పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

జీవన్ ప్రమాన్

జీవన్ ప్రమాన్ లైఫ్ సర్టిఫికేట్ గురించిన సమాచారం

పించనుదారుల (పెన్షనర్ల) కోసం బయోమెట్రిక్ చే ప్రారంబించబడిన ఒక డిజిటల్ సర్వీసు జీవన్ ప్రమాన్. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం లేదా ఏ ఇతర ప్రభుత్వ సంస్థ పెన్షనర్లు అయినను ఈ సర్వీసు ద్వారా ప్రయోజనం పొందుతారు. ఈ పథకం 2014 నవంబర్ 10 న ప్రారంభించబడింది. ఈ పథకం లబ్ధిదారులుగా ప్రభుత్వ మరియు ప్రభుత్వరంగ సంస్థలలో రిటైర్ అయిన ఉద్యోగులు కోటి మించిపోయారు.

ఉద్యోగ విరమణ తర్వాత పింఛనుదారుకు ప్రధాన అవసరం ఏమిటంటే వారి పెన్షన్ వారి ఖాతాకు జమ కావడానికి బ్యాంకులు, పోస్టాఫీసులు వంటి సంస్థలు అధికార పెన్షన్ ఏజెన్సీకి లైఫ్ సర్టిఫికేట్ ఇవ్వడం. పెన్షన్ తీసికునేవారు లైఫ్ సర్టిఫికేట్ పొందడానికి పెన్షన్ ఏజెన్సీ ముందు గీయడం వ్యక్తిగతంగా తమనుతాము ప్రదర్శించవలెను లేదా వారు ముందు పనిచేసిన అధికార సంస్థ ఈ లైఫ్ సర్టిఫికెట్ ను పెన్షన్ ఏజెన్సీ కి జారీ చేయాల్సిన అవసరం ఉండేది.

ఇప్పుడు పెన్షన్ కోసం ప్రతి సంవత్సరం అతని/ఆమె ఉనికి రుజువును అధికారులకు సమర్పించడానికి వారి ఆఫీస్ కు వెళ్ళే బదులుగా జీవన్ ప్రమాన్ ఉపయోగించి వారు ఉన్న చోటు నుండే లైఫ్ సర్టిఫికేట్ పొందడం ద్వారా పెన్షన్ కొనసాగింపు చేసుకోవచ్చును.

ఇది ఎలా పనిచేస్తుందంటే:

జీవన్ ప్రమాన్ పింఛనుదారుని బయోమెట్రిక్ ధృవీకరణ కోసం ఆధార్ ప్లాట్ ఫారంను ఉపయోగిస్తుంది. లైఫ్ సర్టిఫికెట్ రిపోజిటరీ లో నిల్వ అయ్యే ధృవీకరణ విజయవంతం అయినపుడు డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ జెనరేట్ అవుతుంది. పెన్షన్ అందించే ఏజెన్సీ వారు లైఫ్ సర్టిఫికేట్ ను ఆన్లైన్ ద్వారా యాక్సెస్ చేసుకోవచ్చు.

ప్రక్రియ ఈ కింది విధంగా ఉంది:

  1. పెన్షనర్ (పించనుదారుల) నమోదు: మీరు నమోదు చేసుకోవడానికి కంప్యూటర్/మొబైల్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి లేదా ప్రత్యామ్నాయంగా సమీప జీవన్ ప్రమాన్ సెంటర్ ను సందర్శించండి. ఆధార్ నెంబర్, పెన్షన్ పేమెంట్ ఆర్డర్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ నెంబరు, బ్యాంకు పేరు మరియు మీ మైబైల్ నెంబర్ వంటి అవసరమైన సమాచారాన్ని అందించండి.
  2. ఆధార్ ధృవీకరణ: ధృవీకరించబడుటకు మీ బయోమెట్రిక్స్ గాని లేదా ఒక వేలిముద్ర లేదా ఐరిస్ అందించండి.
  3. లైఫ్ సర్టిఫికెట్: ధృవీకరణ విజయవంతమైన తర్వాత మీ జీవన్ ప్రమాన్ సర్టిఫికెట్ ఐడి సహా ఒక ఎస్ఎంఎస్ మీ మొబైల్ నంబరుకు పంపబడుతుంది. ఈ సర్టిఫికేట్లు పింఛనుదారులకు మరియు పెన్షన్ ఏజెన్సీకి ఏ సమయంలో అయినా ఎక్కడైనా అందుబాటులో ఉంచడానికి లైఫ్ సర్టిఫికెట్ రిపోజిటరీ లో నిల్వ చేయబడతాయి. పింఛనుదారుడు తన లైఫ్ సర్టిఫికేట్ ను జీవన్ ప్రమాన్ పోర్టల్ లో ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ ద్వారా పొందినట్టుగా బ్యాంకుకు తెలియజేయాలి.
  4. మీ సర్టిఫికెట్ ఆక్సెస్ చెయ్యడం: మీరు జీవన్ ప్రమాన్ వెబ్ సైట్ నుంచి జీవన్ ప్రమాన్ ఐడి లేదా ఆధార్ నంబర్ అందించడం ద్వారా జీవన్ ప్రమాన్ సర్టిఫికెట్ ను పిడిఎఫ్ రూపంలో డౌన్లోడ్ చేసుకోవచ్చు.

జీవన్ ప్రమాన్ నమోదు:

నమోదు చేసుకోవడానికి మరియు జీవన్ ప్రమాన్ పొందుటకు మూడు మార్గాలు ఉన్నాయి.

  1. మీ సమీప కామన్ సర్వీస్ సెంటర్(సియస్సి)ను సందర్శించండి మరియు ఆన్లైన్ సియస్సి సేవలు ఉపయోగించి నమోదు చేసుకోవడానికి మీరు నామమాత్రంగా చెల్లించాల్సి ఉంటుంది. జీవన్ ప్రమాన్ సెంటర్ల అడ్రెస్స్ తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి. మీ సమీపంలో జీవన్ ప్రమాన్ సెంటర్ల జాబితా పొందుటకు JPL స్పేస్ మరియు మీ పిన్ కోడ్ ను 7738299899 కు కూడా ఎస్ఎంఎస్ చేయవచ్చు.
  2. నమోదు చేసుకోవడానికి గుర్తించిన కార్యాలయంను కూడా సందర్శించవచ్చును.
  3. మీ ఆండ్రాయిడ్ ఆధారిత స్మార్ట్ ఫోన్ / టాబ్లెట్ లేదా విండోస్ కంప్యూటర్ / లాప్టాప్ లో అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసి నమోదు చేసుకోవచ్చును (ఈ క్లయింట్ సాఫ్ట్ వేర్ కి బయోమెట్రిక్ వేలిముద్రల / కంటిపాప స్కానర్ పరికరం అవసరం). అప్లికేషన్ డౌన్లోడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి. ఒకవేళ మీరు సపోర్ట్ అవసరం అయితే దయచేసి jeevanpramaan@gov.in హెల్ప్ డెస్క్ ను సంప్రదించండి.

మీ సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్(సియస్సి)ను గుర్తించడానికి ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత వనరులు:

జీవన్ ప్రమాన్ గురించి తరచుగా అడిగే ప్రశ్నలు

పెన్షనర్ల లైఫ్ సర్టిఫికెట్ యాక్సెస్ ఆధార్ అప్డేట్

ఆధారం: జీవన్ ప్రమాన్ వెబ్ సైట్

2.97727272727
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు