పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

ఒరిస్సా

ఈ విభాగం ఒరిస్సా రాష్ట్ర స్థాయి ఇ-పాలన కార్యక్రమాల గురించిన వివరాలను అందిస్తుంది

భూలేఖ్‌

ఒరిస్సా భూరికార్డుల వెబ్‌పోర్టల్‌

భూలేఖ్‌ అనేది ఒరిస్సా ప్రభుత్వానికి చెందిన భూరికార్డులు, సర్వే శాఖ చేపట్టిన ఇ-గవర్నెన్స్‌ చొరవ. భూరికార్డుల గురించి ఆన్‌లైన్‌ సమాచారాన్నిచ్చే ఈ వెబ్‌పోర్టల్‌, రికార్డుల నిర్వహణను సులభతరంచేసి, సరైన హక్కు రికార్డులను రాష్ట్రంలోని భూపట్టాదారులకు అందజేస్తుంది.

అందించే సేవలు -
 • ఒరిస్సాలోని 171 తహశీలులకు సంబంధించిన సరైన హక్కు రికార్డుల సమాచారాన్ని ఇంటర్నెట్‌లో పొందుపరిచింది.
 • ఒరిస్సా ప్రజలు తమ సరైన హక్కు రికార్డులను ఇంటర్‌నెట్‌లో చూడవచ్చు.
 • భూమి పట్టా పాస్‌బుక్‌ దరఖాస్తు ఫారమ్‌
 • మ్యాపులు
 • వివిధ ఫారాలు
  • భూమి పట్టా పాస్‌బుక్‌ దరఖాస్తు
  • వివిధ రకాల ధృవీకరణ పత్రాల జారీకి దరఖాస్తులు
  • భూమి రికార్డుల మ్యుటేషన్‌కు దరఖాస్తు
  • భూమి సెటిల్‌మెంట్‌కు దరఖాస్తు
  • రైతు వ్యవసాయ భూమిని మార్పు కోసం దరఖాస్తు
మరిన్ని వివరాలకు : http://ori.nic.in/

ఇ - శిశు

'ఇ - శిశు' అనేది ఒరిస్సా ప్రాథమిక విద్యా కార్యక్రమం కింద అమలుచేసింది. ఇది దేశంలోనే తొలి ప్రయత్నం. ఇందులో రెండు భాగాలున్నాయి.

 • శిశు ట్రాకింగ్‌ వ్యవస్థ(సిటిఎస్‌)
 • వివిధ అంశాల పర్యవేక్షణ &  సమాచార వ్యవస్థ(ఐఎంఐఎస్‌)

సిటిఎస్‌  అనేది 14ఏళ్ల దాకా వయస్సున్న  పిల్లలందరి గురించిన సమగ్రమైన డేటాబేస్‌. ఇందులో వారి సాంఘిక, ఆర్థిక, భౌగోళిక అంశాలకు సంబంధించిన సమగ్ర సమాచారం ఉంటుంది.  ఐఎంఐఎస్‌ అనేది సర్వ శిక్షా అభియాన్‌ కింద 14 వివిధ అంశాలను ఆన్‌లైన్‌గా  పర్యవేక్షణ చేసే  వీలునిస్తుంది.

సౌకర్యాలు

 • 6-14 సంవత్సరాల వయస్సుగల పిల్లలు బడులలో ఎంతమంది నమోదయ్యారు, ఎంతమంది కాలేదు, ఎందరు బడికి పోవడం మానేశారు వంటి వివరాలందిస్తుంది
 • ప్రభుత్వం, తల్లిదండ్రులు, ప్రజలు - బడిలో పిల్లల స్థితిగతులను తెల్సుకోవచ్చు
 • జిల్లా వారీ బడుల గురించి వివరాలందిస్తుంది
మరిన్ని వివరాలకు - http://www.opepa.in/

ఐటిఐఎంఎస్‌

ఇంటిగ్రేటెడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఇన్‌ఫర్మేషన్‌ మేనేజిమెంట్‌ సిస్టం

వాణిజ్య మరియు రవాణా శాఖ తన శాఖను పూర్తిగా కంప్యూటరీకరించే దిశగా ఇంటిగ్రేటెడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఇన్‌ఫర్మేషన్‌ మేనేజిమెంట్‌ సిస్టం(ఐటిఐఎంఎస్‌) అనే సాఫ్ట్‌వేర్‌ని రుపొందించింది. దీనిని అన్ని ప్రధాన ఆర్‌టిఏ ఆఫీసుల్లో, చెక్‌ గేట్లదగ్గర అమలు చెశారు. మరిన్ని ఆఫీసుల్లో దీన్ని ప్రవేశపెట్టనున్నారు.

ఈ కంప్యూటరీకృత వ్యవస్థలో కింది విభాగాలున్నాయి :
 1. డ్రైవింగ్‌ లైసెన్స్‌ల జారీకి - సారధి
 2. మోటారు వాహనాల రిజిస్ట్రేషన్‌, పర్మిట్లకు వాహన్‌
 3. మోటారు వాహనాల పన్నుల వసూలుకు చెక్‌ గేట్‌ కంప్యూటరీకరణ

డ్రైవింగ్‌ లైసెన్స్‌లకోసం ఆన్‌లైన్‌గా వివిధ దరఖాస్తులను పొందుపరుస్తూ, ఒక వెబ్‌సైట్‌ ని కూడా ఆరంభించడం జరిగింది.

మరిన్ని వివరాలకు: http://www.orissa.gov.in

ఓరిస్‌

ఒరిస్సా రిజిస్ట్రేషన్‌ ఇన్‌ఫర్మేషన్‌ మేనేజిమెంట్‌ సిస్టం

ఒరిస్సా రిజిస్ట్రేషన్‌ ఇన్‌ఫర్మేషన్‌ మేనేజిమెంట్‌ సిస్టం(ఓరిస్‌) అనేది ఒరిస్సా ప్రభుత్వం రెవిన్యూ శాఖ అమలుచేసిన కంప్యూటరీకృత వ్యవస్థ.

దీనిద్వారా రిజిస్ట్రేషన్‌, డాక్యుమెంట్ల ఎండార్స్‌మెంట్‌, ఎన్‌కంబరెన్స్‌ సర్ఠిఫికేట్ల జారీ వంటి పనులు జరుగుతాయి. రిజిస్ట్రేషన్‌ శాఖ విభాగం జి2సి, జి2జి సేవలను దీని ద్వారా అన్‌లైన్‌గా అందిస్తోంది.

దీని ద్వారా కింది జి2జి సేవలను అన్‌లైన్‌ గా పొందవచ్చు :
 • అన్ని రకాల భూముల విలువల నివేదికనందించడం
 • భూముల విలువల  లెక్కగట్టడం
 • స్టాంపు డ్యూటీ/ రిజిస్ట్రేషన్‌ ఫీజు
 • ఎన్‌కంబరెన్స్‌ సర్టిఫిరేట్‌(ఇసి), మైడాక్యుమెంట్‌
మరిన్ని వివరాలకు:   http://www.ori.nic.in

ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు

2.99594594595
GUVALA OBAIAH Feb 15, 2017 05:56 AM

చాలా ఉపయోగకరమైన వెబ్సైట్. సమాచారం అందిచినందులకు ధన్యవాదములు

మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు