'అమ్మలగన్న అమ్మ ముగురమ్మల మూలపుటమ్మ.. కనకదుర్గమ్మ' కొలువుదీరిన విజయవాడ విద్యలవాడగానూ పేరుగాంచింది. రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించిన పలు కార్పొరేట్ కళాశాలలకు బీజం పడింది ఇక్కడే. రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా విద్యార్థులు విజయవాడ వచ్చి విద్యాభ్యాసం చేస్తారు. ఇక్కడి కార్పొరేట్ కళాశాలల శాఖలు అన్ని చోట్ల పెట్టడంతో విద్యార్థుల రాక కొంతమేర తగ్గినా ఇంకా పూర్తిగా తగ్గలేదని చెప్పవచ్చు .నగరంలో హెల్త్ యూనివర్సిటీ ఎన్టీఆర్ హయాంలో రూపుదిద్దుకుంది. అందువల్లే దీనికి ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం అని పేరువచ్చింది. దీనికిందే రాష్ట్రంలోని అన్ని వైద్య కళాశాలలు ఉంటాయి.
కృష్టా యూనివర్సిటీ సమాచారం
జిల్లాకో విశ్వవిద్యాలయం ఉండాలన్న ప్రభుత్వ, నాలెజ్డ్ కమిషన్ సిఫారసుల మేరకు కృష్ణా యూనివర్సిటీ ఏర్పాటైంది. ఏప్రిల్23, 2008న అప్పటి ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మచిలీపట్నంలోని రాజుపేట ప్రాంతంలో ఆంధ్ర జాతీయ కళాశాల ప్రాంగణంలో(పిన్‌కోడ్- 521001) కృష్ణా యూనివర్సిటీ భవనం తాత్కాలిక నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అప్పటి వరకు నాగార్జున యూనివర్సిటీ పరిధిలో ఉండే కళాశాలలు ఈ యూనివర్సిటీ పరిధిలోకి వచ్చాయి. జిల్లాలో ఉన్న 131 కళాశాలలు ప్రస్తుతం కృష్ణా యూనివర్సిటీకి అనుంబంధంగా పనిచేస్తున్నాయి. వీటితో పాటు నూజివీడులోని పీజీ సెంటర్‌ను కూడా ఇటీవల కృష్ణా యూనివర్సిటీ పరిధిలోకి తెస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
భవన నిర్మాణానికి స్థలాల గుర్తింపు
కృష్ణా యూనివర్సిటీ భవన నిర్మాణానికి మచిలీపట్నం మండలంలోని రుద్రవరం, గూడూరు మండల కేంద్రంలో రెండుచోట్ల మొత్తం 147 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. ప్రస్తుతం భవన నిర్మాణాలకు ప్రభుత్వం జూన్‌లో దాదాపు 5కోట్లు మంజూరు చేసింది. పరిపాలనా విభాగం, తరగతి గదులు ఎక్కడ నిర్మించాలన్న విషయమై ప్రస్తుతం యూనివర్సిటీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
ప్రస్తుతం మచిలీపట్నం క్యాంపస్‌లో పలు కోర్సులకు సంబంధించిన వివరాలు.
కొత్తగా ప్రవేశపెట్టిన కోర్సులు
విశ్వవిద్యాలయ పరిధిలో నడుస్తున్న పీజీ కోర్సులు
దివిసీమనుంచి వచ్చేవారు కూడా కోనేరు సెంటరు మీదుగా వెళ్లవచ్చు. గుడివాడ రెవెన్యూ డివిజన్ పరిధి ప్రాంతాలనుంచి రావాలంటే బస్టాండుమీదుగా కోనేరుసెంటర్- నాగపోతురావు సెంటర్ మీదుగా యూనివర్సిటీకి వెళ్లవచ్చు. ప్రస్తుతం యూనివర్సిటీ ఆంధ్రజాతీయ కళాశాల ప్రాంగణంలోనే కొనసాగుతోంది.
ఆంధ్రా జాతీయ కళాశాల
చారిత్రక ప్రాధాన్యం సంతరించుకున్న కళాశాల మచిలీపట్నం ఆంధ్రా జాతీయ కళాశాల. స్వాతంత్రోద్యమ పోరాట సమయంలో దేశ నాయకుల స్ఫూర్తితో 1910లో కళాశాల ప్రారంభించారు.
వృత్తి విద్యలు
అప్పటి సామాజిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని వృత్తి విద్యా కోర్సులను కళాశాలలో ప్రారంభించారు. సంగీతం, సంస్కృతం, శిల్పకళ, దారు శిల్పకళ, కలంకారీ, తివాచీనేత, చరఖా వడుకటం, నేత, చిత్రకళ, వ్యవసాయం, గుర్రపుస్వారీ, వ్యాయామ విద్యలు తదితరాలపై ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన అధ్యాపకులతో మెరుగైన బోధన సాగేది. అనంతరం కాలానుగుణం 1949లో ఆంధ్రా విశ్వవిద్యాలయానికి అనుబంధంగా మారి డిగ్రీ కోర్సులను ప్రవేశపెట్టారు.
ప్రముఖులతో సంబంధాలు
జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య, కౌతా రామశాస్త్రి, ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, చెరుకువాడ నరసింహం పంతులు, అడవి బాపిరాజు, కాటూరి వెంకటేశ్వరరావు తదితర మహనీయులు ఈ కళాశాలో పనిచేశారు.
మహాత్మాగాంధీ, అనిబీసెంట్, సరోజినినాయుడు, అయ్యదేవర కాళేశ్వరరావు, కాశీనాధుని నాగేశ్వరరావు పంతులు, డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ తదితర నాయకులు కళాశాలను సందర్శించి జాతీయవిద్యా బోధన, విద్యార్థుల్లో జాతీయ స్ఫూర్తి రగిలించేలా ఉన్న కళాశాల నిర్వహణ పట్ల శ్లాఘించారు.
ప్రాశస్త్యం
దేశ జాతీయ పతాకం అయిన మువ్వన్నెల జెండా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రాజముద్ర రూపకల్పనకు వేదికగా నిలిచింది ఆంధ్రాజాతీయ కళాశాల ప్రాంగణమే.
ప్రస్తుతం కళాశాలలో నడుస్తున్న కోర్సులు
నోబుల్ కళాశాల
దేశంలోని పురాతన కళాశాలలో మచిలీపట్నం నోబుల్ కళాశాల ప్రధానమైంది. 1843లో క్రిష్టియన్ మిషనరీస్ ఆధ్వర్యంలో రాబర్ట్ టుర్లింగ్‌టన్ నోబుల్ నేతృత్వంలో పాఠశాలగా ప్రారంభమై 1864లో మద్రాసు యూనివర్శిటీకి అనుబంధంగా కళాశాల హోదాను సంతరించుకుంది. 1938 వరకు దక్షిణభారతదేశంలో ప్రసిద్ధిగాంచిన నోబుల్ కళాశాలను గుంటూరు ఏసీ (ఆంధ్ర క్రిస్టియన్‌కళాశాల) కళాశాలను కలిపి విజయవాడలో కొత్తకళాశాల ఏర్పాటుచేయాలని లిండ్సే కమిషన్ సూచనలతో 1938 ఏజే కళాశాల మూతపడింది. తర్వాత కృష్ణా, గోదావరి డయాస్ బిషప్, స్థానిక ప్రముఖుల చొరవతో 1966లో కళాశాలను అప్పటి ముఖ్యమంత్రి, ఒకనాటి కళాశాల విద్యార్థి కాసు బ్రహ్మానందరెడ్డి చేతుల మీదుగా పునఃప్రారంభమైంది. అనంతరం 1985 వరకు విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీకి, తర్వాత నాగార్జున యూనివర్సిటీ, ప్రస్తుతం కృష్ణా యూనివర్సిటీ అనుబంధ కళాశాలగా పనిచేస్తోంది.
కోర్సులు
ఐదు దశాబ్ధాల చరిత్ర కలిగిన మారిస్ స్టెల్లా కళాశాల
బెంజిసర్కిల్ సాయిబాబా మందిరం సమీపంలో 1962లో మారిస్ స్టెల్లా కళాశాలను ప్రారంభించారు. ఇంటర్మీడియెట్ నుంచి పీజీ వరకు ఆర్ట్స్, సైన్స్, కంప్యూటర్ కోర్సులు ఇక్కడ ఉన్నాయి. టూరిజం ట్రావెల్ మేనేజ్‌మెంట్ సర్టిఫికెట్ కోర్సు, కంప్యూటర్ కోర్సులను కూడా కళాశాల అందిస్తోంది. ఇక్కడ సుమారు 2 వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. అన్ని సదుపాయాలతో కూడిన వసతి గృహం ఉంది. కళాశాలకు 'నాక్ ఏ' గ్రేడు గుర్తింపు లభించింది. విశాలమైన గ్రంథాలయం, ప్రయోగశాలతోపాటు పచ్చని చెట్లతో కళాశాల ప్రాంగణంలో ఆహ్లాదకరమైన వాతావరణం కన్పిస్తుంది. ఉత్తమ గ్రంథాలయం, ప్రయోగశాల, పర్యావరణమిత్ర అవార్డులను కళాశాల అందుకుంది. విద్యార్థులకు విలువలతో కూడిన విద్యను అందించడంతో పాటు కళలు, క్రీడల్లోనూ శిక్షణ ఇస్తున్నారు. ఏఎన్‌యూ పరిధిలో కళాశాల జట్టు బాస్కెట్‌బాల్ ఛాంపియన్‌గా నిలిచింది. అన్ని విభాగాలకు సంబంధించి అవగాహన సదస్సులు నిర్వహించడం, నాయకత్వ లక్షణాలు పెంపొందించేందుకు పలు కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్‌లో కూడా విద్యార్థినులు రాణిస్తున్నారు. 2011లో ఈ సంస్థ స్వర్ణోత్సవాలను జరుపుకొంది.
సిద్ధార్థ అకాడమీ
విజయవాడలో విద్యారంగం అభివృద్ధికి శ్రీకారం చుట్టింది సిద్ధార్థ అకాడమీనే. 1975లో పెద్దలు కీ.శే. డాక్టర్ పిన్నమనేని వెంకటేశ్వరరావు, ప్రముఖ ఆడిటర్లు ముమ్మనేని సుబ్బారావు తదితర విద్యాభిమానులతో సిద్ధార్థ అకాడమీ ఆఫ్ జనరల్ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ పేరుతో సంస్థలను నెలకొల్పారు. స్కూల్ దగ్గర నుంచి పీజీ ఇంజనీరింగ్, ఎంబీఏ వరకు అన్ని కోర్సులతో దాదాపు 20 విద్యాసంస్థలను నెలకొల్పిన ఘనత దీనికి దక్కుతుంది. కేవలం విద్యార్థినుల కోసం శ్రీదుర్గామల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాలను ప్రారంభించింది. మహాత్మాగాంధీ రోడ్డులోని హోటల్ ఫార్చ్యూన్ మురళీ పార్కు ఎదురు రోడ్డులో సువిశాలమైన ప్రాంగణంలో కళాశాలను ఏర్పాటు చేశారు. 1982 సంవత్సరంలో ఇంటర్మీడియెట్‌ను, 1983లో డిగ్రీని తరువాత పీజీ విభాగాలను ప్రారంభించారు. ఇంటర్మీడియెట్, డిగ్రీ, పీజీ కలిపి మొత్తం 3,500 మంది విద్యార్థులు ఇక్కడ విద్యను అభ్యసిస్తున్నారు. ఆర్ట్స్, సైన్స్, కంప్యూటర్స్, ఎలక్ట్రానిక్స్‌కు సంబంధించి వివిధ రకాల కోర్సులను అందిస్తున్నారు. అధునాతనమైన గ్రంథాలయం, ప్రయోగశాలల సదుపాయాలు ఉన్నాయి. హాస్టల్ వసతి కూడా ఉంది. కళాశాలకు నాక్ గుర్తింపు కూడా లభించింది. పర్యావరణమిత్ర అవార్డును కూడా పొందింది. కళలు, సంగీతం, క్రీడల్లో విద్యార్థినులకు శిక్షణ ఇస్తూ వారి సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తున్నారు. చదువుకుంటూనే ఉపాధి పొందే విధంగా వృత్తి విద్యా కోర్సుల్లో కూడా శిక్షణ అందిస్తున్నారు. సామాజిక సేవా కార్యక్రమాల పట్ల విద్యార్థుల్లో అవగాహన పెంచే విధంగా కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు, వివిధ రంగాల ప్రముఖులతో గెస్ట్ లెక్చర్లు, సదస్సులు నిర్వహిస్తారు.
సిద్ధార్థ వైద్య కళాశాల
విజయవాడ కానూరులోని వీఆర్ సిద్ధార్థ కళాశాల ఆవరణలో 1981లో సిద్ధార్థ ప్రైవేటు వైద్య కళాశాల ఆవిర్భవించింది. తర్వాత గుణదల ప్రాంతంలో కొంతమంది దాతలు ఇచ్చిన 55 ఎకరాల విస్తీర్ణలోని స్థలంలో భవానాలు నిర్మించి తరలించారు. అప్పట్లో ఎంబీబీఎస్‌లో 100 సీట్లుండగా, ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయం డిగ్రీలు ప్రదానం చేసేది. తర్వాత 1986లో ఇదే కళాశాల రెండు గదుల్లో ఆరోగ్య విశ్వ విద్యాలయం అంకురార్పణ జరగ్గా ఇదే కళాశాల యూనివర్సిటీ కళాశాలగా గుర్తింపు లభించడమే కాకుండా అప్పటి నుంచి రాష్ట్రవ్యాప్త కళాశాలగా మారింది. 2000లో యూనివర్సిటీ ఇదే ప్రాంగణంలో మరో భవనంలోకి మారి డీలింక్ అవగా ఇప్పటికీ రాష్ట్రవ్యాప్త కళాశాలగానే కొనసాగుతోంది. కొన్ని క్లినికల్, నాన్‌క్లినికల్ విభాగాల్లో పీజీ సీట్లు రాగా ప్రస్తుతానికి వాటి సంఖ్య 56కు పెరిగింది. భవిష్యత్తులో మరిన్ని స్పెషాలిటీస్‌లో సీట్లు పెరిగే అవకాశం ఉంది. గత ఏడాది ప్రభుత్వం ఎంబీబీఎస్ సీట్లను 150కి పెంచి ప్రవేశాలు చేపట్టగా ఎంసీఐ నిబంధనల మేరకు కళాశాలలో మార్పులు జరుగుతున్నాయి.
దేశంలోనే మొదటి ఆరోగ్య విశ్వవిద్యాలయం ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ
బెజవాడ నగరంలోని డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య వర్శిటీ దేశంలోనేమొట్టమొదటి ఆరోగ్య విశ్వవిద్యాలయం. దీనిని 1986లో ఏర్పాటు చేశారు. ఎంతో ప్రాధాన్యత కలిగిన వైద్య కోర్సులకు ప్రత్యేక విశ్వవిద్యాలయం అవసరమని గుర్తించిన అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారకరామారావు దీనిని ప్రారంభించారు. మొదట్లో దంతవైద్య కళాశాలలకు సంబంధించి మాత్రమే ఇక్కడ అడ్మిషన్లు నిర్విహించేవారు. ఆ తరువాత కొత్త కోర్సులకు వేదికగా మారుతూ విశ్వవిద్యాలయం స్థాయికి అభివృద్ధి చెందింది. హోమియోపతి, నర్సింగ్, ఆయుర్వేదం, యునాని కళాశాలలు కూడా ఈ వర్శిటీ పరిధిలోకి వచ్చాయి. దీనిలో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ), డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (డీసీఐ), ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ (ఐఎన్‌సీ), సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియన్ మెడిసిన్ నిబంధనల మేరకు ఆయా పోస్ట్‌గ్రాడ్యుయేషన్, గ్రాడ్యుయేషన్ కోర్సులకు అడ్మిషన్లను నిర్వహించి పట్టాలను ప్రదానం చేస్తున్నారు. యేటా ఎంసెట్‌లో ర్యాంకులు పొందిన విద్యార్థులకు ఇక్కడ కౌన్సెలింగ్ నిర్వహించి సీట్లను కేటాయిస్తారు. విశ్వవిద్యాలయం పరిధిలో మొత్తం 303 కళాశాలలు ఉన్నాయి. వీటిలో వైద్య కళాశాలలు-31, దంత వైద్య కళాశాలలు-19, ఆయుర్వేద వైద్య కళాశాలలు-5, హోమియో వైద్య కళాశాలలు-4, యునానీ వైద్య కళాశాలలు-2తో పాటు న్యాచురోపతి, యోగా కళాశాలలు ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి.
ఎన్టీఆర్ హెల్త్'వర్సిటీగా...
విశ్వ విద్యాలయం వ్యవస్థాపక కులపతిగా ఎన్టీ రామారావు వ్యవహరించేవారు. ఆయన మరణానంతరం ప్రత్యేక చట్టం ద్వారా 1998 ఫిబ్రవరి 2వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ పేరును 'ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం'గా మార్చారు. తర్వాత 2005లో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖర రెడ్డి హయాంలో డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయంగా మారింది.
పరీక్షలు, ప్రవేశాలు, పరిపాలన, ఫైనాన్స్, ఇంజనీరింగ్ శాఖలు ఏర్పడ్డాయి. ఇప్పటి వరకు ఆరుగురు వీసీలు మారగా, 17 మందిరిజిస్ట్రార్‌లు విధులు నిర్వహించారు. 2002లో సిద్ధార్థ వైద్య కళాశాల ప్రాంగణంలోనే ఓ భవనంలోకి విశ్వవిద్యాలయం కార్యకలాపాలను మార్చి నిర్వరిస్తున్నారు.
విశ్వవిద్యాలయ మాజీ రథసారథులు వీరే
విశ్వ విద్యాలయానికి రాష్ట్ర గవర్నర్ కులపతి (ఛాన్సలర్)గా ఉంటారు. కానీ స్థానికంగా యూనివర్సిటీ విధి విధానాలు, పరిపాలనను చూసేదంతా వైస్‌ఛాన్సలర్లు, రిజిస్ట్రార్లే. ఆరోగ్య విశ్వవిద్యాలయం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏడుగురు వీసీలు పనిచేయగా వారిలో కె.ఎన్.రావు, ఎల్.సూర్యనారాయణ. సీఎస్.భాస్కరన్, శ్యామ్‌సుందర్, ఆర్.సాంబశివరావు, ఏవీ కృష్ణంరాజుతో పాటు ప్రస్తుతం డాక్టర్ ఐవీ రావు ఉన్నారు. మొత్తం 19 మంది రిజిస్ట్రార్లు పనిచేయగా పూర్తి కాలం బాధ్యతలు చేపట్టింది ఆరుగురే. వారిలో పి.మహాపాత్రో, ఎం.జాన్ అప్పారావు, ఎన్.ఎస్.దాస్, ఎస్.ఎన్.రెడ్డి, పి.జయకర్‌బాబు, డాక్టర్ టి.వేణుగోపాలరావులతో పాటు ప్రస్తుతం రిజిస్ట్రార్ డాక్టర్ ఎస్.బాబూలాల్ 2013 జనవరి 9వ తేదీ నుంచి పనిచేస్తున్నారు.
డాక్టర్ ఆఫ్ సైన్స్ అవార్డులు
స్నాతకోత్సవం డీఎస్సీ అవార్డు
1. 7.12.96 కేంద్ర ప్లానింగ్ కమిషన్ సభ్యుడు ప్రొఫెసర్ జస్బీర్ సింగ్ బజాజ్
2. 5.02.98 న్యూఢిల్లీ ఎయిమ్స్ ప్రొఫెసర్ వి.రామలింగస్వామి
3. 4.02.99 చెన్నై అపోలో హాస్పిటల్స్, నెఫ్రాలజిస్ట్ డాక్టర్ ఎం.కె.మణి
4. 17.02.2000 ముంబై, న్యూక్లియర్ మెడిసిన్ డాక్టర్ ఆర్.డి.లిలీ
5. 19.02.01 న్యూఢిల్లీ ఎయిమ్స్, కార్డియోథొరాసిక్ సర్జన్ ప్రొఫెసర్ పి.వేణుగోపాల్
6. 25.02.02 బెంగళూరు నిమ్‌హాన్స్ డైరెక్టర్ డాక్టర్ ఎం.గౌరీదేవి
7. 13.02.03 ఎన్టీఆర్ యూహెచ్‌ఎస్ మాజీ ఉప కులపతి డాక్టర్ ఎల్.సూర్యనారాయణ. నిమ్స్ డైరెక్టర్ కాకర్ల సుబ్బరాజు., మాజీ డీఎంఈ డాక్టర్ సి.ఎం.హబీబుల్లా
8. 18.03.04 ఎన్టీఆర్‌యూహెచ్‌ఎస్ మాజీ ఉప కులపతి డాక్టర్ సి.ఎస్.భాస్కరన్
9. 23.04.05 ------
10. 01.03.2006 గుంటూరు మాజీ సూపరింటెండెంట్లు డాక్టర్ పి.లక్ష్మణరావు, డాక్టర్ వెంగళరావు, నిమ్స్ మాజీ డైరెక్టర్ డాక్టర్ డి.భాస్కరరెడ్డి
11. 28.02.2007 గుల్బర్గా మెడికల్ డైరెక్టర్ డాక్టర్ పి.ఎస్.శంకర్
12. 18.02.2008 న్యూరోసర్జన్ డాక్టర్ సుంకర బాలపరమేశ్వరరావు, పాథాలజీ ప్రొఫెసర్ డాక్టర్ చింతల రాజరామమోహన్
13. 10.03.2009 చండీగఢ్ డాక్టర్ కె.కె.తల్వార్, మాజీ డీఎంఈ డాక్టర్ పి.ఎస్.ఆర్.కె.హరనాధ్, యూరాలజీ డాక్టర్ ఎ.రంగనాధరావు, జనరల్ మెడిసిన్ డాక్టర్ ఎం.వీరరాఘవరెడ్డి
14. 10.04.2010 హైదరాబాద్, ఎల్వీప్రసాద్ ఆస్పత్రి, డాక్టర్ గుళ్లపల్లి ఎన్.రావు
15. 11.04.2011 న్యూఢిల్లీ ఎయిమ్స్ కార్డియాలజిస్ట్ కె.శ్రీనాథ్‌రెడ్డి
16. 02.05.12 డాక్టర్ విశ్వమోహన్ కటోచ్, కేంద్ర వైద్య శాఖ సెక్రటరీ జనరల్
17. 27.04.13 డాక్టర్ శాంత, అడయార్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఛైర్‌పర్సన్
కోర్సుల వివరాలు:సూపర్‌స్పెషాలిటీ కోర్సులు:సర్జికల్ ఆంకాలజీ, నెఫ్రాలజీ, కార్డియాలజీ, గ్యాస్ట్రో ఎంటరాలజీ, నెఫ్రాలజీ, న్యూరోసర్జరీ, ప్లాస్టిక్ సర్జరీ, పీడియాట్రిక్ సర్జరీ, ఎండోక్రైనాలజీ, క్లినికల్ ఫార్మాకాలజీ,జెనిటో యూరినరీ సర్జరీ.
పోస్టు గ్రాడ్యుయేషన్:ఎండీ, ఎంఎస్, ఎంఎస్సీ(అప్లయిడ్ న్యూట్రిషన్, ఎంపీటీ), ఎంఎస్సీ (నర్సింగ్).
యూజీ కోర్సులు:బ్యాచిలర్ ఆఫ్ మెడిసిన్ అండ్ బ్యాచులర్ ఆఫ్ సర్జరీ, బ్యాచులర్ ఆఫ్ డెంటల్ సర్జరీ, బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేదమెడిసిన్, బ్యాచిలర్ ఆఫ్ యునానీ సర్జరీ, బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరఫీ, మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ కోర్సులు ఉన్నాయి. వీటితో పాటు నర్సింగ్‌కోర్సుల్లో నాలుగు, రెండు సంవత్సరాల కోర్సులు ఉన్నాయి.
డిప్లమా కోర్సులుడీసీహెచ్, డీఏ, డీటీసీడీ, డీవీఎల్, డీఎంఆర్‌డీ, డీపీఎం, డీఓ, డీఎల్‌ఓ, డీజీఓ, డీసీపీడీ, పీహెచ్ కోర్సులుఉన్నాయి.
ఆంధ్రా లయోల కళాశాల
బెంజిసర్కిల్ సమీపంలోని జాతీయ రహదారి నుంచి గుణదల కొండ వరకు సుమారు 200 ఎకరాల విస్తీర్ణంలో 1953లో ఆంధ్రా లయోల కళాశాలను ప్రారంభించారు. ఇంటర్మీడియెట్ నుంచి పీజీ స్థాయి వరకు ఆర్ట్స్, సైన్స్, కంప్యూటర్, విజువల్ కమ్యూనికేషన్, ఎంబీఎ/ఎంసీఎ కోర్సులు ఇక్కడ ఉన్నాయి. కళాశాలలో సుమారు 3 వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. విద్యార్థినీ విద్యార్థులకు అన్ని సదుపాయాలతో కూడిన హాస్టల్ వసతి కూడా ఉంది. కళాశాలకు నాక్ 'ఏ' గ్రేడు గుర్తింపు లభించింది. విశాలమైన గ్రంథాలయం, ల్యాబొరేటరీతో పాటు పచ్చని చెట్లతో ఆహ్లాదకరమైన వాతావరణం కలిగి ఉంటుంది. ఉత్తమ గ్రంథాలయం, ప్రయోగశాల, పర్యావరణమిత్ర అవార్డులతో పాటు క్రీడలు, కళల్లో అంతర విశ్వవిద్యాలయాలు, రాష్ట్ర, జాతీయ స్థాయిలో గుర్తింపు లభించాయి. విద్యార్థులకు చదువుతో పాటు విలువలతో కూడిన నాణ్యమైన విద్యను అందించడంతో పేద, మధ్య తరగతి వర్గాల వారి ఆదరణ పొందింది. క్రమశిక్షణకు మారుపేరుగా నిలవడంతో ఇక్కడ చదివిన ఎంతో మంది విద్యార్థులు పలు రంగాలలో ప్రముఖులుగా పేరుతెచ్చుకున్నారు. వీరిలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి, లోక్‌సత్తా అధ్యక్షులు జయప్రకాష్‌నారాయణ్, రాష్ట్రమంత్రులు కాసు వెంకట కృష్ణారెడ్డి, మోపిదేవి వెంకటరమణ, ఎంపీ లగడపాటి రాజశేఖర్ తదితరులున్నారు. నాయకత్వ లక్షణాలు పెంపొందించేందుకు కళాశాలలో పలు సదస్సులు నిర్వహిస్తున్నారు. ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్‌లో కూడా విద్యార్థినులు రాణిస్తున్నారు. 2004లో కళాశాల స్వర్ణోత్సవాలను జరుపుకొంది. 2007లో ఇంజినీరింగ్ కళాశాలను కూడా స్థాపించి నాలుగు విభాగాల్లో కోర్సులను అందిస్తున్నారు. ఇదే ఆవరణలో కళాదర్శిని పేరిట ఏటా సాంస్కృతిక ఉత్సవాలను నిర్వహిస్తూ ఎంతో మంది చిన్నారులను కళా రంగంలో ప్రావీణ్యం పొందేలా ప్రోత్సహిస్తున్నారు.
ఎస్.ఆర్.ఆర్. అండ్ సీవీఆర్ విద్యాసంస్థ
జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో శ్రీ రాజా రంగయ్య అప్పారావు అండ్ చుండూరి వెంకటరెడ్డి (ఎస్.ఆర్.ఆర్ అండ్ సి.వి.ఆర్) ప్రభుత్వ కళాశాలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. జిల్లాలోని వివిధ గ్రామాలనుంచి విద్యార్థినీ, విద్యార్థులు వచ్చి ఇక్కడ విద్యనభ్యసిస్తుంటారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు వసతి గృహాలు ఉన్నాయి.1937వ సంవత్సరంలో మాచవరం డౌన్‌లో జూనియర్ కళాశాలగా ప్రారంభమైన ఈ కళాశాల దినదినాభివృద్ధి చెందుతూ ప్రస్తుతం డిగ్రీ, పీజీ, వృత్తి విద్యా, పోటీ పరీక్షలకు సంబంధించిన కోర్సులను కూడా అందిస్తోంది. ఇక్కడ చదువుకున్న విద్యార్థులు పలురంగాల్లో కీలక పాత్రను పోషిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు, ప్రముఖ సినీ నటులు సుత్తివీరభద్రరావు, కోట శ్రీనివాసరావు, కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ, జొన్నలగడ్డ సత్యనారాయణ, జంధ్యాల, ఎం.వి. రఘు, మాధవపెద్ది సురేష్ తదితరులు ఇక్కడ చదువుకున్నవారే. ఇవి కాకుండా ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, ప్రభుత్వ ఐ.టి.ఐ ఏర్పాటు చేసి నాలుగు దశాబ్దాలు దాటింది.
విజయవాడలో ఇంజినీరింగ్ కళాశాలల సమాచారం
పీవీపీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇంజినీరింగ్ కళాశాలను 1998 సంవత్సరంలో స్థాపించారు. ఇంజినీరింగ్ విద్యార్థులకు బీటెక్‌లో ఏరోనాటికల్, సివిల్, కంప్యూటర్స్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్స్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఐటీ, మెకానికల్ ఇంజినీరింగ్ బ్రాంచీలలో అవకాశాలున్నాయి. వీటితో పాటు ఎంటెక్‌లో కంప్యూటర్స్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, పవర్ సిస్టమ్స్ అండ్ కంట్రోల్, మెషీన్ డిజైన్, మైక్రోవేవ్ అండ్ కామన్ ఇంజినీరింగ్ కోర్సులు ఉన్నాయి. ఈ కళాశాల జేఎన్‌టీయూ (కాకినాడ) నుంచి అఫ్లియేషన్ పొందింది. నాక్ అక్రిడిటేషన్, ఎన్‌బీఏ అక్రిడిటేషన్ కలిగి ఉంది.
వీఆర్ సిద్థార్థ (అటాన్‌మస్) 1977 సంవత్సరంలో కానూరులో స్థాపించారు. మొదట్లో సంవత్సరానికి 300 మంది విద్యార్థులు చదివేవారు. ఆ తరవాత ఈ సంఖ్య పెరిగింది. ప్రస్తుతం సంవత్సరానికి 1300 వరకు విద్యార్థులు వివిధ ఇంజినీరింగు కోర్సులు అభ్యసిస్తున్నారు. కళాశాలలో ఈఈఈ, ఈసీఈ, సీఎస్‌ఈ, సివిల్, మెకానికల్, ఈఐఈ, ఐటీ బ్రాంచీల్లో విద్యార్థులకు అవకాశాలు కల్పిస్తున్నారు. స్థాపించిన సంవత్సరం నుంచి ఇప్పటివరకు 20 వేల మందికిపైగా విద్యార్థులు కోర్సులు పూర్తిచేసారు. ఎంటెక్‌లో వీఎల్‌ఎస్‌ఐ, టెలిమాటిక్స్, బీఎస్‌పీ, స్ట్రక్చర్స్, క్యాడ్, థర్మల్ ఇంజినీరింగ్, పవర్ ఎలక్ట్రానిక్స్, సీఎస్‌ఐటీ, సీఎస్‌ఈ చదవడానికి అవకాశాలున్నాయి. కళాశాల జేఎన్‌టీయూ (కాకినాడ)కు అనుబంధంగా.. స్వయం ప్రతిపత్తితో నడుస్తోంది.
జిల్లాలో ప్రాథమిక పాఠశాలలు 2518, ప్రాథమికోన్నత పాఠశాలలు 526, ఉన్నత పాఠశాలలు 453 ఉన్నాయి. ఇవికాకుండా విజయవాడ నగరంలో మున్సిపల్ పాఠశాలలున్నాయి. ఇందులో ప్రాథమిక పాఠశాలలు 66, ప్రాథమికోన్నత పాఠశాలలు 15, ఉన్నత పాఠశాలలు 28 ఉన్నాయి.
జడ్పీ పాఠశాలలు రెండు ఉన్నాయి. జడ్పీ బాలుర పాఠశాల, జడ్పీ బాలికల పాఠశాల పటమటలో ఉన్నాయి.
మచిలీపట్నం
పెడన
కైకలూరు
కలిదిండి
అవనిగడ్డ
చల్లపల్లి
నాగాయలంక
మొవ్వ
పామర్రు
ఆగిరిపల్లి
జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలు
నూజివీడు
తిరువూరు
విస్సన్నపేట
గంపలగూడెం
గుడివాడ
నందిగామ
పెనుగంచిప్రోలు
జగ్గయ్యపేట
మైలవరం
విజయవాడ పరిసర ప్రాంతాల్లోన్ని పాఠశాలలు, ఉన్నత పాఠశాలలు
ప్రాథమికోన్నత పాఠశాలలు
ప్రాథమిక పాఠశాలలు
ప్రైవేటు స్కూళ్లు
అరవింద హైస్కూల్
మేసరపల్లి, విజయవాడ ఫోన్: 0864- 5246877
అరుణోదయ కాన్సెప్ట్ స్కూల్
అరుణోదయ స్ట్రీట్, విద్యాధరపురం, విజయవాడ, ఫోన్: 2411914
అమలేశ్వరీ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూట్
మచిలీపట్నం, కృష్ణాజిల్లా ఫోన్: 08672- 22081
అక్షర ఇంటర్నేషనల్ స్కూల్
అశోక్‌నగర్, బందరురోడ్డు, విజయవాడ, ఫోన్: 2554824/25/26/27
ఆదిత్య విద్యానికేతన్
ఎన్‌ఎస్‌ఎం రోడ్డు, పటమట విజయవాడ-10, ఫోన్: 2489992
ఆదిత్య నికేతన్
ఆపోజిట్ బీఎస్‌ఎన్‌ఎల్ భవన్
చుట్టుగుంట, విజయవాడ ఫోన్: 9247449479
ఆదర్శ మోడల్ స్కూల్
నియర్ తాడిగడప సెంటర్, పోరంకి విజయవాడ, ఫోన్: 2583744
అభ్యుదయ పబ్లిక్ స్కూల్
9-62-81, ఇస్లాంపేట, గణపతిరావురోడ్డు, విజయవాడ ఫోన్: 2562792
అట్కిన్‌సన్ హైస్కూల్
కాన్వెంట్ స్ట్రీట్, విజయవాడ-1 ఫోన్: 2565790
బిషప్ అజరయ్య హైస్కూల్ ఫర్ గర్ల్స్
డోర్నకల్ రోడ్డు, సూర్యారావుపేట, విజయవాడ-2 ఫోన్: 2476925
బ్రిలియంట్స్ కాన్వెంట్
ఇబ్రహీంపట్నం, విజయవాడ ఫోన్: 2882562
బాల విజ్ఞాన్ పబ్లిక్ స్కూల్
అయ్యప్పనగర్, విజయవాడ-4 ఫోన్: 2551178, 2559528
బెజవాడ రాజారావు అరుణోదయ కాన్సెప్ట్ హైస్కూల్
ఆవాస్‌గూడ స్ట్రీట్, విద్యాధరపురం విజయవాడ-12, ఫోన్: 2411914
భాష్యం విద్యా సంస్థలు
గాయత్రీనగర్, విజయవాడ ఫోన్: 9848536971, 9848536941
బ్లూమింగ్‌డేల్ ప్లే స్కూల్
ఆచార్య రంగానగర్, నియర్ బెంజిసర్కిల్
విజయవాడ-10 ఫోన్: 3250222, 9849142363
బడ్స్ అండ్ బ్లోజమ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్
మధు చౌక్, ప్రజాశక్తినగర్
విజయవాడ-10 ఫోన్: 2472155
సీపీ బ్రౌన్ టాలెంట్ స్కూల్
బాలాజీనగర్, కృష్ణలంక, విజయవాడ-13
కేంబ్రిడ్జి స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్
నియర్ వినాయక ధియేటర్, రింగ్‌రోడ్డు,
విజయవాడ-8 ఫోన్: 2544280
సెంట్రల్ పబ్లిక్ స్కూల్ అండ్ రెసిడెన్షియల్ హైస్కూల్
గురునానక్‌రోడ్డు, టీచర్స్‌కాలనీ
విజయవాడ-8 ఫోన్: 2476715
చైతన్య భారతి గర్ల్స్ హైస్కూల్
అశోక్‌నగర్, విజయవాడ-7 ఫోన్: 2478417
క్రిస్టోఫర్ పబ్లిక్‌స్కూల్
నియర్ సాయిబాబా టెంపుల్, విజయవాడ-8 ఫోన్: 2472763
సిటీ కాన్వెంట్ అండ్ హైస్కూల్
నియర్ శివాలయం, మొగల్రాజపురం, విజయవాడ-10
ఫోన్: 2477759
డీవీఎస్‌ఆర్ పబ్లిక్‌స్కూల్
గ్రీన్ ఫీల్డ్స్, పోరంకి, విజయవాడ
ఫోన్: 2581101
ఢిల్లీ పబ్లిక్ స్కూల్
నిడమానూరు, విజయవాడ
డాన్ బాస్కో స్కూల్
ఆపోజిట్ జ్యోతిమహల్ ఆశ్రమం రోడ్డు, విజయవాడ-10
డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఇంగ్లీషు మీడియం హైస్కూల్
పాపయ్యనగర్, కృష్ణలంక, విజయవాడ-13
ఫోన్: 2486774
ఇమ్మానీల్ ఇనిస్టిట్యూషన్స్
న్యూ పోస్టల్ కాలనీ, పటమట, విజయవాడ-10
ఫోన్: 2473302
ఫ్లవర్ ఇంగ్లీషు మీడియం స్కూల్
తోట్లవల్లూరు రోడ్డు, ఉయ్యూరు- 521 165
ఫోన్: 232023
ఫ్యూచర్‌పల్లి ఇంగ్లీష్ మీడియం హైస్కూల్
11 నెం. లేన్, కేదారేశ్వరపేట, విజయవాడ-3
గౌతమ్ ఇంగ్లీషు మీడియం స్కూల్
దుర్గాపురం, సాంబమూర్తిరోడ్డు, విజయవాడ
గౌతమ్ విద్యా సంస్థలు
మెయిన్ రోడ్డు, మధురానగర్, విజయవాడ
ఫోన్: 2534418
గ్లోబ్ ఆర్ట్ అండ్ క్రియేటివ్
36/12/15-2, వసంత్‌విహార్, శాంతినగర్
నియర్ మధు చౌక్, విజయవాడ-10
ఫోన్: 2478739, 9440655684
గౌతం రెయిన్‌బో స్కూల్
పటమట, విజయవాడ-10
ఫోన్: 2494488, 2495666
గౌతం కాన్సెప్ట్ స్కూల్
శాంతినగర్, గుడివాడ
ఫోన్: 08674- 241957
జెమిని ఇంగ్లీష్ మీడియం స్కూల్
తోట్లవల్లూరు రోడ్డు, జెమిని నగర్, ఉయ్యూరు
ఫోన్: 08676- 236778, 236973/ 974/ 975, 9849455069
గురుకుల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్
40-5-2, రామమూర్తి స్ట్రీట్, టిక్కిల్ రోడ్డు, నియర్ డి.వి.మానర్,
విజయవాడ-10
ఫోన్: 2486484
జ్ఞాన భారతి పబ్లిక్‌స్కూల్
కానూరు, ఫోన్: 2581552
హెచ్.ఎం.కె. పబ్లిక్ స్కూల్
గోసాల, కృష్ణాజిల్లా
ఇండియన్ స్ప్రింగ్స్
శివాలయం స్ట్రీట్, కొత్తపేట, విజయవాడ-1
శ్రీ ఉషోదయ టెక్నో హైస్కూల్,
పోరంకి, విజయవాడ
్‌ఫోన్: 926401221
వెన్నెల ప్లే స్కూల్
పోరంకి, విజయవాడ.
ఫోన్: 9246401221
నూజివీడు
నందిగామ
కంచికచర్ల
జగ్గయ్యపేట
మచిలీపట్నం
విజయవాడ పరిసర ప్రాంతాల్లోని కాలేజీల వివరాలు
ఎఆర్‌ఆర్ డిగ్రీ కళాశాల
నున్న, కృష్ణా జిల్లా
ఫోన్: 2852210
అభ్యుదయ జూనియర్ కళాశాల
సాయిబాబా టెంపుల్ రోడ్డు, విజయవాడ-8
ఫోన్: 2481725
ఆదిత్య జూనియర్ కళాశాల
అధికార్ హోటల్ ఎదురుగా, ఎం.జి.రోడ్డు, విజయవాడ-10
ఫోన్: 2470317
అమరావతి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్
ఎన్‌ఎస్‌ఎం పబ్లిక్ స్కూల్ రోడ్డు, పటమట, విజయవాడ-10
ఫోన్: 2474859/ 2484959 పీపీ
ఏఎస్‌ఎం కళాశాల
నున్న- 521 212
విజయవాడ రూరల్ ఫోన్: 2852210
ఏఎన్‌ఆర్ కళాశాల
పి.బి.నెం.20, గుడివాడ-521 301, కృష్ణా జిల్లా
ఫోన్: 08674- 242145
ఆంధ్రా లయోలా కళాశాల
గుణదల, విజయవాడ-8
ఫోన్: 2476082
ఆదిత్య జూనియర్ కళాశాల
కాంధారి బస్టాప్, బందర్ రోడ్డు,
విజయవాడ- 10 ఫోన్: 2470317
డాక్టర్ జాకీర్ హుస్సేన్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్
ఇబ్రహీంపట్నం, విజయవాడ
ఫోన్: 2882291
గౌతం డిగ్రీ కళాశాల
40-1-100ఎ, కోహినూర్ ప్లాజా, నారా చంద్రబాబునాయుడు కాలనీ, బెంజిసర్కిల్,
విజయవాడ-10 ఫోన్: 6512444/ 2484818
గ్లోబల్ ఒకేషనల్ జూనియర్ కళాశాల
అశోక్‌నగర్, కానూరు, విజయవాడ
ఫోన్: 6558447/ 2551449
హిందీ మీడియం డిగ్రీ కళాశాల
మాచవరం, విజయవాడ-3
ఫోన్: 2431224
ఐసీఎఫ్‌ఏఐ నేషనల్ కళాశాల
బెంజిసర్కిల్, విజయవాడ-10
ఫోన్: 662362021
ఇందిరా గాంధీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల
అప్సర థియేటర్ పక్కన, విజయవాడ-2
ఫోన్: 6623868
కాకరపర్తి భావన్నారాయణ కళాశాల (కేబీఎన్)
కొత్తపేట, విజయవాడ-1
ఫోన్: 6699233/ 2565679
కేవీఆర్ కళాశాల
నందిగామ, కృష్ణాజిల్లా
ఫోన్: 08678- 275244/276107
కాకతీయ డిగ్రీ కళాశాల
మారుతీనగర్, విజయవాడ
ఫోన్: 2431212
కృష్ణవేణి డిగ్రీ కళాశాల
దుర్గామహల్ ఎదురుగా, పటమట, విజయవాడ-10
ఫోన్: 2476232, 2521777
క్రాంతి కళాశాల
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఎదురుగా, విజయవాడ
ఫోన్: 2540474, 9440172514
కేవీఎస్‌ఆర్ సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్
సిద్ధార్థనగర్, విజయవాడ
ఫోన్: 2479775
మేరీస్ స్టెల్లా కళాశాల
బెంజిసర్కిల్ దగ్గర, విజయవాడ-8
ఫోన్: 2472332
మాంటిస్సోరి మహిళా కళాశాల
పున్నమ్మతోట, విజయవాడ-10
ఫోన్: 2473634, 2489129
మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ డిగ్రీ కళాశాల
రామమందిరం పక్కన, ఏలూరురోడ్డు, విజయవాడ-2
ఫోన్: 2437943
నారాయణ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూట్
బెంజిసర్కిల్, విజయవాడ
ఫోన్: 2497604, 2497605
నోవా కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్
మొదటి అంతస్తు, యలమంచిలి కాంప్లెక్స్, రింగ్‌రోడ్డు
విజయవాడ ఫోన్: 9866317296
నలందా డిగ్రీ కళాశాల
చెన్నుపాటి పెట్రోల్‌బంకు ఎదురుగా, లబ్బీపేట,
విజయవాడ-10 ఫోన్: 3250223/ 2474869/ 2479084
ప్రభాస్ డిగ్రీ కళాశాల
కేదారేశ్వరపేట, విజయవాడ-3
ఫోన్: 2537879, 2532525
పవిత్ర ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్
రామానాయుడుపేట, మచిలీపట్నం
ఫోన్: 08672- 225165, 223857, 9848853057
పి.బి.సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్
సిద్ధార్థనగర్, విజయవాడ-10
ఫోన్: 2475966
రంగనాయకమ్మ ఉమెన్స్ డిగ్రీ కళాశాల
కోవెలమూడివారి వీధి, పుష్పాహోటల్ దగ్గర, విజయవాడ-10
ఫోన్: 6649939, 9347890839
ఋత్విక్స్ డిగ్రీ కళాశాల
గోటి టవర్స్, గ్రీన్‌ల్యాండ్స్ రోడ్డు, నియర్ హోటల్ కాంధారి, విజయవాడ-10 ఫోన్: 2481760/ 2493127
ఎస్‌ఎస్‌ఏ కళాశాల
టి-1, వసంత్‌ప్లాజా, వరుణ్‌బజాజ్ అప్‌స్టేర్స్, బెంజిసర్కిల్, విజయవాడ-10 ఫోన్: 6630963, 6450963
శ్రీ బాలసాయి డిగ్రీ కళాశాల
మెహర్‌బాబా గుడి ఎదురుగా, పోర్టు రోడ్డు, మచిలీపట్నం
ఫోన్: 230892
శ్రీమతి చలువాది రత్నావతి మహిళా డిగ్రీ కళాశాల
ముదిలి జగన్నాథం వీధి, విజయవాడ-1
ఫోన్: 2560596
శ్రీ సత్యసాయి మహిళా ఆర్ట్స్ కళాశాల
వైశ్యా బ్యాంకు రోడ్డు, పటమట, విజయవాడ-10
ఫోన్: 2474505/ 2482666
సురభి ఫైన్ ఆర్ట్ అకాడమీ
మెయిన్‌రోడ్డు, కేదారేశ్వరపేట, విజయవాడ-3
ఫోన్: 9246495591
శ్రీ వివేకానంద డిగ్రీ కళాశాల
పెద్దకళ్లేపల్లి రోడ్డు, చల్లపల్లి
శ్రీదుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల
ఎం.జి.రోడ్డు, విజయవాడ
శాతవాహన కళాశాల
గాంధీనగర్, విజయవాడ-3
ఫోన్: 2435185
సత్యసాయి విద్యా సంస్థలు
దుర్గామహల్ దగ్గర, పటమట, విజయవాడ-10
ఫోన్: 0866- 2494505, 2495966
సిద్ధార్థ అకాడమీ ఆఫ్ జనరల్ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్
సిద్ధార్థ నగర్, విజయవాడ- 520 010
ఫోన్: 0866- 2475866, 2476026
ఎస్‌ఆర్‌ఆర్ అండ్ సీవీఆర్ గవర్నమెంట్ కళాశాల
మాచవరం డౌన్, విజయవాడ-4
ఫోన్: 2430060
సప్తగిరి జూనియర్ కళాశాల
రైల్వేస్టేషన్ దగ్గర, సత్యనారాయణపురం,
విజయవాడ-11, ఫోన్: 2533630/ 2432590
సయ్యద్ అప్పలస్వామి కళాశాల
చిట్టినగర్, విజయవాడ-9
ఫోన్: 2567919
శ్రీమతి వెలగపూడి దుర్గమాంబ సిద్ధార్థ లా కళాశాల
కానూరు-7, విజయవాడ
ఫోన్: 2582592
ట్రేడ్ వింగ్స్ (ప్రొఫెషనల్ కళాశాల)
ఎఫ్‌ఎఫ్1, ఇందిరా టవర్స్, ఆపోజిట్ నిర్మలా కాన్వెంట్
విజయవాడ
ఫోన్: 6627876, 9985377876
త్రివేణి విద్యా సంస్థలు
ఈనాడు సమీపంలో, విజయవాడ
ఫోన్: 2483627
వీకేఆర్ కళాశాల
బుద్ధవరం, గన్నవరం, కృష్ణా జిల్లా
ఫోన్: 08676- 252263
విశ్వభారతి కళాశాల
వీఎంసీ కాంప్లెక్స్, కొత్తవంతెన సెంటర్, విజయవాడ-2
ఫోన్: 2437025, 9247192656
శారదా కాలేజి, గాంధీనగర్
ఫోన్ నెం: 2430060
వికాస్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్
విస్సన్నపేట, కృష్ణా జిల్లా
ఫోన్: 08673- 271555
వీబీఎం కళాశాల
స్క్యూబ్రిడ్జి దగ్గర, రామలింగేశ్వరనగర్, విజయవాడ-13
ఫోన్: 2482030
డబ్ల్యూఎల్‌సీ కాలేజ్ ఇండియా
నెం. 39-1-89, కళ్యాణ్‌కాంప్లెక్స్, లబ్బీపేట, ఎం.జి.రోడ్డు,
విజయవాడ-10 ఫోన్: 6457715
నారాయణ విద్యాసంస్థలు
నారాయణ ఈ టెక్నో స్కూల్ అండ్ జూనియర్ కాలేజ్, గాంధీ బొమ్మ రోడ్డు, బ్యాంక్ సెంటర్ ఎదురుగా, భవానీపురం, విజయవాడ. ఫోన్- 0866-2418044, 45.
నారాయణ ఈ టెక్నో స్కూల్ అండ్ జూనియర్ కాలేజ్, వాటర్ ట్యాంక్ ఎదుట, కాలేజ్ రోడ్డు, ఉయ్యూరు, విజయవాడ. ఫోన్- 08676-234921, 9494766645.
నారాయణ ఈ టెక్నో స్కూల్ అండ్ జూనియర్ కాలేజీ, పైడి అప్పారావు కాంప్లెక్స్, పాత వర్మ ఆసుపత్రి కాంపౌండ్, ఈ సేవ ఎదురుగా, నూజివీడు, కృష్ణాజిల్లా. ఫోన్- 08656- 235814, 235815.
నారాయణ జూనియర్ కాలేజ్, కమ్మ మహా జనసంఘం, బైపాస్ రోడ్డు, గుడివాడ, కృష్ణాజిల్లా. ఫోన్ - 9912343712.
నారాయణ ఈ టెక్నో స్కూల్ అండ్ జూనియర్ కాలేజ్, ఖాన్ గారి బిల్డింగ్, ఆంధ్రాబ్యాంకు ఎదురుగా, ఆకివీడు. ఫోన్- 08816 - 252263, 64.
నారాయణ ఈ టెక్నో స్కూల్ అండ్ జూనియర్ కాలేజ్ పిఎన్‌ఆర్ కాంప్లెక్స్, కోదాడ రోడ్డు, జగ్గయ్యపేట. ఫోన్- 08654 - 226666.
నారాయణ ఈ టెక్నో స్కూల్ అండ్ జూనియర్ కాలేజ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, రైతుపేట, నందిగామ. ఫోన్- 08678-276575.
నారాయణ జూనియర్ కాలేజ్, బాలికల డే స్కాలర్స్ (ఎంసెట్ అండ్ ఎఐఈఈఈ క్యాంపస్), సర్వోత్తమ భవనం దగ్గర, ఈనాడు ఎదురుగా, పటమట, విజయవాడ-10. ఫోన్- 2497612, 13.
నారాయణ జూనియర్ కాలేజ్, బాలుర డే స్కాలర్స్ (ఎంసెట్ అండ్ ఎఐఈఈఈ క్యాంపస్), బోయపాటి బిల్డింగ్స్, కాంధారి లైన్, లబ్బిపేట, విజయవాడ-10. ఫోన్- 2497614, 15.
నారాయణ జూనియర్ కాలేజ్, ఐసీ క్యాంపస్, నారా చంద్రబాబునాయుడు కాలనీ, బెంజిసర్కిల్, విజయవాడ-10. ఫోన్- 2477183, 2555297.
నారాయణ జూనియర్ కాలేజ్, కో-ఎడ్యుకేషన్ క్యాంపస్, బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయం వద్ద, మాచవరం, ఏలూరు రోడ్డు, విజయవాడ. ఫోన్- 2440186, 189.
నారాయణ జూనియర్ కాలేజ్, ఎ.సి. క్యాంపస్, రెవెన్యూ కాలనీ మొదటి లైను, ఆదాయపు పన్ను శాఖ కార్యాలయం పక్కన, మొగల్రాజపురం, విజయవాడ-10. ఫోన్- 2484925, 2497602.
చైతన్య విద్యాసంస్థలు
ఎన్‌ఆర్‌ఐ విద్యాసంస్థలు (డే స్కాలర్స్)
రెసిడెన్షియల్ క్యాంపస్‌లు
రెసిడెన్షియల్ కాలేజీలు
ఆదిత్య రెసిడెన్షియల్ కాలేజి
హోటల్ అధికార్ ఎదుట, బందరురోడ్డు, లబ్బీపేట, విజయవాడ-10
ఫోన్: 2470317
క్యాడ్ రెసిడెన్షియల్ అండ్ నాన్ రెసిడెన్షియల్ కాలేజ్
పటమట, విజయవాడ-7
ఫోన్: 2542181
గౌతం ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూట్
గూడవల్లి, విజయవాడ
ఫోన్: 2476847, 2474471
క్రాంతి రెసిడెన్షియల్ కళాశాల
సిద్ధార్థ మెడికల్ కాలేజ్ ఎదుట, విజయవాడ-8
ఫోన్: 2540477, 2541580
మోడ్రన్ అకాడమీ
40-6-19, రెవెన్యూ కాలనీ, విజయవాడ-10
ఫోన్: 2476692
నలందా విద్యా సంస్థలు
ఐజీఎంఎస్ కాంప్లెక్స్, లబ్బీపేట, విజయవాడ
ఫోన్: 0866- 2477193
నిమ్స్ ఇన్‌స్టిట్యూట్
డాక్టర్ సమరం హాస్పిటల్ దగ్గర, బెంజిసర్కిల్, విజయవాడ-10
ఫోన్: 5522455, 5544622
మోడ్రన్ అకాడమీ
40-7-31, మొగల్రాజపురం,విజయవాడ-10
ఫోన్: 2480592
సత్యసాయి ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్
దుర్గామహల్ దగ్గర, పటమట, విజయవాడ-10
ఫోన్: 2494505/ 2495966
తక్షశిల రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల
మెడికల్ కాలేజ్ దగ్గర, రింగ్‌రోడ్డు, విజయవాడ-8
విజ్ఞాన్
వినాయక థియేటర్ దగ్గర, రింగ్‌రోడ్డు, విజయవాడ-8
ఫోన్: 6630641/ 42/ 43/ 44
విజయకృష్ణ రెసిడెన్షియల్ కాలేజ్
శ్రీవాణీ నికేతన్ బిల్డింగ్, సూర్యారావుపేట, విజయాడ-2
ఫోన్: 2545800/ 2470126
విజయవాడ కాలేజ్ ఆఫ్ సైన్సెస్
మేరీ స్టెల్లా కాలేజ్ ఎదురు, విజయవాడ-8
ఫోన్: 2541609
విక్రమ్ రెసిడెన్షియల్ కాలేజ్
59ఎ-4-13/1, పీఅండ్‌టీ కాలనీ, విజయవాడ-8
ఫోన్: 2476914
హోటల్ మేనేజ్‌మెంట్ కాలేజీలు
ఏసియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్
ఫస్ట్ ఫ్లోర్, టిక్కిల్‌రోడ్డు, విజయవాడ-10
ఫోన్: 2473437
కెనాన్ మనోరమ కాలేజ్ ఆఫ్ కేటరింగ్ అండ్ హోటల్ మేనేజ్‌మెంట్
సిద్ధార్థ అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ ఎదురు, మొగల్రాజపురం, విజయవాడ-10
ఫోన్: 6630053/ 6629678/ 2487691
ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్
54-15-1/2, ఏబీసీ శ్రీనగర్ కాలనీ, వినాయక థియేటర్ దగ్గర, విజయవాడ
ఫోన్: 6666251/ 2492676
శ్రీ శివానీ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్
ఖన్నానగర్, న్యూ మోడరన్ సూపర్‌మార్కెట్ దగ్గర, బెంజిసర్కిల్,
విజయవాడ-10 ఫోన్: 6664493
సిద్ధార్థ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ అండ్ కేటరింగ్ టెక్నాలజీ
పిన్నమనేని పాలీక్లినిక్ రోడ్డు, సిద్ధార్థ నగర్, విజయవాడ-10
ఫోన్: 0866- 2493042, 2472035
వెస్టిన్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్
జీవీఆర్ టవర్స్, భరత్‌నగర్, రింగ్‌రోడ్డు, విజయవాడ-8
ఫోన్: 0866- 2546765, 5531641
విదేశాల్లో చదువుకు సంబంధించి కళాశాలలు
స్టడీ ఇన్ ఫ్రాన్స్
విసు వరల్డ్
ఆంజనేయ జ్యూయలరీ వెనక, 39-3-2, మ్యాస్క్యూ స్ట్రీట్, లబ్బీపేట,
విజయవాడ ఫోన్: 2488480, 98496 00176
సీర్ అబ్రాడ్
39-3-2, ఆంజనేయ జ్యూయలరీ వెనక, మ్యాస్క్యూ స్ట్రీట్, లబ్బీపేట,
విజయవాడ ఫోన్: 2488480, 93463 31650
ఇంజనీరింగ్ కాలేజీలు
శ్రీవాసవి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, నందమూరు, పెడన మండలం. 08672-241387.
శ్రీ వివేకా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, వివేకానగర్, మాదలవారి గూడెం, గన్నవరం మండలం. 0866-2085299.
ఎంవీర్ ( ముత్తవరపు వెంకటేశ్వరరావు) ఇంజనీరింగ్ కళాశాల
పరిటాల- 98480 40707
గుడ్లవల్లేరు కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, గుడ్లవల్లేరు గ్రామం, కృష్ణా జిల్లా. 0674-273888.
మిక్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ
కంచికచర్ల, కృష్ణా జిల్లా
ఫోన్: 08678- 273535
వికాస కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, నున్న. 0866-2085252.
ప్రసాద్ వి పొట్లూరి సిద్ధార్థ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ
కానూరు, విజయవాడ-7 ఫోన్: 0866- 2581899
గవర్నమెంట్ పాలిటెక్నిక్, విజయవాడ-8
శ్రీ సారధి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ
నూజివీడు, కృష్ణాజిల్లా
ఫోన్: 08656- 233711, 234001
వెలగపూడి రామకృష్ణ సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాల
కానూరు, 0866- 2582672
సన్‌ఫ్లవర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఘంటసాల మండలం. 08671-258585, 86.
లక్కిరెడ్డి బాల్‌రెడ్డి ఇంజనీరింగ్ కళాశాల
మైలవరం, 08659-224044, 222933
శ్రీమతి టీఆర్‌కే పాలిటెక్నిక్ పామర్రు, కృష్ణాజిల్లా
ఏపీ, ఫోన్: 08674- 200050, 253307
సరోజిని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజి, తేలప్రోలు, ఉంగుటూరు మండలం. 08676-317949.
మాంటిస్సోరి శివశివానీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ
మైలవరం
శ్రీ వాణి స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్, చెవుటూరు, జి.కొండూరు మండలం. 08673-253933.
నోవా కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఇబ్రహీంపట్నం. 0866-2881894.
నోవా కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్,
ఇబ్రహీంపట్నం. 0866-2881895.
డి.జె.ఆర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ
వేల్పూరు (గూడవల్లి దగ్గర) ఫోన్ 0866-2082603.
పాలడుగు పార్వతీదేవి కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్, సూరంపల్లి.0866-2853566.
పొట్టి శ్రీరాములు కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజి
విజయవాడ, వన్‌టౌన్. 0866- 6461777.
ఆంధ్ర లయోలా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజి
పాలిటెక్నిక్ పోస్టాఫీస్ దగ్గర, విజయవాడ. 0866-2476161.
నిమ్రా కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజి,ఇబ్రహీంపట్నం. 0866-2882711.
ఉషారామ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజి, తేలప్రోలు, ఉంగుటూరు మండలం. 08676-202279.
వి.కె.ఆర్. అండ్ వి.ఎన్.బి ఇంజనీరింగ్ కాలేజ్, గుడివాడ. 08674- 242188, 89.
విజయ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్, ఎనికేపాడు. 0866-2842246.
శ్రీ వాహిని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, తిరువూరు. 08673-203199.
నిమ్రా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, జూపూడి, ఇబ్రహీంపట్నం. 0866-2882010
వైద్య కళాశాలలు
మెడి స్క్రిప్ట్
40-3/1-41, కృష్ణానగర్, కామినేని స్ట్రీట్, విజయవాడ
ఫోన్: 6631361
నవ్యశ్రీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సైన్సెస్
అజరత్తయ్య స్ట్రీట్, రాజధాని ప్త్లెవుడ్ షాప్, గవర్నర్‌పేట, విజయవాడ
ఫోన్: 2572814, 98491 86027
స్టడీ ఇన్ ఎంబీబీఎస్
ఫోన్: 94404 06828, 94404 06846
రిజిస్ట్రార్
ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్
విజయవాడ
నర్సింగ్ కళాశాలలు
గ్రేస్ స్కూల్ ఆఫ్ నర్సింగ్
రైల్వేస్టేషన్ రోడ్డు, బుట్టాయిపేట, మచిలీపట్నం
ఫోన్: 08672- 222661, 227761
ఫ్లోరెన్స్ నైటింగేల్ స్కూల్ ఆఫ్ నర్సింగ్
గురునానక్‌నగర్ రోడ్డు, ఎస్‌బీహెచ్ పక్కన, పటమట, విజయవాడ
ఫోన్: 5517289
సాయికరుణ స్కూల్ ఆఫ్ నర్సింగ్
ప్లాట్ నెం.74, వెంకటేశ్వరనగర్, వినాయక థియేటర్ దగ్గర, విజయవాడ
ఫోన్: 3094289, 93929 45454
ఉషా స్కూల్ ఆఫ్ నర్సింగ్
ఉషా కార్డియాక్ సెంటర్, బందరురోడ్డు, విజయవాడ
శ్రీ చైతన్య స్కూల్ ఆఫ్ నర్సింగ్
19-27, అశోక్‌నగర్ బస్టాప్ ఎదురు, కానూరు, విజయవాడ
ఫోన్: 2554101, 98484 24446
తమ్మినేని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నర్సింగ్
గుణదల, విజయవాడ
విజయ స్కూల్ ఆఫ్ నర్సింగ్
దుర్గాపురం, రోకళ్లపాలెం, విజయవాడ
ఫోన్: 2430171, 2440554, 98481 29500
ఫార్మసీ కళాశాలలు
ఎం.ఆర్.ఆర్. కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, నందిగామ. 08678-277732.
నోవా కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్, ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, జూపూడి, ఇబ్రహీంపట్నం. 0866-2843839.
శ్రీ వాణి స్కూల్ ఆఫ్ ఫార్మసీ, చెవుటూరు, జి.కొండూరు. 9849149684.
ఆప్‌టెక్ కంప్యూటర్ ఎడ్యుకేషన్
రామ్‌కోర్ ఎదుట, ఏలూరు రోడ్డు, విజయవాడ
ఫోన్: 9440 327702
అపెక్స్ అకాడమీ
బెంజిసర్కిల్, ఆపోజిట్ గాయత్రీ కాంప్లెక్స్, వాసవ్యనగర్, విజయవాడ-10
అకాడమీ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ
3ఫ్లోర్, పద్మావతి కాంప్లెక్స్, నియర్ అప్సర థియేటర్, విజయవాడ-2
ఫోన్: 98495 18110
అబాకస్
40-5-198ఎ, మొగల్రాజపురం, విజయవాడ-10
ఫోన్: 6630053/ 6610054
అమెరికన్ మేనేజ్‌మెంట్ కాలేజ్
టైటాన్ షోరూం పైన, లబ్బీపేట, విజయవాడ-10
ఫోన్: 2479087/ 2487788
బ్రిలియంట్స్ అకాడమీ
గురునానక్‌నగర్, విజయవాడ-8
ఫోన్: 2476305
బ్రైట్ ఎడ్యుకాన్
నియర్ పుష్పాహోటల్,విజయవాడ
బెతల్ మినిస్ట్రీస్
పొట్టిపాడు, ఉంగుటూరు మండలం, కృష్ణా జిల్లా
ఫోన్: 98663 02444, 99492 93481
భవిష్య స్టడీ సర్కిల్
పటమట, విజయవాడ-10
ఫోన్: 6522411, 93483 93979
బ్రిటిష్ ఇన్‌స్టిట్యూట్
ఎంజీరోడ్డు, లబ్బీపేట, విజయవాడ-10
ఫోన్: 2488315
సెంట్రల్ అకాడమీ
రామమందిరం స్ట్రీట్, విజయవాడ-2
ఫోన్: 2435165
క్లియర్ విజన్
చెన్నుపాటి పెట్రోల్‌బంక్, ఆపోజిట్ రోడ్డు, విజయవాడ-10
కాలేజ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్
గవర్నర్‌పేట, విజయవాడ-2
ఫోన్: 0866- 2438383
సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్స్
గవర్నర్‌పేట, విజయవాడ
కాట్ అకాడమీ
సిద్ధార్థ ఉమెన్స్‌కాలేజ్ రోడ్డు, విజయవాడ
ఫోన్: 5513126
కెరీర్ పాయింట్
డిస్కవర్ కాల్ సెంటర్ జాబ్స్, 2్థ్టఫ్లోర్, గురునానక్‌కాలనీ, విజయవాడ
ఫోన్: 6454379, 92471 88857
కెరీర్ ఫోరం
శ్యాంనగర్, నియర్ డీవీమానర్, టిక్కిల్‌రోడ్డు, విజయవాడ
ఫోన్: 6644288, 6644877
చుక్కపల్లి ఐటీసీ
అడవినెక్కలం, కృష్ణా జిల్లా
ఫోన్: 958656220340
ధీరూ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అకాడమీ
హోటల్ రాజ్‌టవర్స్ ఎదురు, ఏలూరు రోడ్డు, విజయవాడ-2
ఫోన్: 2570770, 98495 27784
ఎరూడైట్ కోచింగ్ సెంటర్
నియర్ పీబీసిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్, మొగల్రాజపురం, విజయవాడ-10
ఫోన్: 2240980
ఎస్టీమ్
డోర్ నెం.71-3-15, కనకమేడల నివాస్, కోనేరువారి స్ట్రీట్, పటమట, విజయవాడ
ఫోన్: 2478847, 2478893
ఎక్సెల్ ఇంగ్లిషు ఇన్‌స్టిట్యూట్
న్యూ సిద్ధార్థ ఆర్ట్స్ కాలేజ్, రెవెన్యూ కాలనీ, మొగల్రాజపురం, విజయవాడ-10
ఫోన్: 3258003
ఫోకస్ అకాడమీ ఆఫ్ ఇంగ్లిషు
కాకతీయ మహిళా కళాశాల రోడ్డు, మారుతీనగర్, విజయవాడ-4
ఫోన్: 2441219
గ్లోబల్ ఇన్ఫోటెక్
ఏలూరు రోడ్డు, విజయవాడ-2
ఫోన్: 2438931/ 243922
జీ1 కెరీర్స్ (యూకే)
హెచ్.నెం.27-43-5, మండపాటివారి వీధి, గవర్నర్‌పేట, విజయవాడ-2
ఫోన్: 98487 77499
గౌతం అకాడమీ
ఈనాడు ఎదురు, విజయవాడ
ఫోన్: 93921 27833
హర్ష కామర్స్ కోచింగ్ సెంటర్
ఎన్టీఆర్ సెంటర్, పటమట, విజయవాడ-10
ఫోన్: 2491543
ఐ టెక్ సొల్యూషన్స్
2ఫ్లోర్, ఎస్‌బీహెచ్ కాంప్లెక్స్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ
ఫోన్: 6636565
ఐఏఎస్ కోచింగ్ సెంటర్
బెంజిసర్కిల్, విజయవాడ-10
ఫోన్: ఫోన్‌ఐ 6631533/ 24/ 79627
ఐసీఎఫ్‌ఏఐ నేషనల్ కాలేజ్
3 ఫ్లోర్, ఉత్తమ్ టవర్స్, ఆపోజిట్ ఆంధ్రజ్యోతి, ఎంజీరోడ్డు, విజయవాడ
ఫోన్: 2473620/ 6663620
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లిషు
ఆపోజిట్ రామాలయం, పటమట, విజయవాడ-8
ఫోన్: 6639970
ఐఐటీఈ అకౌంటింగ్ కోచింగ్ సెంటర్
సిద్ధార్థ ఆర్ట్స్ కాలేజ్ ఎదుట, విజయవాడ
ఫోన్: 2495151, 98490 52776
జైహింద్ డిఫెన్స్ అకాడమీ
న్యూ బ్రిడ్జి సెంటర్, దుర్గా అగ్రహారం, విజయవాడ-2
ఫోన్: 6617767
కేఆర్స్ కాంపిటేటివ్ మైండ్స్
సూర్యారావుపేట, విజయవాడ
ఫోన్: 3092967
కాకతీయ అకాడమీ
బెంజిసర్కిల్, నియర్ డాక్టర్ సమరం హాస్పిటల్, విజయవాడ
ఫోన్: 2474126, 98484 82793
కేరళ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పోకెన్ ఇంగ్లిషు
శారదా కాలేజ్ ఎదుట, సత్యనారాయణపురం, విజయవాడ-3
ఫోన్: 2441448, 98490 12156
కార్తికేయ కోచింగ్ సెంటర్
ఓల్డ్ మొగల్రాజపురం బస్టాప్ వెనక, లబ్బీపేట, విజయవాడ-10
ఫోన్: 2484957
లక్ష్మి కామర్స్ కోచింగ్ సెంటర్
40-15-2, గ్రీన్‌ల్యాండ్ హోటల్ రోడ్డు, బృందావన్‌కాలనీ, విజయవాడ-10
ఫోన్: 6660654
లయోలా అకాడమీ ఆఫ్ ఇంగ్లిషు
అరుణ్ రెసిడెన్షీ, నియర్ సాయిబాబా టెంపుల్, విజయవాడ-8
ఫోన్: 2485257
మధురై కామరాజ్ యూనివర్సిటీ
రమా పబ్లిక్ స్కూల్ క్యాంపస్, కేదారేశ్వరరావుపేట, విజయవాడ
ఫోన్: 2533567/ 2539596
మార్గదర్శి అకాడమీ
ఆపోజిట్ ఊర్వశి బస్టాప్, గాంధీనగర్, విజయవాడ
ఫోన్: 2570876
మణిపాల్ ఐటీ కాలేజ్
ఎంజీరోడ్డు, విజయవాడ-10
ఫోన్: 2487691
మేధ
కళాంజలి ఎదుట, లబ్బీపేట, విజయవాడ-10
ఫోన్: 3093086
మెరిట్
2 ఫ్లోర్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు పైన, ఎంఅండ్‌ఎం ఎదుట, బందరురోడ్డు, విజయవాడ
ఫోన్: 6668556
మిక్
సిద్ధార్థ అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ ఎదుట, మొగల్రాజపురం, విజయవాడ-10
ఫోన్: 6660053/ 2480792
మూర్తి మ్యాథ్స్ ట్యూషన్
న్యూ పీఅండ్‌టీ కాలనీ, సాయిబాబా టెంపుల్ దగ్గర, రింగ్‌రోడ్డు, విజయవాడ-8
ఫోన్: 2479466
మన్వాస్ కన్సల్‌టెంట్స్
విజయవాడ
మహేశ్వరి కాలేజ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్
కాళేశ్వరరావు రోడ్డు, విజయవాడ-2
ఫోన్: 2438787, 2439462, 2441706
మహాత్మాగాంధీ యూనివర్సిటీ
రింగ్‌రోడ్డు, విజయవాడ
ఫోన్: 94401 157957
నాగార్జున అకాడమీ
జి-1, నర్మదా అపార్ట్‌మెంట్స్, మొగల్రాజపురం, విజయవాడ-10
ఫోన్: 2482967/ 2478040
నేషనల్ స్కూల్ ఆఫ్ బ్యాంకింగ్
3ఫ్లోర్, కాథ్‌లిక్ సెంటర్, బందరురోడ్డు, విజయవాడ
ఫోన్: 2475872
న్యూ స్టూడెంట్ అకాడమీ
ఆంధ్రజ్యోతి దగ్గర, లబ్బీపేట, విజయవాడ-10
ఫోన్: 2473858
నైస్ స్టడీ సర్కిల్
ఈనాడు ఎదుట, బెంజిసర్కిల్, విజయవాడ-10
ఫోన్: 6662868
నిమ్స్
డాక్టర్ సమరం హాస్పిటల్ దగ్గర, బెంజిసర్కిల్, విజయవాడ-10
ఫోన్: 6622422/ 6644622
ఆక్స్‌ఫోర్ట్ స్పోకెన్ ఇంగ్లిషు
ఏలూరురోడ్డు, విజయవాడ-2
ఫోన్: 3256678/ 3678910
ఒప్సియా టెక్నాలజీస్
విజయ టాకీస్ దగ్గర, పూర్ణా హిందీ విద్యాలయం, అవనిగడ్డ, కృష్ణా జిల్లా
ఫోన్: 273872, 99492 93730
మిస్టర్ పీఎస్.రావు(రిటైర్డ్)
ఎస్‌బీఐ, విజయవాడ
ఫోన్: 0866- 5591133, 98852 68219
ప్రతిభ
ఎంఅండ్‌ఎం షోరూం ఎదుట, బందరురోడ్డు, విజయవాడ
ఫోన్: 5542584
రాజీవ్స్ ఎగ్జామ్స్ అకాడమీ
నియర్ సమరం హాస్పిటల్
బెంజిసర్కిల్, విజయవాడ
ఆధారము: ఈనాడు
చివరిసారిగా మార్పు చేయబడిన : 5/28/2020