హోమ్ / ఇ-పాలన / విఎల్ఇల కొరకు వనరులు / వి.యల్.ఇ లకు ఉపయోగపడు ఐ.టి. సమాచారం
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

వి.యల్.ఇ లకు ఉపయోగపడు ఐ.టి. సమాచారం

వి.యల్.ఇ లకు వివిధ రకాలుగా ఉపయోగపడే ఐ.టి. సమాచారం ఈ పేజి లో అందుబాటులో ఉంటుంది.

వృత్తిపరమైన నాణ్యత కలిగిన ఆన్‌లైన్ వీడియోను అమలు చేయడం

వెబ్‌లో వీడియో ఉపశీర్షికల విధానం అనేది గణనీయంగా మెరుపరచబడుతోంది, ఇది వృత్తిపరమైన నాణ్యత కలిగిన ఆన్‌లైన్ వీడియో నిర్వహణ మరియు ప్లేబ్యాక్‌ను అమలు చేయడం కోసం మరో కీలకమైన భవన బ్లాక్‌ను ఆ స్థానంలో ఉంచబోతోంది. టెలివిజన్ ప్రసార అనుభూతిని సాధించడానికి, పదాన్ని హైలైట్ చేయడం, ఉపశీర్షికలు మరియు పలికిన పదం మధ్య బలమైన సమకాలీకరణ, సరళమైన ఉపశీర్షిక స్థానబద్ధీకరణ, ఉపశీర్షిక శైలి మరియు ఉపశీర్షిక యానిమేషన్‌లతో సహా ఉపశీర్షిక సామర్థ్యాలను వెబ్ అందించాలి – ఇవన్నీ డబ్ల్యు3సి టైమ్డ్ టెక్స్ట్ వర్కింగ్ గ్రూప్ (టిటిడబ్ల్యుజి) నుండి ఇటీవల ప్రచురించబడిన ప్రత్యేక లక్షణాల పరిచ్ఛేదికలో భాగం. Microsoft (మైక్రోసాఫ్ట్) అంతర్‌నిర్వహణ మరియు ప్రసరణ సంవృత ఉపశీర్షిక రూపకల్పన మరియు నిర్వహణకు హామీ ఇవ్వడం కోసం ప్రత్యేక లక్షణాలను అభివృద్ధిపరచడానికి విషయ యజమానులు, వీడియో పంపిణీదారులు మరియు పరికర ప్రదాతలతో కలుస్తోంది.

ఉపశీర్షిక విధానంఉపశీర్షిక విధానం అనేది వృత్తిపరమైన నాణ్యత కలిగిన ఆన్‌లైన్ వీడియో అనుభవంలో ప్రాథమిక అంశం మరియు దీని ప్రభావం వలన వినికిడి శక్తి లేని వారు వీడియో విషయానికి పూర్తి ప్రాప్తిని పొందడానికి అనుమతించబడతారు. ఉపశీర్షికలు అనేవి బిగ్గర అరుపులు ఉండే పరిసరాల్లో ప్రారంభించబడతాయి. ఉపశీర్షిక విధానం విదేశీ భాష చలనచిత్రాలను అర్థం చేసుకోవడంలో సహాయపడటానికి ఉపయోగించబడుతుంది.

Microsoft (మైక్రోసాఫ్ట్) సంవృత శీర్షికల (ఎస్‌డిపి-యుఎస్) ప్రొఫైల్ ప్రత్యేక లక్షణం కోసం టిటిఎమ్ఎల్ సరళమైన నిర్వహణ ప్రొఫైల్‌ను అందించడానికి డబ్ల్యు3సి టైమ్డ్ టెక్స్ట్ వర్కింగ్ గ్రూప్‌లో (టిటిడబ్ల్యుజి) సంస్థ వాటాదారులతో కలిసింది. ఈ కొత్త ప్రొఫైల్ డిఈసిఈ, ఎస్ఎమ్‌పిటిఈ, ఈబియులోని ప్రసార మాధ్యమ పరిశ్రమలోని నిపుణులు మరియు Adobe (అడోబ్), MovieLabs (మూవీల్యాబ్స్), NBC Universal (ఎన్‌బిసి యూనివర్సల్), Cox(కాక్స్), Apple (యాపిల్), Netflix (నెట్‌ఫ్లిక్స్) మరియు Microsoft (మైక్రోసా‌ఫ్ట్)తో సహా పరిశ్రమ ప్లేయర్ల ఇన్‌పుట్‌తో రూపొందించబడింది.
ఎస్‌డిపి-యుఎస్ అనేది టైమ్డ్ టెక్స్ట్ మార్కప్ ల్యాంగ్వేజ్ (టిటిఎమ్ఎల్) ఆధారంగా ఉంటుంది, ఇధి ఉపశీర్షిక అంతరమార్పు ప్రత్యేక లక్షణం కోసం వృత్తిపరమైన వీడియో పరిశ్రమలో సంవత్సరాలుగా ఉపయోగించబడుతోంది మరియు లేఅవుట్, శైలి, కాలక్రమం మరియు విషయ అవసరాలు వంటి కీలక ఉపశీర్షిక ఆకృతి లక్షణాలను స్పష్టంగా నిర్వచిస్తుంది, దీనివల్ల విషయ రచయితలు మరియు ఉపకరణ ప్రదాతలు పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా ఉండే అంతర్‌నిర్వహణ ఉపశీర్షిక ఫైల్‌లను సులభంగా సృష్టించగలరు. బ్రౌజర్‌లో, పరికరాలలో లేదా Microsoft (మైక్రోసాఫ్ట్) మీడియా ప్లేయర్ ఫ్రేమ్‌వర్క్‌ను ఉపయోగించి రూపొందించిన అప్లికేషన్‌ల వంటి విభిన్న రకాల సాఫ్ట్‌వేర్ మరియు పరికరాల అంతటా వెబ్‌కు ప్రసార మాధ్యమ విషయాన్ని అందించేందుకు సంవృత శీర్షికల ప్రసరణ సృష్టికి ఎస్‌డిపి-యుఎస్ సహాయపడుతుంది..

ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ అనేది హెచ్‌టిఎమ్ఎల్5-ఆధారిత వీడియో ఉపశీర్షికలకు టిటిఎమ్ఎల్ మరియు వెబ్‌విటిటి ఫైల్ ఆకృతులతో <ట్రాక్> మూలకం ద్వారా పూర్వ మద్దతు కలిగిన మొదటి బ్రౌజర్‌లలో ఒకటి. విషయ రచయితలకు ఇంటర్నెట్ అనుసంధానిత పరికరాల్లో బ్రౌజర్‌లు మరియు ఇతర సాఫ్ట్‌వేర్ కోసం అభివృద్ధి చెందుతున్న అవసరాలకు అనుగణంగా అంతర్గతంగా నిర్వహించగల, సరళమైన మరియు పూర్తి లక్షణాలు కలిగిన ఉపశీర్షిక సోల్యూషన్ కావాలి. ఎస్‌డిపి-యుఎస్ హెచ్‌టిఎమ్ఎల్5 <ట్రాక్> మూలకం కోసం ప్రసరణ కలిగిన ఉపశీర్షిక సామర్థ్యాల సమితిని నిర్వచించడం ద్వారా ఈ అవసరాన్ని నెరవేర్చుతుంది. డెవలపర్‌లు వీడియో డైలాగ్ లేదా చర్యల యొక్క శైలీకృత వచన సూచనను కలిగిన ఉపశీర్షిక ఫైల్‌ను అందించడం ద్వారా మరియు ఫైల్ విషయాలను అమలు చేయడానికి మరియు ప్రదర్శించడానికి <ట్రాక్> మూలకం ఉపయోగించడం ద్వారా హెచ్‌టిఎమ్ఎల్5 వీడియోకు ఉపశీర్షికలను జోడించగలుగుతారు.

ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ ఉపశీర్షికలను డిఫాల్ట్ సాధారణ వచన శైలి మరియు స్థానంతో అమలు చేస్తుంది

ఎస్‌డిపి-యుఎస్‌తో, ఉపశీర్షిక రచయితలు ఉపశీర్షిక స్థానబద్ధీకరణ మరియు శైలికి సంబంధించి మరింత ఎక్కువ సౌలభ్యాన్ని పొందుతారు.

వృత్తిపరమైన నాణ్యత కలిగిన ఆన్‌లైన్ వీడియో అనేది రాబోవు వాస్తవికత, ఇది అభివృద్ధి చెందుతున్న వెబ్ ప్రత్యేక లక్షణాలను మరియు శక్తివంతమైన విషయ పంపిణీ అవస్థాపనను కలిగి ఉంటుంది. ఉపశీర్షిక విధానం వృత్తిపరమైన నాణ్యత కలిగిన వీడియోను అమలు చేయడం కోసం ముఖ్యమైన భవన బ్లాక్ మరియు Microsoft (మైక్రోసాఫ్ట్) ఉత్తమ ఉపశీర్షిక అనుభూతులను అందించడం కోసం పరిశ్రమ భాగస్వాములతో కలిసి క్రియాశీలంగా కృషి చేస్తోంది.

ఆధారము: భాష ఇండియా

ఎన్ఎఫ్‌సితో అధునాతన అప్లికేషన్‌ను అభివృద్ధి చేయడం

సమీప ఫీల్డ్ కమ్యూనికేషన్ (ఎన్ఎఫ్‌సి) అనేది అభివృద్ధి చెందుతోన్న సంక్షిప్త పరిధిలో గల తీగరహిత సాంకేతికత. ఖచ్చితంగా 2 సెం.మీ పరిధిగల వాటిలో, వ్యక్తులు విషయం పంపడానికి/స్వీకరించడానికి పరికరాలను ట్యాప్ చేయవచ్చు.

Nokia 360 speaker sharing its Bluetooth pairing information with a Windows Phone

ఎన్ఎఫ్‌సి అనేది ప్రామాణిక తీగరహిత సాంకేతికత ప్రోటోకాల్. వినియోగదారు PC (పిసి)కి ఎన్ఎఫ్‌సి రేడియో అవసరం. అనేక Windows 8 PCలలో (విండోస్ 8 పిసి) ఎన్ఎఫ్‌సి రేడియోలు నేరుగా వాటిలో సమగ్రపరచబడి ఉంటాయి.

ఎన్ఎఫ్‌సి కొన్ని చక్కని సామర్థ్యాలను అందిస్తుంది. వ్యక్తులు ట్యాప్ చేసి, ఫోటోలు పంపవచ్చు లేదా ట్యాప్ చేసి బ్లూటూత్ పరికరాన్ని కూడా జతపరచవచ్చు. పరికరాలను అనుసంధానించడాన్ని నిజంగా స్పష్టమైన అనుభవంగా చేయడానికి ఎన్ఎఫ్‌సి వివిధ పరికరాలలో ఉపయోగించబడుతుంది, PCలు (పిసిలు), ఫోన్లు, స్పీకర్లు, హెడ్‌సెట్‌లు, తీగరహిత డిస్‌ప్లేలు, మొ... వంటివి. ఎన్ఎఫ్‌సి ఆర్ఎఫ్ఐడి ట్యాగ్‌లను ఉపయోగిస్తుంది; ఇవి నిజంగా చౌకైన, పరిమాణం మేరకు డేటా మొత్తాన్ని ఉంచుకోగల తక్కువ బరువు ఉండే క్రియారహిత యాంటెన్నాలు మరియు వాస్తవికంగా దేనిలో అయినా సరిపోయేవి, సర్వసాధారణంగా పోస్టర్లు.

’ట్యాప్’ను నిర్వచించడం
ఒకే విధానంలో పరికరాలను ట్యాప్ చేయడం అనేది వినియోగదారులకు చాలా ముఖ్యం. మరో పరికరంలో వలె కాకుండా వేరే విధంగా PCని ట్యాప్ చేయడం అనేది చాలామంది వ్యక్తులకు కొత్తగా ఉంటుంది.వినియోగదారులు పరికరాలను ‘ట్యాప్ చేసి, పని చేయి’ దృశ్యమాన గుర్తు అని కూడా పిలువబడే టచ్‌మార్క్ ఉపయోగించడం ద్వారా ట్యాప్ చేయవచ్చు, ఇది ఎన్ఎఫ్‌సి యాంటెన్నా ఎక్కడ ఉందో సూచిస్తుంది. PC (పిసి) నమూనా ఆధారంగా, వినియోగదారు PC (పిసి)లోని విభిన్న భాగాలను ట్యాప్ చేయవచ్చు.

Tap and Do visual mark

ట్యాప్ సమయంలో పరికరాలు ఒక పరిధిలో ఉన్నప్పుడు మరియు పరస్పరం కమ్యూనికేట్ చేసుకుంటున్నప్పుడు Windows (విండోస్) స్వయచాలకంగా ధ్వనిని ప్లే చేస్తుంది.

ఎన్ఎఫ్‌సి ఉపయోగించడం
వినియోగదారు దేన్నైనా ఎంచుకోవడానికి ఎన్ఎఫ్‌సి ఉపయోగించాల్సినప్పుడు ఎన్ఎఫ్‌సి ఎంచుకోవడానికి మాన్యువల్ శోధన కంటే వేగవంతమైన సులభమైన విధానాన్ని అందిస్తుంది. ట్యాప్ అనేది ఒక విధానాన్ని ప్రారంభించడానికి ట్రిగ్గర్ మరియు అప్లికేషన్ ఆధారంగా, విధానం పరిధి ఫోటోను స్వీకరించడం మొదలుకొని ప్లేజాబితాను ప్రారంభించడం వరకు ఉంటుంది. ట్యాప్ తర్వాత జరగవలసిన దాన్ని నిర్ణయించే బాధ్యత వినియోగదారు అప్లికేషన్‌ది. ఎన్ఎఫ్‌సి అనేక రోజువారీ విధులను తుది-వినియోగదారుల కోసం సులభం చేసింది. ఎన్‌ఎఫ్‌సి ఏపిఐ ఒకేదాన్ని సాధించడానికి అనేక మార్గాలను అనుమతిస్తుంది..

ఎన్ఎఫ్‌సి ఏపిఐలు Windows.Networking.Proximity namespaceలో (విండోస్.నెట్‌వర్కింగ్.ప్రాక్స్‌మిటీ నేమ్‌స్పేస్‌లో) ఉంటాయి. ముందుగా, అప్లికేషన్ సామీప్య అంశాన్ని ప్రారంభిస్తుంది, ఇది ట్యాగ్ పరిధి లోపల/వెలుపల ఉన్నప్పుడు చెప్పడానికి ఉపయోగించబడుతుంది. తదుపరి, DeviceArrival (పరికర చేర్పు) ఈవెంట్ హ్యాండ్లర్ జోడించబడుతుంది. హ్యాండ్లర్ ట్యాగ్ ట్యాప్ చేయబడినప్పుడు గుర్తిస్తుంది, వినియోగదారు ట్యాగ్‌కు సమాచారం వ్రాయడం ప్రారంభించవచ్చని దీని అర్థం.

తదుపరి, వినియోగదారు ట్యాగ్‌కు సమాచారాన్ని ప్రచురించవచ్చు. అప్లికేషన్ రెండు విషయాలను ప్రచురిస్తుంది: అప్లికేషన్ ఐడి మరియు అప్లికేషన్ ప్లాట్‌ఫారమ్‌ను కలిగి ఉండే అప్లికేషన్ ఐడెంటిఫైయర్ స్ట్రింగ్ మరియు ఆర్గ్యుమెంట్‌లను లాంచ్ చేస్తుంది. Windows 8 (విండోస్ 8) కోసం, అప్లికేషన్ ఐడి <package family name>!<app Id> (<ప్యాకేజీ కుటుంబ పేరు>!<అప్లికేషన్ ఐడి>) మరియు అప్లికేషన్ ప్లాట్‌ఫారమ్ ‘Windows’ ('విండోస్'). వినియోగదారు అప్లికేషన్ కోసం ప్యాకేజీ మానిఫెస్ట్‌లో అప్లికేషన్ మూలకం యొక్క ఐడి లక్షణం నుండి అప్లికేషన్ ఐఢి విలువను తప్పనిసరిగా కాపీ చేయాలి.
అప్లికేషన్ ప్లాట్‌ఫారమ్‌ల్లో పనిచేస్తే, Windows (విండోస్) ప్రత్యామ్నాయ అప్లికేషన్ ఐడి(లు) మరియు అప్లికేషన్ ప్లాట్‌ఫారమ్(లు) ప్రచురించడానికి వినియోగదారును అనుమతిస్తుంది.

అప్లికేషన్ publishBinaryMessage (పబ్లిష్‌బైనరీమెసేజ్) అని పిలువబడే పద్ధతిని ఉపయోగించి డేటాను ట్యాగ్‌కు ప్రచురిస్తుంది. పద్ధతిలో మూడు పరామితులకు ప్రాధాన్యత ఉంటుంది – సందేశ రకం, సందేశం మరియు సందేశ TransmittedHandler (పరివర్తన హ్యాండ్లర్) ఫంక్షన్. వినియోగదారు సందేశ రకాన్ని ‘LaunchApp:WriteTag’కి (‘లాంచ్‌యాప్:వ్రైట్ ట్యాగ్’కి) సెట్ చేయాలి, ఇది వినియోగదారుల అప్లికేషన్ ఒక ఎన్ఎఫ్‌సి ట్యాగ్‌కు సమాచారం వ్రాయాలనుకుంటోందని Windows (విండోస్)కు తెలియజేస్తుంది. వినియోగదారు సందేశాన్ని బఫర్‌లో బైనరీ సందేశంగా నిల్వ చేయాలి. సందేశTransmittedHandler (పరివర్తన హ్యాండ్లర్) ఫంక్షన్ కాల్‌బ్యాక్‌ల కోసం రిజిస్టర్ చేయబడుతుంది. ఇది సందేశం ట్యాగ్‌కు విజయవంతంగా వ్రాయబడిందని వినియోగదారు అప్లికేషన్‌కు తెలియజేస్తుంది.
వినియోగదారు StopPublishingMessage (స్టాప్‌పబ్లిషింగ్‌మెసేజ్) ఫంక్షన్‌ను కాల్ చేసే వరకు లేదా ProximityDevice (సామీప్యపరికరం) అంశం విడుదల చేయబడే వరకు సందేశాలు ప్రచురించడానికి కొనసాగుతాయి.

దోష నిర్వహణ
అప్లికేషన్ కలిగి ఉండే కొన్ని సాధారణ దోషాలు
• ట్యాప్ చేసిన ట్యాగ్ ఎన్‌డిఈఎఫ్ ఆకృతీలోనిది కాదు. Windows 8 (విండోస్ 8) ట్యాగ్‌ను స్వయంచాలకంగా ఎన్‌డిఈఎఫ్‌కు పునఃఆకృతీకరించడానికి మద్దతివ్వదు, కాబట్టి వినియోగదారులు ఎన్‌డిఈఎఫ్ ఫార్మెటర్‌ను డౌన్‌లోడ్ చేసి, ఇన్‌స్టాల్ చేయాలి.
• ట్యాప్ చేసిన ట్యాగ్ చదవడానికి మాత్రమే. కొన్ని ఎన్ఎఫ్‌సి ట్యాగ్‌లు చదవడానికి-మాత్రమే అనేదానికి లాక్ చేయబడి ఉండవచ్చు.
• ట్యాప్ చేసిన ట్యాగ్ చాలా చిన్నది మరియు మొత్తం డేటాను పట్టి ఉంచలేదు.
• వినియోగదారుల PC (పిసి) ఎన్ఎఫ్‌సిని కలిగి ఉండదు ఎందుకంటే ఎన్ఎఫ్‌సి అనేది అభివృద్ధి చెందుతోన్న సాంకేతికత.

ఆధారము: భాష ఇండియా

అనుసంధానిత విండోస్ స్టోర్ అప్లికేషన్‌లను రూపొందంచడం

వ్యక్తులు నెట్‌వర్క్‌కు అనుసంధానించిన పరికరాల పరిసరాల్లో ఉన్నారు. తాజా గృహోపరకరణమలు కూడా నెట్‌వర్క్‌కు మరియు గృహ నెటవర్క్‌లకు అనుసంధానించబడవచ్చు. ఈ “అనుసంధానిత అప్లికేషన్‌లు” వెబ్ నుండి తాజా విషయాన్ని వినియోగిస్తాయి.

సరైన ఎపిఐని ఎంచుకోండి
Windows 8 (విండోస్ 8) వినియోగదారు అప్లికేషన్ ఇంటర్నెట్ లేదా ప్రైవేట్ నెట్‌వర్క్‌లలో ఇతర కంప్యూటర్‌లు మరియు పరికరాలతో కమ్యూనికేట్ చేయడానికి ఉపయోగించగల విభిన్న రకాల ఎపిఐలను అందిస్తోంది.
Windows 8 (విండోస్ 8) వెబ్ సేవలు మరియు వెబ్ సైట్‌లతో అనుసంధానించబడే అనేక ఎపిఐలను కలిగి ఉంది. ఈ ఎపిఐలతో వినియోగదారు అప్లికేషన్ REST (ఆర్ఈఎస్‌టి)కి మద్దతు ఇచ్చే లేదా ప్రాథమిక హెచ్‌టిటిపి ప్రోటోకాల్ ఆదేశాలను పంపే వెబ్ సేవలను ప్రాప్తి చేయగలదు. వెబ్ ప్రాప్తి కోసం, ఎపిఐ వినియోగదారు అప్లికేషన్‌ను అభివృద్ధి చేయడానికి ఉపయోగించిన భాషపై ఆధారపడతారు:
• XMLHTTPRequest (ఎక్స్ఎమ్ఎల్‌హెచ్‌టిటిపిఅభ్యర్థన) మరియు WinJS.xhr—జావాస్క్రిప్ట్ మరియు హెచ్‌టిఎమ్ఎల్‌లో వ్రాసిన అప్లికేషన్‌లు.
• HttpClient (హెచ్‌టిటిపిక్లయింట్)— C# లేదా Visual Basic .NET (విజువల్ బేసిక్ .నెట్) మరియు XAML (ఎక్స్ఏఎమ్ఎల్)లో వ్రాసిన అప్లికేషన్‌లు.
• XML HTTP Request 2 (ఎక్స్ఎమ్ఎల్ హెచ్‌టిటిపి అభ్యర్థన 2) (IXHR2) (ఐఎక్స్‌హెచ్ఆర్2)— C++ మరియు XAML (ఎక్స్ఏఎమ్ఎల్)లో వ్రాసిన అప్లికేషన్‌లు.

Windows.Networking.BackgroundTransfer (విండోస్.నెట్‌వర్కింగ్.బ్యాక్‌గ్రౌండ్‌ట్రాన్స్‌ఫర్) ఎపిఐ వినియోగదారు అప్లికేషన్ అమలులో లేనప్పుడు కూడా ఫైల్‌లను డౌన్‌లోడ్ చేయగల లేదా అప్‌లోడ్ చేయగల సామర్థ్యాన్ని అందిస్తుంది. అప్లికేషన్ అది ముందు భాగంలో అమలు అవుతునప్పుడు బదిలీని ప్రారంభిస్తుంది మరియు దృష్టి నిల్పుతుంది మరియు Windows 8 (విండోస్ 8) ఆపై అప్లికేషన్ అమలులో లేకపోయినా నేపథ్యంలో బదిలీని కొనసాగిస్తుంది.

Windows.Web.Syndication (విండోస్.వెబ్.సిండికేషన్) ఎపిఐ ఫీడ్‌లను ఆర్ఎస్ఎస్ లేదా ఆటమ్ ఆకృతులలో తిరిగి పొందవచ్చు. అదనంగా, Windows.Web.AtomPub (విండోస్.వెబ్.ఆటమ్‌పబ్) ఎపిఐ డేటాను విభిన్న AtomPub (ఆటమ్‌పబ్) ఆకృతులలో ప్రచురించడానికి అప్లికేషన్‌ను అనుమతిస్తుంది.

సరైన నెట్‌వర్క్ సామర్థ్యాలను ఎంచుకోండి
Windows (విండోస్) నెట్‌వర్క్ హద్దులను క్రియాశీలంగా గుర్తిస్తుంది మరియు నెట్‌వర్క్ నిశ్చలత్వం కోసం నెట్‌వర్క్ ప్రాప్తి పరిమితులను అమలు చేస్తుంది. వినియోగదారు వాటిని సరిగ్గా అమలు చేసినప్పుడు, ఈ సామర్థ్యాలు హానికరమైన దాడుల నుండి వినియోగదారులను మరియు అప్లికేషన్‌లను రక్షించడంలో సహాయపడతాయి.

అప్లికేషన్‌లు నెట్‌వర్క్ ప్రాప్తి పరిమితిని నిర్వచించడానికి తప్పనిసరిగా నెట్‌వర్క్ నిశ్చలత్వ సామర్థ్యాలను ప్రకటించాలి.
నెట్‌వర్క్ ప్రాప్తి అభ్యర్థనలు రెండు వర్గాల్లో అందించబడతాయి:
1. అవుట్‌బౌండ్, క్లయింట్ ప్రారంభించిన అభ్యర్థనలు: వినియోగదారు అప్లికేషన్ క్లయింట్‌గా పని చేస్తుంది మరియు సాధారణంగా రిమోట్ కంప్యూటర్ అయిన సర్వర్‌కు ప్రారంభ నెట్‌వర్క్ అభ్యర్థనను పంపడం ద్వారా నెట్‌వర్క్ ప్రాప్తిని ప్రారంభిస్తుంది. అప్లికేషన్ సర్వర్‌కు అభ్యర్థనలను పంపుతుంది మరియు సర్వర్ తిరిగి ప్రతిస్పందనలను పంపుతుంది.

2. ఇన్‌బౌండ్, అవాంఛనీయ అభ్యర్థనలు: వినియోగదారు అప్లికేషన్ నెటవర్క్ సర్వర్‌గా పని చేస్తుంది మరియు రిమోట్ కంప్యూటర్ నుండి ఇన్‌బౌండ్ నెట్‌వర్క్ అభ్యర్థనల కోసం వింటుంది. రిమోట్ కంప్యూటర్ సర్వర్‌గా పని చేసే వినియోగదారు అప్లికేషన్‌కు ప్రారంభ అభ్యర్థనను పంపడం ద్వారా నెట్‌వర్క్ ప్రాప్తిని ప్రారంభిస్తుంది. రిమోట్ కంప్యూటర్ అప్లికేషన్‌కు అభ్యర్థనలు పంపుతుంది, అది రిమోట్ కంప్యూటర్‌కు ప్రతిస్పందనలను తిరిగి పంపుతుంది.
కొన్ని అప్లికేషన్‌లకు నెట్‌వర్క్‌లో ప్రామాణీకరిస్తున్నప్పుడు వినియోగదారు క్రెడెన్షియల్‌లకు మరియు ప్రమాణపత్రాలకు కూడా ప్రాప్తి అవసరం కావచ్చు.

Using the App Manifest Designer in Microsoft Visual Studio 2012

చెల్లింపు నెట్‌వర్క్‌ల కోసం అప్లికేషన్ లక్షణాలను అలవర్చుకోవడం
Windows 8 (విండోస్ 8) అందుబాటులో ఉన్న నెట్‌వర్క్ వనరులను పర్యవేక్షించి, చెల్లింపు నెట్‌వర్క్‌లు అందుబాటులో ఉన్నప్పుడు తదనుగుణంగా ప్రవర్తించడానికి అప్లికేషన్‌లను అనుమతించడం ద్వారా వినియోగదారు సమస్యను గుర్తిస్తుంది.

Windows.Networking.Connectivity (విండోస్.నెట్‌వర్కింగ్.కనెక్టివిటీ) ఎపిఐ నెట్‌వర్క్ అనుసంధానం యొక్క రకం మరియు ధర గురించి సమాచారం అందిస్తుంది. అనుసంధాన ప్రొఫైల్ నెట్‌వర్క్ అనుసంధానాన్ని సూచిస్తుంది. వినియోగదారు అప్లికేషన్ అనుసంధాన ప్రొఫైల్ యొక్క అనుసంధాన ధరను ఉపయోగించి దాని లక్షణాలను అలవర్చుకోవాలా వద్దా అన్నది నిర్ణయిస్తుంది. నెట్‌వర్క్ ధర రకం లక్షణం అనేది నెట్‌వర్క్ అనుసంధానం యొక్క రకాన్ని, నియంత్రణ లేనిది, స్థిరమైనది, చరాంకం మరియు తెలియనిది వంటవి సూచిస్తుంది.
అనుసంధాన ధర కోసం అనేక ఇతర బులియన్ లక్షణాలు రోమింగ్, డేటా పరిమితిని చేరుకోవడం మరియు డేటా పరిమితిని దాటడం గురించి మరింత సమాచారాన్ని అందిస్తాయి

అప్లికేషన్‌లు వినియోగిస్తున్న నెట్‌వర్క్ డేటా మొత్తాన్ని చూడటం కోసం వినియోగదారులు విధి నిర్వాహికిని కూడా అమలు చేయవచ్చు.

నెట్‌వర్క్ స్థితి మార్పులకు ప్రతిస్పందించడం
ఏ మొబైల్ పరికరంలో అయినా నెట్‌వర్క్‌లు అందుబాటులో ఉంటాయి. వినియోగదారు ఇంటి నుండి దూరంగా వెళ్లినప్పుడు వై-ఫై అందుబాటులో ఉండకపోవచ్చు. అందుబాటులో ఉన్న ధర లేదా కనెక్టివిటీ ఎంపికల మార్పును నెట్‌వర్క్ స్థితి మార్పు ఈవెంట్ సూచిస్తుంది. దోషం లేదా నెట్‌వర్క్ లేకపోవడం వంటి కారణాల వల్ల అనుసంధానాన్ని కోల్పోయినప్పుడు కూడా ఇది స్పందిస్తుంది.

కొత్త నెట్‌వర్క్ లభ్యత
కొన్ని సందర్భాల్లో పరికరం బహుళ నెట్‌వర్క్‌లకు కూడా అనుసంధానించబడవచ్చు. చెల్లింపు నెట్‌వర్క్ కంటే నియంత్రణ లేని నెట్‌వర్క్‌కు ప్రాధాన్యత ఇవ్వడమే Windows 8 (విండోస్ 8) యొక్క డిఫాల్ట్ విధానం, అదే విధంగా మందగమన నెట్‌వర్క్ కంటే వేగవంతమైన నెట్‌వర్క్‌కు ప్రాధాన్యత ఉంటుంది. అప్లికేషన్ ద్వారా స్థాపించబడిన నెట్‌వర్క్‌లు స్వయంచాలకంగా కొత్త నెట్‌వర్క్‌కు మారవు. అప్లికేషన్ ప్రమేయం తప్పనిసరిగా ఉండాలి, ఎందుకంటే కొత్త నెట్‌వర్క్‌కు మారాలా వద్దా అనేది అప్లికేషన్ మాత్రమే ఉత్తమంగా నిర్ణయించగలదు.

నెట్‌వర్క్ ధరలో మార్పు
నెట్‌వర్క్ ధర మార్పు స్థిరం చేయబడినప్పుడు, వినియోగం డేటా పరిమితిని చేరుకుంటున్నప్పుడు లేదా డేటా పరిమితిని అధిగమించినప్పుడు నెట్‌వర్క్ ధరలో మార్పు సంభవిస్తుంది. నెట్‌వర్క్ ధర రకం చరాంకం అయినప్పుడు లేదా రోమింగ్ మార్పులు వాస్తవమైనప్పుడు వీటి ఫలితంగా కూడా నెట్‌వర్క్ ధర మారుతుంది.

ఆధారము: భాష ఇండియా

వెబ్ సాకెట్

నేటి నెట్‌వర్క్‌లు బహుళ హోమింగ్, వెబ్ ప్రాక్సీలు, భద్రతా సమస్యలు, అంతర్జాతీయం చేయడం మరియు ఇతర సమస్యల ఫలితంగా మరింత క్లిష్టంగా విపరీతంగా పెరిగాయి. ఒక అనువర్తనం టిసిపి లేదా యుడిపిని ఉపయోగించడానికి తప్పనిసరిగా చేయవలసినదాన్ని విండోస్ అమలు సమయ సాకెట్‌ల ఏపిఐ సరళీకరించింది. వెబ్‌సాకెట్‌లు అనేది వెబ్‌లో భద్రతను, నిజ-సమయాన్ని, ద్వైదిశాత్మక కమ్యూనికేషన్‌ను ప్రారంభించే నూతన రూప వ్యక్తీకరణ ప్రమాణం. మైక్రోసాఫ్ట్ మరియు డబ్ల్యూ3సి మరియు ఐబిటిఎఫ్‌లోని ఇతర సంస్థ నాయకులు కలిసికట్టుగా ఈ ప్రమాణాన్ని అభివృద్ధి చేసారు. మైక్రోసాఫ్ట్ ఐఈ10, విండోస్ 8 అనువర్తనాలు, ఐఐఎస్, ఏఎస్‌పి.నెట్ మరియు డబ్ల్యూసిఎఫ్‌లో మద్దతుతో విస్తృత వెబ్‌సాకెట్‌ల పరిష్కారాన్ని అందిస్తోంది.
వెబ్‌సాకెట్‌లు బ్రౌజర్‌లో నిజ సమయ నోటిఫికేషన్‌లను మరియు నవీకరణలను బట్వాడా చేయడానికి వెబ్ అనువర్తనాలను అనుమతిస్తాయి. డెవలపర్‌లు నిజ సమయ ప్రమేయాల కోసం రూపొందించబడని బ్రౌజర్ యొక్క వాస్తవ హెచ్‌టిటిపి అభ్యర్థన-ప్రతిస్పందన నమూనాలో పరిమితులకు లోబడి పని చేయడంలో సమస్యలను ఎదుర్కొన్నారు. సేవలతో ద్వైదిశాత్మక, పూర్తిగా రెండింటితో కూడిన కమ్యూనికేషన్‌ను తెరవడానికి వెబ్‌సాకెట్‌లు బ్రౌజర్‌లను అనుమతిస్తాయి. డేటాను వెంటనే మరోదానికి పంపడానికి ఆపై ప్రతివైపు ఈ ఛానెల్‌ను ఉపయోగించవచ్చు.

ఇప్పుడు ఐఈటిఎఫ్ వెబ్‌సాకెట్ ప్రోటోకాల్ యొక్క తుది సంస్కరణకు ఐఈ10 మరియు అన్ని ఇతర మైక్రోసాఫ్ట్ వెబ్‌సాకెట్ క్లయింట్ మరియు సర్వర్ లక్షణాలు మద్దతు ఇస్తాయి. అదనంగా, ఐఈ10 డబ్ల్యూ3సి వెబ్‌సాకెట్ ఏపిఐని అమలు చేస్తుంది. నవప్రవర్తనాత్మక అనువర్తనాలను మరియు సేవలను సృష్టించడాన్ని ప్రారంభించడానికి డెవలపర్‌ల కోసం వెబ్‌సాకెట్‌లు స్థిరంగా మరియు సిద్ధంగా ఉంటాయి.
ఈ సరళమైన వివరణ అనువర్తనం మరియు సర్వర్ మధ్య ప్రత్యక్ష అనుసంధానం ఆధారంగా ఉంటుంది. ప్రాక్సీ కాన్ఫిగర్ చేయబడితే, ఆపై ప్రాక్సీకి HTTP CONNECT అభ్యర్థనను పంపడం ద్వారా ఐఈ10 ప్రాసెస్‌ను ప్రారంభిస్తుంది.

వెబ్‌సాకెట్ అంశాన్ని సృష్టించినప్పుడు, వెబ్‌సాకెట్ అనుసంధానాన్ని ఏర్పాటు చేయడానికి క్లయింట్ మరియు సర్వర్ మధ్య కరచాలన మార్పడి చేయబడుతుంది.

ఐఈ10 సర్వర్‌కు హెచ్‌టిటిపి అభ్యర్థనను పంపడం ద్వారా ప్రాసెస్‌ను ప్రారంభిస్తుంది. అనుసంధాన ప్రాసెస్ ఫైర్‌వాల్‌లు, ప్రాక్సీలు మరియు ఇతర మాధ్యమికాల మీదుగా వెళ్లడానికి అభ్యర్థనను అనుమతించే ప్రామాణిక HTTP GET అభ్యర్థనతో ప్రారంభించబడుతుంది. హెచ్‌టిటిపి అప్‌గ్రేడ్ శీర్షిక అనువర్తన-లేయర్ ప్రోటోకాల్‌ను హెచ్‌టిటిపి నుండి వెబ్‌సాకెట్ ప్రోటోకాల్‌కు మార్చడానికి సర్వర్‌ను అభ్యర్థిస్తుంది. సర్వర్ వెబ్‌సాకెట్ ప్రోటోకాల్‌ను అర్థం చేసుకుందని రుజువు చేయడానికి ప్రతిస్పందనగా Sec-WebSocket-Key శీర్షికలో విలువను పరివర్తనం చేస్తుంది. ప్రారంభ ఆధార భద్రతను అమలు చేయడానికి సర్వర్‌ను అనుమతించడానికి ప్రారంభ శీర్షిక ఐఈ10 ద్వారా సెట్ చేయబడుతుంది. సర్వర్ క్లయింట్ అభ్యర్థన మేరకు
Sec-WebSocket-Accept శీర్షికలో అందిస్తుంది. ఐఈ10 ఆఫై సర్వర్ వెబ్‌సాకెట్ సర్వర్ అని నిర్ధారించడానికి Sec-WebSocket-Keyని Sec-WebSocket-Acceptతో సరిపోలుస్తుంది.
సర్వర్ దీని 101 ప్రతిస్పందనను అందించిన తర్వాత, అనువర్తన-లేయర్ ప్రోటోకాల్ హెచ్‌టిటిపి నుండి మునుపు ఏర్పాటు చేసిన టిసిపి అనుసంధానాన్ని ఉపయోగించే వెబ్‌సాకెట్‌లకు మారుతుంది.
హెచ్‌టిటిపి ఈ సమయంలో పూర్తిగా అసందర్భమైనది. తేలిక బరువు గల వెబ్‌సాకెట్ వైర్ ప్రోటోకాల్‌ను ఉపయోగించి, ఇప్పడు సందేశాలను ఏ సమయంలో అయినా రెండు తుది స్థానాల్లో పంపవచ్చు లేదా స్వీకరించవచ్చు.

విజయవంతమైన హ్యాండ్ షేక్ తర్వాత,అప్లికేషన్ మరియు వెబ్ సాకెట్ సర్వర్ వెబ్ సాకెట్ సందేశాలను పంపిణీ చేయవచ్చు. ఒక సందేశం ఒకటి లేదా ఎక్కువ సందేశ భాగాలు లేదా డేటా “ఫ్రేమ్” ల వరుస లాగా కంపోజ్ చేయబడుతుంది.
ప్రతి ఫ్రేమ్ కూడా ఇటువంటి సమాచారాన్ని కలిగివుంటుంది
• ఫ్రేమ్ పొడవు
• సందేశంలోని తొలి ఫ్రేములోని సందేశపాఠం (బైనరీ లేదా పాఠం)
• ఇది సందేశంలోని చివరి ఫ్రేమ్ అని సూచించే ఒక ఫ్లాగ్ (ఎఫ్ఐఎన్)

ఐఇ౧౦ ఫ్రేమ్ లను స్క్రిప్టుగా మార్చడానికి ముందు పూర్తి సందేశాలుగా మారుస్తుంది. హ్యాండ్ షేక్ ను తెరవడం లాగే హ్యాండ్ షేక్ ను మూసివేయడం కూడా ఉంటుంది. ఏదైనా ఎండ్ పాయింట్ (అప్లికేషన్ లేదా సర్వర్)ఈ హ్యాండ్ షేక్ ను ఇనిషియేట్ చేస్తుంది.

ఒక ప్రత్యేక ఫ్రేమ్ రకం -క్లోజ్ ఫ్రేమ్- మరొక ఎండ్ పాయింటుకు పంపించబడుతుంది. క్లోజ్ ఫ్రేమ్ ఒక ఐచ్ఛిక స్థితి కోడ్ ను మరియు క్లోజ్ చేయడానికి హేతువును కలిగివుంటుంది. ప్రోటోకాల్ స్టాటస్ కోడ్ కి తగిన విలువల సముదాయాన్ని నిర్వచిస్తుంది. క్లోజ్ ఫ్రేమ్ పంపించిన వారు ఆ క్లోజ్ ఫ్రేమ్ తర్వాత తదుపరి అప్లికేషన్ డేటాను పంపించకూడదు.

మరొక ఎండ్ పాయింట్ క్లోజ్ ఫ్రేమ్ ను స్వీకరిస్తున్నప్పుడు, అది తన స్వంత ఫ్రేమ్ కో స్పందిస్తుంది. క్లోజ్ ఫ్రేమ్ తో స్పందించడానికి ముందు అది వాయిదా పడిన సందేశాలను పంపించవచ్చు.

ఆధారము: భాష ఇండియా

ఆన్లైన్లో సేవల సమాహారం i-Seva

e-Seva తరహాలో ప్రయివేట్ సేవల కోసం i-Seva (ఐ-సేవ) అందుబాటులోకి వచ్చింది. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఇటీవలే సచివాలయం నుంచి ఐ-సేవ వెబ్సైట్ను ప్రారంభించారు.

ఫోన్ బిల్లుల చెల్లింపులతో పాటు సెల్ ఫోన్ రీచార్జిలు, క్రెడిట్ కార్డ్ చెల్లింపులు వంటి బ్యాంకింగ్ రంగం సేవలు, దూరప్రయాణ ప్యాకేజీలు, సినిమా, బస్, రైలు, విమాన ప్రయాణ టికెట్లు, హొటళ్ళలో వసతి, అద్దె కార్లు, సెలవల్లో యాత్రలకు బుకింగ్లు, PAN కార్డ్ సర్వీస్, బీమా ప్రీమియం చెల్లింపు, ఎడ్యుకేషన్ టెస్ట్ ప్యాకేజీలు, DTH రీచార్జి, షేర్ ట్రేడింగ్ ఇలా ప్రజలకు ఉపయుక్తమైన దాదాపు 600 పైచిలుకు సేవలు దీని ద్వారా అందుబాటులోకి వస్తాయి.

దేశవ్యాప్తంగా త్వరలో లక్ష వరకూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిసెంబర్ 2012 కల్లా ఐదు వేల ఐ-సేవ కేంద్రాలను ప్రారంభిస్తామని, దీని ద్వారా ఏడాది కాలంలో పది వేలమందికి ఉద్యోగ, స్వయం ఉపాధి అవకాశాలు కలుగుతాయని ఐ-సేవ ఆన్లైన్ ఈ-కామర్స్ యుటిలిటీ సొల్యూషన్ను ప్రమోట్ చేస్తున్న i-Seva e-Com Services India Pvt Ltd పేర్కొంది. ప్రభుత్వ, ప్రయివేట్ రంగాల్లోని సేవల సమాహారంగా లక్షకు పైగా సర్వీస్ ఔట్లెట్లను నెలకొల్పుతామని నిర్వాహకులు అన్నారు.

ఈ సంస్థకు ప్రస్తుతం న్యూఢిల్లీ, పూణె, చెన్నై, హైదరాబాద్ నగరాల్లో కార్యాలయాలున్నాయి. ఫిబ్రవరి నెలలో కర్ణాటక, తమిళనాడు, ఒడిషా రాష్ట్రాల్లో కార్యకలాపాలను ప్రారంభిస్తామని ఐ-సేవ ఎండీ లలితా పాటిల్ తెలిపారు. సామాన్య ప్రజలకు అవసరమైన వివిధ రకాల సేవలన్నిటినీ ఒకేచోట అందుబాటులో ఉంచేలా దీనిని రూపొందించామన్నారు. ఇందులో ప్రభుత్వ రంగానికి చెందిన సేవల్ని కూడా పొందుపరుస్తున్నారు.

ఆధారము: భాష ఇండియా

ఆర్టీసీ నుంచి ఎస్ఎంఎస్ ఈ-టికెట్..

ఎస్ఎంఎస్ రూపంలో ఈ-టికెట్ విధానానికి భారత రైల్వే శాఖ రంగం సిద్ధం చేసిన నేపథ్యంలో ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ దిశగా ఆలోచన చేసింది. ఇంటి నుంచే ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకోవడం, సంక్షిప్త సందేశ (ఎస్ఎంఎస్) రూపంలో మన మొబైల్ ఫోన్కు ఈ-టికెట్ రావడం, దానిని బస్సులో డ్రైవర్ లేదా కండక్టర్ లేదా తనిఖీ సిబ్బందికి చూపించి గమ్యస్థానాన్ని చేరుకోవడం. క్లుప్తంగా ఇదీ సారాంశం.

దేశవ్యాప్తంగా అంతర్జాల ఆధారిత సేవలు నానాటికీ విస్తృతమవుతున్న నేపథ్యంలో ఈ అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ (ఎపిఎస్ ఆర్టీసీ) నిర్ణయించింది. ఇందులో భాగమే ఈ ఎస్ఎంఎస్ టికెట్ వ్యవస్థ. ప్రస్తుతం టికెట్ కౌంటర్ల వద్ద ప్రయాణీకులు బారులు తీరడం, సిబ్బందికి ప్రయాస తప్పడం లేదు. ఇవన్నీ ఈ సరికొత్త విధానంతో సులభతరమవుతాయి.

మన రాష్ట్రంలో ఇప్పటికే కొన్ని ప్రయివేటు బస్సు సర్వీసులు ఆన్లైన్ బుకింగ్ సేవల్ని ప్రారంభించాయి. వీరి వద్ద ఆన్లైన్ బుకింగ్ చేసుకున్నా లేక నేరుగా టికెట్ కొనుకోలు చేసినా, దీనిని ధృవీకరిస్తూ మన మొబైల్ ఫోనుకు వెంటనే సందేశం వస్తుంది.

ఆర్టీసీలో ఆన్లైన్ టికెట్ విధానం ఏర్పాట్లపై సంస్థ అధికార్లు గత ఏడాది నుంచీ కసరత్తు మొదలుపెట్టారు. ఎట్టకేలకు ఈ ఏడాది జనవరి 25వ తేదీ నుంచీ ఇది ప్రయోగాత్మకంగా అమలులోకి వచ్చింది. దీని ఫలితాలను బట్టి ఇందులో అవసరమైన మార్పు చేర్పులు చేస్తారు. ఆర్టీసీ ఈ-టికెట్ కోసం చేయాల్సింది ఏమిటంటే.. ఆర్టీసీ వెబ్సైట్లోకి ప్రవేశించి ఏ బస్సుకు ఏ రోజున ఎన్ని సీట్లు కావాలో ఆ వివరాలివ్వాలి. ప్రయాణీకులు కోరిన మేరకు సదరు బస్సులో ఈ సీట్లు అందుబాటులో ఉంటే బ్యాంక్ కార్డ్ ద్వారా చెల్లింపు జరపడం, రిజర్వేషన్ పూర్తికావడం, మన మొబైల్ ఫోన్కు ఈ-టికెట్ సందేశం రావడం చకచకా జరిగిపోతాయి.

మొబైల్ ఫోన్కు ఈ-టికెట్ వచ్చిన తర్వాత మన ప్రయాణించే బస్సులోని సిబ్బందికి దీనిని చూపిస్తే చాలు. వారు తమ వద్ద ఉన్న రిజర్వేషన్ పట్టికతో సరిపోల్చుకుని ప్రయాణానికి వీలు కల్పిస్తారు. ఈ సరికొత్త వ్యవస్థకు ప్రజాదరణ తప్పక లభిస్తుందని ఆర్టీసీ అధికార్లు ఆశాభావంతో ఉన్నారు.

ఆధారము: భాష ఇండియా

మీ కంప్యూటర్ నుంచే రేడియో వినండి..

ఏ కంప్యూటర్‌కైనా ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే చాలు... దీనిని గ్లోబల్ రేడియో రిసీవర్‌గా మార్చుకోవడం చాలా తేలిక. ఇక మీకు కావలసిందల్లా కొంత సాఫ్ట్‌వేర్ మరియు కొన్ని చిట్కాల తోడ్పాటు. దాంతో లైవ్ రేడియో లేదా స్ట్రీమింగ్ రేడియో ప్రసారాల్ని ఆస్వాదించవచ్చు.

అసలు ఈ ఏమిటీ Internet radio ?

ప్రపంచవ్యాప్తంగా చాలా radio స్టేషన్లుండగా, చాలామంది వ్యక్తులు Internet radio స్టేషన్లను కూడా సృష్టించారు. వీటినే వెబ్ రేడియోలంటారు. ఇంకా National Public Radio, CBC, ChoiceRadio, SHOUTcast లాంటివి చాలానే ఉన్నాయి. రియల్ టైం ప్రసారాలు లేదా కావలసినప్పుడు వినడం కోసం సిద్ధం చేసి ఉంచిన ప్రసారాలు ఇలా అందుబాటులో ఉన్నాయి.

మీదగ్గర ఏమేం ఉండాలి ?

Online రేడియో ప్రసారాల్ని మీ కంప్యూటర్ నుంచి వినడానికిగాను Windows Media Player లాంటి ఒక ప్లేయర్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఇది Windows 7 మరియు Windows Vista ఆపరేటింగ్ సిస్టంలలో ముందుగానే ఇన్‌స్టాల్ చేసి ఉంటుంది. ఇంటర్నెట్ రేడియో ప్రసారాలు డౌన్‌లోడ్ చేసుకోవడానికి వీలుగా RealPlayer cjf/g QuickTime ఫార్మాట్లలో ఉంటాయి.

Windows Media Player ద్వారా పలు రేడియో స్టేషన్లను సులభంగా అన్వేషించి వివిధ ప్రసారాల్ని ఆస్వాదించవచ్చు. మీ మనసును దోచే రకరకాల పాటలను వర్గీకరించి అందిస్తూ custom-built playlistsతో కూడిన డజన్లకొద్దీ రేడియో స్టేషన్లు మీకు అందుబాటులో ఉంటాయి.

Internet radioలోని ఒక గొప్ప విషయం ఏమిటంటే.. దీని ద్వారా మీరు ఆనందించే సంగీతమంతా ఉచితమే. ఎప్పుడు కావాలంటే అప్పుడు వినచ్చు. కాకపోతే ఒక అకౌంట్ తెరవడం, ఇ-మెయిల్ చిరునామా ఇవ్వడం లాంటివి ఉంటాయంతే. ఇవే కంపెనీలు కొద్దిపాటి రుసుముతో వాటి శ్రోతలకు ప్రత్యేక ప్యాకేజీల్ని ఆఫర్ చేస్తుంటాయి. అవి మరింత నాణ్యతతో higher bit rate ప్రసారాలని, ప్రత్యేక ప్రసారాలని, Commercial-free listening అని ఇలా...

మరికొన్ని Internet radio స్టేషన్లు ఇంకో అడుగు ముందుకేశాయి. Pandora.com లాంటి కొన్ని సైట్లయితే శ్రోతలకు నచ్చిన సంగీతవేత్త, గీతరచయిత లేదా పాటల ఆధారంగా రేడియో స్టేషన్‌ను (playlist తరహాలోనే) రూపోందించి ఆకట్టుకుంటున్నాయి. మీరు చెయ్యాల్సిందల్లా ఉచితంగా నమోదు చేసుకోవడమే...

ఇదిలా ఉండగా, పలు మ్యూజిక్ స్టేషన్ల వెబ్ సైట్ల ద్వారా రియల్ టైంలోనే ప్రసారాల్ని ఆస్వాదించవచ్చు. మీరెక్కడున్నప్పటికీ Bing.com నుంచి శోధించడం ద్వారా ఒక లోకల్ రేడియో స్టేషన్‌ను కనుగొని ప్రసారాలు వినవచ్చు. ఆ స్టేషన్‌కు సంబంధించిన కాల్ సైన్ టైప్ చేసి (ఉదా.. 94.9), సదరు వెబ్ సైట్ లభించగానే Listen Live లేదా Streaming అని ఉన్న లింక్ ద్వారా సంగీత ప్రసారాల్ని తనివితీరా ఆనందించగలుగుతారు. మీరు మంచి సంగీత ప్రియులు కనుక ప్రసార నాణ్యతలో రాజీపడకుండా మంచి స్పీకర్లు లేదా హెడ్ ఫోన్లను ఉపయోగించుకోండి.

ఆధారము: భాష ఇండియా

Ms-Office గురించి ఉపయుక్తమైన బ్లాగ్

MS-Office ఉత్పత్తుల్ని ఉపయోగించుకునే యూజర్లకు అత్యంత ఉపయుక్తమైంది Office బ్లాగ్. వినియోగదార్ల మదిలో జనించే పలు సందేహాలకు సరైన పరిష్కారాల్ని సూచిస్తూ వారి లక్ష్య సాధనలో ఈ బ్లాగ్ నుంచి మంచి తోడ్పాటు ఉంటుంది. ఈ బ్లాగ్ ప్రత్యేకత ఏమిటంటే, Office ఉత్పత్తుల గురించి చదువుకోవడానికి ఎన్నో వ్యాసాలతో పాటు వీడియో ఆధారిత సమాచారం కూడా అందుబాటులో ఉంది. తద్వారా వినియోగదార్ల సందేహాలకు కచ్చితమైన స్పందన లభిస్తుంది.

ట్విట్టర్

మీ బిజినెస్ మీటింగ్‌లకు సంబంధించిన మీ ఆలోచనలకు ఒక రూపమివ్వడంలో MS-Outlookను ఏ విధంగా ఉపయోగించుకోవచ్చో ఇందులో ఉన్న ఒక వీడియో కథనం ద్వారా తెలుసుకోవచ్చు. ఆయా బిజినెస్ మీటింగ్‌ల నిర్వహణ, కస్టమర్లకు తోడ్పాటునిచ్చే కార్యకలాపాలకు ఒక ఆకృతినిచ్చే క్రమంలో ఇమిడి ఉన్న ప్రక్రియలు, దశల గురించి ఈ వీడియోలో వివరంగా తెలియజేయబడి ఉంది.

ఇక మరొక కథనం MS-Accessకు సంబంధించిన కీలకమైన అంశాల్ని తెలియజేస్తుంది. Access డేటాబేస్‌ల కుదింపు మరియు నకలు తీసే ప్రక్రియల్ని స్వయంచాలితం చేసేలా అభివృద్ధిపరచిన Total Visual Agent అనే ప్రోగ్రాం ద్వారా MS-Accessలో డేటా పునరుద్ధరణ గురించి ఈ కథనం సవివరంగా తెలియజేస్తుంది.

ఇంకొక కథనం Microsoft ఉత్పత్తి అయిన MS-OneNote 2010 గురించి సమగ్రంగా తెలియజేస్తుంది. ఇందులోని ప్రత్యేకతలు, దీనిని ఉపయోగించుకోవడం ఎలా అన్నది ఇక్కడ తెలుసుకోవచ్చు.

ఇందులోనే MS-Excelలో రూపకల్పన చేసిన ఫ్యామిలీ బడ్జెట్ టెంప్లేట్ అయిన "Staying on Budget" గురించి వివరించే కథనం కూడా ఉంది. ఎందరో యూజర్లు దీనిలో సూచించిన బడ్జెటింగ్ విధానాన్ని అనుసరించడం ద్వారా ప్రయోజనాలు పొంది ప్రశంసలు కురిపించారు. తద్వారా ఈ బ్లాగ్ ఆర్థికంగానూ తోడ్పాటునిస్తున్నది. అంతేగాక, Pivot table అనే plug-in గురించి కూడా ఇక్కడ వివరించబడింది. గజిబిజిగా ఉన్న డేటాను అర్థవంతంగా చేసి చక్కని ఫలితాల్ని రాబట్టడంలో Pivot tables ఎంతో సహకరిస్తాయి. బడ్జెట్ డేటాను ఇవి తమంత తాముగా నిర్వహించి సారాంశాన్ని అందిస్తాయి.

మెయిళ్ళను, వాటికి వచ్చే ప్రతిస్పందనలను అనుసరించడం గురించి కూడా ఈ బ్లాగ్‌లో కథనాలున్నాయి. ఒకరికంటే ఎక్కువ మందికి మెయిళ్ళను పంపడానికి (మాస్ మెయిలింగ్) సంబంధించి labelను ఏర్పాటు చేసుకోవడం గురించి ఇందులో ఒక మంచి కథనం ఉంది. ఇక్కడ కూడా చదువుకునే కథనాలు, ప్రయోగాత్మక వీడియోలు అందుబాటులో ఉన్నాయి. మెయిల్ మెర్జింగ్ మరియు మాస్ మెయిలింగ్‌లకు అనుసరించాల్సిన దశలవారీ ప్రక్రియల్ని ఈ వీడియో వివరిస్తుంది. ఇందుకు సంబంధించి చదువుకోవడానికి వీలున్న కథనాన్ని ఐదు భాగాలుగా వర్గీకరించారు. labelను ఏర్పాటు చేసుకోవడం గురించి, మాస్ మెయిలింగ్‌కు సంబంధించి పాఠకులకు మార్గదర్శకత్వాన్ని ఇచ్చే చిత్రాల్ని ప్రతి భాగంలోనూ పొందుపరిచారు.

ఆధారము: భాష ఇండియా

"ఆరోగ్యశ్రీ" ఆసుపత్రుల ఎంపికకు ఆన్‌లైన్ ప్రక్రియ

ఆంధ్రప్రదేశ్‌లోని సామాన్య ప్రజానీకానికి మెరుగైన వైద్య సేవలందించడం కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతిష్ఠాత్మక పథకం ‘రాజీవ్ ఆరోగ్యశ్రీ’. ఈ పథకానికి సంబంధించి రోగులకు వైద్యసేవలు అందించే ఆసుపత్రుల ఎంపిక ప్రక్రియ పునర్వ్యవస్థీకరణ దిశగా అడుగులు వేస్తున్నది. ఇందులో భాగంగా లబ్ధిదారులకు అందించే వైద్య సేవల నాణ్యతపై నిరంతరం దృష్టిసారించేందుకుగాను ముఖ్య వైద్యాధికారి ఉంటారు. ఆసుపత్రుల ఎంపికకు సంబంధించిన జాబితా రూపకల్పన మరియు క్రమశిక్షణా కమిటీ (Empanelment and Disciplinary Committee - EDC)కి ముఖ్య వైద్య గణకాధికారి (Chief Medical Auditor) నేతృత్వం వహిస్తారు. ఆసుపత్రుల్లో తగిన మేరకు మౌలిక సదుపాయాలు, మానవ వనరులు, సామగ్రి తగినంతగా ఉండేలా చూసే బాధ్యతను EDC వహిస్తుంది. ఈ ఆసుపత్రుల ఎంపిక ప్రక్రియలో పారదర్శకత కోసం ఆన్‌లైన్ విధానాన్ని అనుసరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఆసుపత్రుల ఎంపిక ప్రక్రియను సులభతరం చేసి, వేగిరపరిచేందుకు గాను ముఖ్యమంత్రి రోశయ్య ఒక సమీక్షా సమావేశం నిర్వహించారు. మౌలిక వసతులు లేని ఆసుపత్రులకు సంబంధించిన దరఖాస్తుల్ని తిరస్కరించాలన్న ప్రతిపాదనపై ఈ సమావేశంలో ఆమోదముద్ర పడింది.

ఆన్‌లైన్ ఎంపిక ప్రక్రియ తీరుతెన్నుల్ని పరిశీలిస్తే... ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించిన ఆసుపత్రుల జాబితాకెక్కాలని ఆశించే ఏ ఆసుపత్రి అయినా ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవాలి. నిబంధనల ప్రకారం సదరు ఆసుపత్రిలో కనీసం 50 పడకలైనా ఉండాలి. ఇలాంటి కనీస వసతులు లేని ఆసుపత్రుల దరఖాస్తుల్ని పరిశీలన సమయంలోనే పక్కనపెట్టేస్తారు. ఆసుపత్రికి సంబంధించిన ఫోటోల్ని ఆన్‌లైన్‌లోనే దరఖాస్తుతోపాటు upload చెయ్యాలి, లేనిపక్షంలో ఈ దరఖాస్తును పరిగణనలోకి తీసుకోరు. అవసరమైన పత్రాలు, ఫోటోలన్నిటీనీ ఆన్‌లైన్‌లోనే సమర్పించిన అనంతరం ఈ దరఖాస్తును నమోదు చేస్తారు. తర్వాత సీనియర్ అధికార్లు, ఆరోగ్యశ్రీ ట్రస్ట్ నిపుణులు, బీమా సంస్థ ప్రతినిధుల పర్యవేక్షక బృందం ఆసుపత్రిని నేరుగా పరిశీలించి EDCకి నివేదిక ఇస్తుంది. ఈ నివేదికననుసరించి సదరు ఆసుపత్రి వర్గాలు అంతకుముందు ఆన్‌లైన్‌లో సమర్పించిన పత్రాలు, ఫోటోలు తదితరాల్ని EDC సమీక్షిస్తుంది. అక్కడి మౌలిక వసతులు, సేవలు సక్రమమేనని ధృవీకరించుకున్న తర్వాత ఆయా ఆసుపత్రుల్ని ‘ఆరోగ్యశ్రీ’ జాబితాలో చేర్చోందుకు సిఫారసు చేస్తారు.

ఆరోగ్యశ్రీ పథకం కోసం ఎంపికయ్యేందుకు గాను దరఖాస్తు చేసుకున్న ఆసుపత్రులకు పర్యవేక్షక బృందం వెళ్ళినప్పుడు, అక్కడ ఏవైనా లోపాలు, సమస్యలను ఈ బృందం గుర్తిస్తే, వాటిని పరిష్కరించి అరోగ్యశ్రీ నిబంధనలకు అనుగుణంగా మెరుగుపరిచే అవకాశమున్నప్పుడు ఆ దిశగా పనులు పూర్తి చేసి ఆరోగ్యశ్రీ ట్రస్ట్ వారి పునఃపరిశీలనకు దరఖాస్తు చేసుకోవాలని ఆ ఆసుపత్రులకు సూచిస్తారు.

లోపాలు, సమస్యల దిద్దుబాటు పూర్తయి... ‘ఆరోగ్యశ్రీ’ ఆసుపత్రుల్ని ఎంపికచేసిన తర్వాత బీమా సంస్థ అక్కడ ‘ఆరోగ్యమిత్ర’ల నియామకం, కియోస్క్‌ల కేటాయింపు పనుల్ని చేపడుతుంది. ఈ ఆసుపత్రుల్లోని రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్య సమన్వయకర్త, ఆరోగ్యశ్రీ వైద్య శిబిర సమన్వయకర్త, బిల్లింగ్ ఎగ్జిక్యూటివ్‌లకు ఈ పథకం, దీనితో ముడిపడి ఉన్న ఆన్‌లైన్ ప్రక్రియలు, మార్గదర్శక సూత్రాలు, ప్యాకేజీలు, బాధ్యతలను పూర్తిగా వివరించేందుకు ఒక సమావేశం ఏర్పాటు చేస్తారు. ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌లోని ఆసుపత్రులకు యాక్సెస్ కోడ్‌లు కేటాయిస్తారు. ఈ పథకాన్ని అమలు చెయ్యడానికి కావలసిన పుస్తకాలు, సామగ్రిని అందజేస్తారు. దీంతో ‘ఆరోగ్యశ్రీ’ పథకం కింద ఈ నెట్‌వర్క్‌లోని ఆసుపత్రుల్లో రోగుల్ని నమోదు చేసుకోవడం ప్రారంభిస్తారు. ఈ క్రమంలో ఎదురయ్యే సమస్యలు, ఫిర్యాదుల్ని EDC ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో పరిశీలిస్తూ రోగులు సత్వర చికిత్స పొందేలా తగిన చర్యల్ని సూచిస్తుంటుంది.

ఆధారము: భాష ఇండియా

వేగం, సులభం, భద్రతకు ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ 8

(Internet Explorer 8.0 for easier, faster and safer ways)

నిత్యం వివిధ అవసరాలకోసం బ్రౌజింగ్‌లో నిమగ్నమయ్యే యూజర్లకు వేగంగా, సులభంగా, భద్రతతో కూడిన సమాచార సేకరణలో సహకరించే శక్తిమంతమైన సాధనం Internet Explorer 8.0. ఇందులోని సరికొత్త ఫీజర్లేమిటో తెలుసుకుందామా....

Accelerators

రోజువారీ బ్రౌజింగ్‌కు సంబంధించి ఇతర వెబ్‌సైట్లలోకి వెళ్ళాల్సిన అవసరం లేకుండా Internet Explorer 8.0లోని ఈ సరికొత్త Accelerators ద్వారా యూజర్లు త్వరితగతిన వారి కార్యకలాపాలను పూర్తిచేసుకోవచ్చు. యూజర్లు వారికి అవసరమైన ఒక వెబ్‌పైజీలోని టెక్ట్స్ హైలైట్ చేసి నీలం రంగులోని Accelerator Iconపైన క్లిక్ చేస్తే చాలు మీ పని పూర్తయినట్లే. ఆ టెక్ట్స్‌కు సంబంధించిన ప్రతిబింబం మీకు సదరు వెబ్‌పేజీలో కనిపిస్తూంటుంది. ఇలా ఎన్నో చేసుకోవచ్చు.

Search

ఇక Search కార్యకలాపాలకోసం సమయాన్ని ఆదా చెయ్యడానికి గాను యూజర్లకు Internet Explorer 8.0లో ఎన్నో సలహాలు, సూచనలు లభిస్తాయి. మొత్తం పదం లేదా పదబంధాన్ని టైప్ చెయ్యాల్సిన అవసరం ఉండదు. విషయ సేకరణలో Explorer యూజర్లకు మరింత చేయూతనివ్వడం కోసం Bing, Wikipedia, Yahoo!, Amazon వంటి అగ్రశ్రేణి Search Providersతో భాగస్వామ్యం కూడా ఉంది.

Smart Address Bar

Address barలో మీరు కొన్ని అక్షరాలు టైప్ చేస్తే చాలు వాటికి సంబంధించి మీరు అప్పటికే సందర్శించిన వెబ్‌సైట్స్‌ను Internet Explorer 8 ఆటోమేటిక్‌గా కాల్ చేస్తుంది. హిస్టరీ, ఫేవరేట్స్, RSS ఫీడ్స్‌లో అన్వేషణ, వెబ్‌సైట్ చిరునామాలో లేదా URLలోని ఏ భాగంతో అయినా సరిపోలే అంశాలను ప్రదర్శించడం చేస్తుంది. ముఖ్యంగా తప్పులతో ఉన్న URLsను తప్పించుకోవచ్చు.

Web Slices

తరచుగా కొత్త సమాచారాన్ని అందించే సైట్స్‌ను Favorites Bar నుంచే గమనించేందుకు యూజర్లు ఈ Web Slicesను ఉపయోగించుకోవచ్చు. ఏ పేజీలో అయినా Web Slice ఉన్నట్లయితే Command Bar పైన ఆకుపచ్చరంగులో Web Slices Icon కనిపిస్తుంది. కొత్త సమాచారం ఏదైనా ఉన్నప్పుడు ఈ Web Slice హైలైట్ అవుతుంది. Favorites Bar ఈ Web Sliceను యూజర్లు క్లిక్ చెయ్యగానే సంబంధిత సమాచారపు preview చూపిస్తుంది. ఈ previewపై క్లిక్ చేస్తే నేరుగా ఆ సమాచారం వద్దకు వెళ్ళవచ్చు. మరిన్ని Web Slicesల ఏర్పాటు కోసం భాగస్వాములతో కలసి Microsoft పనిచేస్తున్నది.

Compatibility View
Internet Explorer 8 అనేది కొత్త ఆవిష్కరణ కావడం చేత కొన్ని వెబ్‌సైట్లు ఈ కొత్త బ్రౌజర్‌కు సిద్ధంగా ఉండకపోవచ్చు. ఇలాంటి వెబ్‌సైట్లను చూడటానికి Compatibility View టూల్‌బార్ బటన్‌పైన క్లిక్ చేస్తే Internet Explorer 7లో అవి ఎలా కనిపిస్తాయో అలా చూడవచ్చు. దీనితో ఇంకా ఎన్నో ఉపయోగాలున్నాయి. మొత్తం వెబ్‌సైట్లు, ఇంట్రానెట్ సైట్లను చూడటానికి కూడా ఆప్షన్లున్నాయి.

Tab Groups

సమాచార సేకరణలో యూజర్లకు చేయూతనివ్వడానికి Tab Groups సదుపాయాన్ని Internet Explorer 8 కల్పిస్తున్నది. ఒక టాబ్ నుంచి మరొక టాబ్‌ను తెరిచినప్పుడు, అసలు టాబ్ పక్కనే రంగు కలిగిన కొత్త టాబ్ ఉంటుంది. ఇందువల్ల సంబంధిత సమాచారమున్న టాబ్‌లను యూజర్లు తేలిగ్గా గుర్తించగలరు. ఈ Tab Groupsతో మరెన్నో ఉపయోగాలున్నాయి.

ఇలాంటి వినూత్న సేవలందించే Internet Explorer 8లోని మరిన్ని సదుపాయాల గురించి మున్ముందు ఇంకా తెలుసుకుందాం.

ఆధారము: భాష ఇండియా

భారతీయ భాషలకు TDIL సముచిత సేవలు... స్వరణ్ లత

లాంగ్వేజి కంప్యూటింగ్ రంగంలో TDIL (టెక్నాలజీ డెవలప్‌మెంట్ ఫర్ ఇండియన్ లాంగ్వేజెస్) చేస్తున్న కృషి గురించి తమిళనాడులోని కోయంబత్తూర్‌లో ఇటీవల జరిగిన అంతర్జాతీయ తమిళ సదస్సులో TDIL ప్రోగ్రాం డైరక్టర్ స్వరణ్ లత తెలియజేశారు. ఈ రంగంలో జరుగుతున్న ప్రయత్నాలపై స్వరణ్ లత తెలియజేసిన వివరాల ముఖ్యాంశాలు భాషాఇండియా వీక్షకుల కోసం...

భిన్నభిన్న సంస్కృతులు, విభిన్న భాషల సమాహారం మన భారతదేశం. ఈ దేశంలోని ప్రతి రాష్ట్రానికీ ఒక ప్రత్యేకత ఉంది. హిందీ అధికార భాషగా... ఇంగ్లీష్ మాధ్యమంగా ఉత్తరప్రత్యుత్తరాలు సాగుతున్నప్పటికీ జాతీయస్థాయిలో మెరుగైన అనుబంధం కోసం ప్రాంతీయ భాషల్ని బలోపేతం చెయ్యాలని భారత ప్రభుత్వం భావిస్తున్నది. ఈ క్రమంలో మనం నిత్యం వాడుతున్న కంప్యూటర్లలో ప్రాంతీయ భాషల ఉనికిని పటిష్ఠపరిచే దిశగా భారత ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంది. అటువంటిదే గొప్ప ప్రయత్నాల్లో ఒకటి... భారతీయ భాషల్లో కంప్యూటింగ్‌పై దృష్టి సారించిన "టెక్నాలజీ డెవలప్‌మెంట్ ఫర్ ఇండియన్ లాంగ్వేజెస్" (TDIL) ప్రోగ్రాం.

స్వరణ్ లత ఏమంటున్నారంటే...

"ప్రపంచ దేశాల్లో భారతదేశం అత్యంత ప్రత్యేకమైనదని పేర్కొనడం అతియోశక్తి ఎంత మాత్రం కానేకాదు. మన దేశంలో అధికారికంగా గుర్తించిన 22 భాషలు, 11 లిపులు వాడుకలో ఉన్నాయి. పలు భాషలకు ఒకే లిపిని వాడుతుంటారు. ఇప్పుడు నడుస్తున్నది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యుగం. ప్రజలు వారి వారి భాషల్లో సులభంగా సమాచారాన్ని సేకరించుకోవడానికి వీలు కల్పించి, వివిధ వర్గాల మధ్య అంతరాల్ని తగ్గిస్తూ భాషాపరమైన అడ్డంకుల్ని అధిగమించేలా కంప్యూటర్ టెక్నాలజీని ఉపయోగించుకోవడం చాలా ఆనందాన్నిస్తుంది. దేశంలోని వివిధ భాషల ప్రజల మధ్య సమాచార మార్పిడి ప్రక్రియలో లాంగ్వేజి కంప్యూటింగ్ అనేది ముఖ్యపాత్ర పోషిస్తుండటం కనిపిస్తూనే ఉంది."

"మానవులు, యంత్రాల మధ్య పరస్పర సంప్రదింపులకు కావలసిన ప్రక్రియీకరణ సాధనాలు, వివిధ భాషల్లోని విజ్ఞాన వనరుల్ని పొందేందుకు కావలసిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసేందుకుగాను భారత ప్రభుత్వంలోని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగం (DIT) చేపట్టిన కార్యక్రమం ఈ TDIL (టెక్నాలజీ డెవలప్‌మెంట్ ఫర్ ఇండియన్ లాంగ్వేజెస్). ప్రాథమిక సమాచారానికి సంబంధించిన ప్రాసెసింగ్ టెక్నాలజీలను అభివృద్ధి చేసి, వాటిని కలసికట్టుగా ఒకేచోట వాడుకదార్లకు అనుకూలంగా సిద్ధంచేసి, ఉచితంగా జనబాహుళ్యానికి అందజేయడం TDIL లక్ష్యం."

"భారతీయ భాషల్లో సాఫ్ట్‌వేర్ అభివృద్ధి విషయంలో ఎదురయ్యే ప్రధాన అవరోధం ఏమిటంటే భాషావేత్తలను, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లను ఏకతాటిపైకి తీసుకురావడం. భారతదేశపు 22 అధికార భాషల్లో టెక్నాలజీ అభివృద్ధి కోసం తగినన్ని నిధుల్ని TDIL కేటాయించింది. భాషావేత్తలు, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల మధ్య TDIL ఒక వారధిలా పనిచేస్తుంది. కాగా, హిందీ, తమిళ భాషలకు ఎక్కువ ప్రాధాన్యత ఉంది. హిందీ విషయానికి వస్తే, ఎక్కువ ప్రాంతాల్లో ఈ భాష వాడుకలో ఉంది. తమిళం మాటకొస్తే... తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు తమిళ ఎన్నారైలు ఈ విషయంలో పట్టుదలతో ఉన్నారు."

"TDIL కార్యక్రమానికి 1990-91లో రూపకల్పన జరిగింది. సమాచార ప్రక్రియీకరణకు సంబంధించి పద సంచయ నిర్మాణం, OCR (Optical character recognition) , Text-to-Speech, యంత్రానువాదం, సాధారణ సాఫ్ట్‌వేర్ అభివృద్ధి తదితర ప్రాజెక్ట్‌లకు TDIL చేయూతనిస్తుంది. కీబోర్డ్ లేఅవుట్‌కు కావలసిన ప్రమాణాలు, సమాచార వినిమయం కోసం ఇంటర్నల్ కోడ్ సిద్ధమయ్యాయి. దీంతో భారతీయ భాషల్లో సమాచార ప్రక్రియీకరణకు పరిష్కారాల విషయంలో ఒక నమ్మకం ఏర్పడింది."

"అయితే, భారతీయ భాషలకు టెక్నాలజీపరమైన పరిష్కారాల దిశగా సాగేందుకు ప్రభుత్వం, ప్రజల నుంచి వచ్చే డిమాండ్ ఒక చోదకశక్తిలా పనిచేసింది. ఈ నేపథ్యంతో 2000-2001లో ఒక లక్ష్యం కోసం ప్రభుత్వం ప్రారంభించిన కార్యక్రమమే ఈ TDIL. అప్పట్లో ఏడు ప్రధాన కార్యకలాపాలపై ఇది దృష్టి కేంద్రీకరించింది. అవి... పరిజ్ఞాన వనరులు, పరిజ్ఞాన సాధనాలు, అనువాదానికి మద్దతు వ్యవస్థలు, మానవ - యంత్ర సంప్రదింపు వ్యవస్థలు, స్థానీకరణ, ప్రమాణీకరణ, భాషా సాంకేతిక మానవ వనరుల అభివృద్ధి. మొత్తం 18 భారతీయ భాషల్నీ కలుపుకుని వెళ్ళేలా భారతీయ భాషల సాంకేతిక పరిష్కారాల కోసం 13 రిసోర్స్ సెంటర్ల (RC-ILTS) కు తోడ్పాటు ఉంది."

"అస్సామీ, హిందీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒరియా, పంజాబీ, తమిళం, తెలుగు, ఉర్దూ, గుజరాతీ, సంస్కృతం, బోడో, డోగ్రీ, మైథిలీ, నేపాలీ, బెంగాలీ, కాశ్మీరీ, కొంకణి, మణిపురీ, సంతాలీ, సింధీ భాషలకు సంబంధించి TDIL డేటా సెంటర్ నుంచి ఉచితంగా ఫాంట్స్, సాఫ్ట్‌వేర్ సాధనాల్ని పొందవచ్చు."

"TDILకు ప్రస్తుతం దేశవ్యాప్తంగా 13 రిసోర్స్ సెంటర్లున్నాయి. అవి.. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కాన్పూర్ (హిందీ, నేపాలీ), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ముంబై (మరాఠీ, కొంకణి), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, గువాహటి (అస్సామీ, మణిపురీ), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, బెంగళూరు (కన్నడ, సంస్కృతం), ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్, కోల్‌కత (బెంగాలీ), జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం, న్యూఢిల్లీ, విదేశీ భాషలు (జపనీస్, చైనీస్) మరియు సంస్కృతం (భాషా అధ్యయన వ్యవస్థలు), హైదరాబాద్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ (తెలుగు), అన్నా విశ్వవిద్యాలయం, చెన్నై (తమిళం), ఎంఎస్ విశ్వవిద్యాలయం, బరోడా (గుజరాతీ), ఉత్కళ విశ్వవిద్యాలయం, కంప్యూటర్ సైన్స్ మరియు అప్లికేషన్ విభాగం (ఒరియా), థాపర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, పాటియాలా (థాపర్), ERDCI, తిరువనంతపురం (మలయాళం), మరియు CDAC, పూణే (ఉర్దూ, సింధీ, కాశ్మీరీ )."

"TDILలో మేమంతా ఇంగ్లీష్ అడ్డంకిని అధిగమించే ఒక అద్భుత ప్రపంచం దిశగా పనిచేస్తున్నాం. ఈ క్రమంలో వేసిన తొలి అడుగే National Roll Out పథకం. ఈ పథకంలో భాగంగా జనబాహుళ్యం కోసం 22 భారతీయ భాషల్లోనూ సాఫ్ట్‌వేర్ సామగ్రి, ఫాంట్స్ విడుదల చేశాం. National Roll Out పథకపు CD-ROMలో ఫాంట్లు, కీబోర్డ్ డ్రైవర్లు, కన్వర్టర్లు, ఎడిటర్లు, టైపింగ్ బోధినులు, సమగ్ర Word Processor, భారతీయ Open Office, ద్విభాషా నిఘంటువులు, Spell checker, ట్రాన్స్‌లిటరేషన్ సాధనం, బ్రౌజర్, ఇ-మెయిల్ క్లయింట్, మెసెంజర్, టెక్ట్స్ టు స్పీచ్ వ్యవస్థ మరియు OCRలు ఉన్నాయి. ఈ CD-ROMను ఎవరైనా www.ildc.gov.in మరియు www.ildc.in నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు లేదా ఈ వెబ్‌సైట్లలో పేర్లు నమోదు చేసుకుంటే వారి చిరునామాకు ILDC ఈ CD-ROMను పంపిస్తుంది. ఇది పూర్తిగా ఉచితం."

"ప్రస్తుతం TDILలో నడుస్తున్న ప్రధాన ప్రాజెక్ట్‌ల విషయానికి వస్తే... ఇంగ్లీష్ నుంచి భారతీయ భాషల్లోకి యంత్రానువాద (Machine Translation) వ్యవస్థ (CDAC, పూణే), ఆంగ్ల భారతి టెక్నాలజీ ద్వారా ఇంగ్లీష్ నుంచి భారతీయ భాషల్లోకి యంత్రానువాద వ్యవస్థ (ఐఐటి, కాన్పూర్), భారతీయ భాష నుంచి భారతీయ భాషలోకి యంత్రానువాద వ్యవస్థ (ఐఐఐటి, హైదరాబాద్), సంస్కృతం - హిందీ యంత్రానువాదం (హైదరాబాద్ విశ్వవిద్యాలయం, జెఎన్‌యు), భారతీయ భాషల పత్ర విశ్లేషణ మరియు గుర్తింపు వ్యవస్థ (ఐఐటి ఢిల్లీ), ఆన్‌లైన్ ద్వారా చేతిరాత గుర్తింపు (ఐఐఎస్‌సి, బెంగళూరు), భాషావ్యాప్త సమాచార సేకరణ (ఐఐటి, బాంబే), Speech Corpora & Technologies (ఐఐటీ, చెన్నై), భారతీయ భాషల పదసంచయ కార్యకలాపాలు (జెఎన్‌యు, న్యూఢిల్లీ) వంటివి కొనసాగుతున్నాయి."

"భాషా సాంకేతిక వ్యవస్థ భారతీయ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక లాంటిది. ఎగుమతులవైపు చూస్తున్న సాఫ్ట్‌వేర్ పరిశ్రమ స్థానిక అవసరాలమేరకు ఐటీ సొల్యూషన్లు అందిస్తూ దేశీయంగా ఐటీ అభివృద్ధికి దారితీసేలా స్థానిక మార్కెట్ల వైపు దృష్టిసారించేలా ఇది కచ్చితంగా చెయ్యగలదు. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ టెక్నాలజీ అభివృద్ధి అనే లక్ష్యాన్ని దాటి ముందుకెళ్ళాలి. విస్తృత సమాజంలో పై స్థాయి నుంచి కింది స్థాయి వరకూ ఈ సాధనాల్ని వినియోగించుకునేందుకు ఇతర మంత్రిత్వశాఖలు, రాష్ట్ర ప్రభుత్వాల కృషి కూడా తోడవ్వాలి."

ఆధారము: భాష ఇండియా.కం

3.00515463918
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు