పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

టెలీమెడిసిన్

టెలీమెడిసిన్ ద్వారా సియస్సి సెంటర్ లో వైద్యం ఎలా పొందాలి అను సమాచారం

20 వ శతాబ్దపు టెలికమ్యూనికేషన్, సమాచార సాంకేతిక పరిజ్ఞానానికి  టెలీమెడిసిన్ ఒక చక్కటి ఉదాహరణ. టెలీమెడిసిన్  ద్వారా సుదూర ప్రాంత, మారుమూల గ్రామ ప్రజలు కూడా వారి గ్రామము నుండే ఉత్తమమైన నైపుణ్యం కలిగిన డాక్టర్స్ ద్వారా వైద్య మరియు ఆరోగ్య సేవలు పొందవచ్చును.

టెలికమ్యూనికేషన్, సమాచార సాంకేతికత ఉపయోగించడం ద్వారా వైద్య, ఆరోగ్య సంరక్షణ అందించడానికి టెలీమెడిసిన్ సేవలు వినియోగిస్తారు. ఇది దూరాన్ని మరియు ఇతర అడ్డంకులు తొలగించి సుదూర గ్రామీణప్రాంతాలకు నిలకడగా అందుబాటులో లేని  వైద్య సేవలను అందించడానికి సహాయపడుతుంది. ఇ ప్రక్రియ క్రిటికల్ కేర్ మరియు అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలను కాపాడడానికి ఉపయోగించరాదు.

సియస్సి టెలీమెడిసిన్:

సియస్సి ఇ గవర్నెన్స్ వారు భారతదేశంలో  దేశవ్యాప్తంగా దాని విస్తారమైన సియస్సి నెట్వర్క్ ద్వార మారుమూల పల్లెలకు కూడా ఇ గవర్నెన్స్ (ఇ పరిపాలన) విధానాన్ని అందిస్తున్నది. ఆ నెట్వర్క్ ద్వారానే ఇపుడు టెలీమెడిసిన్ సేవలను పల్లేలకు అందిచుచున్నది, దీని ద్వార మారుమూల గ్రామాల ప్రజలు నాణ్యమైన ఆరోగ్య సేవలు పొందుచున్నారు.

సియస్సి టెలీమెడిసిన్ పొందే విధానం:

  1. మొదటగా మీ దగ్గరలో వున్న సియస్సి సెంటర్ కి వేళ్ళవలెను (మీ సమీపంలోని సియస్సి సెంటర్ ను ఇక్కడ శోదించవచ్చును).
  2. ముందుగా సియస్సి సెంటర్ ఆపరేటర్ (VLE) మీ సమస్యని తెలుసుకొని మీయొక్క వివరాలను ఆన్లైన్ లో నమోదు చేస్తారు.
  3. నమోదు చేసిన తరువాత మీకు ఒక ఐడి నెంబర్ ఇచ్చెదరు దీనిని జాగ్రత్తగా భద్రపరచవలెను, భవిష్యత్తులో ఈ ఐడి నెంబర్ ద్వారానే మీరు డాక్టర్ల సలహాలు పొందగలరు.
  4. తరువాత పోర్టల్ లో అందుబాటులో వున్నా డాక్టర్స్ తో ఒక నిర్దిష్ట సమయానికి ఆప్పాయింట్మెంట్ బుక్ చేసుకొని, నిర్దిష్ట రుసుము చెలించవలెను.
  5. తరువాత బుక్ చేసిన నిర్దిష్ట సమయానికి డాక్టర్ ఆన్లైన్ లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రోగిని సంప్రదించి, వ్యాధి వివరాలను తెలుసుకుని, రోగికి తగిన సూచనలు మరియు మందులు మరియు తదుపరి ఏ రోజు రావాలెనో సూచించెదరు. రోగి రక్త పరీక్ష, మూత్ర పరీక్ష లేదా ఎక్స్ రేల ద్వార తీసిన ఛాయా చిత్రములు ఉన్నాగాని ఆన్లైన్ లో డాక్టర్ కి పంపించవచ్చును. ఆన్లైన్ లోనే మందుల చీటీ కూడా పంపించబడును.
  6. సియస్సి సెంటర్ ఆపరేటర్ మీకు డాక్టర్ సూచించిన మందుల చీటీ ప్రింట్ ఇచ్చెదరు.
3.0071942446
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు