పంజాబ్‌లో ఇ-పరిపాలన
పంజాబ్ సేవ
కంప్యూటర్ మాధ్యమం ద్వారా పౌర సేవలకు మార్గం
సామాన్య పౌరునికి అన్ని రకాల పౌర సేవల గురించి విస్తృతమైన సమాచారం ఒక్కసారి అవలోకిస్తూ అందించే కంప్యూటర్ విభాగం ఇది. ఒక ప్రత్యేకమైన సేవ గురించి ముఖ్యమైన సమాచారాన్ని వివరించడమే కాకుండా అభ్యర్ధన చేసుకునే విధానం గురించి కూడా తెలుపుతుంది. వారు తమ అభ్యర్ధనాపత్రాన్ని కూడా కంప్యూటర్ లో ఈ విభాగం నుండి (డౌన్ లోడ్) తీసుకొనవచ్చు.
ఈ విభాగం లో అందుబాటులో ఉండే కొంత సమాచారం మరియు సేవలు.
- భూమి మరియు ప్రభుత్వ ఆదాయం.
- సామాన్య ధృవ పత్రం
- రవాణా సేవలు.
- ప్రజా పంపిణీ సేవలు.
- పురపాలక సంఘ (మున్సిపల్) సేవలు.
- సాంఘిక భద్రత మరియు పింఛను ( ఉపకార వేతనం ) సేవలు మొదలైనవి.
సువిధ
అందుబాటు లో ఉన్న సేవలుః
- స్వాతంత్ర్య సమర యోధులకు, వికలాంగులకు బస్ పాస్ ల జారీ మరియు పొడిగింపు.
- వృద్ధులకు, భర్తను కోల్పోయిన వారికి, అనాధ పిల్లలు మరియు వికలాంగులకు పింఛను.
- స్వాతంత్ర్య సమర యోధులకు, గుర్తింపు పత్రాలు జారీ చేయుట, పొడిగించుట.
- ప్రవర్తన పరిశీలన
- స్వాతంత్ర్య సమర యోధుల పిల్లలకు ఆధార ధృవ పత్రం జారీ.
- ఉగ్రవాద, హింసాత్మక ఘటనలకు గురి అయిన వ్యక్తుల పై ఆధారపడిన వారికి ధృవపత్రం జారీ
- నష్టపరిహార (ఇండెమినిటీ బాండ్ ) హామీపత్రం యొక్క ప్రమాణపత్రం.
- హామీ పత్రాన్ని (షూరిటీ బాండ్) అంగీకరించినట్లు ప్రమాణ పత్రం.
- జాతీయతా ధృవపత్రం జారీ.
- జననం, మరణం, వివాహం కాలేదన్న దానికి ధృవపత్రాలు.
- వాంగ్మూల ప్రమాణ పత్రం.
- పాస్ పోర్ట్ (విదేశాలు ప్రయాణించడానికి అనుమతి) సేవలు, మరియు ఆయుధాలు కలిగి ఉండడానికి అనుమతి జారీ.
- పెట్రోల్ పంపు, వివాహ మండపం, హోటల్ లేక రెస్టారెంట్ (భోజన శాల), సినిమా మొదలైనవాటికి
- (ఎన్.ఒ.సి.) అభ్యంతరం లేదని ఇచ్చే పత్రం జారీ.
- వాహనం నడిపేందుకు ఇచ్చే అనుమతి పత్రం (డ్రైవింగ్ లైసెన్స్) పొడిగింపు, మంజూరు.
- వాహనమును నమోదు చేయుట
- ప్రదర్శనలకు అనుమతి.
- (ఆయుధ వ్యాపారులకు, సినిమా, వీడియో పార్లర్ యజమానులకు ) అనుమతి పత్రాల జారీ,
- పొడిగింపు.
సువిధా లో ఇటువంటి ప్రాధమికమైన అభ్యర్ధనలు కూడా అందుబాటులో ఉన్నాయిః
- ఆయుధాలు కలిగి ఉండడానికి అనుమతి జారీ చేసే వ్యవస్థ ( ఆర్మ్స లైసెన్సెస్ ఇస్యూయన్స్ సిస్టం –ఎ.ఎల్.ఐ.ఎస్)
- పత్రాలను ఆమోదించే వ్యవస్థ ( కౌంటర్ సైనింగ్ ఆఫ్ డాక్యుమెంట్స్ - సి.ఒ.డి)
- జనన మరణ ధృవపత్రాలు జారీ చేసే వ్యవస్థ ( బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్ ఇస్యూయన్స్ సిస్టం – బి.డి.సి.ఐ.ఎస్)
- సాంఘిక భద్రతా సమాచార వ్యవస్థ ( సోషల్ సెక్యురిటి ఇన్ఫర్మేషన్ సిస్టమ్ - ఎస్.ఎస్.ఐ.ఎస్)
- నిజ నిరూపణ సమచార వ్యవస్థ ( అఫిడవిట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ - ఎ.ఐ.ఎస్)
- ధృవపత్రాలు జారీ చేసే వ్యవస్థ ( సర్టిఫికెట్ ఇస్యూయన్స్ సిస్టమ్ - సి.ఐ.ఎస్)
- న్యాయస్థాన సమాచార వ్యవస్థ ( కోర్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టం - సిఒ.ఐ.ఎస్)
- అంగవైకల్య ధృవపత్రాలు జారీ చేసే వ్యవస్థ (హాండీ కేప్ సర్టిఫికెట్ ఇస్యూయన్స్ సిస్టమ్ - హెచ్.సి.ఐ.ఎస్)
- పాస్ పోర్ట్ అభ్యర్ధనలను అంగీకరించే వ్యవస్థ ( పాస్ పోర్ట్ అప్లికేషన్స్ ఏక్సెప్టన్స్ సిస్టమ్ - వెబ్ పాస్)
పైన పేర్కొన్న సేవలు పొందుటకు దీనితో అనుసంధానం చేసుకొనండి.
http://suwidhaonline.punjab.gov.in/
ఇంటర్నెట్ లో ప్రజలకు ఉపయోగపడే పత్రాలు
అందుబాటులో ఉన్న సేవలు :
- శాఖల వారీగా ప్రజలకు ఉపయోగపడే పత్రాలు, అవి : సాంఘిక భద్రత, పింఛన్లు (ఉపకార వేతనములు), పురపాలక సంఘ (మునిసిపల్) సేవలు, గృహ సంబంధ సేవలు, వ్యవసాయం, రవాణా, ప్రజా పంపిణీ సేవలు, స్వాతంత్ర్య సమర యోధులు, విద్య మరియు శిక్షణ, మాజీ సైనికోద్యోగులు, చిన్న తరహా పొదుపు పధకాలు, విద్యుత్తు, మరియు పరిశ్రమలు.
- అన్ని పత్రాలు పి.డి.ఎఫ్. రూపంలో ఉండి సులభంగా తీసుకునేందుకు ( డౌన్ లోడ్) వీలుగా ఉన్నాయి.
ఆన్ లైన్ గ్రీవియన్స్ సెల్ ( ఇంటర్నెట్ లో సమస్యల కొరకు కేంద్రం)
అందుబాటులో ఉన్న సేవలు :
- పంజాబ్ ప్రభుత్వంలోని ఏ విభాగానికైనా మీ అభియోగం పంపవచ్చు.
- అభియోగంపై వెనువెంటనే స్పందన, నివారణ.
భూమి పత్రాల నిర్వహణా వ్యవస్థ ( లాండ్ రికార్డ్స్‌మేనేజ్ మెంట్ సిస్టమ్)
అందుబాటులో ఉన్న సేవలు :
- భర్/ముక్త్ తనఖా లేదనడానికి ధృవపత్రం.
- ఆదాయ ముద్రణా పత్రాల ( రెవెన్యూ స్టాంప్ పేపర్స్) వాపసు.
- కొత్త చౌకీదారు లేక కాపలాదారు నియామకం.
- వివాహం నమోదు చేయుట.
- నగరాల్లో వదిలివేయబడిన ఆస్తి వేలం వేయుట ద్వారా బద లాయింపు.
- ప్రభుత్వ భూమిని చకౌతా ద్వారా అమ్మజూపటం.
- భూమి పత్రాలలో కొన్ని భాగాల ధృవపత్రాలు.
- దస్తావేజుల ధృవప త్రాల నమూనా పత్రం.
- భూమి సరిహద్దు రేఖల ఏర్పాటు.
- భూమి మార్పులకు సంబంధించిన ధృవపత్రాలు.
- భూమిని విభజించుట మరియు భాగాలు చేయుట.
- గ్రామాలలో వదిలివేయబడిన ఆస్తిని వేలంపాట ద్వారా బదలాయింపు.
- గిర్దావారి ట్రస్ట్ (సంరక్షణ)
- నక్సా సాధారణ మదింపు (రేటు)
- నంబర్ దార్ మరియు సర్ నంబర్దార్ ల నియామకం.
- ఆస్తిపత్రాలను నమోదు చేయుట.
- భూమిపత్రాల నకలు పత్రాలు.
- జమాబందీ/ఖసరా గిర్దావరి ల యొక్క నకలు పత్రాలు.
సారధి మరియు వాహనం
అందుబాటులో ఉన్న సేవలుః
- వాహనం నడుపుటకు అనుమతి మంజూరు.
- వాహనాలను నమోదు చేయుటకు అనుమతి.
- అనుమతులు పొందేందుకు చేసే అనుమతి అభ్యర్ధనల స్వీకరణ.
దీని గురించి వివరంగా తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
http://olps.punjabtransport.org/
ఇ - జిల్లా (డిస్ట్రిక్ట్)
ముఖ్యమైన సేవలు :
పత్రాలు (సర్టిఫికెట్స్): స్థిర నివాసానికి సంబంధించిన ఋజువు (డోమిసైల్), ఆదాయం, వివాహం, ఉద్యోగం, ప్రాంతీయతా ధృవపత్రం, కుల ధృవీకరణ పత్రం.
సాంఘిక భద్రత: పింఛన్లు (వృద్ధాప్యం, వైధవ్యం, అంగవైకల్యం, అనాధ), అభ్యర్ధన, అనుమతి, నిర్వహణ, చెల్లింపులు.
ప్రభుత్వాదాయనికి సంబంధించిన న్యాయస్థానం: దావా (కేస్) నమోదు, దావా వాయిదా, దస్తావేజుల కూర్పు ( కేస్ ఫైలింగ్ ), నిలుపుదల (స్టే), లేక ఆఖరి తీర్పు, పత్రాలు భద్రపరిచే స్థల సేవలు ( రికార్డ్ రూమ్ సర్వీసెస్)
ప్రభుత్వానికి చెల్లించవలసిన బాకీలు మరియు వాటి వసూలు: హెచ్చరికల (నోటీసుల) జారీ, పత్రాల చెల్లింపులు, కోర్టు వాయిదాలకు హాజరు కాక చేసే ఉపేక్ష -దాని పర్యవసనాలు, కోశాగార రసీదుల నిర్వహణ.
ప్రజా పంపిణి వ్యవస్థ: నమోదు చేయుట, చిరునామా మార్పు, అదనపు సభ్యుల నమోదు, నకలుల (డూప్లికేట్) జారీ.
ఆర్. టి. ఐ. సేవలు: నష్ట నివారణ సేవలు, ముఖ్యమైన సాంఘిక సంక్షేమ పధకాల, కార్యక్రమాల పర్యవేక్షణకు సమాచారం .
ఇ-జిల్లా (డిస్ట్రిక్ట్) యొక్క మరికొంత సమాచారం కొరకు క్లిక్ చేయండి.
ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు