడంలో ఈ క్రింది అంశాలను పరిగణలోనికి తీసుకోవాలి:
1. MGNREGS కింద చేపట్టే పనులను స్పష్టంగ గుర్తించాలి మరియు దానిలో ఎలాంటి కనిపించని అంశాలు ఉండకూడదు.
ముక్కలుగా చేసిన పని (పీస్ రేట్)లో ఎలాంటి తక్కువ వేతన చెల్లింపులు ఉండరాదు. వివిధ రకల పనులను కలపడం/ఒకే పనిగా
గుర్తించడం (ఉదా: గుంటలు తవ్వడం/మట్టిని తవ్వి పోయడం) లాంటి వాటిని నివారించాలి.
2. పీస్-రేట్ పనుల జాబితా కింద నమోదు చేయబడిన పనులన్నింటిలో నేల స్వభావం, వాలు, భూమి స్వభావంలాంటి వివిధ స్థానిక
అంశాలను పరిగణలోనికి తీసుకుని, సాధారణంగా ఆ పనిని పూర్తి చేయడానికి పడే కాలానికి అనుగుణంగా అన్ని ప్రాంతాల వారు
సమానమైన వేతనాన్ని పొందేట్లు ఆయా పరిస్థితులకు అనుగుణంగా ఉత్పత్తి నిబంధనలను నిర్ణయించాలి.
3. అవినీతి, తక్కువ చెల్లింపు సమస్యలను అరికట్టడానికి పని చేసిన సమయం, కొలతలు తీసుకున్న సమయానికి మధ్య ఉన్న విరామం, కొలతపరమైన నిబంధనలు (వ్యక్తిగత/సమిష్టి) రూపొందించుకోవాలి.
పని ప్రదేశంలో సౌకర్యాలు:
పనుల అమలును పర్యవేక్షించే సంస్థలు పని ప్రదేశంలో సౌకర్యాలు ఏర్పాటు చేయాలి. వైద్యపరమైన సంరక్షణ, తాగు నీరు, నీడ వసతులు, ఆరేళ్లకన్నా తక్కువ వయసున్న పిల్లలు ఐదుమందికన్నా ఎక్కువ ఉంటే ఆ పిల్లలకు క్రేష్ వసతి కల్పించాలి.
ఆరేళ్లకన్నా తక్కువ వయసున్న పిల్లలు ఐదుమందికన్నా ఎక్కువ ఉంటే వారిని చూసుకోవడానికి MGNREGS కింద ఒక వ్యక్తిని, వారు మహిళ అయి ఉంటే మంచిది, ఏర్పాటు చేయాలి. ఆమెకు నైపుణ్యంలేని వ్యక్తితో సమానమైన వేతనాన్ని చెల్లించాలి. ఈ ఖర్చును ప్రత్యేకంగా నమోదు చేయాలి. దానిని పని కొలతలో భాగంగా చేర్చరాదు.
క్రెష్ ఉండే ప్రదేశాన్ని సమర్థంగా ఉపయోగించుకొనేలా తీర్చిదిద్దాలి. సాధారణంగా, ఒక పని ప్రదేశానిని లేదా కొన్ని పని ప్రదేశాలకు కలిపి ఒక క్రెష్ ను ఏర్పాటు చేయాలి.
వేతనాల చెల్లింపు:
నిరుద్యోగ భృతి: దరఖాస్తు చేసుకున్న 15 రోజుల్లోగా పనిని కల్పించలేకపోయినట్లైతే, దరఖాస్తుదారులకు నిరుద్యోగ భృతి చెల్లించాలి. మొదటి 30 రోజులకు వేతన రేటులో మూడో భాగం, ఆ తర్వాత సగం వేతనం వంతున చెల్లించాలి.
పని కల్పన: పని కేటాయింపు సందర్భంగా, ఈ క్రింది అంశాలను పరిగణలోనికి తీసుకోవాలి: గ్రామానికి చుట్టుప్రక్కల 5 కిలోమీటర్ల పరిధిలో పనిని చూపించాలి. 5 కిలోమీటర్లు పైబడినట్లైతే రవాణా చార్జీలు, ఇతర ఖర్చుల నిమిత్తం పది శాతం అదనపు వేతనాన్ని చెల్లించాలి.
మహిళలకు ప్రాధాన్యతనివ్వాలి. ఈపథకం కింద ఉపాధి కల్పించేవారిలో కనీసం మూడో వంతు మంది మహిళలు ఉండాలి. ఖర్చుపరంగా, పనుల్లో 50 శాతం ఖర్చు చేసే అధికారాన్ని గ్రామ పంచాయితీలకు కట్టబెట్టాలి.
ప్రణాళిక: ప్రణాళికలు, ఎలాంటి పనులు చేపట్టాలి, ఏ పనిని ముందు, ఏ పనిని తర్వాత చేపట్టాలి, ఏ ప్రాంతంలో మొదట పనిని చేపట్టాలి – ఇలాంటి నిర్ణయాలు ఆ ఆర్థిక సంవత్సరంలో చేసుకోవాలి. ఈ నిర్ణయాలను గ్రామసభ సమావేశాల్లో తీసుకోవాలి. గ్రామ పంచాయతీ వాటికి ఆమోదం తెలపాలి. బ్లాక్, జిల్లాస్థాయిలో ప్రతిపాదించిన పనులకు అధికార యంత్రాంగం ఆమోదం తెలిపే ముందు గ్రామ సభ వాటిని ఆమోదించాలి. గ్రామ సభ వాటిని ఆమోదించవచ్చు, సవరణలు చేయవచ్చు లేదా వాటిని నిరాకరించవచ్చు.
ఖర్చుల వాటా: నైపుణ్యం అవసరం లేని కూలీల విషయంలో భారత ప్రభుత్వం 100 శాతం ఖర్చును భరిస్తుంది. నిర్మాణ పదార్థాల ఖర్చుతోపాటు నైపుణ్యాలు, అర్థనైపుణ్యాలు కలిగిన కూలీల ఖర్చులో 75 శాతం ఖర్చును భరిస్తుంది.
పని ప్రదేశం నిర్వహణ: ఈ పథకం కింద కూలీలు ప్రత్యక్ష లబ్ది పొందేలా, పనుల్లో యంత్రాల వాడకాన్ని, కాంట్రాక్టర్ల జోక్యాన్ని నిషేధించారు. ఈ చట్టం నీరు కారకుండా ఉండేందుకు, వేతన ఉపాధిపై ప్రధానంగా దృష్టి సారించేందుకు MGNREGS ఒక గ్రామ
పంచాయతీలో చేపట్టిన మొత్తం ఖర్చుల్లో వేతన ఖర్చు, నిర్మాణ పదార్థాల ఖర్చు 60 : 40 శాతంగా ఉండాలని ఈ చట్టం నిర్థేశిస్తోంది. పని ప్రదేశంలో క్రెష్, తాగు నీరు, నీడ వసతి కల్పించాలని కూడా ఈ చట్టం చెబుతోంది.
గిరిజన ప్రాంతాలలో MGNREGS :
గిరిజన వ్యవహారాల శాఖ MGNREGS కింద గిరిజన కుటుంబాలకు కేటాయించే పనిదినాల సంఖ్యను పెంచాలని ఒక ప్రతిపాదన తెచ్చింది. ఈ ప్రతిపాదనలను అనుసరించి భారత ప్రభుత్వం 2014, జనవరి 7న గిరిజన ప్రాంతాలలో షెడ్యూల్ తెగల కుటుంబాలకు పని దినాలను 100 నుంచి 150 కు పెంచింది. 50 రోజుల అదనపు పని దినాలకు అయ్యే ఖర్చును గిరిజన శాఖ నుంచి చెల్లిస్తారు.
చాలా రాష్ట్రాలు వికలాంగులకు కూడా తగిన పనుల రూపకల్పన చేస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తున్న 80 శాతం వికలాంగులకు ఈ పథకం మంచి అవకాశం.
పారదర్శకత మరియు జవాబుదారీతనము:
సామాజిక తనిఖీ ద్వారా ఈ పథకంలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని నెలకొల్పారు. ఈ పథకం కింద చేపట్టే అన్ని పనులనూ, రికార్డులను గ్రామసభ తనిఖీ చేస్తుంది.
పథకాన్ని బాధ్యతాయుతంగా అమలు చేయడం కోసం సమస్య పరిష్కార వ్యవస్థ మరియు నిబంధనలను రూపొందించారు. ఈ పథకానికి సంబంధించిన అన్ని రికార్డులు, లెక్కలను ప్రజల పరిశీలనార్థం అందుబాటులో ఉంచారు. కూలీల గురించి, పని వివరాల గురించి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పై అధికారులకు పంపేందుకు ప్రభుత్వం క్షేత్రస్థాయి సిబ్బందికి స్మార్ట్ ఫోన్లు కూడా అందజేసింది. ఈ మొబైల్ సాంకేతిక పరిజ్ఞానం కారణంగా ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న MGNREGS పనులపై రోజువారీ సమాచారాన్ని తెలుసుకోగలుగుతుంది.
సామాజిక తనిఖీ:
ప్రతి మండలం/బ్లాక్ లో ప్రతి ఆరునెలలకోసారి సామాజిక తనిఖీ నిర్వహిస్తారు. దీనిలో హాజరు పట్టికలను, చేపట్టిన అన్ని పనులనూ తనిఖీ చేస్తారు. గ్రామ సభ, మండలస్థాయి సమావేశాల్లో ఈ సామాజిక తనిఖీ నివేదికలను చదివి వివిపిస్తారు. క్రమపద్ధతిలో, క్రమం తప్పని, భహుళ వ్యవస్థ సామజిక తనిఖీ వల్ల ఈ పథకం అమలులో పౌరసమాజం పాత్ర పెరిగింది. అనేక రకాల మోసాలు, ఒకరి జాబ్ కార్డుపై మరొకరు పని చేయడం లాంటి బినామీ వ్యవహారాలు వెలుగులోకి వచ్చి, వాటిపై చర్య తీసుకోవడం జరిగింది. సామాజిక తనిఖీ యొక్క ప్రాథమిక లక్ష్యం – వివిధ కార్యక్రమాలు, చట్టాలు, విధానాలను సమర్థంగా అమలులో జవాబుదారీతనం ఉండేలా చూడటం.
సామాజిక తనిఖీ అనేది లబ్ధిదారులు, ఇతర భాగస్వాములు – ప్రణాళిక రూపకల్పన నుంచి, దాని అమలు, పర్యవేక్షణ, మదింపు వరకూ ప్రాజెక్టు ప్రతి దశలో పాల్గొంటూ నిరంతరం నిర్వహించే ప్రక్రియగా పేర్కొనవచ్చు. దీని వల్ల ఆయా స్థానిక పరిస్థితులకు అనుగుణంగా వివిధ కార్యక్రమాలు రూపొందించుకోవడం, అమలు చేయడం సాధ్యపడుతుంది. దాని వల్ల ప్రభావితులయ్యే వారి ప్రాధాన్యతలను ప్రతిఫలిస్తుంది. తద్వారా ఎక్కువ మందికి మేలు జరుగుతుంది.
సామాజిక తనిఖీ అనేది ఒక నిరంతర ప్రకియ. సామాజిక తనిఖీలో వివిధ కార్యక్రమాల అమలులో 11 దశలలో ప్రజలు నిఘా, పరిశీలన చేసుకోవచ్చు.
MGNREGSప్రభావం:
భారతదేశంలోని గ్రామీణ కుటుంబాలలో MGNREGS చెప్పుకోదగిన ప్రభావాన్నే కనబైచింది. దీని వల్ల వ్యవసాయ కూలీ రేట్లు పెరగడం, వలస వెళ్లడం తగ్గింది. గ్రామీణ కుటుంబాల ఆదాయం పెరిగింది. ఉపాధి కల్పనావాకాశాలు పెరిగి మహీళా సాధికారత పెరిగింది. దేశవ్యాప్తంగా MGNREGS కారణంగా గ్రామీణ ప్రజలు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో లబ్ధి పొందుతున్నారు.
వలసల్లో తగ్గుదల:
పేదరికానికి పలసలు ప్రత్యక్ష నిదర్శనాలు. ఆర్థిక అభివృద్ధి లేదా ఇతర అవకాశాల కొరకు జరిగే వలసలు కాకుండా దుర్భర పరిస్థితుల కారణంగా వలస వెళ్లాల్సిన పరిస్థితుల్లో MGNREGS ఒక మేలైన, ప్రత్యక్ష మార్పును తీసుకురాగలిగింది. ఇంటికి దగ్గరలోనే గౌరవప్రదమైన ఉపాధిఉ కల్పన కారణంగా MGNREGS వలసల సంఖ్యను భారీగా తగ్గించగలిగింది.
ఏడాది పొడవునా ఎలాంటి పని దొరకని పరిస్థితులున్న చోట వలసలు సర్వసాధారణం. గతంలో ఇలాంటి వలసలను నివారించడానికి అనేక కార్యక్రమాలు చేపట్టినప్పటికీ వాటి వల్ల చెప్పుకోదగిన ప్రభావం కనిపించలేదు. MGNREGS కింద పేద కుటుంబాలకు పనిలేని కాలంలో వంద రోజుల పనిదినాలను కల్పించడం జరుగుతోంది. తప్పనిసరి వలసలు ఉన్న గ్రామీణ ప్రాంతాలలో MGNREGS కారణంగా అలాంటి వలసలు తగ్గుముఖం పట్టాయి.
కూలీల రేట్ల పెంపు:
పని తక్కువగా ఉన్న కాలాల్లో గ్రామీణులకు ఉపాధి కల్పించడం ద్వారా MGNREGS వారికి ఆదాయ భద్రత కల్పించింది. మొదట్లో గ్రామాల్లో ఇచ్చే వేతనాలకన్నా MGNREGS కింద ఇచ్చే వేతనాలు ఎక్కువగా ఉండేవి. MGNREGS వేతనాలతో పాటు ఇతర వేతనాల రేట్లలో మార్పులు, ఒక కుటుంబానికి లభించే కూలీ దినాల సంఖ్యలో పెరుగుదల కారణంగా కుటుంబాల ఆదయం పెరిగి, వారి జీవనస్థాయి పెరిగింది.
జీవనోపాధి అవకాశాలు, ఆదాయాల్లో మార్పులు:
పేద కుటుంబాలకు బహుళ జీవనోపాధులుంటాయి. ఆయితే వారికి ఏడాది మొత్తం వేతనాలు అందించే జీవనోపాధి అవకాశాలు అవసరం.
అలాంటి క్రమం తప్పని జీవనోపాధులను పేదలు చాలా సందర్భాల్లో పొందలేకపోతున్నారు. దీని వల్ల వారు దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటూ, పనులు లేని కాలాల్లో ఇతర ప్రాంతాలకు వలస లేదా కుటుంబం గడవడం కోసం ఎక్కువ వడ్డీకి అప్పులు తీసుకోవడం జరుగుతోంది. MGNREGS పథకం రాకతో ఈ పరిస్థితిలో చాలా మార్పు వచ్చింది.
సామాజిక సాధికారత:
ఇతర పనులకన్నా మహిళలు ఈ పథకంలో చాలా చురుకుగా పాల్గొంటున్నారు. MGNREGS పథకం అమలవుతున్న తర్వాత గతంలో ఉపాధి లేకుండా లేదా తక్కవ వేతనాలు పొందుతున్న మహిళలకు చాలా ఉపాధి అవకాశాలు లభిస్తాయని పరిశోధనలు చేబుతున్నాయి. సాంప్రదాయపరంగా ఉండే లైంగిక వివక్షను MGNREGS కొంత వరకూ తగ్గించగలిగింది – మరీ ప్రత్యేకించి ప్రభుత్వ పనుల రంగంలో, ప్రస్తుతం MGNREGS కింద మహిళలకూ, పురుషులకూ సమాన వేతనాలు అందుతున్నాయి. MGNREGS తెచ్చిన ప్రధానమైన మార్పులు:
సలహాలు/సూచనలు:
ముగింపు:
MGNREGS కారణంగా ఉపాధి అవకాశాలు, వేతనాలు పెరిగి, ఉమ్మడి వనరులు, వ్యక్తిగత వనరుల మెరుగుపడి, గ్రామాల్లోని పేద కుటుంబాల ఆదాయం, పనులు, ఆహారభద్రత, జీవన ప్రమాణాలు వంటి వాటి విషయంలో అనేక మార్పులు తీసుకురాగలిగింది.
గ్రామీణ కుటుంబాలలో ఈ పథకం అనేక ముఖ్యమైన మార్పులు తెచ్చింది. పని దినాలను పెంచడం ద్వారా ఈ పథకం వారి జీవన ప్రమాణాలు పెంచగలదు, మహిళల భాగస్వామ్యాన్ని పెంచగలదు, స్వయం సహాయక బృందాలను బలోపేతం చేయగలదు, వికలాంగులు, ఒంటరి మహిళలు లాంటి వారికి సరైన పని కల్పించగలదు, చిన్న రైతుల భూమిని అభివృద్ధి చేయగలదు, చేతివృత్తుల వారిని ఆదుకోగలదు.
ఉపాధి హామీ పథకం లబ్ధిదారులు మరీ ప్రత్యేకించి ఆర్థికంగా, సామాజికంగా వెనికబడిన వారిలో అనేక ముఖ్యమైన మార్పులు తీసుకురాగలిగినప్పటికీ, సమాజంలో ఈ పథకం ద్వారా ఇంకా అనేక మార్పులు తీసుకురావచ్చు. ఉపాధి కూలీలు తమ హక్కును ఉపయోగించుకునే స్థితికి, ఈ పథకం అమలులో పారదర్శకత ఉండేలా చూసే స్థితికి చేరుకోలేదు.
MGNREGS లాంటి పథకాలతో గ్రామీణ ప్రజలకు మెరుగైన జీవనోపాధి అవకాశాలు కల్పించడమనే ప్రజాస్వామ్యయుతమైన దృఢవిశ్వాసం ద్వారా భారతదేశం తన ప్రాధాన్యతలను పునర్మూల్యాంకనం చేసుకోవచ్చు.
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం క్రింద చేపట్టబడే పనుల వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం క్రింద ఉపాధి కోరినవారికి ఇచ్చు లేఖ మరియు సమగ్ర ఇతర వివరాలకోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సమగ్ర చట్టం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
ఉద్యోగ కల్పన లక్ష్యాన్ని అనుసంధానపరుస్తూ యువత నైపుణ్యాలను పెంపొందించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వినూత్న కార్యక్రమం రాజీవ్ యువకిరణాలు.
రాజీవ్ యువకిరణాలు కార్యక్రమం గురించి సమగ్ర వివరాలకోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం“రాజీవ్ ఇంటర్నెట్ విలేజి కార్యక్రమం”అనే పధకాన్ని ఇటీవల ఆరంభించింది. దీనిద్వారాగ్రామీణ ప్రజలకు సత్వరంగా, సమర్ధవంతంగా, తక్కువఖర్చుతో, ఎలాటి బాదరబందీ లేకుండా అన్ని రకాల ప్రభుత్వ సేవలను అందించడమేప్రభుత్వ లక్ష్యం. రాష్ట్రంలో మొత్తం మీద 8618 గ్రామాల్లో ఈ రాజీవ్ఇంటర్నెట్ కేంద్రాలను ఆరంభించారు.
ప్రస్తుతం 1148 గ్రామీణ సేవలందించే డెలివరీపాయింట్లను(ఆర్.్ఎస్డిపి) 2003 సంవత్సరంలోనే ఒక కార్యక్రమంగా ఆరంభించారు. ఇవిమండలస్థాయిలో, గ్రామస్థాయిలో పనిచేస్తున్నాయి. ఏపిఆన్లైన్ అన్న ప్రభుత్వ పోర్టల్ ద్వారా కింది సేవలను అందిస్తున్నాయి :
ఈ రాజీవ్ ఇంటర్నెట్ కేంద్రాల ద్వారా కింది సేవలను గ్రామీణ ప్రజలకు అదనంగా అందించడం జరుగుతోంది:
ఆస్తి పన్ను చెల్లింపులు. జనన, మరణాల నమోదు, సర్టిఫికేట్ల జారీ. వ్యాపార లైసెన్సుల జారీ, పునరుద్దరణ, అప్లికేషన్ల అమ్మకం. ఆర్టిసి టికెట్ల అమ్మకం, రిజర్వేషన్ . పన్ను చెల్లింపుల రిటర్న్‌లను ఫైల్చేయడం, పన్ను చెల్లింపులు. నాన్ జుడీషియల్ స్టాంప్ పేపర్లఅమ్మకం. రవాణా శాఖ సంబంధిత సేవలు. పాస్‌పోర్ట్ అప్లికేషన్ల అమ్మకం. రైల్వే రిజర్వేషన్. వివిధ యాత్రాస్థలాలలో కాటేజీలరిజర్వేషన్, దర్శనం టికెట్లు.
రాజీవ్ ఇంటర్నెట్ విలేజి గురించి మరింత సమాచారానికి ఏ.పి ఆన్ లైన్ పై క్లిక్ చేయండి. ఆన్ లైన్ లో మల్టీ పర్పస్ హౌస్ హోల్డ్ సర్వే / బహు ప్రయొజక గ్రహ సర్వే
ఆధారము: వికిపీడియా
ప్రతిష్ఠాత్మక డిజిటల్ ఇండియా ప్రాజెక్టుకు కేంద్ర మంతివర్గం ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపారు. లక్షకోట్ల విలువ కలిగిన డిజిటల్ ఇండియా ప్రాజెక్టు లక్ష్యం దేశంలో అధునాతున సమాచార, ఆర్థిక స్వాలంబన సాధించడం. ఈ ప్రాజెక్టు అమలుకు 2014 ఆగష్టు నెల 7న ప్రధాని మోడీ నేతృత్వంలో జరిగిన సమావేశంలో సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నారు. ప్రాజెక్టు ద్వారా ప్రతి గ్రామ పంచాయతీకి హైస్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ సౌకర్యాన్ని కల్పిస్తారు.
ఎలక్ట్రానిక్స్-ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగం ఆధ్వర్యంలో రానున్న నాలుగేండ్లలో ఈ ప్రాజెక్టును పూర్తిచేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రభుత్వ పథకాలు, సేవలు ఎలక్ట్రానిక్ రూపంలో ప్రజలకు అందడం ఈ ప్రాజెక్టు ముఖ్యోద్దేశం. ఇందుకోసం ఇప్పుడు అమలులోకి వచ్చిన ఆధార్ కార్డు (యూనిక్ ఐడీ), కొత్తగా ప్రవేశపెట్టబోయే ఈ-ప్రమాణ్ ప్రధాన ఆధారాలుగా ఉంటాయి. డిజిటల్ ఇండియా ప్రాజెక్టుకు అవసరమయ్యే నిధులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, వివిధ మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ విభాగాలు భరిస్తాయి. ప్రతి గ్రామ పంచాయతీకి హైస్పీడ్ ఇంటర్నెట్ సౌకర్యం కల్పించడం, ప్రతి ప్రాంతానికి కామన్ సర్వీస్ సెంటర్ ద్వారా చేరుకోవడం ఈ ప్రాజెక్టు ద్వారా సాధ్యమవుతుంది. మొబైల్ ఫోన్ నంబర్, బ్యాంకు ఖాతాల ద్వారా వ్యక్తిగతంగా డిజిటల్, ఆర్థిక రంగాల్లో సేవలందిస్తారు.
సింగిల్ విండో పథకం ద్వారా ప్రతి ఒక్కరికీ వివిధ శాఖలు, న్యాయవ్యవస్థకు సంబంధించిన సేవలను అందుతాయి. వివిధ ప్రభుత్వ పథకాలు ఆన్లైన్ లేదా మొబైల్ సర్వీసు ద్వారా ప్రజలకు అందుబాటులోకి వస్తాయి. వివిధ అభివృద్ధి, అనుబంధ సేవలకు జీఐఎస్ (జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్)ను అనుసంధానించవచ్చు. వివిధ సేవలకు సంబంధించిన సర్టిఫికెట్లను డిజిటల్ సిస్టమ్ ద్వారా జారీ చేయవచ్చు. ఇండియన్ టాలెంట్ (ఐటీ)కు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ)ని జోడించడం ద్వారా భవ్యిష్యత్తులో ఇండియా టుమారో (ఐటీ)ని సృష్టించవచ్చని ప్రధాని ఈ ప్రాజెక్టు లక్ష్యాన్ని వివరించారు. ప్రస్తుతం అమలవుతున్న అనేక సంక్షేమ పథకాలను, సేవలను డిజిటల్ ఇండియా ప్రాజెక్టు ద్వారా పటిష్టంగా అమలుచేయడానికి అవసరమైతే కొన్ని పథకాలను పునర్వ్యవస్థీకరించడంతోపాటు మార్పులు చేయాల్సి ఉంటుందని ప్రధాని మంత్రివర్గ సమావేశంలో పేర్కొన్నారు.
అభివృద్ధిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు తొమ్మిది ప్రధాన స్థంభాలు ఈ ప్రాజెక్టులో కీలకంగా ఉంటాయి. బ్రాడ్‌బ్యాండ్ హైవేస్, మొబైల్ కనెక్టివిటీ ద్వారా ఎక్కడున్నా సేవలను అందించడం, ప్రజలు ఇంటర్నెట్ను విస్తృతంగా వారి అవసరాల కోసం వినియోగించుకోవడం, ఐటీని వినియోగించుకోవడం ద్వారా ఈ-గవర్నెన్స్‌ను ప్రవేశపెట్టడం, ప్రతి ఒక్కరికీ సమాచారాన్ని చేరవేయడం, ఉపాధికల్పన చర్యలు చేపట్టడం, వివిధ సేవలను అందించడానికి ఈ-క్రాంతి పథకాన్ని తీసుకురావడం ఈ ప్రాజెక్టులోని కొన్ని ముఖ్యాంశాలు. ఇందుకు ప్రధాని మోడీ అధ్యక్షతన ఒక మానిటరింగ్ కమిటీ ఏర్పాటవుతుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ ఎఫైర్స్ అనుమతులు మంజూరు చేస్తుంది. కమ్యూనికేషన్-ఐటీ మంత్రి డిజిటల్ ఇండియా సలహా గ్రూపుకు అధ్యక్షత వహిస్తారు.
ఆధారము: నమస్తే తెలంగాణా
ఆధారము: అద్య స్టడీ బ్లాగ్
డా॥తమ్మా కోటిరెడ్డి, ప్రొఫెసర్, ఐబీఎస్ హైదరాబాద్.
తొలి దశగా వంద స్మార్ట్ నగరాలను నెలకొల్పేందుకు సంకల్పించింది. ప్రాంతాల వారీ ప్రాధాన్యమిస్తూ నగరీ కరణ బాట పట్టడం శుభసూచికమే అని చెప్పాలి. అయితే శతకోటి జన భారతంలో ఈ స్మార్ట్‌సిటీలు ప్రాథమిక అవసరాల లోటును తీరుస్తూ ఆర్థిక అసమానతలను రూపు మాపి అసలు సిసలైన అభివృద్ధి వైపు పరుగులు పెట్టిస్తాయి.
స్మార్ట్ సిటీ-ఆవశ్యకత:
దేశంలో సహజంగా పట్టణ ప్రాంతాల్లో జనాభా వృద్ధి రేటు అధికం. దీనికి తోడు గ్రామీణులు పట్టణాలకు వలస బాట పట్టడంతో అక్కడ జనాభాలో పెరుగుదల ఏర్పడింది. 2011 గణాంకాల ప్రకారం... గుజరాత్లో 42.6 శాతం, మహారాష్ట్రలో 45.2 శాతం ప్రజలు పట్టణాల్లోనే నివశిస్తున్నారు. దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ (విభజనకు ముందు) మినహా మిగతా రాష్ట్రాల్లోని జనాభాలో 35 శాతానికి పైగా పట్టణ జనాభా నమోదయింది. తమిళనాడు మొత్తం జనాభాలో 48.5 శాతం, కేరళలో 47.7 శాతం, కర్ణాటకలో 38.6 శాతం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 33.5 శాతం పట్టణ ప్రాంతాల్లోనే జీవనం సాగిస్తున్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో పట్టణాలు పలు సమస్యలను ఎదుర్కొంటున్నాయి. పట్టణీకరణ ప్రక్రియ పెద్ద నగరాలు, అభివృద్ధి చెందిన ప్రాంతాలలోనే కేంద్రీకృతమైనందువల్లవాటి వృద్ధిలో వ్యత్యాసాలు పెరిగాయి.
గ్రామీణ ప్రాంతాల నుంచి వలసలతో పెద్ద నగరాల్లో స్వాతంత్య్రానంతరం జనాభా వృద్ధి అధికమైంది. 1971-81 మధ్య కాలంలో బెంగళూరు జనాభా 75.6 శాతం పెరిగింది. 1981-1991 కాలంలో పశ్చిమబెంగాల్లోని అజాన్సోల్ పట్టణంలో జనాభా పెరుగుదల ఏకంగా 108.7 శాతం కాగా ఫరీదాబాద్ (హర్యానా)లో 85.5 శాతం, గౌహాతి(అసోం)లో 188.3 శాతం, థానే (మహారాష్ట్ర)లో 105.9 శాతం, విశాఖపట్టణం (ఆంధ్రప్రదేశ్)లో 75 శాతం, భువనేశ్వర్ (ఒడిశా) లో 87.7 శాతం నమోదైంది. 1991-2001 మధ్య కాలంలో సూరత్ (గుజరాత్)లో 85.1 శాతం, నాసిక్ (మహారాష్ట్ర)లో 58.9 శాతం జనాభా పెరిగింది. 2001-2011 మధ్యలో ఢిల్లీ, గ్రేటర్ ముంబయి, కోల్‌కత నగరాల్లో జనాభా పెరుగుదల అధికంగా నమోదైంది. గత రెండు దశాబ్దాల్లో వ్యవసాయం, దాని అనుబంధ రంగాలలో వృద్ధి స్తంభించింది. దీంతో గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు వలసలు పెరిగాయి.
ఐరోపా సమాఖ్య వ్యూహాల బాటలో:
1991-2001 కాలంలో వ్యవసాయమే జీవనోపాధిగా ఉన్న 70 లక్షల మంది ఆ రంగానికి దూరమయ్యారు. పెరిగిన వలసలతో పట్టణ ప్రాంతాల్లో పలు సమస్యలు చుట్టుముట్టాయి. నిరుద్యోగితా రేటు అధికమైంది. భౌతిక , సాంఘిక అవస్థాపనల విషయంలో పట్టణ ప్రాంతాల పురోగతి మందగించింది. ఈ నేపథ్యంలో 2014 మేలో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ (జాతీయ ప్రజాస్వామ్య కూటమి) ప్రభుత్వం స్మార్ట్ సిటీలు అనే అంశాన్ని తెరమీదికి తీసుకు వచ్చింది. ఇందులో భాగంగా దేశంలో తొలి దశగా 100 స్మార్ట్ సిటీలు నెలకొల్పడానికి సంకల్పించింది. ఇందుకు అభివృద్ధి చెందిన దేశాలు తమ వంతు సహకారం అందించడానికి ముందుకొచ్చాయి. దీంతో స్మార్ట్ సిటీల ఏర్పాటు భారత్‌లో ప్రధాన చర్చనీయాంశం అయింది. మెట్రో పాలిటన్ నగరాల్లో స్మార్ట్ అర్బన్ గ్రోత్ సాధించడానికి యూరోపియన్ యూనియన్ అనుసరించే వ్యూహాలను రూపొందించడంపై దృష్టి సారించింది.
స్మార్ట్ సిటీ-నిర్వచనాలు:
స్మార్ట్ సిటీని నిర్వచించడానికి ఫ్రాస్ట్ అండ్ సులిబాన్‌లు ప్రధానంగా ఎనిమిది అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు.
స్మార్ట్ సిటీస్ కౌన్సిల్ నిర్వచనం ప్రకారం..
నగరాలకు సంబంధించి అన్ని ప్రధాన కార్యక్రమాల్లో డిజిటల్ టెక్నాలజీ అనుసంధానించినట్లయితే ఆ నగరమే స్మార్ట్ సిటీ.
ఐఈఈఈ స్మార్ట్ సిటీస్ వివరణ:
స్మార్ట్ ఎకానమీ, స్మార్ట్ మొబిలిటీ, స్మార్ట్ ఎన్విరాన్మెంట్, స్మార్ట్ పీపుల్, స్మార్ట్ లివింగ్, స్మార్ట్ గవర్నెన్స్ అనే లక్ష్యాలను సాధించే క్రమంలో సాంకేతిక పరిజ్ఞానంతోపాటు, ప్రభుత్వం, సమాజాన్ని ఒకే చోటకు చేర్చడం
బిజినెస్ డెరైక్టరీ మాటల్లో:
సుస్థిర వృద్ధి, జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి ముఖ్యమైంది ఆర్థిక వ్యవస్థ స్థాయి పెంపు. ఈ విషయం లో ప్రగతి సాధించిన పట్టణ ప్రాంతమే స్మార్ట్ సిటీ.
స్మార్ట్‌సిటీ ప్రస్థానం:
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న పరిస్థితుల నేపథ్యంలో స్మార్ట్ సిటీ అనే పేరు ఆవిర్భవించింది. 2008లో ఐ.బి.ఎం స్మార్టర్ ప్లానెట్ ఇనీషియేటివ్ (I.B.M smarter planet initiative)లో భాగంగా స్మార్టర్ సిటీస్ నిర్మాణంపై దృష్టి పెట్టింది. 2009 ప్రారంభంలో ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు స్మార్ట్ సిటీలపై ఆసక్తి కనబరిచాయి. దక్షిణ కొరియా, యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్, చైనాలు స్మార్ట్ సిటీల ఏర్పాటు, పరిశోధనపై అధిక పెట్టుబడులు పెట్టాయి. ఇదివరకే అంతర్జాతీయ వాణిజ్య జిల్లా వెరోనాలో ఈ సిటీలు ప్రాచుర్యం పొందాయి. ఇక మనదేశం విషయానికి వస్తే.. కోచి, అహ్మదాబాద్, ఔరంగాబాద్, ఢిల్లీ ఎన్సీఆర్లోని మనేసర్, ఖుష్‌కెరా (రాజస్థాన్), కృష్ణపట్నం, పొన్నే (తమిళనాడు), తుంకూరు (కర్ణాటక) ప్రాంతాల్లో స్మార్ట్ సిటీలు నెలకొల్పేందుకు భారత ప్రభుత్వం ప్రతిపాదించింది. వీటిలో ప్రత్యేక పెట్టుబడి ప్రాంతాలు లేదా ప్రత్యేక ఆర్థిక మండళ్లు ఏర్పాటవుతాయి. ఆయా ప్రాంతాలలో పన్ను నిర్మాణతలో నియంత్రణల సడలింపు ద్వారా విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
ఆశయం అభినందనీయం:
భారత ప్రభుత్వం 2020 నాటికి 100 స్మార్ట్‌సిటీల అభివృద్ధి లక్ష్యాన్ని చేపట్టింది. భారత్‌లో స్మార్ట్‌సిటీల ఏర్పాటు ప్రపంచ బ్యాంకు సమ్మిళిత గ్రీన్ గోల్‌కు అనుగుణంగా ఉంది. శీఘ్రగతిన అభివృద్ధి చెందుతున్న దేశాల్లో సుస్థిర వృద్ధి సాధనకు స్మార్ట్‌సిటీల ఏర్పాటు దోహదపడగలదని పలువురి నిపుణుల అభిప్రాయం. మధ్య తరహా నగరాలను ఆధునికీ కరించడం ద్వారా 100 స్మార్ట్ సిటీలను అభివృద్ధి చేయాలని భారత ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. 2014-15 కేంద్ర బడ్జెట్లో వీటి కోసం రూ. 7060 కోట్లను కేటాయించారు. దీర్ఘకాలంగా విఫలమైన ప్రాంతీయ ప్రణాళికకు ఉప ఉత్పత్తిగా భారత్‌లో పట్టణీకరణను భావించారు. పట్టణాల్లో జరుగుతున్న వ్యయాన్ని మించి లబ్ధిచేకూరేలా ప్రయత్నించినపుడే అధికవృద్ధి సాధ్యమవుతుంది. పట్టణ ప్రాంతాలు ఎదుర్కొంటున్న సమస్యలను తొలగించడంతోపాటు అధిక పెట్టుబడులను ఆకర్షించే దిశగా స్మార్ట్ సిటీల అభివృద్ధికి శ్రీకారం చుట్టడం అభినందనీయం.
అమెరికా, సింగపూర్ సహకారం:
జపాన్, సింగపూర్, అమెరికా, గ్లోబల్ పెన్షన్ ఫండ్లు భారత్‌లో 100 స్మార్ట్‌సిటీల అభివృద్ధికి తమ సహకారం అందించడానికి ఆసక్తి కనబరుస్తున్నాయి. గ్రేటర్ నొయిడాలో రూ.30వేల కోట్లకు పైగా పెట్టుబడులు రాగలవని అంచనా. స్మార్ట్ సిటీల ఏర్పాటులో భారతీయ సంస్థలతో కలిసి పనిచేయడానికి అమెరికా ఆసక్తి కనబరు స్తోంది. భారత్‌లో రైల్వే వ్యవస్థ, పరికరాల అభివృద్ధి, విమానాశ్రయాలు, ట్రాఫిక్ నియంత్రణ వ్యవస్థ, ఎయిర్ క్రాఫ్ట్ నిర్వహణ, వాటి మరమ్మతు, భద్రతా వ్యవస్థను ఆధునికీకరించడం, రక్షిత నగరాల ఏర్పాటు, ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ వ్యవస్థ, నౌకాశ్రయాల అభివృద్ధికి భారత్‌కు అమెరికా సహకారం ఎంతో అవసరం. అవస్థాపనా సౌకర్యాల అభివృద్ధిలో భారత్, అమెరికాలు పరస్పర సహకారాన్ని అందిపుచ్చుకున్నప్పుడే స్మార్ట్‌సిటీల ఏర్పాటు లక్ష్యం నెరవేరుతుంది. అటు సింగపూర్ కూడా స్మార్ట్‌సిటీల నిర్మాణానికి అవసరమైన సహకారాన్ని అందించేందుకు సన్నద్ధంగా ఉంది. వీటితో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన రాజధాని అభివృద్ధిలోనూ పాలుపంచుకోవాలని అభిలషిస్తోంది. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు, సింగపూర్ ప్రధాని లీ సియెన్ లుంగ్‌ల మధ్య జరిగిన సంభాషణలలో ఆయా రంగాలలో సహకారానికి సంబంధించి కమిటీలను ఏర్పా టు చేయాలని నిర్ణయించారు. స్మార్ట్‌సిటీల అభివృద్ధితో పాటు 500 పట్టణాలు, నగరాల్లో అవస్థాపనా సౌకర్యాల అభివృద్ధి, పట్టణ గృహనిర్మాణ కార్యక్రమం, చారిత్రక, వారసత్వ నగరాల అభివృద్ధికి సంబంధించి అంశాలను ఈ కమిటీ పరిశీలిస్తుంది. అత్యాధునిక రవాణా వ్యవస్థ, వివిధ సేవల బట్వాడాలో భాగంగా ఈ-అర్బన్ గవర్నెన్స్, ఘన వ్యర్థాల నిర్వహణ- నీటి యాజమాన్యంలో సహకరించాలని సింగపూర్ ప్రభుత్వాన్ని భారత్ కోరింది.
కోచి స్మార్ట్‌సిటీగా రూపుదాల్చితే:
ప్రతిపాదిత కోచి స్మార్ట్‌సిటీగా రూపుదాల్చితే... లక్షమంది నిరుద్యోగ యువతకు ఉపాధి లభిస్తుంది. కేరళ రాష్ట్రం ఉత్తమ ఐటీ హబ్‌గా అవతరిస్తుంది. విద్యావంతులైన మహిళా ఐటీ నిపుణులకు సొంత రాష్ట్రంలోనే ఉద్యోగాలు లభిస్తాయి. కేరళ ప్రజల జీవన ప్రమాణాల పెరుగుతాయి. పేపర్, మీడియా పరిశ్రమ వృద్ధి చెందుతుంది.
20 ఏళ్లలో 500 నగరాలు:
సగటున ప్రతి నిమిషానికి గ్రామీణ ప్రాంతాల నుంచి 30 మంది పట్టణ ప్రాంతాలకు వలస వెళుతున్నారు. 2050 నాటికి అదనంగా 700 మిలియన్ల వలస ప్రజల అవసరాలు తీర్చాలంటే రాబోయే 20 ఏళ్లలో 500 కొత్త నగరాలను దేశంలో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. 2050 నాటికి ప్రపంచంలోని మొత్తం జనాభాలో నగర జనాభా వాటా 70 శాతంగా ఉంటుందని అం చనా. భారత్‌లోనూ ఇదే పరిస్థితి కనిపించే అవకాశాలు ఉ న్నాయి. పెరుగుతున్న పట్టణ జనాభాకు సకల సౌకర్యాలు కల్పించాలంటే దేశంలో 500 నగరాల ఏర్పాటు అవసరం.
సుస్థిర వృద్ధి:
పట్టణాల్లోని ప్రజలు నిత్య జీవితంలో ఎదుర్కొనే సమస్యలకు తక్షణ పరిష్కారంలో భాగంగా స్మార్ట్‌సిటీల ఏర్పాటు వెలుగులోకి వచ్చింది. వనరులను సక్రమంగా వినియోగించుకోవడం ద్వారా స్మార్ట్‌సిటీలు నవకల్పనకు ఊతమిస్తాయి. తద్వారా ఆరోగ్యకరమైన పోటీతత్వం, సమ్మిళిత ఆర్థికవృద్ధి సాధ్యమవుతుంది.
విధానాలే ప్రామాణికం:
అవస్థాపనా సౌకర్యాల కల్పనతో పాటు అధిక పెట్టుబడుల్ని ఆకర్షించేలా స్మార్ట్‌సిటీల ఏర్పాటు అభినందనీయం. అయితే ఈ సుందర నగరాలు మౌలిక వసతులతో విరాజిల్లేలా రూపుదిద్దుకోవాలి. ఇందుకోసం నియంత్రణల సడలింపు, పన్ను నిర్మాణతలో మార్పులతో విదేశీ పెట్టుబడులను ఆకర్షించేలా ప్రభుత్వ విధానాలు ఉండాలి. స్మార్ట్‌సిటీల ఏర్పాటులో పక్షపాత ధోరణికి పాల్పడకుండా, పాలక ప్రభుత్వాలు పట్టణాభివృద్ధికి పాటుపడాలి. అలా జరిగినప్పుడే స్మార్ట సిటీలు అభివృద్ధి దివిటీలుగా ఆవిర్భవిస్తాయి.
ప్రయోజనాలు
అవస్థాపనా సౌకర్యాల కల్పనతోపాటు సుస్థిర రియల్ ఎస్టేట్, సమాచారం, మార్కెట్ సౌకర్యాలు ఉన్న పట్టణ ప్రాంతంగా స్మార్ట్ సిటీలు ఆవిర్భవించాలి. స్మార్ట్ టెక్నాలజీని అమలు చేయడం ద్వారా కింది ప్రయోజనాలు చేకూరుతాయి.
ఆధారము: సాక్షి