హోమ్ / ఇ-పాలన / విఎల్ఇల కొరకు వనరులు / పాన్ కార్డ్ కొరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకొనుట
పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

పాన్ కార్డ్ కొరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకొనుట

శాశ్వత ఖాతా సంఖ్య కార్డు ఒక పది అంకెల అక్షర సంఖ్య ఉన్న ఫోటో గుర్తింపు కార్డు ప్రతీ ఉన్న వానికీ యివ్వబడుతుంది.

పాన్ కార్డ్

పాన్- శాశ్వత ఖాతా సంఖ్య గురించి

శాశ్వత ఖాతా సంఖ్య కార్డు (permanent accout number) card ఒక పది అంకెల అక్షర సంఖ్య ఉన్న ఫోటో గుర్తింపు కార్డు ప్రతీ ఉన్న వానికీ యివ్వబడుతుంది. ఇది ఆర్ధిక మంత్రిత్వ శాఖ, (భారతప్రభుత్వం) జారీ చేస్తుంది. దీనిని ఫోటో గుర్తింపు కార్డుగా బ్యాంకు ఖాతాను తెరవడానికి, పాస్ పోర్టును పొందడానికి, ఇ టికెట్ ద్వారా రైలులో ప్రయాణం చేయడానికి, మొదలైన వాటికి ఉపయోగించవచ్చు.

పాన్ వల్ల ఉపయోగాలు

ఈ పనులను చేయడానికి పాన్ తప్పనిసరి

 • ఆదాయపు పన్ను చెల్లింపు వివరాలను దాఖలు చేయడానికి
 • షేర్లు అమ్మడానికి మరియు కొనడానికి, డీ - మ్యాట్ ఎకౌంట్ (ఢీ-మ్యాట్ ఖాతా) ను తెరవడం.
 • ఒక బ్యాంకు ఖాతా నుండి మరియొక బ్యాంకు ఖాతాకు, 50000రూపాయలు లేక అంతకు మించిన సోమ్మును బదిలీ చేయడానికి గానీ, బ్యాంకులో జమ చేయడానికి గానీ, లేక బ్యాంకు నుండి తిరిగి పొందడానికి గాని PAN అవసరం.
 • పన్ను తగ్గింపు సోమ్ము తిరిగి పొందడానికి

అర్హత

 • ఏ వ్యక్తి అయినా, సంస్ధ అయినా లేక ఉమ్మడి భాగస్వామ్య వ్యవస్థ అయినా PAN కార్డు కోసం దరఖాస్తు చేసుకొనవచ్చు. దీనికోసం ఎటువంటి వయసు నిబంధనలూ లేవు

PAN (పాన్) కోసం దరఖాస్తు చేసుకొనుటకు కావలసిన అధికారిక ధృవపత్రాలు

 • మంచి నాణ్యత గల పాస్ పోర్టు సైజు పరిమాణంలో రంగుల ఫోటో
 • డిమాండ్ డ్రాఫ్ట్ / చెక్కు 94 రూపాయల విలువైనది.
 • గుర్తింపు నిరూపణ పత్రం యొక్క జిరాక్స్ కాపీని జతచేయాలి
 • చిరునామా నిరూపణ పత్రం యొక్క జిరాక్స్ కాపీని జతచేయాలి

ఈ రెండు పట్టికల నుండి, ఏదో ఒక ధృవ పత్రాన్ని జోడించండి గుర్తింపు నిరూపణ కొరకు

 1. పాఠశాలను వదిలి వెళ్ళిన ధృవపత్రం
 2. మెట్రిక్యులేషన్ ధృవపత్రం
 3. గుర్తింపు ఉన్న విద్యా సంస్థ నుండి పట్టభద్రుడు అయినట్లు ధ్రువపత్రం
 4. ఖతాలో జమ చేసినట్లు నివేదిక
 5. క్రెడిట్ కార్డు నివేదిక
 6. బ్యాంకు నివేదిక / బ్యాంకు పాస్ పుస్తకం
 7. నీటి బిల్లు
 8. రేషన్ కార్డు
 9. ఆస్తి పన్ను మదింపు తాఖీదు
 10. పాస్ పోర్టు
 11. ఓటరు గుర్తింపు కార్డు
 12. డ్రైవింగ్ లైసెన్సు
 13. గుర్తింపు ధ్రువపత్రం పై పార్లమెంట్ సభ్యుడు గాని, లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యుడు గాని లేక మున్సిపల్ కౌన్సిలర్ లేక గజిటెడ్ అధికారి సంతకం చేసి ఉన్నది.

చిరునామా నిరూపణ కొరకు

 1. కరెంట్ బిల్లు ( విద్యుత్ బిల్లు)
 2. టెలిఫోన్ బిల్లు
 3. జమ చేసే ఖాతా యొక్క నివేదిక
 4. క్రెడిట్ కార్డు నివేదిక
 5. బ్యాంకు నివేదిక / బ్యాంకు పాస్ పుస్తకం
 6. అద్దె రసీదు
 7. యజమాని యిచ్చే ధృవపత్రం
 8. పాస్ పోర్టు
 9. ఓటరు గుర్తింపు కార్డు
 10. ఆస్తి పన్ను మదింపు తాఖీదు
 11. డ్రైవింగ్ లైసెన్సు
 12. రేషన్ కార్డు
 13. పార్లమెంట్ సభ్యుడు గాని, అసెంబ్లీ సభ్యుడు గాని, మున్సిపల్ కౌన్సిలర్ గాని లేక గజిటెడ్ ఆఫీసర్ సంతకం చేసిన చిరునామా ధృవపత్రం

గమనిక : ధృవపత్రాలు, చిరునామాకు సంబంధించి నిరూపణ పత్రాలు అందజేసినవి క్రమ సంఖ్య 1 నుండి 7 వరకు దరఖాస్తు చేసుకున్న నాటికి ఆరునెలల లోపువై ఉండాలి.

పాన్ కార్డ్ రుసుము మరియు చెల్లింపు విధానం

 • PAN దరఖాస్తు ప్రక్రియకు 94 రూపాయల రుసుము( 85రూపాయలు 10.3 శాతం పన్ను)
 • డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా గాని, చెక్కుద్వారా గాని లేక క్రెడిట్ కార్డు ద్వారా గాని రుసుమును చెల్లించవచ్చు.
 • NSDN – PAN కోసమని డిమాండ్ డ్రాఫ్ట్ / చెక్కు పై వ్రాయాలి.
 • ముంబైలో డిమాండ్ డ్రాఫ్ట్ ను చెల్లించవచ్చు. పేరు మరియు అందినట్లు యిచ్చిన నంబరు, డిమాండ్ డ్రాఫ్ట్ వెనుకవైపు వ్రాయాలి.
 • చెక్కు ద్వారా చెల్లించే అభ్యర్ధులు ఒక ప్రాంతీయ చెక్కును ( ఏ బ్యాంకు నుంచైనా) దేశంలోని ఏ HDFC బ్యాంకు శాఖకైనా (దహేజ్ తప్ప) డిపాజిట్ చెయ్యవచ్చు. డిపాడిట్ పారం పై NSDN – PAN అని వ్రాయాలి.

ఆన్ లైన్ లో PAN కోసం దరఖాస్తు చేసుకునే ప్రక్రియ

 • PAN కోసం ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకొనుటను ప్రారంభించడానికి ముందు, మీకు దరఖాస్తు రుసుము ఆన్ లైన్ లో చెల్లించడానికి వీలుగా ఒక 94 రూపాయల విలువైన డి.డి. / చెక్కు, లేక క్రెడిట్ కార్డు ఉండాలి.
 • దీని మీద క్లిక్ చెయ్యండి. https://tin.tin.nsdl.com/pan/form49A.html
 • ముందుగా ఈ దిగువ పేర్కొన్న వాటి / వారి గురించి / సంబంధిత సమాచారాన్ని నింపండి వార్డు / సర్కిల్, రేంజ్, కమీషనర్, ఏరియా కోడ్ ఎ.ఒ. కోడ్, రేంజ్ కోడ్, మరియు ఎ.ఒ. నంబరు

ప్యాన్ కార్డు కొరకు చేసే దరఖాస్తు, మానవ ప్రయత్నంలో చేసే ప్రక్రియ

 • PAN దరఖాస్తు నంబరు 49ఎ ను డౌన్ లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చెయ్యండి.
 • నల్ల యింకు బాల్ పెన్నుతో దరఖాస్తు ఫారమ్ ను నింపండి. మీ రంగుల ఫోటో ను అతికించండి మరియు నిర్దేశిత బాక్స్ లో సంతకం చెయ్యండి.
 • ఫారమ్ 49ఎ ను నింపడానికి సూచనలు కొరకు ఇక్కడ క్లిక్ చెయ్యండి.
 • అవసరమైన అధికారిక ధృవ పత్రాలను జత చేసి, మరియు డి.డి. / చెక్కు రూపంలో రుసుము ను కూడ జత చెయ్యండి.
 • మీకు చేరువలో ఉన్న PAN సెంటర్ లో దరఖాస్తు ఫారమ్ ను అందజేయండి.
 • మీకు చేరువలో ఉన్న PAN దరఖాస్తు కేంద్రం గురించి తెలుసుకొనుటకు ఇక్కడ క్లిక్ చెయ్యండి.

PAN కార్డు కు సంబంధించిన ఆన్ లైన్ సేవలు

ఫారమ్ నంబరు - 49ఎ ను నింపడానికి తెలుసుకోవలసిన సూచనల గురించి యిక్కడ క్లిక్ చెయ్యండి.

PAN దరఖాస్తు ఫారమ్ నెంబరు - 49 ఎ ను డౌన్ లోడ్ చేసుకొనడానికి యిక్కడ క్లిక్ చెయ్యండి.

మీకు అతి దగ్గరలో ఉన్న PAN దరఖాస్తులు తీసుకునే కేంద్రం కొరకు తెలుసుకోవడానికి యిక్కడ క్లిక్ చెయ్యండి.

PAN కార్డు కొరకు ఆన్ లైన్ దరఖాస్తు

NSDL

Utitsl

మీ ప్యాన్ దరఖాస్తు స్థితిని (nsdl) పరిశీలించుటకు కొరకు యిక్కడ క్లిక్ చెయ్యండి.

మీ PAN దరఖాస్తు స్థితి (uti tsl) ని తెలుసుకొనుటకు యిక్కడ క్లిక్ చెయ్యండి.

 • ఈ సమాచారం ఆదాయ పన్ను కార్యాలయం నుండి పొందవచ్చు.
 • దీని తరువాత ఫారమ్ ను నింపండి.
 • ఫారమ్ లో, మీ కార్యాలయ చిరునామా ను తెలపాలి మీకు కార్యాలయ చిరునామా లేనిచో, ఈ పనికై మీ వేరే చిరునామా ను ఉపయోగించవచ్చు.
 • తరువాత ఫారమ్ ను దాఖలు చెయ్యండి.
 • మీరు వ్రాసిన సమాచారమంతా సరియైనదో కాదో పరిశీలించండి. సమాచారమంతా సరిగా ఎంటర్ చేసినట్లైతే, పేజీ లో క్రిందగా చూపబడిన కోడ్ ను ఎంటర్ చేసి కన్ ఫర్మ్ బటన్ ను నొక్కండి.
 • తరువాత ఎక్నాలెడ్జ్ మెంట్ నంబరు తో ఒకఫారమ్ కనబడుతుంది.
 • ఆ రసీదు నంబరు , మీ యొక్క ప్రత్యేకమైన PAN దరఖాస్తు కొరకు ఉద్దేశించిన సంఖ్య
 • దయచేసి మీ PAN దరఖాస్తు స్ధితిని గమనించడానికి ఈ నంబరు ను తెలియచెప్తూ ఉండండి.
 • ఈ రసీదు ను సేవ్ (పదిలపరచి) చేసి ప్రింట్ తీసుకోండి.
 • ఎక్నాలెడ్జ్ మెంట్ ఫారమ్ ను ముద్రించి తీసుకున్న తరువాత, మీ యొక్క ఇటివలి రంగుల ఫోటోను అతికించి సంతంకం చెయ్యండి ( దీని కొరకు ప్రత్యేకించి బాక్స్ లోనే, వేరేవి తాకకుండ సంతకం చెయ్యండి.
 • నల్ల యింకు బాల్ పెన్నును మాత్రమే సంతకం చేయుటకు ఉపయోగించండి.
 • గుర్తింపు నిరూపణ ధృవపత్రం యొక్క జిరాక్స్ ప్రతిని, చిరునామా ధృవపత్రాన్ని మరియు అప్లికేషన్ రుసుముగా 94 రూపాయల విలువైన డి.డి. ని జత చెయ్యండి.
 • మీ పేరు మరియు రసీదు నంబరు ను చెక్కు / డి.డి. వెనుక వైపు వ్రాయండి.
 • మీరు ప్యాన్ దరఖాస్తు రుసుమును, చెక్కు ద్వారా చెల్లిస్తున్నట్లయితే, ఆ చెక్కును మీ నగరంలోని hdfc బ్యాంకులో డిపాజిట్ చెయ్యండి.
 • ఎక్నాలెడ్జ్ మెంట్ ఫారమ్ ను nsdl కార్యాలయమునకు పంపించే ముందు ఈ పత్రాలు ఉన్నవో, లేవో సరి చూసుకోండి.
 • ఎక్నాలెడ్జ్ మెంట్ ఫారమ్ ( రసీదు పత్రం - రంగుల పోటోతో మరియు సంతకంతో)
 • గుర్తింపు ధృవపత్రం యొక్క జిరాక్స్ ప్రతి
 • చిరునామా నిరూపణ ధృవపత్రం యొక్క జిరాక్స్ ప్రతి
 • 94 రూపాయల విలువైన డిమాండ్ డ్రాఫ్ట్
 • ఎన్వలప్ ( కవర్) పై పెద్ద అక్షరాలతో ఈ విధంగా వ్రాయండి application for pan – acknowledgment number ( application for pan -881010100000097)
 • దరఖాస్తును ఇక్కడకు పంపించాలి - NSDL INCOME TAX PAN SERVICES, NATIONAL SECURITIES DEPOSITORY LIMITED, 3RD FLOOR,SAPPIRE CHAMBERS, NEAR BANER TELEPHONE EXCHANGE, BANER, PUNE – 411045 (MAHARASHTRA)
 • మీ ఎక్నాలెడ్జ్ మెంట్, డిమాండ్ డ్రాఫ్ట్, యింకా ఏవైనా మరియు ధృవపత్రాలు nsdl కు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకున్న తేదీ నుండి 15 రోజుల లోపల చేరుకోవాలి.
 • డిమాండ్ డ్రాఫ్ట్ లేక చెక్కు రూపంలో చెల్లింప బడే విధానంలో పంపించబడిన అప్లికేషన్ ఫారమ్ లు కావలసిన నిరూపణ మరియు చెల్లింపు జరిగిన తరువాత మాత్రమే కార్యాచరణ క్రమం మొదలౌతుంది.
 • మరికొంత సమాచారం కొరకు, TIN కాల్ సెంటర్ కు 020-27118080 కాల్ చెయ్యండి లేదా యి. మొయిల్ ను యిక్కడకు పంపండి.TININFO@NSDL.CO.IN MAILTO.TININFO@NSDL.CO.IN
 • SMS PAN < SPACE> ACKNOWLEDGEMENT NO. కు SMS చెయ్యండి. 53030 కు పంపించి దరఖాస్తు స్ధితి ని తెలుసుకోండి.

ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు

3.01412872841
బోయిరె ప్రకాష్ Jun 17, 2019 05:30 PM

వెలి ముద్ర వాళ్ళు ఎలా పాన్ కార్డు తీయాలి వివరాలు

కుమార్ బాబు. k May 15, 2017 11:55 AM

సార్,
పాన్ కార్డులో సంతకం చేయలేని వారు వేలి ముద్ర వేయ వచ్చా .దయ చేసి తెలుప గలరు

మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు