హోమ్ / ఇ-పాలన / విఎల్ఇల కొరకు వనరులు / వికాస్ పీడియా ఉత్పత్తులు మరియు సేవలు
పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

వికాస్ పీడియా ఉత్పత్తులు మరియు సేవలు

ఈ విభాగం వికాస్ పీడియా ఉత్పత్తి మరియు సేవల వివరాలు అందిస్తుంది.

వ్యాపర్ : ఉమ్మడి మార్కెట్ ప్రదేశం

నిపుణులను ప్రశ్న అడగండి

పిల్లల కొరకు మల్టి మీడియూ పాఠాలు

మల్టి మీడియూ సి.డిలు

బహుళ మాధ్యమాల (భాషల) ఉత్పత్తులు

'పోషకాహారం, ఆరోగ్యం'

భారతీయ వైద్య పరిశోధనా సంస్ధ (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్- ఐ.సి.ఎమ్.ఆర్) క్రింద పనిచేస్తూ ఉండే ఒక ప్రముఖ పరిశోధనా సంస్ధ అయిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (జాతీయ పోషకాహార సంస్ధ) వారి సహకారంతో ఈ సమగ్ర బహు-భాషల సి.డి. రూపొందించబడింది. ఈ సి.డి.లోని సమాచారాన్ని నాలుగు కీలకమైన శీర్షికలుగా పేర్కొనడం జరిగింది. అవిః మీ ఆహరాన్ని గురించి తెలుసుకోండి; పోషకాహారాల అవసరాలు, అవి లభించే పదార్ధాలు; ఆహారం-వ్యాధులు మరియు ఆహార భధ్రత అనేవి. సామాజిక ఆరోగ్య కార్యకర్తలకు, పారా మెడికల్ సిబ్బందికి (వైద్యులకు సహాయపడడంలో శిక్షణపొందిన వారికి), విద్యార్ధులకు, గృహిణులకు ఇంకా తాము తీసుకుంటున్న ఆహారాన్ని గురించి, అలాగే ఆరోగ్యవంతమైన జీవనశైలిని కొనసాగించడంలో దాని పాత్రను గురించి తెలుసుకోవాలనే కుతూహలం గలవారికి ఇది ఉపకరిస్తుంది.

లభ్యమయ్యే భాషలు:

ఈ సి డి, ప్రస్తుతానికి, ఈ కింది జంట భాషలలో లభిస్తున్నది

 1. ఇంగ్లీషు-హిందీ
 2. ఇంగ్లీషు-తెలుగు
 3. ఇంగ్లీషు-తమిళం
 4. ఇంగ్లీష్-మరాఠి
 5. ఇంగ్లీష్-బంగ్లా
 6. ఇంగ్లీష్-అస్సామీస్

ఎక్కడ కొనవచ్చు?

 • పబ్లికేషన్ కౌంటర్, ఇ..టి. విభాగం, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, ఐ.సి.ఎమ్.ఆర్. జామై ఉస్మానియా పోస్ట్, హైదరాబాద్-500 604, ఆంధ్ర ప్రదేశ్, ఫోన్ నం. 040-27197345, వద్ద ఇది అమ్మకానికి లభిస్తుంది.
 • ఒక్కొక్క సి డి వెల 75.00 రూపాయలు
 • హైదరాబాద్ లో చెల్లుబాటయ్యే లాగ ‘డైరెక్టర్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్‘ పేరిట రు. 75 లకు క్రాస్డ్ డిమాండ్ డ్రాఫ్ట్ ను తీసి, పై చిరునామాకు పంపినవారికి సి.డి. రిజిస్టర్డ్ వి.పి.పి. ద్వారా పంపబడుతుంది.
 • వి.పి.పి. కయ్యే ఖర్చును (కేపలం పోస్టల్ ఛార్జిలకు మాత్రమే) అందుకునే వారే భరించాల్సి ఉంటుంది.
 • మీకు సందేహాలు, ప్రశ్నలు ఏమైనా ఉంటే ninpub@hotmail.com కు పంపండి.

'ఔషధీయ, సుగంధభరిత మరియు రంగుల అద్దకానికి ఉపయోగపడే పంటల ఉత్పత్తి'

వాణిజ్యపరంగా ప్రాధాన్యం గల 54 ఔషధ పంటలు, సుగంధభరిత పంటలు మరియు రంగులు అద్దడానికి ఉపయోగపడే పంటల ఉత్పత్తిని గురించి, ఉత్పత్తులను గురించి మరియు మార్కెటింగ్ విధానంపై కూడా సమగ్ర సమాచారంతో స్ధానిక భాషలలో ఈ సి.డి.లో ప్రశ్నలు, జవాబుల రూపంలో పొందుపరచబడింది.

లభ్యమయ్యే భాషలు: - హిందీ - తెలుగు – తమిళంఇంగ్లీషు

మరిన్ని వివరాలకోసం: indg@cdac.in ని సంప్రతించండి

'కాలువ చివర భూములలో వరిసాగులో ఎదురయ్యే ఇబ్బందులను తగ్గించుకోవడానికి మార్గదర్శకాలు'

తమిళనాడు లోని మధురైకి చెందిన సి.సి.డి. సంస్ధతో కలసి, బహుళ భాషలలో ఈ సి.డి. ని ఆవిష్కరించడం జరిగింది. విపత్తుల ప్రభావాన్ని తగ్గించడం అనే మౌలికమైన, ప్రధానావసరాన్ని గుర్తించి, ఇటువంటి సమస్యను అధిగమించడానికి అనుసరించవలసిన 4 సూత్రాల వ్యూహాన్ని గురించి ఈ సి.డి. విశదీకరిస్తుంది. తమిళ నాడులోని కావేరి డెల్టా (మైదాన ప్రాంతం) లో, సునామీ భాధిత రైతుల సహభాగస్వామ్యంతో, నాలుగు సంవత్సరాలకు పైగా నిర్వహించబడిన ప్రయోగఫలితంగా, ఈ సి.డి. రూపుదిద్దుకుంది. ఈ వ్యూహాలను అమలుచేయడంలో ఉపకరించే విధానాలను, పధ్దతులను గురించిన సంగ్రహ సమాచారాన్ని కూడా ఈ సి.డి. అందిస్తుంది. ఈ బహు భాషా (మల్టీ మీడియా) సి..డి. స్వయంగా నేర్చుకొనగలిగే సాధనంగా ఉపయోగపడటమే కాక, క్షేత్రస్ధాయి అభివృధ్ది కార్యకర్తలకు, పరిశోధకులకు మరియు విస్తరణను చేపట్టే అధికారులకు కూడా ఒక శిక్షణా కరదీపికగా కూడా ఉపకరిస్తుంది.

లభ్యమయ్యే భాషలు:తమిళం - ఇంగ్లీషు

మరిన్ని వివరాలకోసం: indg@cdac.in ని సంప్రతించండి

'సుస్ధిరమైన వ్యవసాయం'

పంటపొలాలలో తీసిన అనేక వీడియో చిత్రాలతో, మరెన్నో ఫోటోలతో స్పష్టమైన విషయ వివరణకు మరింతగా తోడ్పడుతూ, సుస్ధిర వ్యవసాయోత్పత్తికి అనుసరించవలసిన పధ్దతులను గురించిన సమాచారాన్ని ఈ సి.డి. సవివరంగా అందిస్తుంది. రైతులకు, స్వఛ్చంద సేవా సంస్ధలకు (ఎన్.జి.ఓ) ఈ సి.డి. ఎంతగానో ఉపకరిస్తుంది. హైదరాబాద్ కు చెందిన సెంటర్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్ మరియు సెర్ప్ (ఎస్.ఇ.ఆర్.పి) సంస్దలు ఈ సమాచారాన్ని సమకూర్చాయి.

లభ్యమయ్యే భాష: తెలుగు

మరిన్ని వివరాలకోసం: indg@cdac.in ని సంప్రతించండి

ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు

3.0
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు