హోమ్ / ఇ-పాలన / రాష్ట్రాలలో ఇ-ప్రభుత్వపాలన / ఇ-ప్రగతి - డిజిటల్ ఏపీ వైపు
పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

ఇ-ప్రగతి - డిజిటల్ ఏపీ వైపు

ఇ-ప్రగతి - డిజిటల్ ఏపీ వైపు

పరిచయం

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ పరిపాలనలో సమూల మార్పులకు నాంది పడింది. సన్‌రైజ్‌ ఏపీ లక్ష్యసాధనలో భాగంగా సర్కారు ప్రతిపాదించిన ఏడు మిషన్లను ఈ-పరిపాలనతో సమర్థంగా అమలుచేసేందుకు ‘ఈ-ప్రగతి’ ప్రాజెక్టు చేపట్టనుంది. దాదాపు రూ.2,398 కోట్ల ఖర్చుతో కూడిన ప్రాజెక్టును అమలు చేసేందుకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఇందులోభాగంగా రానున్న మూడేళ్లలో ఏపీ సర్కారు రూ.1,528 కోట్లు ఖర్చుచేయనుంది. పౌరసేవలన్నీ తక్షణమే పొందడం, ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు ఈ ప్రాజెక్టు కీలకం కానుంది. ఈ-ప్రగతితో ద్రువీకరణ పత్రాలు లేని సమాజాన్ని సృష్టించనుంది. పారదర్శకత, సమర్థత, మెరుగైన పౌరసేవల కోసం పరిపాలనలో ఐటీని విస్తృతంగా వినియోగించనుంది. సమీకృత డేటాబేస్‌తో అక్రమాలకు తావులేకుండా అర్హులకు ప్రభుత్వ పథకాల ఫలాలు అందుతాయని సర్కారు భావిస్తోంది.

ఈ-ప్రగతి ప్రాజెక్టు అమల్లో స్మార్ట్‌పల్స్‌ సర్వే కీలకం కానుంది. పౌరుల వివరాలతో కూడిన డేటాబేస్‌ను సర్కారు సిద్థంచేస్తుంది. ఇప్పటికే ఈ సర్వే కోసం సర్కారు లక్ష వరకు ట్యాబ్‌లను సేకరించి, కిందిస్థాయి సిబ్బందికి అందజేస్తోంది. ఈనెలాఖరులోగా మూడు జిల్లాల్లో దీన్ని పైలెట్‌ ప్రాజెక్టుగా చేపట్టనుంది. ఇంటింటి సర్వేతో ఆన్‌లైన్లో సేకరించిన వివరాలతో కూడిన ఈ డేటాబేస్‌ అన్ని ప్రభుత్వ విభాగాలకు సమాచారనిధిగా ఉపయోగపడుతుంది. ప్రజల సామాజిక-ఆర్థిక వివరాలూ తెలుస్తాయి. పౌరసేవలకు ఈ సమాచార నిధి వివరాలు కీలకం అవుతాయి.

ఇ ప్రగతి ఏమిటి


గవర్నమెంట్ 2.0 వైపు అడుగులు

TOGAF ఆధారంగా సృష్టించబడింది!

మనిషి పుట్టుక నుంచి మరణం వరకు జీవనంలో అవసరమైన పౌరసేవలన్నీ అనుసంధానమైన కచ్చితమైన సమాచారంతో ఆన్‌లైన్లో పొందవచ్చు. పుట్టిన వెంటనే జనన ద్రువీకరణ, చదువుకునేటపుడు పాఠశాల, కళాశాల సమాచారం, ప్రవేశాలు, ఉపకారవేతనాలు, పొందిన మార్కులు, అర్హతల వివరాలు ప్రభుత్వ డేటాబేస్‌లో పొందుపరుస్తారు. ప్రభుత్వ కార్యకలాపాల్లో ఆయా వివరాలను సంబంధిత విభాగాలు, కళాశాలలు ఉపయోగించుకుని సరిచూసుకోవచ్చు. ఓటరు నమోదు వివరాలు, వాహనాల రిజిస్ట్రేషన్‌, డ్రైవర్‌ లైసెన్సు, నైపుణ్య శిక్షణ నమోదు, ఉద్యోగాలు, పొందుతున్న వేతనాలు, ఆదాయపన్ను చెల్లింపులు, పాస్‌పోర్టు వివరాలన్నీ నమోదు చేస్తారు. వ్యక్తిపేరిట ఆస్తుల వివరాలు, ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవచ్చు. అర్హతలన్నీ ఉంటే ఆ వ్యక్తికి వృద్ధాప్య పింఛను అందుకునే వయసు రాగానే నేరుగా పింఛను మంజూరు అవుతుంది. మరణించిన తరువాత ద్రువీకరణ జరిగిన వెంటనే అర్హులైన సంబంధీకులకు క్లెయిమ్‌ల చెల్లింపులు, ఆస్తుల ముటేషన్లు జరుగుతాయి. ఈ కార్యక్రమాలన్నీ ఇతరుల ప్రమేయం, కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా ఈ-ప్రగతి ప్రాజెక్టులో ఆటోమెటిక్‌గా జరుగుతూనే ఉంటాయి.

పరిపాలన దిశ, దశమారేదిలా…

ద్రువీకరణలులేని పాలన: ప్రస్తుతం ప్రజలకు వివిధ శాఖల నుంచి దాదాపు 103 ద్రువీకరణ పత్రాలు జారీఅవుతున్నాయి. ద్రువీకరణలులేని పరిపాలన (సీఎల్‌జీఎస్‌) కింద తొలుత డిజిటల్‌ సంతకంతో కూడిన డేటాబేస్‌ తయారవుతుంది. సొంతంగా ఆన్‌లైన్లోనే డిజిటల్‌ సర్టిఫికేట్‌ సేవలు లభ్యం అవుతాయి. ఆయా ద్రువీకరణలను ఎవరైనా ఎక్కడినుంచైనా నేరుగా సరిచూసుకునేందుకు వీలుంటుంది. తద్వారా కాగితాలపై ఇచ్చే వ్యవస్థ దూరంకానుంది.

డయల్‌ ఏపీ: ప్రజలు ప్రభుత్వ సేవల్లో సందేహాలు నివృత్తి చేసుకునేందుకు, ప్రభుత్వ పథకాల్లో ఎదురయ్యే ఇబ్బందుల పరిష్కారం కోసం డయల్‌ ఏపీ కేంద్రం ఉంటుంది. ఈ కేంద్రం ద్వారా ప్రజలు సంతృప్తి చెందేలా సేవలు అందించవచ్చు. అధికారులు, ప్రభుత్వంలో జవాబుదారీతనం పెంపొందించేందుకూ వీలవుతుంది.
టెలీ-హెల్త్‌ : తక్షణమే అవసరమైన పరీక్షలు, చికిత్సలను వీడియోలు, సెన్సార్ల ద్వారా అందించవచ్చు. ఎంఎంఆర్‌, ఐఎంఆర్‌ రేటును తగ్గించవచ్చు. మారుమూల ప్రాంతాలకు సేవలు అందడంతో పాటు రోగి వివరాలన్నీ ఆన్‌లైన్లో ఉంటాయి. తద్వారా వైద్యఆరోగ్య సేవల ప్రమాణాలు పెంపొందించడం, ఖర్చు, సమయాన్ని ఆదా చేయవచ్చు.
ఈ-లెర్నింగ్‌: యువత వివిధ రంగాల్లో నైపుణ్యాలు పెంచుకునేందుకు ఆన్‌లైన్‌ లెర్నింగ్‌ యాజమాన్య వ్యవస్థ అందుబాటులోకి వస్తుంది. మూక్స్‌ పద్ధతిలో వర్చువల్‌ క్లాసులు వినడంతోపాటు సందేహాలకూ సమాధానాలు పొందొచ్చు. ఈ-లెర్నింగ్‌తో మారుమూల ప్రాంతాలకు నైపుణ్యాలు అందించేందుకు వీలవుతుంది.

ఇ ప్రగతి ప్రత్యేకత

 

దేశంలో మొట్టమొదటిసారిగా!
 • ఎంటర్ప్రైజ్ ఆర్కిటెక్చర్ రూపకల్పన చేసిన తొలి రాష్ట్రం
 • ఒక రాష్ట్రంఆమోదించిన అతిపెద్ద ఇ-పరిపాలన కార్యక్రమం !
 • మొట్టమొదటి ఎజైల్ ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్

అమలు-మిషన్ మోడ్

ఇ-ప్రగతి వంటి ప్రతిష్టాత్మక ప్రోగ్రామ్ ఒక మిషన్ మోడ్ లో అమలు చేస్తారు . ఇ-ప్రగతి ప్రోగ్రామ్ కోసం సేకరణ కాలం నుండి 4 ప్రధాన స్టేజెస్ ఉంటుంది.ఇ-ప్రగతి ప్రోగ్రామ్ కోసం ప్రోగ్రామ్ కన్సల్టెంట్స్ విప్రో సహకారంతో అన్ని 14 ప్యాకేజీలు మరియు 72 ప్రాజెక్ట్స్ కోసం అవసరాలు స్పెసిఫికేషన్ రూపకల్పన పూర్తయ్యాయి.

ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఎంటర్‌ప్రైజ్‌ ఆర్కిటెక్చర్‌ (ఏపీఎ్‌సఈఏ)లో ఈ-ప్రగతి కీలకం కానున్నది. ప్రభుత్వ సేవలను ఈ-పాలన విధానంలో అమలు చేసేందుకు ఇప్పటికే ఐటీ దిగ్గజ సంస్థ విప్రోతో కలసి ముందుకు సాగుతున్న ఏపీ సర్కార్‌ ఇప్పుడు.. మరింత వేగవంతమైన ఎలక్ర్టానిక్‌ పాలనను అందించేందుకు ఈ ప్రగతిని అమలు చేయాలని నిర్ణయించింది. ప్రభుత్వం నుంచి కస్టమర్‌, ప్రభుత్వం నుంచి బిజినెస్‌, ప్రభుత్వం నుంచి ప్రభుత్వం అనే విధానాల ద్వారా 33 శాఖలకు చెందిన 745 సేవలను ఈ ప్రగతి ద్వారా అందించవచ్చని ఐటీ శాఖ చెబుతోంది. ‘ఈ ప్రగతి’లో 14 ప్యాకేజీల ద్వారా 72 ప్రాజెక్టులు పనిచేస్తాయని వివరిస్తోంది. ‘ఈ ప్రగతిలో’ 7 మిషన్లు, 5 గ్రిడ్‌లు, 5 కాంపైన్‌లు ఉంటాయని అంటోంది.

ఇందులో..

 • ఏపీ ఫైబర్‌ గ్రిడ్‌ (అన్ని పంచాయతీలకూ)
 • ఏపీ స్టేట్‌ డేటా సెంటర్‌
 • ఈ-హైవే (శాఖల సమాచారం అనుసంధానం)
 • పీపుల్‌ హబ్‌ (సామాజిక డేటా )
 • ల్యాండ్‌ హబ్‌ (రాష్ట్రంలోని భూమి వివరాలు)
 • డయల్‌ ఏపీ (ఏకీకృత కాంటాక్ట్‌/ కాల్‌ సెంటర్‌)
 • ఈ లెర్నింగ్‌ ప్లాట్‌ఫారమ్‌ (ఆన్‌లైన్‌ విధానంలో బోధన)
 • సోషల్‌ బెనిఫిట్స్‌ మేనేజ్‌మెంట్‌ (సంక్షేమ పథకాలు)
 • ఏపీకాన్‌ (పౌర సేవల్లో సమీకృత యాజమాన్య విధానం)
 • ఎం సేవ (మొబైల్‌లో పౌర సేవలు)
 • ఈ-అగ్రిమార్కెట్‌ (రైతులు తమ ఉత్పత్తులను ఆన్‌లైన్‌లో విక్రయించే వేదిక)
 • ఈ-పంచాయత్‌ (పంచాయతీ రాజ్‌సంస్థల పటిష్టం)

ఆధారం: www.e-pragati.ap.gov.in

3.02777777778
రేటింగ్ చేయుటకు చుపించిన నక్షత్రము పైన క్లిక్ చేయండి
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు