పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

మహారాష్ట్ర

ఈ విభాగం మహారాష్ట్ర రాష్ట్ర స్థాయి ఇ-పాలన కార్యక్రమాల గురించి వివరాలను అందిస్తుంది.

సరిత (స్టాంప్స్ రిజిస్ట్రేషన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బేస్డ్ అడ్మినిస్ట్రేషన్)

సరిత  అనేది ఒక జి 2 సి-యు ప్రాజెక్ట్. ప్రతి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్  చేయడానికి, సమయానికి అప్ డేట్ చేసిన డేటాను జాయింట్ జిల్లా రిజిస్ట్రార్లకు, మహారాష్ట్రలోని పునే లోని రిజిస్ట్రేషన్ శాఖ పరిధిలోని ఇతర ప్రధాన కార్యాలయాలకందజేయడానికి వీలుగా ఒక కంప్యూటర్ అప్లికేషన్ ను రూపొందించి, అభివృద్ధి చేసి, అమలు చేయడమే ఈ ప్రాజెక్ట్ లక్ష్యం. ఇది పిపిపి పద్ధతిలో, మొత్తం మహారాష్ట్రలోని 405 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలలో, 35 జిల్లా కార్యాలయాలలో, 8 డివిజినల్ కార్యాలయాలలో, పుణెలోని ప్రధాన కార్యాలయంలోనూ అమలౌతూంది.

ప్రాజెక్టు లక్ష్యాలు  :

 • ప్రస్తుత రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి స్థాయిలో కంప్యూటరీకరణ చేయడం.
 • ఆస్తి విలువను ఆటోమేటిగ్గా తెలియజేసే వీలుగా ఒక త్వరిత దర్శిని ఆధారంగా నిర్దేశించిన నమూనా ఏర్పాటు.
 • తీర్పునివ్వడం.
 • రసీదులను, పెండింగ్ జాబితాను తయారుచేయడం.
 • పార్టీలకు నోటీసులను జారీ చేయడం.
 • రిజిస్ట్రేషన్ చేసిన డాక్యుమెంట్లను స్కాన్ చేసి సురక్షితం చేయడం, చక్కని బ్యాకప్ సౌకర్యంతో వెలితీత సౌకర్యాన్నందించడం.
 • శాఖీయ విభాగాలలో అవసరమయ్యే వివిధ అన్ని రకాల రిపోర్టుల(తరచూ ఇచ్చేవి, ఇతరాలు) తయారీ.
 • కార్యాలయ పరిధిలోని అన్ని గ్రామాలకు సంబంధించిన మాస్టర్ డేటాబేస్ ను నిర్వహించడం.
 • ఉన్నత స్థాయి అధికారుల కోసం సారాంశ రిపోర్టులు.
 • రిపోర్టులను వెదకడం, రిజిస్ట్రేషన్, డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ల సర్టిఫైడ్ కాపీలను సత్వరమే అందించడం.
 • ప్రజల కోసం వెబ్ ఆధారిత సమాచార ఖని ఏర్పాటుచేసి దానిని సుదూర ప్రాంతాలనించే వాడే సౌకర్యం.

లభించే సేవలు  :

 • ప్రభుత్వం నిర్దేశించినట్లు 67 రకాల వివిధ డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్.
 • అనుసంధించిన 360 చోట్లలో ఏకకాలంలో సాఫ్ట్ వేర్ అమలు.
 • తగిన వివరాలతో డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ కేవలం 30 నిమిషాలలోపే పూర్తి చేసేలా ప్రజలకు భరోసా.
 • ఎలాటి పొరబాట్లూ లేకుండా  రిజిస్ట్రేషన్, ఆన్ లైన్ పర్యవేక్షణ, డాక్యుమెంట్లను ఫోటోలతో సహా కోడీకరణ, క్రయ, విక్రయదారుల వేలిముద్రల సేకరణ.
 • సాఫ్ట్ వేర్ ను సులభంగా ఎక్కడైనా అమలుచేసి, నిర్వహించే వీలు.
 • రిజిస్ట్రేషన్ వెల కట్టడం, స్కానింగ్, నెట్వర్కింగ్, ప్రక్రియల పర్యవేక్షణ -వంటి అన్ని పనులనూ ఒకేచోట ఉండేలా ఏకీకృతం చేయడం.
 • యూజర్ ఇంటర్ ఫేస్ మరాఠీలో లభింపచేయడం.

ప్రభుత్వానికి:

డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో రోజుకు సగటున 16 నించి 40కి పెరిగింది. అంటే, అదనపు పెట్టుబడి లేకుండా 10-15 శాతం ఆదాయం పెరిగింది.

పరిశ్రమలకి:

నిర్మించి - పనిచేయించి - బదిలీ చేయడం(బిల్డ్-ఆపరేట్-ట్రాన్స్ఫర్ -బిఓటి) పద్ధతిలో ఐజిఆర్ సైట్లలో పనిచేయడంలో ప్రవేటు భాగస్వామ్యంవల్ల వనరులను పంచుకొని వాడుకొనే వీలు ఏర్పడింది.

ప్రజలకి:

డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ కు పట్టే సమయం కొద్ది రోజులనించి కేవలం 30 నిమిషాలకు గణనీయంగా తగ్గింది. ఆలస్యానికి పెనాల్టీ విధించడమూ జరుగుతుంది. అందువల అధికారులు సైతం జాగ్రత్త వహించి రిజిస్ట్రేషన్ వేగంగా చేస్తున్నారు.

ఈ ప్రాజెక్టు వివిధ బాధ్యతలు:

 • మహారాష్ట్రలో ఉన్న అన్ని 360 ఐజిఆర్ కార్యాలయాలలో ఏకకాలంలో సాఫ్ట్ వేర్ అమలు
 • ఐజిఆర్ వెబ్ సైటును (http://igrmaharashtra.gov.in/) హోస్ట్ చేయడం, తద్వారా ఐజిఆర్ కార్యకలాపాలను, ఇతర కంప్యూటరీకృత సేవల గురించి సమాచారాన్నీ ప్రజలకు తెలియజేయడం
 • రిజిస్ట్రార్, ఉప రిజిస్ట్రార్ కార్యాలయాలలోని అధికారులకు శిక్షణనివ్వడం.
 • కనీసం 10,000 డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియతో పైలట్ నడుస్తోంది. దాదాపు 1మిలియన్ పాత డాక్యుమెంట్ల ను స్కాన్ చేసి, భవిష్యత్ లో పనికొచ్చేలా సిడిల లో దాయడమూ జరుగుతోంది.
 • రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 360 చోట్లనూ అనుసంధానం చేసే ప్రణాళిక  చేయడం.
 • అన్ని చోట్లలో సాఫ్ట్ వేర్ ని అమలు చేయడంలో, వాడటంలో ఎంపిక చేసిన ప్రైవేటు ఏజన్సీల పనితీరు పర్యవేక్షణ

డిజిటల్ చెల్లింపు వ్యవస్థ

డిజిటల్  చెల్లింపు వ్యవస్థ అనే దాన్ని పేద రైతులకు ఐటిని ఒక సాధనంగా సాయపడేలా చేసి, ఇపుడున్న  రైతు సహకార సంఘాల  ఉత్పాదకతను పెంచడానికి ఉద్దేశించింది.  సమాచార పరిజ్ఞానాన్ని వాడి గ్రామీణ భారతీయ వాణిజ్యానికి రోజూ జరిగే వ్యాపార లావాదేవీలకు సాయపడేలా సమగ్రమైన సదుపాయాలు ఏర్పాటు చేయడం, గ్రామీణులందరినీ కలపడం, గ్రామ స్థాయి వ్యాపారంలో పారదర్శకతను తేవడమే దీని ఉద్దేశ్యం. అత్యధిక గ్రామీణ జనాభాకు వారికి సమాచార పరిజ్ఞానాన్ని సరిగ్గా వాడుకోలేకపోవడంతో సహా పలు సమస్యలను పరిష్కరించుకోవడానికి వీలుగా ఈ ప్రాజెక్టు రూపొందింది.  ఈ ప్రాజెక్టు కింద  గ్రామీణ సహకార సంస్థల బిల్లులను, వసూళ్లను  స్మార్ట్ కార్డ్ల వాడకం ద్వారా సమయానికి చెల్లింపులు చేసేలా చూడటం ప్రధానోద్దేశ్యం.  రైతులకు ఎలక్ట్రానిక్ ఖాతాలు ఏర్పాటు చేసి, వారికి రావలసిన రాబడి బకాయిలు చెల్లించడానికి, వారినించి రావలసిన వివిధ బకాయిలను చెల్లించడానికి దీనివల్ల మార్గం సుగమమైంది. ఆ కార్డులను వాడి వివిధ ఉత్పత్తులను సహకార సంస్థలనించి, ఇతర సంస్థలనించి  పొందే వీలు కూడా ఏర్పడింది. దీనివల్ల సహకార సంఘాల సభ్యులు అందజేసే పాలు, చెరకు, ఇతర ఉత్పత్తులకు తగిన చెల్లింపులను పొందడంలో ఆలస్యం గణనీయంగా తగ్గుతుంది.  డిజిటల్ చెల్లింపు వ్యవస్థ  గురించి మరింత సమాచారం కోసం  www.vidyapratishthan.org www.viitindia.org పై క్లిక్ చేయండి.

సేతు

(సమీకృత ప్రజా సేవాకేంద్రాలు)

సేతు అనేది ప్రభుత్వ కార్యాచరణ క్రమానికి హెచ్చు పారదర్శకత, లభ్యత, సమర్ధతలను జోడించడంపై దృష్టి సారిస్తుంది. ఉపాధి కల్పన దీని మరో పరోక్ష లక్ష్యం.  సేతు లేదా సమీకృత ప్రజా సేవాకేంద్రాలు అనేవి వివిధ ధృవీకరణ పత్రాల కోసం, పర్మిట్ల కోసం, ధృవీకరణ కోసం, అఫిడవిట్ల కోసం, ఇతర సేవల కోసం వివిధ ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లే ప్రజలకు ఒకే గొడుగు కింద అంద జేస్తాయి. సేతు సొసైటీ అనేది ఈ సేతు కేంద్రాలను నిర్వహిస్తుంది. సేతు సొసైటీ అనేది ప్రజా పరిపాలనలో పారదర్శకత, సమర్ధతలను పెంపొందించే దిశలో పనిచేసే ఒక సంస్థ.  ఇది ప్రజావసరాలను అర్థం చేసుకొని, వాటిని తీర్చడానికనువుగా వారధిగా, ప్రజలను ప్రభుత్వంతో అనుసంధించడానికి పనిచేస్తుంది. సమీకృత ప్రజా సేవాకేంద్రాలుగా సేతుని 28 జిల్లాకేంద్రాలలో, 298 తాలూకాలలో ఆరంభించారు. ప్రస్తుతం, ఇవి కలెక్టర్ కార్యాలయాలకు సంబంధించిన సౌకర్యాలందిస్తున్నాయి. తరచుగా ఇవి జారీ చేసే ధృవీకరణ పత్రాల్లో  స్థానిక ధృవీకరణ, జాతీయ  ధృవీకరణ,  కుల ధృవీకరణ,  వయస్సు ధృవీకరణ, ఆదాయ వివరాల ధృవీకరణ, వృత్తి ధృవీకరణ వంటివి ఎక్కువగా ఉన్నాయి.   సేతు  గురించి మరింత సమాచారం కోసం  www.maharashtra.gov.inపై క్లిక్ చేయండి.

ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు

3.00272108844
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు