పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

ఇ-పశు చికిత్స

ఇ-పశు చికిత్స వెటర్నరీ టెలి సంప్రదింపుల కోసం ఆన్లైన్ వ్యవస్థ గురించిన సమాచారం

వెటర్నరీ (జంతు) టెలీమెడిసిన్:-

20 వ శతాబ్దపు మనిషి తన  మేధస్సును తన కోసమే కాక తన పెంపుడు జంతువుల సౌకర్యం కొరకు కుడా వినియోగించినాడు అనుటకు ఇది ఒక చక్కటి ఉదాహరణ. టెలికమ్యూనికేషన్, సమాచార సాంకేతిక ఉపయోగించి జంతువుల వైద్య, ఆరోగ్య సంరక్షణ అందించడానికి వెటర్నరీ (జంతు) టెలీమెడిసిన్ సేవలు వినియోగిస్తారు. ఇది దూరాన్ని మరియు ఇతర అడ్డంకులు తొలగించి సుదూర గ్రామీణ ప్రాంతాల పశువుల యజమానులు వారి గ్రామము నుండే  ఉత్తమమైన నైపుణ్యం కలిగిన వెటర్నరీ డాక్టర్స్ ద్వారా జంతు వైద్య సేవలను పొందవచ్చును.

సియస్సి వెటర్నరీ (జంతు) టెలీమెడిసిన్ సౌకర్యం (ఇ-పశు చికిత్స):

ఇ-పశు చికిత్స అనునది వెటర్నరీ టెలి సంప్రదింపుల కోసం సియస్సి వారు అభివృద్ధి చేసిన ఒక ఆన్లైన్ వ్యవస్థ. ఇప్పుడు వారు భారతదేశంలో దేశవ్యాప్తంగా దాని విస్తారమైన సియస్సి నెట్వర్క్ ద్వార వెటర్నరీ (జంతు) టెలీమెడిసిన్ సేవలు (ఇ-పశు చికిత్స) అందిస్తున్న మొదటి సంస్థ. సియస్సి కేంద్రాలు ఇప్పుడు తమ సమూహాల్లో టెలి వెటర్నరీ వైద్యులు సౌకర్యం అందించడం ద్వారా పెంపుడు జంతువుల యజమానులు వెటర్నరీ వైద్యుల సౌకర్యం చేతిలో పొడిగించవచ్చును.

సియస్సి టెలీమెడిసిన్ పొందే విధానం:

  1. మొదటగా మీ దగ్గరలో వున్న సియస్సి సెంటర్ కి వేళ్ళవలెను (మీ సమీపంలోని సియస్సి సెంటర్ ను ఇక్కడ శోదించవచ్చును).
  2. సిఎస్సి సెంటర్ ఆపరేటర్ (VLE) కి వ్యాధి సంక్రమించిన పశువు యొక్క పిక్చర్ మరియు వీడియో ను వాట్స్అప్ ద్వారా పంపిస్తారు.
  3. సెంటర్ ఆపరేటర్ (VLE) మీ పశువు యొక్క సమస్య వివరాలను ఆన్లైన్ లో నమోదు చేస్తారు.
  4. నమోదు చేసిన తరువాత అప్పాయింట్మెంట్ తారీకు మరియు సమయం కేటాయించెదరు, దీనికి నిర్దిష్ట రుసుము చెలించవలెను.
  5. ఇచ్చిన తారీకు సమయానికి డాక్టర్ గారు  జంతు యజమానితో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పశువుల సమస్యలని మరియు లక్షణాలను తెలుసుకొని చికిత్స సూచనలు ఇస్తారు.
  6. సిఎస్సి సెంటర్ ఆపరేటర్ మీకు డాక్టర్ సూచించిన మందుల చీటీ ప్రింట్ ఇచ్చెదరు.
3.00740740741
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు