ఇ-గవర్నెన్స్ అమలు లక్ష్య సాధనలో భాగంగా పశ్చిమ బెంగాల్లో వివిధ డైరెక్టరేట్లలో, వివిధ ప్రభుత్వ శాఖలలో కంప్యూటరీకరణని పెద్ద ఎత్తులో చేపట్టడం జరిగింది. ఇందులో ఆర్థిక, కార్మిక, రవాణా, పంచాయితీ - గ్రామీణ అభివృద్ధి, భూమి - భూ సంస్కరణలు, ఐ & సిఏ, పర్యాటక శాఖలు, అటవీ శాఖ, యువజన సేవలు, పురపాలక శాఖ, ఉన్నత విద్య, పర్యావరణం, గృహ వసతి వంటి అనేక శాఖలు ఉన్నాయి.
భూరికార్డుల కంప్యూటరీకరణ అనేది ఒక చిన్న పైలట్ ప్రాజెక్టుగా వర్ధమాన్ జిల్లాలో ఆరంభమై ఆ తర్వాత మొత్తం పశ్చిమ బెంగాలు రాష్ట్రంలోని అన్ని జిల్లాలకూ విస్తరించింది. రాష్ట్రంలోని 341 బ్లాకులలో 238 బ్లాకుల వివరాలను ఇప్పటికే కంప్యూటరీకరించడం జరిగింది. భూమి పరిమాణాన్ని తెలిపే రేఖాచిత్రాలు (మ్యాపులు) డిజిటీకరించడం ఆరంభమైంది. ముఖ్యంగా ఇది హూగ్లీ జిల్లాలో ఒక పైలట్ ప్రాజెక్టుగా మొదలైంది. ఇంకా, కంప్యూటర్ ఆధారిత భూ సేకరణ సమాచార వ్యవస్థ నొకదాన్ని ఇటీవలే అభివృద్ధి చేశారు. భూ సేకరణ కేసులను సత్వరంగా పరిష్కరించడం దీని ఉద్దేశ్యం. ఇది ప్రకటన, న్యాయబద్ధంగా చెప్పటం, భూమి షెడ్యూలు, అంచనాల తయారీ వంటి సమాచారాలతో రిపోర్టులను అతి వేగంగా, సమర్ధవంతంగా తయారుచేస్తుంది. దీనిని ప్రయోగాత్మకంగా రాజర్‌హట్‌లోని కొత్త టౌన్షిప్ ప్రాజెక్టు కోసం ఉత్పన్నమైన భూ సేకరణ కేసులను సత్వరంగా పరిష్కరించడం కోసం అమలు చేశారు.
టెలి మెడిసన్ సౌకర్యం అనేది తీవ్రంగా బాధపడే రోగులకోసం తయారుచేసిన ఒక యూసర్ ఫ్రెండ్లీగా ఉండే హైటెక్ వ్యవస్థ. పురులియా జిల్లా ఆసుపత్రిని ఎన్ఆర్ఎస్ వైద్య కళాశాల, బుర్ద్వాన్ వైద్య కళాశాల వంటివాటితో అనుసంధానం చేశారు. ఇంటర్నెట్ సౌకర్యంతో రోగి రోగ చరిత్రను ఆయా కళాశాలలకు పంపుతారు. ఆయా కళాశాలలనుంచి ప్రిస్క్రిప్షన్లను ఇంటర్నెట్ ద్వారా ఆ ఆసుపత్రికి అందుతుంది. అవసరం అయితే, విడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఆయా కళాశాలలలో ఉండే స్పెషలిస్ట్ లు, రోగితో నేరుగా మాట్లాడి రోగ నిర్ధారణ చేయగలరు.
మరింత సమాచారం కోసం చూడండి: http://www.purulia.gov.in
భారత ప్రభుత్వ రోడ్లు రవాణా, హైవేల మంత్రిత్వశాఖ నిర్దేశనల ప్రకారం దేశంలోని వివిధ రాష్ట్రాల రవాణా శాఖ దరఖాస్తులన్నీ ఒకే ప్రమాణాలననుసరించి స్మార్ట్ కార్డ్ ఆధారిత డ్రైవింగ్ లైసెన్స్, ధృవీకరణ పత్రాన్ని సారథి, వాహన్ సాఫ్ట్ వేర్లను వాడి జారీచేసి ఉండాలి. ఈ దిశలో వెబెల్ ఆధారిత పశ్చిమ బెంగాల్ మొట్టమొదటి రాష్ట్రంగా గుర్తింపు పొందబోతోంది.
స్మార్ట్ కార్డ్ అనేది ఆకారంలో క్రెడిట్ కార్డ్ ను పోలిన ఒక చిన్న ఎలక్ట్రానిక్ ఉపకరణం. ఇందులో ఒక సూక్ష్మ రూపంలో ఉండే మైక్రో ప్రాసెసర్ ఉండి సమాచారాన్ని దాచి ఉంచి, అవసరం ఐనపుడు ఎన్ని సార్లైనా చదివేలా, రాసేలా వీలునిస్తుంది.
స్మార్ట్ కార్డ్ వల్ల లాభాలివీ :
మరింత సమాచారం కోసం చూడండి : http://www.webel-india.com
వెబెల్ పశ్చిమ బెంగాల్లో మూడు సాధారణ అప్లికేషన్లను అమలు చేసే పనిలో ఉంది. అవి ఫైలు కదలలికలను నిర్దేశించే వ్యవస్థ, వివిధ శాఖలలో ఉద్యోగుల సమాచార వ్యవస్థ, ఇంకా వివిధ ప్రభుత్వ శాఖల్లో నిధుల వినియోగాన్ని పర్యవేక్షించే వ్యవస్థ. ఆర్థిక, కార్మిక, రవాణా, పంచాయితీ, గ్రామీణాభివృద్ధి, భూ, భూ సంస్కరణలు, పర్యాటకం, అటవీశాఖ, యువజన సేవలు, పురపాలక వ్యవస్థ, ఉన్నత విద్య, పర్యావరణం, గృహాలు వగైరా వంటి 16 శాఖలను ఈ అప్లికేషన్ల అమలుకై గుర్తించింది.
మునిసిపాలిటీలకు జిఐఎస్
వెబెల్ పశ్చిమ బెంగాల్లో 10 మునిసిపాలిటీలలో భౌగోళిక సమాచార వ్యవస్థ (జిఐఎస్) ను అమలు చేసింది. పుజలి, కుర్సేయోంగ్, బడ్జే బడ్జే, కలింపాంగ్, బిధాన్ నగర్ మునిసిపాలిటీలలో ఇప్పటికే డేటా సర్వే, జిఐఎస్ లను అమలు చేయడం పూర్తి చేసింది.
ప్రజా సేవలకై కియోస్కులు/ వెబ్సైట్లు
పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ అధికార వెబ్సైట్ ప్రభుత్వం చొరవల గురించి, వివిధ అంశాల గురించి ప్రజలకు పూర్తి స్థాయిలో సమాచారాన్ని అందించేందుకై ఒక వెబ్సైటును ఏర్పాటు చేసింది. వెబెల్ వివిధ ప్రభుత్వ శాఖలకోసం కూడా వెబ్సైట్లను ఏర్పాటు చేసింది. వాటిని ప్రజలదాకా తీసుకెళ్ళడానికై వివిధ కియోస్కులని కూడా అందుబాటులోకి తెచ్చింది.
ఉన్నత విద్యా శాఖ
వెబెల్ విద్యాశాఖ కోసం ఒక డేటాబేస్ ను రూపొందించింది. దానినుంచి సమాచారాన్ని కియోస్క్లద్వారా, టచ్ స్క్రీన్ల ద్వారా, ఐవిఆర్ల ద్వారా అందించే సౌకర్యాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమాచారం వివిధ కళాశాలల్లో ప్రవేశాన్ని పొందగోరే విద్యార్థులకెంతో వినియోగిస్తుంది.
పర్యాటక శాఖ
వెబెల్ పర్యాటక శాఖ కోసం ఒక వెబ్‌సైట్‌ను, టచ్ స్క్రీన్ కియోస్క్ ను రూపొందించింది. వీటిలో పర్యాటక సమాచారాన్ని అందించడం జరుగుతోంది. ఇది జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులకెంతో వినియోగపడుతుంది. వివిధ పర్యాటక సేవలను, వసతి గృహాలలో ముందే రిజర్వ్ చెసుకోవడానికి పర్యాటక శాఖ కోసం వెబెల్ ఒక వెబ్ ఆధారిత సాఫ్ట్ వేర్ ను రూపొందించింది.
సమాచార,సాంస్కృతిక వ్యవహారాల శాఖ
వెబెల్ టచ్ స్క్రీన్ ఆధారిత సమాచార కియోస్క్ ను రూపొందించింది. దీనిద్వారా ప్రజలకు యుటిలిటీ సేవలను అందించడం సాధ్యమౌతుంది. బిధాన్ నగర్ మునిసిపాలిటీ కోసం కూడా వెబెల్ ఒక వెబ్సైటును, సమాచార కియోస్క్ ను వివిధ దరఖాస్తు ఫారంలను డౌన్ లోడ్ చేసుకొనే వీలుగా రూపొందించింది. ఇందులో ఫిర్యాదులకు సంబంధించిన డేటా కూడా ఉంది.
భౌగోళిక సమాచార వ్యవస్థ(జిఐఎస్)
రాష్ట్రంలో భౌగోళిక సమాచార వ్యవస్థ(జిఐఎస్)ను 20 మునిసిపాలిటీలలో అమలు చేసె బాధ్యతను వెబెల్ చేపట్టింది. పుజలి, కుర్సేయోంగ్, బడ్జే బడ్జే, కలింపాంగ్, బిధాన్ నగర్ మునిసిపాలిటీలలో ఇప్పటికే డేటా సర్వే, జిఐఎస్ లను అమలు చేయడం పూర్తి చేసింది.
కనెక్టివిటీ
వెబెల్ తన ఐఎస్పి ద్వారా నాణ్యమైన ఇంటర్నెట్ బ్యాండ్ విడ్త్ ను అటు సామాన్య ప్రజానీకానికీ, ఇటు వివిధ కార్పొరేట్, విద్యా సంస్థలకు, ఆసుపత్రులకు, రాష్ట్రంలోని ఇతర సంస్థలకు సరసమైన ధరలో అందిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో దీని ద్వారా సాంఘిక, ఆర్థిక స్థిరత్వాన్ని, అవకాశాలని తేవడం, నేర్చుకోడానికి కొత్త ఛానెళ్లను ఏర్పాటు చేయడం, ప్రభుత్వంతో మెరుగైన సంబంధాలనేర్పరచడం, ఆరోగ్య సంక్షేమాభివృద్ధిని తేవడం కోసం ఎంతో తోడ్పడుతుంది. గ్రామీణ భారతాన్ని నాగరిక భారతానికి వెన్నెముకగా తీర్చిదిద్దడంలో ఇది తొలి మెట్టు. దీనిలో భాగంగా టెలి విద్య, టెలి మెడిసిన్, ఇగవర్నెన్స్, వినోదం మాత్రమేకాక ఉపాధిని కల్గించడం, వేగంగా సమాచారాన్ని అందించడం, వెబ్ ఆధారిత సమాచార వ్యవస్థను ఏర్పాటు చేయడం కూడా జరుగుతోంది.
మరింత సమాచారం కోసం చూడండి : http://www.webel-india.com
పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం, కోల్‌కత పోలీసు శాఖ వెబెల్ టెక్నాలజీ లిమిటెడ్ ను పోలీసు శాఖ కంప్యూటరీకరణకి ఆదేశించింది. దీని ద్వారా కోల్‌కతలోని 45 పోలీసు స్టేషన్లు, 5 డివిజనల్ ఆఫీసులు, 30 ఇతర బెటాలియన్ల ఆఫీసులు, ఏసి ఆఫీసులు ఉన్నాయి. ఈ కంప్యూటరీకరణ ద్వారా పనిలో సామర్ధ్యాన్ని పెంపొందించడం, నేర నియంత్రణ ముఖ్యోద్దేశ్యం. లాల్ బజార్ ఉన్నతస్థాయి అధికారులతో కలిసి పనిచేయడానికి, రోజువారీ పోలీసు యంత్రాంగం పనిలో నియంత్రణకు ఇది ఉపకరిసితుంది. పోలీసుశాఖ కోసం సాఫ్ట్ వేర్ ను కూడా వెబెల్ రూపొందించే పనిని చేపట్టింది.
మరింత సమాచారం కోసం చూడండి : http://www.webel-india.com/
పశ్చిమ బెంగాల్ స్టేట్ వైడ్ ఏరియా నెట్వర్క్ అనేది రాష్ట్ర డేటా, వాయిస్, విడియో సమాచార వ్యవస్థకు వెన్నెముక. ఈ ప్రభుత్వ ఇంట్రానెట్ వ్యవస్థ ద్వారా రాష్ట్ర ఇ-గవర్నెన్స్ పనులు చేపట్టడం జరుగుతుంది. దీనికి ఇంటర్నెట్ ప్రోటోకోల్(ఐపి) పరిజ్ఞానమే ఆధారం.
డ బ్ల్యుబి స్వాన్ ప్రధాన సౌకర్యాలు :
డబ్ల్యుబి స్వాన్ సేవలు అప్లికేషన్లు :
మరింత సమాచారం కోసం చూడండి : http://www.webel-india.com
‘పశ్చిమ బెంగాల్‌లోని అంధ విద్యార్థుల పాఠశాలలలో ఐటి ఆధారిత బ్రెయిలీ విద్య, మౌలిక వనరుల బలోపేతం చేయడం' అనే ప్రాజెక్ట్ కింద వెబెల్ మీడియా ట్రానిక్స్ లిమిటెడ్ ఐటి ఆధారిత బ్రెయిలీ విద్యకు కావలసిన మౌలిక వనరులను 27 ప్రత్యేక పాఠశాలలలో, 2 గ్రంథాలయాలలో అభివృద్ధి చేస్తోంది.
ఈ ప్రాజెక్ట్ ను డిపార్ట్ మెంట్ ఆఫ్ ఐటి, మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ అండ్ ఐటి, భారత ప్రభుత్వంతోబాటు పశ్చిమబెంగాలుకు చెందిన డిపార్ట్ మెంట్ ఆఫ్ ఐటి, డిపార్ట్ మెంట్ ఆఫ్ మాస్ ఎడ్యుకేషన్ ఎక్స్ టెన్షన్లు సంయుక్తంగా స్పాన్సర్ చేస్తున్నాయి.
మౌలిక వనరుల అభివృద్ధి
మరింత సమాచారం కోసం చూడండి : http://www.webelmediatronics.in/brlads/
ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు