పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

CSC RAP భీమా నమోదు

గ్రామీణ అధీకృత వ్యక్తి (రూరల్ అతరైజ్డ్ పర్సన్ RAP) భీమా కంపెనీల తరపున భీమా తీసుకోవాలనుకున్న వారితో భీమా పాలసీల గురించి చర్చించడానికి అనుమతి కలిగిన వ్యక్తి. ఇప్పుడు VLEలు గ్రామీణ అధీకృత వ్యక్తులు (RAP)గా మారవచ్చు మరియు APNA CSC పోర్టల్ ద్వారా భీమా ఉత్పత్తులను అమ్మవచ్చు

గ్రామీణ అధీకృత వ్యక్తి (రూరల్ అతరైజ్డ్ పర్సన్ RAP) భీమా కంపెనీల తరపున భీమా తీసుకోవాలనుకున్న వారితో భీమా పాలసీల గురించి చర్చించడానికి అనుమతి కలిగిన వ్యక్తి. ఇప్పుడు VLEలు గ్రామీణ అధీకృత వ్యక్తులు (RAP)గా మారవచ్చు మరియు APNA CSC పోర్టల్ ద్వారా భీమా ఉత్పత్తులను అమ్మవచ్చు. VLEలు RAPగా మారాలంటే RAP శిక్షణను పూర్తి చేయాలి మరియు NIELIT నిర్వహించిన పరీక్షలో ఉత్తీర్ణులు కావాలి.

RAP అవ్వటంవలన ప్రయోజనాలు

 • అవాంతరాలు లేని ఆన్లైన్ అనుమతి
 • ఇప్పటికే బీమా కంపెనీల ఎజెంటుగా ఉన్నవారు RAP అనుమతిని పొందవచ్చు
 • ఓవర్ ది కౌంటర్ పాలసీ పంపిణి
 • ఒకే పోర్టల్ లో చాలా సంస్థలు ఉంటాయి
 • విక్రయించిన అన్ని ఉత్పత్తులకు తక్షణ కమిషను ఉంటుంది
 • VLE లైఫ్ & జనరల్ ఇన్సూరెన్స్ రెండు ఉత్పత్తులను అమ్మవచ్చు

VLE అనుమతి కిలిగిన RAPగా మారడానికి చేయవలసినవి

 • http://164.100.115.10/insurance/ లో RAPగా నమోదు చేసుకొండి. నమోదు ప్రక్రియ సమయంలో మీరు మీ చిరునామా రుజువు, ఫోటో గుర్తింపు రుజువు, PAN పత్రము మరియు విద్య రుజువు నఖలులను పేజీలో ఎగుమతి చేయటం అవసరం.
 • మీరు పొందిన నమోదు సంఖ్యను ఉపయోగించి పరీక్ష మరియు అనుమతుల కొరకు రూ.350/ - ఫీజు చెల్లించాలి. గమనిక: నమోదు తేదీ నుండి (RAP పోర్టలులో పంపిన వివరాలను తనిఖీ చేసిన తర్వాత) RAP వాడకం దారు పేరు మరియు పాస్వర్డును పొందటానికి వారం సమయం పడుతుంది. ఒకవేళ VLE పరీక్షలో ఉత్తీర్ణులు కాకపోతే లేదా హాజరు కాకపోతే, వారు ప్రతి పరీక్షకు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఫీజును http://www.apna.csc.gov.in/ లో మీ ఇ-వాలెట్ను ఉపయోగించి చెల్లించాలి.
 • RAP శిక్షణ కోసం అనుమతి గుర్తింపు మరియు పాస్వర్డును టీమ్ భీమా, CSC SPV నుండి VLE పొందుతాడు.
 • VLE అనుమతి పత్రం పొందడానికి తొలి ఆన్ లైన్ పరీక్షను పూర్తిచేయాలి. ఆన్లైన్ పరీక్ష పూర్తయిన తర్వాత పూర్తి యోగ్యతా పత్రాన్ని పొందితాడు. శిక్షణ అంచనా మరియు మాడ్యూల్లను Google Chrome బ్రౌజరును ఉపయోగించి పొందవచ్చు.
 • VLE మాడ్యూల్లు మరియు అంచనా పూర్తయిన తర్వాత వారి కేంద్రం నుంచి లేదా ఇంటి నుండి ఇవ్వగలిగే ఆన్లైన్ పరీక్ష రాయాలి. VLEకు ఇంటర్నెట్ మరియు వెబ్ కెమెరా యాక్సెస్ ఉండాలి.

పరీక్ష ముఖ్య లక్షణాలు,

 • పని రోజులు అనగా సోమవారం నుండిశుక్రవారం (4pm కు 10AM) వరకు పరీక్ష లింకు చురుకుగా ఉంటుంది.
 • పరీక్ష తేదీ కోసం వేచి ఉండవలసిన అవసరం లేదు.
 • పరీక్ష హిందీ/ఇంగ్లీష్ లో ఇవ్వవచ్చు

పరీక్ష రాసే విధానము

 • లింక్http://164.100.115.10/insurance/ తెరిచి "ఆన్లైన్ ఇన్సూరెన్స్ పరీక్ష" పై క్లిక్కు చేయండి.
 • మీ OMT గుర్తింపును, నమోదు సంఖ్య మరియు క్యాప్చా సంకేతాన్ని నమోదు చేయండి.
 • అప్పుడు మీరు పరీక్ష వెబ్ సైటుకు మరల్చ బడతారు.
 • వెబ్ కెమెరా ఉపయోగించి మీ చిత్రాన్ని తీసుకుని, దీన్ని సమర్పించండి.
 • ప్రామాణీకరణ కోసం వెబ్ క్యామ్ ముందు ఒక ఫోటో గుర్తింపును ఉంచి దానిని స్నాప్ షాట్ తీయండి. తర్వాత మీరు మీ RAP పరీక్ష ప్రారంభించండి.
 • పరీక్ష సమర్పించిన తర్వాత VLE మార్కులను పొందుతారు.
 • ప్రతి పరీక్షకు ఉత్తీర్ణత శాతం 35 ఉండాలి. ఉత్తీర్ణులైన వారికి "పాస్" అని ఉండే మార్కుల నివేదిక వస్తుంది. దీనిలో ఏ సంఖ్యా స్కోరు చూపబడదు. పరీక్షలో విఫలం అయిన వారు "ఫేయిల్ " అని ఉండే మార్కుల నివేదిక కనబడుతుంది. దీనిలో ఏ సంఖ్యా స్కోరు చూపబడదు.
పరీక్ష ఉత్తీర్ణత తేదీ నుండి, 10-15 రోజులు VLE పోర్టల్ లో సేవలు క్రియాత్మకం అవడానికి పడుతుంది. ఇరిస్ ఉపకరణము మరియు అనుమతి పత్ర హార్డ్ కాపీ రాష్ట్ర కోఆర్డినేటరుకు పంపబడుతుంది. VLE కింది అన్ని పత్రాలను CSCకి పంపాలి. మొదటి 3 పత్రాలు పరీక్ష ఉత్తీర్ణత తర్వాత http://164.100.40.23/rap/Admin/document_download.aspx లింకుతో దిగుమతి చేసుకోవచ్చు
 • 1. ఒప్పుకోలు పత్రము (సంతకం)
  2.RAP షరతులు (సంతకం)
  3.RAP లైసెన్సు (సంతకం)
  4. సంతకం చేసిన కాపీలు
   • గర్తింపు రుజువు
   • చిరునామా రుజువు
   • పాన్ కార్డ్
   • విద్య రుజువు
   • అనుమతి పత్రం తిరిగి ఇచ్చేసినట్టు రుజువు (ప్రస్తుతం లైసెన్సు ఉంటే)

5. ఒక పాస్పోర్ట్ సైజు వర్ణ చిత్రం

ప్రశ్నల కోసం, ఫోను చేయండి - 180030003468/011 49754815/16, ఇమెయిల్ - insurance@csc.gov.in, Raise Helpdesk ticket-http://helpdesk.csc.gov.in/

 

మూలం : http://164.100.115.10/insurance

సంబంధిత వనరులు

 1. RAP పై FAQs
2.94230769231
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు