অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

జాతీయ ఇ-పాలన ప్రణాళిక

సమాజంలోని అట్టడుగువర్గాలవారికి కూడా సమాచార సాంకేతిక పరిజ్ఞాన ఫలాలు అందడానికి, వారు పౌరసేవలు పారదర్శకంగా, ఇబ్బందులేమీ లేకుండా, సమయానికి పొందడానికి భారత ప్రభుత్వం 1990ల చివరలో దేశంలో ఇ-పరిపాలనను ప్రవేశపెట్టింది. ఆ తర్వాత ఇ-పరిపాలన కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేసేందుకు 27 మిషన్ మోడ్ ప్రాజెక్టులు మరియు 8 కాంపొనెంట్స్ సహా జాతీయ ఇ-పరిపాలన ప్రణాళిక(ఎన్.ఇ.జి.పి)ను 2006 మే 18న కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. స‌మాచార సాంకేతిక ప‌రిజ్ఞాన‌ విభాగము(డి.ఐ.టి), పరిపాలనా సంస్కరణలు మరియు ప్రజా సమస్యల విభాగము(డి.ఏ.ఆర్&పి.జి) కలిసి ఇ-పరిపాలన ప్రణాళిక(ఎన్.ఇ.జి.పి)ని రూపొందించాయి.

జాతీయ ఇ-పరిపాలన ప్రణాళిక యొక్క లక్ష్యం (విజన్)

ఎన్.ఇ.జి.డి పౌరులకు, వివిధ వ్యాపారాలకు ప్రభుత్వ సేవలను మెరుగ్గా అందించాలనే లక్ష్యంతో ప్రారంభించిన జాతీయ ఇ-పరిపాలన ప్రణాళిక ఈ క్రింది సిధ్దాంతాన్ని లక్ష్యంగా పెట్టుకుంది: “సామాన్య మానవుడికి అతను నివసించేచోటే ఉమ్మడి సేవా కేంద్రాలద్వారా అన్ని ప్రభుత్వసేవలూ అందించేటట్లుగా చూడాలి. ఆ సేవలు సామాన్య మానవుడి ప్రాధమిక అవసరాలు అతను భరించగలిగే ఖర్చుతో తీరేలా సమర్ధవంతంగా, పారదర్శకంగా, విశ్వాసయోగ్యమైనవిగా, నమ్మకంగా అందించాలి.” ఈ లక్ష్యాన్ని ఆదర్శంగా పెట్టుకుని సుపరిపాలనను అందించడానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను నొక్కి చెబుతోంది.

చేరువ చేయడం:

గ్రామీణ ప్రజలను దృష్టిలో ఉంచుకుని ఈ లక్ష్యాన్ని రూపొందించడం జరిగింది. అవగాహనాలోపం, దూరాభారం వంటి కారణాలరీత్యా ప్రభుత్వసేవలను వాటిని పొందలేకపోతున్న సమాజంలోని కొన్ని వర్గాలవారికి చేరవేయడమే లక్ష్యం. గ్రామీణ ప్రాంతాలలోని పౌరులను చేరుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా నెలకొల్పబడి (స్టేట్ వైడ్ ఏరియా) నెట్ వర్క్ ద్వారా సమితిస్థాయివరకు అన్ని ప్రభుత్వ కార్యాలయాలను, ఉమ్మడి సేవాకేంద్రాలను అనుసంధానం (కనెక్ట్) అయి ఉండేందుకు జాతీయ ఇ-పరిపాలన ప్రణాళిక అవకాశాన్ని కల్పించింది.

ఉమ్మడి సేవాకేంద్రాలు:

ప్రస్తుతం మారుమూలప్రాంతాలలో నివశించే పౌరులు ఒక ప్రభుత్వశాఖ నుండి గానీ, దాని స్థానిక కార్యాలయంనుండి గానీ ఏదైనా సేవను పొందాలంటే సుదూరప్రయాణం చేయాల్సివస్తోంది. సామాన్యపౌరుడు ప్రభుత్వసేవలను పొందాలంటే సమయాన్ని, డబ్బును కూడా తనస్థాయికి మించి వెచ్చించాల్సి వస్తోంది. ఈ సమస్యను అధిగమించడానికి జాతీయ ఇ-పరిపాలన ప్రణాళిక(ఎన్.ఇ.జి.పి) లక్ష్యంలో భాగంగా ఒక పరిష్కారాన్ని రూపొందించారు. దీని ప్రకారం ప్రతి ఆరు గ్రామాలకూ ఒక ఉమ్మడిసేవా కేంద్రాన్ని ఏర్పాటుచేస్తారు. ఒక కంప్యూటర్, ఇంటర్నెట్ సౌకర్యం ఉండే ఈ కేంద్రంద్వారా గ్రామస్తులు ప్రభుత్వ సేవలను పొందవచ్చు. ఎక్కడైనా, ఎప్పుడైనా అనే ప్రాతిపదికన ఆన్ లైన్ సమీకృత సేవలను అందించే విధంగా ఈ ఉమ్మడి సేవాకేంద్రాలకు రూపకల్పన చేశారు.

పరిపాలనను మెరుగుపరచడానికి ఇ-పరిపాలనను అనుసరించడం:

సమాచార, సాంకేతిక పరిజ్ఞానం వినియోగంద్వారా ప్రభుత్వం పౌరులకు చేరువై మెరుగైన పరిపాలనను అందించగలుగుతుంది. అంతేకాక వివిధ ప్రభుత్వ పథకాల అమలు, పర్యవేక్షణలను మెరుగుపరచడానికి...తద్వారా జవాబుదారీతనం, పారదర్శకత పెంపొందించడానికి కూడా వీలవుతుంది.

పౌరుల జీవనప్రమాణాలు మెరుగుపరచడం:

ఇ-పరిపాలన ద్వారా నామమాత్రపు ఖర్చుతో పౌరులు తక్కువ సమయంలో, సులభంగా పౌరసేవల కొరకు ద‌ర‌ఖాస్తు చేసుకోడానికి, పౌరసేవలు పొంద‌డానికి వీలు కల్పించడంద్వారా ప్రభుత్వం ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచ గలుగుతుంది. కాబ‌ట్టి సుప‌రిపాల‌న అందించ‌డానికి ప్రభుత్వాల‌కు ఇ-ప‌రిపాల‌న‌ను ఉప‌యోగించుకోవాల‌నేదే లక్ష్యం (విజ‌న్). కేంద్ర‌, రాష్ట్రాల‌లోని ప్రభుత్వాలు స‌మాజంలోని అట్టడుగువ‌ర్గాల‌ను కూడా చేర‌డానికి వివిధ‌ ఇ-ప‌రిపాల‌న కార్యక్రమాలు అందించే సేవ‌లు ఉప‌యోగ‌ప‌డ‌తాయి. నిరాద‌ర‌ణ‌కు గురైన ఆ వ‌ర్గాలు ప్ర‌భుత్వ అభివృద్ధి కార్యక్రమాల‌లో పాలుపంచుకోడానికి, త‌ద్వారా సాధికార‌త సాధించ‌డానికి ఇ-ప‌రిపాల‌న ఉప‌యోగ‌ప‌డుతుంది. ఈవిధంగా ఇ-ప‌రిపాల‌న‌ పేద‌రికాన్ని త‌గ్గించ‌డానికి, స‌మాజంలో సాంఘిక‌, ఆర్ధిక అంత‌రాన్ని పూడ్చడానికి సాయ‌ప‌డుతుంది.

జాతీయ ఇ-ప‌రిపాల‌నా ప్రణాళిక అమ‌లుకు వ్యూహం

జాతీయంగా, అంత‌ర్జాతీయంగా ఇ-ప‌రిపాల‌నను వేర్వేరుచోట్ల గ‌తంలో విజ‌య‌వంతంగా అమ‌లుచేసిన అనుభ‌వాల ప్రాతిప‌దిక‌గా జాతీయ ఇ-పరిపాలన ప్రణాళిక(ఎన్.ఇ.జి.పి), కోసం ఒక మెరుగైన విధానానికి రూప‌క‌ల్ప‌న చేశారు. ఈ విధానంలో ఈ కింది అంశాలుంటాయి.

ఉమ్మడి మౌలిక వసతులు:

జాతీయ ఇ-పరిపాలన ప్రణాళిక(ఎన్.ఇ.జి.పి) అమలుకోసం రాష్ట్రవ్యాప్తంగా ఏరియా నెట్‌వ‌ర్క్స్(స్వాన్‌లు), రాష్ట్ర సమాచారకేంద్రాలు (ఎస్‌డీసీలు) ఉమ్మడి సేవాకేంద్రాలు (సీ.ఎస్‌.సీలు) మ‌రియు ఎల‌క్ట్రానిక్ స‌ర్వీస్ డెలివ‌రీ గేట్‌వేలు వంటి ఉమ్మడి మ‌రియు ఆధారిత ఐటీ మౌలిక‌వ‌స‌తులు ఏర్పాటు చేయాల్సిఉంది.

ప‌రిపాల‌న:

స‌మ‌ర్ధులైన అధికారుల నేతృత్వంలో జాతీయ ఇ-పరిపాలన ప్రణాళిక(ఎన్.ఇ.జి.పి) అమ‌లును ప‌ర్యవేక్షించ‌డానికి, స‌మ‌న్వయ‌ప‌ర‌చ‌డానికి త‌గిన ఏర్పాట్లు చేయ‌బ‌డ్డాయి. ఈ కార్య‌క్ర‌మంలో ప్రామాణికాలు, విధానాల రూప‌క‌ల్పన‌, సాంకేతిక స‌హాయం అందించ‌డం, సామ‌ర్ధ్యాలను పెంచే కార్య‌క్ర‌మం చేప‌ట్ట‌డం, ప‌రిశోధ‌న‌, అభివృద్ధి మొద‌లైన అంశాలు కూడా ఉంటాయి. ఈ విధుల‌న్నీ స‌మ‌ర్ధవంతంగా నిర్వహించ‌డానికి స‌మాచార సాంకేతిక ప‌రిజ్ఞాన విభాగం(డిఐటి) త‌న‌ని తాను, మ‌రియు నేష‌న‌ల్ ఇన్ఫార్మేటిక్స్ సెంట‌ర్(ఎన్ఐసి), స్టాండ‌ర్డైజేష‌న్, టెస్టింగ్ అండ్ క్వాలిటీ స‌ర్టిఫికేష‌న్(ఎస్‌టిక్యూసి), సెంట‌ర్ ఫ‌ర్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్(సి-డాక్), నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్మార్ట్ గ‌వ‌ర్నెన్స్(ఎన్.ఐ.ఎస్‌.జి) వంటి వివిధ సంస్థల‌ను మ‌రింత బలోపేతం చేసుకుంటోంది.

కేంద్రీకృత ప్రయ‌త్నం, వికేంద్రీకృత అమ‌లు:

పౌర కేంద్రీకృత దృక్పథంతో వివిధ ఇ-ప‌రిపాల‌నా అనువ‌ర్తన‌ముల‌ను స‌మ‌న్వయం చేసుకుని స‌మాచార సాంకేతిక ప‌రిజ్ఞాన మౌలిక‌వ‌స‌తుల‌ను, వ‌న‌రుల‌ను గ‌రిష్ఠంగా వినియోగించుకుంటూ ఒక కేంద్రీకృత ప్రయ‌త్నంగా ఇ-ప‌రిపాల‌న‌ను వికేంద్రీకృత విధానంలో ప్రోత్సహిస్తున్నారు. విజ‌య‌వంత‌మైన ప్రాజెక్టుల‌ను గుర్తించి,అవ‌స‌ర‌మైన‌చోట‌ కావ‌ల‌సిన మార్పులు చేసుకుని కొత్త ప్రాజెక్టుల‌ను సృష్టించుకోవాల‌ని కూడా ల‌క్ష్యంగా పెట్టుకున్నారు

ప్రభుత్వ-ప్రైవేటు భాగ‌స్వామ్యాలన‌మూనా:

భ‌ద్రతా కోణంలో రాజీప‌డ‌కుండా వ‌న‌రుల స‌మూహాన్ని పెద్దది చేయ‌డానికి సాధ్య‌మైన ప్రతిచోటా దీనిని అనుస‌రించాలి.

విలీనీక‌ర‌ణ‌ అంశాలు:

స‌మ‌న్వయం సాధించ‌డానికి, సందిగ్ధత‌ను నివారించ‌డానికి పౌరుల‌కు, వ్యాపారాల‌కు, ఆస్తుల‌కు ఒక విశిష్ట గుర్తింపు కోడ్‌ను ఇచ్చే విధానాన్ని ప్రోత్సహిస్తారు.

జాతీయ ఇ-ప‌రిపాల‌నా ప్ర‌ణాళిక‌(ఎన్.ఇ.జి.పి)ను అమ‌లు చేయాల్సిన విధాన‌ము

జాతీయ ఇ-ప‌రిపాల‌నా ప్రణాళిక‌(ఎన్.ఇ.జి.పి) అమ‌లులో అనేక సంస్థలు మ‌మేక‌మై ఉండ‌టం, జాతీయ‌స్థాయిలో స‌మ‌న్వయం, స‌ముచ్యయం (ఇంటిగ్రేషన్) చేయాల్సిన అవ‌స‌రాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ ప్రణాళిక‌లో మ‌మేక‌మైఉన్న ప్రతిసంస్థకూ ఖ‌చ్చిత‌మైన క‌ర్తవ్యాన్ని, బాధ్యత‌ను క‌ట్టబెడుతూ, ఒక స‌ముచిత‌మైన కార్యక్రమ నిర్వహణా (ప్రోగ్రామ్ మేనేజ్‌మెంట్) వ్యవ‌స్థను సృష్టించే కార్యక్రమంగా జాతీయ ఇ-ప‌రిపాల‌నా ప్రణాళిక‌(ఎన్.ఇ.జి.పి)ను అమ‌లుచేయాల‌ని నిర్ణయించారు. దీనికి ప్రభుత్వ ఆమోదం కూడా లభించింది. ఈ ప్రోగ్రామ్ మేనేజ్‌మెంట్ వ్యవ‌స్థలోని కీల‌క అంశాలు, విశేషాలు గ్రాఫిక్స్‌లో ఇవ్వబ‌డ్డాయి.

సేవ‌ల బ‌ట్వాడాకు అనుస‌రించాల్సిన వ్యూహం:

రాష్ట్ర వ్యాప్తంగా నెలకొల్పబడిన (స్టేట్ వైడ్ ఏరియా) నెట్‌వ‌ర్క్(స్వేన్), స్టేట్ డేటా సెంట‌ర్(ఎస్‌డీసీ), నేష‌న‌ల్ స్టేట్ స‌ర్వీస్ డెలివ‌రీ గేట్‌వే(ఎన్.ఎస్‌.డీ.జీ/ఎస్‌.ఎస్‌.డీ.జీ), స్టేట్ పోర్ట‌ల్ అండ్ కామ‌న్ స‌ర్వీసెస్ సెంట‌ర్(సి.ఎస్‌.సి)ల‌తో ప్ర‌భుత్వ సేవ‌ల‌ను సామాన్య పౌరుడికి నిరాటంకంగా, ఒకేచోట అందించ‌డానికి ప్రతి రాష్ట్రంలోనూ, ప్ర‌తి కేంద్ర‌పాలిత ప్రాంతంలోనూ ఒక ఉమ్మడి డిజిట‌ల్ సేవా బ‌ట్వాడా వ్యవ‌స్థలను ఏర్పాటు చేస్తారు.

జాతీయ ఇ-ప‌రిపాల‌నా విభాగ‌ము(ఎన్.ఇ.జి.డి)

జాతీయ ఇ-ప‌రిపాల‌నా ప్రణాళిక కార్యక్రమ నిర్వహ‌ణ‌లో సాయ‌ప‌డ‌టానికి భార‌త ప్రభుత్వానికి చెందిన స‌మాచార సాంకేతిక ప‌రిజ్ఞాన విభాగ‌ము, భార‌త ప్రభుత్వానికి చెందిన ప్ర‌సార‌, స‌మాచార సాంకేతిక ప‌రిజ్ఞాన మంత్రిత్వశాఖ నేతృత్వంలోని మీడియాల్యాబ్ ఏషియాలో జాతీయ ఇ-ప‌రిపాల‌నావిభాగం పేరుతో ఒక స్వయంప్రతిప‌త్తిగల వ్యాపార‌కేంద్రాన్ని ఏర్పాటుచేశారు. జాతీయ ఇ-ప‌రిపాల‌నా ప్రణాళిక స‌మాచార సాంకేతిక ప‌రిజ్ఞాన విభాగానికి ఈ క్రింది ప‌నుల‌లో స‌హాయ‌ప‌డుతుంది.

 • వివిధ మంత్రిత్వశాఖ‌లు/రాష్ట్రప్ర‌భుత్వాలకు చెందిన మిష‌న్ మోడ్ ప్రాజెక్టుల అమ‌లుకు వీలు కలిగించడం.
 • వివిధ కేంద్ర‌మంత్రిత్వశాఖ‌లు/రాష్ట్రప్రభుత్వాల విభాగాల‌కు సాంకేతిక స‌హాయాన్ని అందించ‌డం
 • జాతీయ ఇ-ప‌రిపాల‌నా ప్రణాళిక‌(ఎన్.ఇ.జి.పి)కు చెందిన అన్ని ప్రాజెక్టులకూ సాంకేతిక మూల్యాంక‌నం చేసే శిఖరాగ్ర స్ధాయిలో వుండే క‌మిటీకి స‌చివాల‌యంగా వ్య‌వ‌హ‌రించ‌డం
 • వివిధ రాష్ట్రాలు ఇ-ప‌రిపాల‌నా ప్రణాళిక‌ను అమ‌లుప‌ర‌చ‌డంలో సాయ‌ప‌డ‌టానికి రాష్ట్ర ఇ-మిష‌న్ బృందాల‌ను అందించ‌డం

సామర్ధ్య పెంపుదల

జాతీయ ఇ-పరిపాలనాప్రణాళిక(ఎన్.ఇ.జి.పి) 35రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలలో ఆయా రాష్ట్రప్రభుత్వాలు, కేంద్రపాలితప్రాంతాల ప్రభుత్వాలు, 20 కేంద్రమంత్రిత్వశాఖలు, రాష్ట్ర,కేంద్రపాలిత ప్రభుత్వాలలోని 360 విభాగాలు మరియు ఈప్రణాళికను అమలుచేస్తున్న 500 సంస్థలతో కూడిన ఒక బృహత్తర, సంక్లిష్ట కార్యక్రమం ఇది. మొత్తం మీద దీనికి 70,000  సంవత్సరాల కృషి అవసరమవుతుందని అంచనా. అందువలన జాతీయ ఇ-పరిపాలనాప్రణాళిక(ఎన్.ఇ.జి.పి), తన లక్ష్యాలు సాధించాలంటే నిపుణులను పనిలోకి తీసుకోవడం, నైపుణ్యాలను అభివృద్ధి చేయడం, శిక్షణను ఇస్తుండటం వంటి కార్యక్రమాలద్వారా సామర్ధ్య అంతరాన్ని పూడ్చాలి. రాష్ట్ర ఇ-పరిపాలన మిషన్ టీమ్స్(ఎస్.ఇ.ఎమ్‌.టి), ప్రాజెక్ట్ ఇ-పరిపాలన మిషన్ టీమ్స్(పి.ఇ.ఎమ్‌.టి) మరియు మానవవనరుల నిర్వహణ బృందాల ఏర్పాటుకు సాయపడటంద్వారా పై సవాళ్ళను ఒక సమీకృత విధానంలో ఎదుర్కొనడానికి సామర్ధ్య పెంపుదల పథకాన్ని ఏర్పాటు చేశారు. అభ్యర్ధుల ఎంపిక, ఇ-పరిపాలన ప్రాజెక్టుల అమలులో వివిధ స్థాయిలలో పనిచేస్తున్న నాయకులను/అధికారులను చైతన్యపరచడం, మార్గనిర్దేశనం చేయడం, నియామకాలలో రాష్ట్రాలకు సాయపడటం, రాష్ట్రాల ఇ-పరిపాలన మిషన్ టీమ్స్(ఎస్.ఇ.ఎమ్‌.టి)కు మార్గనిర్దేశనం చేయడం, ప్రాజెక్టుల్లో వివిధ స్థాయిల్లో పనిచేసే అధికారులకు కేంద్రీకృత పాఠ్యాంశాలు మరియు విషయాలతో కూడిన ప్రత్యేక శిక్షణ ఇవ్వడం వంటి అనేక కార్యక్రమాలను కూడా ఈ పథకం కింద నిర్వహిస్తారు.

సాధారణంగా రాష్ట్రాలలో ఉండే మూడు ప్రత్యేక సామర్ధ్యాల అంతరాలను పూడ్చటానికి ఈ పథకాన్ని రూపొందించారు:

 • సాముచిత నేపథ్యం, యోగ్యత గల సిబ్బంది కొరత
 • ఇప్పటికే పనిలోకి తీసుకొనబడిన సిబ్బందిలో తగిన నైపుణ్యాలు లేకపోవడం
 • నిర్దేశిత కార్యక్రమాన్ని నిర్వహించడానికి సాముచిత సంస్ధాగత విధానం లేకపోవడం

ఇ పాలన గురించి మరింత సమాచారం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

ఆధారము: సమాచార సాంకేతిక పరిజ్ఞాన విభాగం
ఇ-పరిపాలన పరిజ్ఞాన మారకం (నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఫ‌ర్ స్మార్ట్ గ‌వ‌ర్నెన్స్)

ఇ-గవర్నెన్స్ కు సంబంధించిన అంశాలపై సమాచారం అందించండి !

వికాస్ పీడియా పోర్టల్ ( భారత ప్రగతి ద్వారం) అనేది, భారత ప్రభుత్వ సమాచార సాంకేతిక పరిజ్ఞాన (ఇన్ఫర్మేషన్ టెక్నాలజి) మంత్రిత్వశాఖ చేపట్టిన దేశాభివృద్ధి కార్యక్రమం. సామాన్య ప్రజలకు ఉపయోగదాయకంగా, విజ్ఞానాన్ని, అనుభవాలను ఇతరులతో పంచుకోవడానికి అనువైన ఒక బహుభాషా వేదికను రూపొందించే కృషిలో ఇండియా డెవలప్‌మెంట్ గేట్‌వే నిమగ్నమైంది. ఈ సందర్భంగా, సమగ్రమైన ఇ - గవర్నెన్స్ విజ్ఞాన వేదికను రూపొందించడానికి వీలుగా, ఇ గవర్నెన్స్ కు సంబంధించి, (సాంకేతిక, సాంకేతికేతర) ఈ క్రింది అంశాలను గురించిన సమాచారాన్ని ఆంగ్లంలో లేదా మీ మాతృభాషలో మాకు అందజేయవలసిందింగా , ఇ-గవర్నెన్స్ పరిశోధనలు చేసే మేధావులను, విద్యార్ధులను, ప్రభుత్వాధికారులను, ఇతర ఉద్యోగులను, విద్యావేత్తలను, పాత్రికేయులను, సాంఘిక కార్యకర్తలను, ఫ్రీలాన్సర్లను కోరడమైనది.

 • ఇ-గవర్నెన్సుకు సంబంధించిన తాజా వార్తలు (ఒక వేళ మీరు ఏదైనా వర్కుషాప్ నకు గాని, సెమినార్ కు గాని, సదస్సుకు గాని హాజరవుతుంటే, వాటికి సంబంధించిన సమాచారం )
 • ఇ-గవర్నెన్సుకు సంబంధించిన ఈ క్రింద పేర్కొన్న అంశాలపై ప్రజెంటేషన్ లేదా ప్రచురితమైన వ్యాసాలు
  • జాతీయ ఇ-గవర్నెన్స్ ప్రణాళిక
  • మిషన్ మోడ్ ప్రాజెక్టులు
  • సాధారణ సేవల కేంద్ర కార్యక్రమం (కామన్ సర్వీస్ సెంటర్ ప్రోగ్రామ్)
  • ఇ-గవర్నెన్స్‌కు సంబంధించి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలోని వివిధ మంత్రిత్వ శాఖలలో చేపట్టిన రకరకాల కార్యక్రమాలు, ప్రక్రియలు
  • రాష్ట్రాలలో ఇ-గవర్నెన్స్‌కు సంబంధించిన మొబైల్ సేవలు
  • మొబైల్ బ్యాంకింగ్ , ఇంటర్నెట్ బ్యాంకింగ్
  • వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, గ్రామీణాభివృద్ధి వంటి రంగాలలో ఐ.సి.టి. కార్యక్రమాలు, ప్రక్రియలు
 • పైన పేర్కొన్న ఇ-గవర్నెన్స్, మొబైల్-గవర్నెన్స్ (ఎం -గవర్నెన్స్) సంబంధిత అంశాలపై రూపొందించిన పరిశోధనా వ్యాసాలు (పేపర్లు),
 • ఇ-గవర్నెన్స్ , ఎం–గవర్నెన్స్ అంశాలపై రూపొందించినపుస్తకాలు, చిరుపొత్తాలు (హ్యాండ్ బుక్స్), మార్గ దర్శకాలు, కరపత్రాలు, పోస్టర్లు మొదలైనవి
 • భారత ప్రభుత్వం, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు, అంతర్జాతీయ సంస్ధలచే విడుదల చేయబడిన ఇ-గవర్నెన్స్ మరియు ఎమ్-గవర్నెన్స్ కు సంబంధించిన విధాన పత్రాలు (పాలసీ డాక్యుమెంట్స్).
 • ఈ క్రింది అంశాలపై ఇ-లెర్నింగ్ కోర్సు మెటిరియల్ :
  • ఇ-గవర్నెన్స్
  • ఎమ్-గవర్నెన్స్
  • ప్రోజెక్ట్ మేనేజ్ మెంట్
  • పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్
  • పంచాయతిరాజ్ మొదలైనవి
 • ఇ-గవర్నెన్స్ నిపుణునితో జరిపిన ఇంటర్ వ్యూ.
 • ఇ-గవర్నెన్స్ కార్యక్రమాలపై వీడియో ఫిల్ములు.
 • ఇ-గవర్నెన్స్ / ఐ.సి.టి. కార్యక్రమాలకు సంబంధించిన విజయగాధలు.
 • ఇ-గవర్నెన్స్ , ఎమ్-గవర్నెన్స్ వంటి వాటిపై కొత్త రచనలు మొదలైనవి

ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate