విదేశీ ప్రయాణ అనుమతి పత్రం (పాస్ పోర్ట్) కోసం ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేయండి
ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేయుట వలన కలుగు ప్రయోజనాలు
- ప్రాంతీయ పాస్ పోర్ట్ కార్యాలయం నందుకల పాస్ పోర్ట్ జారీచేయు అధికారికి అవసరమైన ధృవీకరణ పత్రాలు సమర్పించవలసిన ఖచ్చితమైన తేది, సమయం, చెల్లించవలసిన రుసుముతో దరఖాస్తుదారులు పొందగలరు.
- ఈ ప్రక్రియ వలన దరఖాస్తుదారులు పొడవైన క్యూలో వేచివుండవలసిన అవసరం వుండదు
పాస్ పోర్ట్ జారీకోసం ఆన్ లైన్ ద్వారా ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చును
- పాస్ పోర్ట్ పొందుటకు యోగ్యత కల్గిన ఏ వ్యక్తి అయినా ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేయుటకు యోగ్యులు.
- తాము నివసించు ప్రదేశాలు ఏఏ పాస్ పోర్ట్ కార్యాలయం పరిధిలోకి వస్తాయో ఆయా ప్రాంతాల వాసులు, ఆయా కార్యాయాలకు ఈ వెబ్ సైట్ నుంచి ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేయుటకు యోగ్యులు.
- ఆన్ లైన్ ద్వారా ప్రస్తుతం ఈ క్రింద పేర్కొన్న నగరాలలో మాత్రమే దరఖాస్తులు పొందు సౌకర్యం కలదు.
అహ్మదాబాద్
|
అమృత్ సర్
|
బెంగుళూరు
|
బరైలీ
|
భోపాల్
|
భువనేశ్వర్
|
చండిగడ్
|
చెన్నెయ్
|
కొచ్చిన్
|
కోయంబత్తూర్
|
డెహ్రడూన్
|
ఢిల్లి
|
ఘజియాబాద్
|
గోవా
|
గౌహతి
|
హైదరాబాద్
|
జైపూర్
|
జలంధర్
|
జమ్ము
|
కొల్ కత్తా
|
కోజికోడ్
|
లక్నో
|
మధురై
|
మలపురం
|
ముంబై
|
నాగపూర్
|
పాట్నా
|
పూణె
|
రాయపూర్
|
రాంచి
|
సిమ్లా
|
శ్రీనగర్
|
సూరత్
|
థాణె
|
తిరుచ్చి
|
త్రివేండ్రం
|
విశాఖపట్టణం
|
|
|
పాస్ పోర్ట్ కోసం ఆన్ లైన్ ద్వారా ఎప్పుడు దరఖాస్తు చేసుకోవచ్చును
- సరికొత్త పాస్ పోర్ట్ జారీకోసం ( మీరు ఇంతకు ముందు ఎన్నడూ పాస్ పోర్ట్ పొందివుండక పోయినట్లయితే)
- పాస్ పోర్ట్ మరల తిరిగి పొందుటకు ( మీరు ప్రస్తుతం కల్గివున్న పాస్ పోర్ట్ యొక్క 10 ఏళ్ళ కాలవ్యవధి తీరినచో లేదా మరో 12 నెలల్లో కాలవ్యవధి తీరిపోవునట్లయితే)
- పాస్ పోర్ట్ నకలు జారీ చేయుటకు (మీరు ప్రస్తుతం కల్గివున్న పాస్ పోర్ట్ పోగొట్టుకొని పోయినచో లేదా చెడిపోయినచో)
పాస్ పోర్ట్ పొందుటకు కావలసినవి
- నివాస ధృవీకరణ
- జనన ధృవీకరణ
- చెల్లించవలసిన రుసుము (నగదుగా కాని డి డి రూపేణ కాని)
- పాస్ పోర్ట్ సైజు కలరు ఫొటొ
ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేయు విధానము
- passport.gov.inఅనే వెబ్ సైట్ ద్వారా మీరు ఏ ఏ పాస్ పోర్ట్ కార్యాలయము పరిధిలోకి వచ్చెదరో ఆయా కార్యాలయం నందు మీ యొక్క దరఖాస్తును నమోదు చేసుకోవలెను.
- మీరు మీ దరఖాస్తును నమోదు చేసిన పిదప కంప్యూటర్ మిమ్ములను మీ దరఖాస్తు ఫారమ్ ను పొందుపరచవలసినదిగాను, భద్రపరచవలసినదిగానూ కోరుతుంది.
- మీరు మీ దరఖాస్తును పొందుపరచి, భద్రపరచిన పిదప మీ దరఖాస్తు యొక్క ముద్రిత పత్రాన్నితీసుకోగలరు.
- ఏ కారణం చేతనైన మీరు మీ దరఖాస్తు అచ్చుకాపీని పొందలేకపోయినచో మీరు మీ దరఖాస్తు యొక్క సంఖ్యను భద్రపరచుకోవాలి. మీరు భద్రపరచిన దరఖాస్తు సంఖ్య మరియు మీ పుట్టిన తేదీ సహాయంతో మీరు భవిష్యత్ లో అచ్చుకాపీని పొందవచ్చు.
- మీరు మీ దరఖాస్తును భద్రపరచుకొన్నచో మీరు అచ్చుకాపీని ఎప్పుడైనను పొందవచ్చు.
- మీరు ఆన్ లైన్ లో దరఖాస్తు పంపిననూ కొన్ని కాలమ్స్ లో (గడులలో ) మీరు మీచేతి వ్రాత ద్వారా నింపవలసిన అవసరం ఉంటుంది.
- మీరు పూర్తిగానింపిన దరఖాస్తుఫారమ్ ను నిర్ణీత రుసుములో అవసరమైన పత్రాలు(పుట్టిన్ తేది,ధృవీకరణ పత్రం వంటి వాటితో ) సహా మీకు కేటాయించిన తేదీ,సమయాలలో మీ యొక్క పాస్ పోర్ట్ కార్యాలయమునకు వెళ్లి సమర్పించాలి.
- కంప్యూటర్(సిస్టమ్)లోని ఆన్ లైన్ ద్వారా మీకు కేటాయించిన తేది, సమయాన్ని పాస్ పోర్ట్ కార్యాలయం అధికారులు మీకు తెలియబరుస్తారు.అంతేగాక మీరు పొందిన దరఖాస్తుఫారమ్ అచ్చు కాపీనందు మీకు కేటాయించిన తేదీ,సమయం పేర్కొనబడుతుంది.
- పాస్ పోర్ట్ కార్యాలయం పేర్కొన్న తేది,సమయాలలో మీరు పాస్ పోర్ట్ కార్యాలయమునకు వెళ్ళాలి. మీరు మీ యొక్క ప్రాంతీయ పాస్ పోర్ట్ కార్యాలయమునకు మీకు కేటాయించిన తేదీన, పేర్కొన్న కౌంటర్ నందు నిర్ణీత సమయమునకు పదిహేను నిమిషముల ముందుగానే హాజరు కావాలి.
- ఆన్ లైన్ దరఖాస్తుదారులు దరఖాస్తులు సమర్పించుటకు టోకెన్ నంబర్ తీసుకోవలసిన్ అవసరం లేదు. మీరు క్యూలైన్ యందు వేచి ఉండనక్కరలేదు.
పాస్ పోర్ట్ కు రుసుము
దరఖాస్తు ఫారంతో పాటే దరఖాస్తు రుసుము పాస్ పోర్ట్ అధికారికి చెల్లింపు జరిగేలా బ్యాంకు డి డి ద్వారా గాని, నగదు రూపేణ చెల్లించాలి. డి డి ద్వారా చెల్లించువారు తమ దరఖాస్తు సంఖ్యను తాము చెల్లించు డి డి వెనుక వైపు రాయాలి. మీరు ఏ బ్యాంకు నందు డి డి ని చెల్లింపు కోరుతున్నారో ఆ బ్యాంకు కోడ్ ను, డి డి సంఖ్యను, డి డి జారీచేసిన తేదిని పేర్కొనాలి. దరఖాస్తు ఫారంనందు గల సంబంధిత గడులలో మీరు చెల్లించిన రుసుము యొక్క వివరాలు పేర్కొనాలి.
వరుస సంఖ్య
|
వివరణ
|
రుసుము (రూపాయలలో)
|
1.
|
10 ఏళ్ళ కాల పరిమితి గల సరికొత్త పాస్ పోర్ట్ (36 పేజీలు గలది)కోసం ( 15 నుంచి 18 ఏళ్ళలోపు వయస్కులకు మైనర్ లతో కలిపి 10 ఏళ్ళ కాల పరిమితి గల సరికొత్త పాస్ పోర్ట్ కోరువారికి)
|
Rs 1,000/-
|
2.
|
10 ఏళ్ళ కాల పరిమితి గల సరికొత్త పాస్ పోర్ట్ (60 పేజీలు గలది)కోసం
|
Rs. 1,500/-
|
3.
|
5 ఏళ్ళ కాల పరిమితి గలిగి 18 ఏళ్ళలోపు వయస్కులకు సరికొత్త పాస్ పోర్ట్ కోసం లేదా మైనర్ లకు 18 ఏళ్ళు నిండువరకు ఏది ముందైతే అనే విధంగా
|
Rs 600/-
|
4.
|
పాస్ పోర్ట్ పోయిన, చెడిపోయిన, దొంగిలింపబడినచో (36 పేజీల) పాస్ పోర్ట్ నకలు కొరకు
|
Rs. 2500/-
|
5.
|
పాస్ పోర్ట్ పోయిన, చెడిపోయిన, దొంగిలింపబడినచో (60 పేజీల) పాస్ పోర్ట్ నకలు కొరకు
|
Rs. 3000/-
|
6.
|
పోలీసు క్లియరెన్సు ధృవీకరణ పత్రం/ ఇ సి ఎన్ ఆర్ / అదనపు అనుమతులు
|
Rs.300/-
|
7.
|
పాస్ పోర్ట్ లో పేరు, జనన తేది, జన్మ స్థలం, చిరునామా, భార్య లేక భర్త పేరు, తల్లి/ తండ్రి/ సంరక్షకుని పేరుల మార్పు కోసం
|
Rs.1000/- జారిచేయు కొత్త పాస్ పోర్ట్ నందు పొందుపరచబడును
|
తత్కాల్ కోటాలో పాస్ పోర్ట్ పొందుటకు రుసుము వివరములు
సాధారణంగా వసూలు చేయు పాస్ పోర్ట్ రుసుముతో పాటు తత్కాల్ రుసుము కూడా కలిపి నగదు రూపేణ లేదా డి డి రూపేణ గాని దరఖాస్తు దారులు సంబంధిత పాస్ పోర్ట్ కార్యాలయంనందు చెల్లించవలెను. తత్కాల్ కోటాలో పాస్ పోర్ట్ జారీచేయుటకు అదనంగా చెల్లించవలసిన రుసుము వివరములు.
సరికొత్త పాస్ పోర్ట్ కోసం
1.
|
దరఖాస్తు చేసిన 1 నుండి 7 రోజులలోపు
|
1500 రూపాయిలు + 1000 రూపాయిలు పాస్ పోర్ట్ రుసుము
|
2.
|
దరఖాస్తు చేసిన 7 నుండి 14 రోజులలోపు
|
1000 రూపాయిలు + 1000 రూపాయిలు పాస్ పోర్ట్ రుసుము
|
పాస్ పోర్ట్ పోయిన, చెడిపోయిన, దాని స్థానంలోకొత్త పాస్ పోర్ట్ కొరకు:
1.
|
దరఖాస్తు చేసిన 1 నుండి 7 రోజులలోపు
|
2500 రూపాయిలు + 2500 రూపాయిలు పాస్ పోర్ట్ నకలు రుసుము
|
2.
|
దరఖాస్తు చేసిన 7 నుండి 14 రోజులలోపు
|
1500 రూపాయిలు + 2500 రూపాయిలు పాస్ పోర్ట్ నకలు రుసుము
|
10 ఏళ్ళ కాల పరిమితి మించిపోయినచో కొత్త పాస్ పోర్ట్ జారీకోసం
1.
|
దరఖాస్తు చేసిన తేది నుండి 3 పని దినముల లోపు
|
1500 రూపాయిలు + 1000 రూపాయిలు పాస్ పోర్ట్ రుసుము
|
పాస్ పోర్ట్ ఆన్ లైన్ దరఖాస్తు కోసం పై క్లిక్ చేయండి
పాస్ పోర్ట్ కొరకు కావలసిన పత్రాలు
- సరికొత్త పాస్ పోర్ట్ పొందగోరువారు ఈ క్రింద పేర్కొన్న పత్రాల 2 కాపీలను జతచేయాలి.
- నివాసం రుజువు కోసం ఈ క్రింది పేర్కొన్న వాటిలో ఏదేని ఒక దానిని జతచేయాలి. దరఖాస్తుదారుని రేషన్ కార్డ్
- అభ్యర్థి పని చేయుచున్న ప్రసిద్ది చెందిన కంపెని లెటర్ హెడ్ పై దాని యజమాని జారీచేసిన ధృవీకరణ పత్రం
- నీరు / టెలిఫోన్ / విధ్యుత్ బిల్లు
- దరఖాస్తుదారు బ్యాంకు అకౌంట్ స్టేట్ మెంట్
- ఆదాయపన్ను మదింపు ఉత్తర్వు
- ఎన్నికల కమీషన్ గుర్తింపు కార్డ్
- గ్యాస్ కనెక్షన్ బిల్లు
- భార్య లేక భర్త పాస్ పోర్ట్ కాపి
- మైనర్ లు అయినచో దరఖాస్తుదారు తల్లి / తండ్రి పాస్ పోర్ట్ కాపి
గమనిక: ఎవరైన దరఖాస్తుదారు తన రేషన్ కార్డ్ ను మాత్రమే నివాస ధృవీకరణగా సమర్పించినచో దానితోబాటు పైన పేర్కొన్న వాటిలో ఏ ఒక్కటైనా అదనంగా జత చేయవలెను.
- పుట్టినతేది ధృవీకరణ కోసం ఈ క్రింది పేర్కొన్న వాటిలో ఏదేని ఒక దానిని జతచేయాలి
- మున్సిపల్ అధికారి లేదా జనన, మరణ నమోదు చేసే జిల్లా రిజిస్ట్రార్ జారీచేసిన పుట్టినతేది ధృవీకరణ పత్రం
- దరఖాస్తుదారు తాను ఆఖరిగా విద్యాభ్యాసం చేసిన పాఠశాల జారీచేసిన పుట్టినతేది ధృవీకరణ పత్రం గాని లేదా ప్రభుత్వగుర్తింపు పొందిన విద్యాసంస్థ జారీచేసిన పుట్టినతేది ధృవీకరణ పత్రం లేదా అనుబంధం ‘ ఎ ‘ లో పేర్కొనిన నమూన పత్రం లో సూచించినట్లు నిరక్షరాస్యులు, చదవడం మాత్రమే తెల్సిన దరఖాస్తుదారులు తాము మేజిస్ట్రీట్ / నోటరీ ముందు పైన పేర్కొన్న అధికారులలో ఎవరో ఒకరు జారీచేసిన ప్రమాణపత్రం.
గమనిక: 26. 01. 89 వ తేదీన గాని ఆ తర్వాత గాని జన్మించిన దరఖాస్తుదారులు మున్సిపల్ అధికారి లేదా జనన, మరణ నమోదు చేసే జిల్లా రిజిస్ట్రార్ జారీచేసిన పుట్టినతేది ధృవీకరణ పత్రాలను మాత్రమే పాస్ పోర్ట్ జారీకోసం సమర్పించాలి. వీటిని మాత్రమే పాస్ పోర్ట్ అధికారులు ఆమోదిస్తారు.
మైనర్ కి పాస్ పోర్ట్ కోసం దరఖాస్తు చేస్తున్నప్పుడు సమర్పించవలసిన ధృవపత్రాలు
- అనుబంధం – హెచ్ మైనర్ యొక్క తల్లిదండ్రులు ఇద్దరు తాము చేసిన దరఖాస్తు లోని వివరాలు అన్ని ఖచ్చితమైనవని ప్రకటించే పత్రం.
- అనుబంధం – సి మైనర్ యొక్క తల్లిదండ్రులు ఇద్దరులో ఒకరు చట్టబద్దంగా విడాకులు పొందకుండా విడిగా జీవిస్తున్న సందర్బములో వివాహ ఫలితముగా పుట్టిన బిడ్డ యొక్క సింగిల్ పేరెంట్ తాము చేసిన దరఖాస్తు లోని వివరాలు అన్ని ఖచ్చితమైనవని ప్రకటించే పత్రం.
- అనుబంధం – జి మైనర్ యొక్క సింగిల్ పేరెంట్ లేదా సంరక్షకుడు దాఖలు చేసిన దరఖాస్తు
- అనుబంధం – ఐ మైనర్ 15-18 ఏళ్ళ లోపు వయస్సువుండి, 10 ఏళ్ళ వ్యవధికల పాస్ పోర్ట్ కోసం దరఖాస్తుచేసినచో లేదా తల్లిదండ్రులు ఇద్దరికి పాస్ పోర్ట్ లేనప్పుడు పై ఏరకమైన దరఖాస్తు చేయడానికైనా కావలసిన పత్రాలు
- అటెస్ట్ చేయబడిన తల్లిదండ్రులిద్దరి పాస్ పోర్ట్ ఫోటో కాపీలు
- తల్లిదండ్రులిద్దరి అసలు ( ఒరిజినల్ ) పాస్ పోర్ట్ లు తనిఖి నిమిత్తము
- తల్లిదండ్రుల్లో ఒకరు విదేశంలో నివసిస్తున్నట్లయితే, వారు ఆ దేశం భారతీయ మిషన్ ధృవీకరణ పత్రం తో పాటు భారతదేశంలో నివసిస్తున్నవారి యొక్క ప్రమాణపత్రం కూడా జతచేసి సమర్పించాలి
తత్కాల్ పథకం కింద పాస్ పోర్ట్ పొందడం ఎలా?
- అనుబంధం – హెచ్ మరియు అనుబంధం – ఐ లో పేర్కొన్న నిర్దిష్ట ప్రమాణ పత్రం నమూన ప్రకారం నిర్థారణ నిమిత్తం తత్కాల్ రుసుముతో పాటు పూర్తిగా నింపిన దరఖాస్తు ఫారంను సమర్పించాలి.
- దరఖాస్తుదారు సమర్పించిన పత్రాన్ని జారీచేసిన తనిఖి పత్రం అధికారి యొక్క అధికారాన్ని వ్రాత పూర్వకంగా నిర్ధారణ చేసుకొనుటకు పాస్ పోర్టు జారీచేయుటకు అధికారికి పూర్తి అధికారం కలదు.
- పాస్ పోర్ట్ సత్వర జారీకోసం ఎటువంటి నిరూపణ పత్రం అవసరం లేదు.
- తత్కాల్ పథకం కింద జారీచేయబడిన అన్ని పాస్ పోర్ట్ లకు పోలీసు సరినిరూపణ తర్వాత జరుపబడును.
- తత్కాల్ పథకం కింద దరఖాస్తుదారు పాస్ పోర్ట్ పొందుటకు సమర్పించవలసిన 3 పత్రాలలో ఈ కింద పేర్కొన్న జాబితాలోని తన కిష్టమైన ఏ మూడింటినైనా సమర్పించవచ్చు. అయితే ఆ మూడింటిలో ఫోటో గుర్తింపు కార్డు తప్పనిసరి. దీనితో పాటు అనుబంధం – ఐ లో పేర్కొన్న ప్రమాణపత్రం సమర్పించాలి. ఆ పత్రం న్యాయికేతర (non judicial) స్టాంపు కాగితంపై న్యాయపత్ర ప్రమాణ లేఖరి (నోటరి) చేత అటెస్ట్ చేయబడి ఉండాలి.
- ఈ కింద పేర్కొన్న జాబితాలోని ఏ మూడింటినైనా పాస్ పోర్ట్ కొరకు సమర్పించాలి:
- ఎన్నికల కమీషన్ ఫోటో గుర్తింపు కార్డ్ (EPIC)
- రాష్ట్ర / కేంద్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ ఆధీన సంస్థలు, స్థానిక సంస్థలు, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు జారీచేసిన గుర్తింపు కార్డులు స. ఎస్ సి/ ఎస్ టి / ఒ బి సి ధృవీకరణ పత్రాలు. స్వాతంత్య్ర సమర యోధుని గుర్తింపు కార్డ్
- ఆయుధాల అనుమతి పట్టా (Arms licenses)
- ఆస్తి పత్రాలు అనగా పట్టాలు, నమోదైన దస్తావేజులు (Registered deeds) మొదలైనవి.
- రేషన్ కార్డ్ ( దిన వెచ్చం పత్రం)
- పింఛను పత్రాలు అనగా మాజీ సైనికుల పింఛను పుస్తకం / పింఛను చెల్లింపు ఆదేశాలు / మాజీ సైనికుల వితంతు పింఛను / దృవపత్రములు / వృద్థాప్య పింఛను ఆదేశాలు / వితంతు పింఛను ఆదేశాలు
- రైల్వే గుర్తింపు కార్డులు
- ఆదాయపన్ను గుర్తింపు కార్డులు (PAN CARD)
- బ్యాంక్ / కిసాన్ / తపాలా కార్యాలయ పాస్ పుస్తకాలు , గుర్తింపు పొందిన విద్యా సంస్థలు జారీ చేసిన విద్యార్థి గుర్తింపు కార్డులు
- డ్రైవింగ్ లైసెన్స్
- ఆర్ బి డి (Registrar of Births and Deaths) చట్టం కింద జనన ధృవీకరణ పత్రాలు
- గ్యాస్ కనెక్షన్ బిల్లు
పాస్ పోర్ట్ కోసం ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేయడం ఎలా?
- నిర్ణీత దరఖాస్తు ఫారం మరియు అందలి అంశాలను డౌన్ లోడ్ చేసుకొని నింపండి.
- పూర్తిగా నింపిన దరఖాస్తును నిర్ణీత రుసుమును అవసరమైన గుర్తింపు పత్రాలతో
దరఖాస్తును క్రమముగా ఒక మెట్టు తర్వాతి మెట్టు నింపడానికి
పాస్ పోర్ట్ కొరకు దరఖాస్తు చేయుటకు ఉపయోగపడే పత్రాల జాబితా
దరఖాస్తు పత్రం సంఖ్య-1
ఈ పారంను సరికొత్త/పోయిన/చెడిపోయిన పాస్ పోర్ట్ లకు మారుగా మరల కొత్త పాస్ పోర్ట్ ల జారీ కోసం / పేరు మార్పు కోసం /కొత్తపేజీలు పొందుపరచుటకు ,కొన్ని పేజీలు అయిపోవుటవలన, ఎపియరెన్స్ ల కొరకు ఉపయోగిస్తారు. దీనినే మైనర్ల కోసం కూడ ఉపయోగిస్తారు.
దరఖాస్తు పత్రం సంఖ్య-2
పోలీస్ అనుమతి ధృవీకరణపత్రం ఈ దరఖాస్తుపత్రాన్ని ఉపయోగిస్తారు. ఇ. సి. ఆర్ ముద్ర (Emigration Check Required(ECR) stamp) తొలగించుటకు / భార్య లేక భర్త పేరు చేర్చుటకు / నివాస చిరునామా మార్పునకు ఉపయోగిస్తారు. స్వల్ప కాలవ్యవధిగల పాస్ పోర్ట్ లను పూర్తి కాలవ్యవధిగల పాస్ పోర్ట్ గా మార్పు చేయుటకు ఉపయోగిస్తారు.
వ్యక్తిగత వివరాల నమూనా పత్రం( పి.పి పత్రం):
పోలీసు సరినిరూపణ నివేదిక కోసం ఉపయోగిస్తారు. ఈ పత్రం దరఖాస్తు నమూనా పత్రం – 1 లోని అంతర్భాగమే. పాస్ పోర్ట్ కార్యాలయం వారు తిరిగి మరల నిర్థారణ నిమిత్తం కోరినచో దీనిని పూర్తిచేసి సమర్పించాలి. దరఖాస్తుదారు పాస్ పోర్ట్ కొరకు దరఖాస్తు చేసిన ఒక సంవత్సరంలో ఒకటి కన్నా ఎక్కువ చిరునామాలలో నివసించినట్లయితే , ప్రతి చిరునామాకు ఒక వ్యక్తిగత వివరాల నమూనా పత్రం ( పి.పి పత్రం) ను పూర్తి చేసి సమర్పించాలి.
ప్రమాణపత్రం నిర్ధిష్ట నమూనా
అనుబంధం – ఎ: నిరక్షరాస్యులైన దరఖాస్తుదారులు తమ జనన ధృవీకరణ కోసం సమర్పించవలసిన పత్రం
అనుబంధం – బి: గుర్తింపు ధృవీకరణ పత్రం
అనుబంధం – సి: మైనర్ల కోసం తల్లిదండ్రులలో ఏ ఒక్కరో (చట్టబద్ధంగా విడాకులు పొందకుండా విడిగా జీవిస్తున్నవారు) సమర్పించవలసిన పత్రం
అనుబంధం – డి: వివాహము తర్వాత పేరు మార్పు కోసం స్త్రీ దరఖాస్తుదారు సమర్పించవలసిన పత్రం
అనుబంధం – ఇ: పేరు మార్పు / దస్తావేజుల జాబితా / వాంగ్మూలంతో మారిన ప్రమాణ పత్రం
అనుబంధం – ఎఫ్: తత్కాల్ పాస్ పోర్ట్ కొరకు తనిఖీ కోసం సమర్పించవలసిన పత్రం
అనుబంధం – జి: మైనర్ల పాస్ పోర్ట్ కోసం తల్లిదండ్రులు / సంరక్షకుడు సమర్పించవలసిన పత్రం (తల్లిదండ్రులలో ఒకరు అంగీకారం తెలుపనట్లయితే)
అనుబంధం – హెచ్: మైనర్ల పాస్ పోర్ట్ కోసం తల్లిదండ్రులు / సంరక్షకుడు సమర్పించవలసిన పత్రం
అనుబంధం – ఐ: నిర్ధిష్టమైన ప్రమాణపత్రం
అనుబంధం – జె: నమూనా తనిఖీ పత్రం
అధికారిక పత్రం
పాస్ పోర్ట్ దరఖాస్తు కోసం మరిన్ని వివరాలు తెలుసుకొనుటకు http://passport.gov.in/ ను దయచేసి సందర్శించండి.