অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

గుంటూరు

విద్య

గుంటూరు నగరంలోని కొన్ని ప్రధాన కళాశాలల గురించి..

ఆంధ్రా క్రైస్తవ కళాశాల

అమెరికన్‌ క్రైస్తవ మిషనరీల ఆధ్వర్యంలో 1885లో ఆంధ్రా క్రైస్తవ (ఎ.సి.) కళాశాల ఏర్పాటైంది. అంతకుముందు 1842లోనే ఇది పాఠశాలగా ఏర్పాటైంది. అమెరికాకు చెందిన ఫాదర్‌ హయ్యర్‌ ఎ.సి.కళాశాలను నెలకొల్పారు. 1885లో సెకండరీ గ్రేడ్‌ కళాశాలగా మారిన తరువాత తమిళనాడులోని మద్రాసు విశ్వవిద్యాలయం అనుబంధ సంస్థగా ఇంటర్‌స్థాయి పీయూసీ కోర్సులు ఇక్కడ ప్రారంభమయ్యాయి. తొలినాళ్లలో దీన్ని అమెరికన్‌ ఇవాంజిలికల్‌ లూథరన్‌ మిషనరీ కళాశాలగా పిలిచేవారు. 1928లో కళాశాల పాలకమండలి సమావేశంలో దీన్ని ఎ.సి.కళాశాలగా పేరు మార్చారు. మొదటి ప్రిన్సిపల్‌గా వుల్ఫ్‌ బాధ్యతల్ని నిర్వర్తించారు. కళాశాలకు ఎక్కువ మొత్తంలో విరాళమిచ్చిన అర్ధర్‌వాట్‌ పేరిట ఇక్కడ టవర్‌ను ఏర్పాటు చేశారు. 1926లో ఆర్ట్స్‌& సైన్స్‌ గ్రూపులతో డిగ్రీ కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. తొలి డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్‌గా హెచ్‌.హెచ్‌.స్పైస్‌ వ్యవహరించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక 1950లో తొలి భారతీయ ప్రిన్సిపల్‌గా డాక్టర్‌ టి.ఎస్‌.పాలస్‌ బాధ్యతలు చేపట్టారు. 1971లో పొలిటికల్‌సైన్స్‌, చరిత్ర సబ్జెక్టులతో పి.జి.కోర్సులు అందుబాటులోకి రావడంతో రాష్ట్రంలోనే తొలి  పి.జి. కేంద్రంగా గుర్తింపు పొందింది. ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రులుగా రాణించిన భవనం వెంకట్రామ్‌, కాసు బ్రహ్మానందరెడ్డి, నందమూరి తారక రామారావు ఇక్కడే విద్యాభ్యాసం చేశారు. వీరితోపాటు సినీ నటులు జగ్గయ్య, శోభన్‌బాబు, దర్శకులు కె.విశ్వనాథ్‌, వాసంతి, హస్యనటుడు సుధాకర్‌, జయప్రకాశ్‌రెడ్డి తదితరులు ఇక్కడ చదివినవారే కావడం విశేషం.

ప్రభుత్వ మహిళా కళాశాల

స్వాతంత్ర్యానికి  పూర్వమే 1942లో కేవలం మహిళల కోసమే ఏర్పాటైంది ప్రభుత్వ మహిళా కళాశాల. గుంటూరుకు చెందిన పలువురు ప్రముఖుల కృషి ఫలితంగా అప్పటి బ్రిటిష్‌ అధికారిణి లేడీ హోప్‌ అనుమతితో పట్టణ పురపాలకసంఘం నిధులను సమకూర్చి కళాశాల భవనాన్ని నిర్మించింది. మొదట్లో దీన్ని లేడీ హోప్‌ కళాశాలగా పిలిచేవారు. 60 మంది విద్యార్థులు, ఇంటర్‌ పీయూసీ, డిగ్రీ కోర్సులతో ప్రారంభమైన కళాశాలకు తొలి ప్రిన్సిపల్‌గా సి.సరోజినిరావు బాధ్యతల్ని నిర్వర్తించారు.స్వాతంత్ర్యం  వచ్చాక మద్రాసు రాష్ట్ర ఆధీనంలోనికి కళాశాల వెళ్లటంతో అప్పటి మద్రాసు ప్రభుత్వం 1947లో దీన్ని ప్రభుత్వ మహిళా కళాశాలగా మార్చింది. 1999 నుంచి కంప్యూటర్‌ కోర్సులతో పాటు పి.జి. కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. 2011 సెప్టెంబరులో నాక్‌ 'ఎ' గ్రేడు గుర్తింపును మహిళా కళాశాల సొంతం చేసుకుంది. చలనచిత్ర నటి సుమలత, వివిధ పార్టీల మహిళా రాజకీయ నాయకులు, ఐ.ఎ.ఎస్‌. అధికారిణులు ఇక్కడ విద్యాభ్యాసం చేశారు.

హిందూ కళాశాల

నగరానికి చెందిన పలువురు విద్యావేత్తలు 1935 తొలినాళ్ళలో టౌన్‌స్కూల్‌ పేరిట ఏర్పాటు చేసిన విద్యాసంస్థ హిందూ కళాశాల. మొదట్లో పాఠశాల తరగతులతో పాటు ఇంటర్‌తో సమానమైన పీయూసీ కోర్సులు ఇక్కడ ప్రారంభమయ్యాయి. 1953లో డిగ్రీ కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. హిందూ కళాశాలకు తొలి ప్రిన్సిపల్‌గా బుడ్డిరాజు రామచంద్రరావు బాధ్యతలు నిర్వర్తించారు. 1994లో పి.జి. కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. హిందూ కళాశాల నాక్‌ నుంచి రెండుసార్లు ఏ గ్రేడ్‌ గుర్తింపును సాధించింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా వ్యవహరించిన రోశయ్య, ప్రముఖ చలనచిత్ర దర్శకులు కె.విశ్వనాథ్‌, నటులు గుమ్మడి వెంకటేశ్వరరావు, సంగీత దర్శకులు చక్రవర్తి ఇక్కడ విద్యాభ్యాసం చేసినవారే.

జె.కె.సి. కళాశాల

1968లో జాగర్లమూడి చంద్రమౌళి తన తండ్రి జాగర్లమూడి కుప్పుస్వామిచౌదరి పేరిట ఏర్పాటు చేసిందే జె.కె.సి. కళాశాల. హిందూ కళాశాల తొలి ప్రిన్సిపల్‌గా ఉన్న బుద్ధవరపు రామచంద్రరావు దీనికి శంకుస్థాపన చేశారు. అప్పట్లో పి.యూ.సి. డిగ్రీ కోర్సులతో ప్రారంభమైన జె.కె.సి. కళాశాలలో 1989లో పి.జి.కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం ఎం.ఎ., ఎమ్మెస్సీ తోపాటు ఎం.సి.ఎ. కోర్సు అందుబాటులో ఉంది. 2005లోనే నాక్‌ నుంచి ఏ గ్రేడ్‌ గుర్తింపును జె.కె.సి. కళాశాల కైవసం చేసుకుంది. 2007లో అటానమస్‌ (స్వయం ప్రతిపత్తి) హోదాను పొందిన జిల్లాలోని తొలి డిగ్రీ కళాశాలగా ఘనతను సొంతం చేసుకుంది. ఇక్కడ విద్యాభ్యాసం చేసిన ఆరుగురు ఐ.పి.ఎస్‌. అధికారులుగా సేవలందిస్తున్నారు. అనేక మంది రాజకీయాల్లోనూ గుర్తింపు పొందారు. వైద్యులు, ఇంజినీర్లుగా విదేశాల్లో స్థిరపడ్డవారూ ఉన్నారు. కళాశాలలోని గ్రంథాలయానికి ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పరిధిలోని అన్ని కళాశాలలకంటే మెరుగైన గ్రంథాలయంగా అవార్డు లభించింది.

టి.జె.పి.ఎస్‌. కళాశాల

గుంటూరు పురపాలక సంఘానికి తొలి మున్సిపల్‌ ఛైర్మన్‌గా సేవలందించిన తెల్లాకుల జాలయ్య, పోలిశెట్టి సోమసుందరం కుటుంబసభ్యులు కలిపి టి.జె.పి.ఎస్‌. (తెల్లాకుల జాలయ్య, పోలిశెట్టి సోమసుందరం) కళాశాలను ఏర్పాటు చేశారు. తొలినాళ్ళలో ఇంటర్‌, బి.కాం కోర్సులతో కళాశాల ప్రారంభమైంది. 1974లో ఎం.కాం.తో పీజీ కోర్సులను అందుబాటులోకి తెచ్చారు. 1986 నుంచి ఎంబీఏ, ఎం.సి.ఎ., ఎమ్మెస్సీ తదితర కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. 2008లో నాక్‌ నుంచి ఏ గ్రేడ్‌ గుర్తింపును టి.జె.పి.ఎస్‌. కళాశాల దక్కించుకుంది. రాజకీయ నాయకులు ప్రతిభా భారతి,  కన్నా లక్ష్మీనారాయణ తదితరులు ఇక్కడ చదువుకున్నవారే.

ఆచార్య ఎన్జీ రంగా పాలిటెక్నిక్‌ కళాశాల,  లాం

తాడికొండ మండలం లాం గ్రామంలోని ఆచార్య ఎన్‌.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో 2011లో వ్యవసాయ పాలిటెక్నిక్‌ కళాశాలను ఏర్పాటు చేశారు. ఉపాధ్యాయులు, సిబ్బంది కొరత ఉంది. ప్రస్తుతం తాత్కాలిక సిబ్బందే విధులు నిర్వహిస్తున్నారు. లాం ఫాం శాస్త్రవేత్తలు తరగతులు నిర్వహిస్తున్నారు. తరగతి గదులు నిర్వహించేందుకు, వసతిగృహాలకు భవనాలు లేకపోవడంతో స్థానికంగా ఉన్న పురాతన భవనాల్లోనే విద్యార్థులు కాలం వెళ్లదీస్తున్నారు. రూ.3.5 కోట్లతో అంచనాలు ఉన్నతాధికారులకు పంపగా ఇటీవల కాలంలో వసతిగృహం నిర్మాణం నిమిత్తం రూ.80 లక్షలు మంజూరయ్యాయి.

ఆధారము: ఈనాడు

పాఠశాలలు

ప్రాథమిక పాఠశాలలు

జిల్లాలో మొత్తం ఎం.పి., జడ్పీ, ఎ.పి.ఎల్‌., ఎయిడెడ్‌, ప్రభుత్వ, ఎ.పి. గురుకుల, గిరిజన, ఆన్‌ఎయిడెడ్‌, ఆన్‌రికగ్నయిజ్డ్‌ మొత్తం కలిపి 3392 పాఠశాలలు ఉన్నాయి. వీటిలో గతేడాది గణాంకాలు పరిశీలిస్తే బాలురు 126314, బాలికలు 128193 విద్యనభ్యసిస్తున్నారు. మొత్తం 9439 మంది ఉపాధ్యాయులు బోధన చేస్తున్నారు.

ప్రాథమికోన్నత పాఠశాలలు

ఎం.పి., జడ్పీ, ఎ.పి.ఎల్‌., ఎయిడెడ్‌, ప్రభుత్వ, ఎ.పి. గురుకుల, గిరిజన, ఆన్‌ఎయిడెడ్‌, ఆన్‌రికగ్నయిజ్డ్‌ మొత్తం కలిపి 608 పాఠశాలలు ఉన్నాయి. వీటిలో గతేడాది గణాంకాలు పరిశీలిస్తే బాలురు 48915, బాలికలు 39999 విద్యనభ్యసిస్తున్నారు. 3581 మంది ఉపాధ్యాయులు బోధన చేస్తున్నారు.

ఉన్నత పాఠశాలలు

జిల్లాలో మొత్తం ఎం.పి., జడ్పీ, ఎ.పి.ఎల్‌., ఎయిడెడ్‌, ప్రభుత్వ, ఎ.పి. గురుకుల, గిరిజన, ఆన్‌ఎయిడెడ్‌, ఆన్‌రికగ్నయిజ్డ్‌ మొత్తం కలిపి 877 పాఠశాలలు ఉన్నాయి. వీటిలో గతేడాది గణాంకాలు పరిశీలిస్తే బాలురు 116037, బాలికలు 110927 విద్యనభ్యసిస్తున్నారు. 8013 మంది ఉపాధ్యాయులు ఉన్నారు.

గుర్తింపులేని పాఠశాలలపై ప్రభుత్వం చర్యలు తీసుకోనుందన్న వార్తలతో చాలా సంస్థల యాజమాన్యాలు గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకున్నాయి. 259 ప్రాథమిక, 111 ప్రాథమికోన్నత, 181 ఉన్నత పాఠశాలలకు గుర్తింపు లేదు.

ప్రభుత్వ, మున్సిపల్‌ ఉన్నత పాఠశాలలు..

  • ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల-- పాతబస్టాండ్‌-- 0863- 2212104
  • ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల--- చౌత్రాసెంటర్‌-- 93941 16828
  • ఎ.పి.ఆర్‌.ఎస్‌. ఉర్ధూ (బాలుర) పాఠశాల-- లాలాపేట-- 0863- 2225840, 9989888401
  • కావటి శంకరరావు మున్సిపల్‌ ఉన్నత పాఠశాల-- ఆర్‌.అగ్రహారం--97044 58245
  • ఎస్‌.కె.బి.ఎం. మున్సిపల్‌ ఉన్నత పాఠశాల-- ఏటి.అగ్రహారం-- 92961 09205
  • పట్టాభిపురం మున్సిపల్‌ ఉన్నత పాఠశాల-- రవీంద్రనగర్‌-- 99495 25520
  • శ్రీ చేబ్రోలు మహాలక్ష్మీపుల్లయ్య మున్సిపల్‌ ఉన్నత పాఠశాల-- స్తంభాలగరువు-- 80085 92667
  • ఎస్‌.జి.ఎన్‌.కె. మున్సిపల్‌ బాలికోన్నత పాఠశాల-- రైలుపేట-- 0863- 2213103
  • జలగం రామారావు మున్సిపల్‌ ఉన్నత పాఠశాల-- కొత్తపేట-- 94934 44949
  • కాసుశాయమ్మ మున్సిపల్‌ ఉన్నత పాఠశాల-- కొత్తపేట-- 97035 25700
  • కోన బాలప్రభాకరరావు మున్సిపల్‌ ఉన్నత పాఠశాల-- వేణుగోపాల్‌నగర్‌-- 0863- 2212424

ఎయిడెడ్‌ ఉన్నత పాఠశాలలు

  • బి.హెచ్‌.హెచ్‌. బాలికోన్నత పాఠశాల-- బ్రాడీపేట-- 0863- 2230523
  • యాదవ హైస్కూల్‌-- పాతగుంటూరు-- 0863- 2220383
  • సెయింట్‌ జోసఫ్‌ బాలికోన్నత పాఠశాల-- ఎ.సి. కాలేజీ రోడ్డు-- 0863-2267074
  • సెయింట్‌ ఇగ్నేషియస్‌ బాలికోన్నత పాఠశాల-- అరండల్‌పేట-- 0863-2242620
  • లూథరన్‌ మోడల్‌ పబ్లిక్‌స్కూల్‌-- బ్రాడీపేట-- 98491 99164
  • పాటిబండ్ల సీతారామయ్య ఉన్నత పాఠశాల-- లక్ష్మీపురం-- 0863-2230922
  • శ్రీ మాజేటి గురవయ్య ఉన్నత పాఠశాల-- బ్రాడీపేట-- 0863- 2230696
  • స్టాల్‌ బాలికోన్నత పాఠశాల-- నగరపాలెం - 99897 92300
  • ఆక్సీలియం బాలికోన్నత పాఠశాల-- ఎల్‌.ఐ.సి.కాలనీ-- 0863- 2231721

ప్రైవేటు అన్‌ఎయిడెడ్‌ స్కూల్స్‌

  • భాష్యం పబ్లిక్‌స్కూల్‌--- చంద్రమౌళినగర్‌ --- 98485 36947
  • ఆక్స్‌ఫర్డ్‌ ఇంగ్లీష్ మీడియం . పబ్లిక్‌స్కూల్‌ ---బృందావన్‌గార్డెన్స్‌ --- 98493 81767
  • కెనడీ ఇంగ్లీష్ మీడియం . పబ్లిక్‌స్కూల్‌--- అరండల్‌పేట --- 0863- 2251310
  • ఇండియన్‌ స్ప్రింగ్స్‌ పబ్లిక్‌స్కూల్‌ --- లక్ష్మీపురం--- 93969 90555
  • విజ్ఞాన్‌ ఇంగ్లీష్ మీడియం . హైస్కూల్‌--- ఎల్‌.ఐ.సి.కాలనీ--- 99633 94595
  • వికాస్‌ పబ్లిక్‌స్కూల్‌--- రింగురోడ్డు--- 0863-2256449, 9848886962
  • సాయిఆదిత్య పబ్లిక్‌స్కూల్‌--- బృందావన్‌గార్డెన్స్‌--- 94408 01697
  • శ్రీ పూజిత పబ్లిక్‌స్కూల్‌--- పట్టాభిపురం--- 0863- 2359755
  • సౌత్‌ ఇండియన్‌ పబ్లిక్‌స్కూల్‌--- నగరపాలెం --- 94402 60237
  • లోటస్‌ పబ్లిక్‌ స్కూల్‌--- పట్టాపురం--- 0863-2235537, 98485 23625
  • డాక్టర్‌ కె.ఎల్‌.పి.పబ్లిక్‌స్కూల్‌--- జె.కె.సి. కాలేజీరోడ్డు--- 0863- 2350392
  • భారతీయవిద్యాభవన్‌--- నగరపాలెం --- 0863- 2234802, 99852 37668

ఆధారము: ఈనాడు

కళాశాలలు

విద్యాలయాల ఖిల్లా

గుంటూరు జిల్లాలోని ఇంటర్‌, డిగ్రీ కళాశాలల వివరాలు

  • ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు- 20
  • ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు- 5
  • ఎయిడెడ్‌ కంపోజిట్‌ జూనియర్‌, డిగ్రీ కళాశాలలు - 13
  • ప్రభుత్వ వృత్తివిద్య జూనియర్‌ కళాశాల - 1 (గుంటూరు)
  • కేంద్రీయ విద్యాలయం-1 (నల్లపాడు)
  • చెవిటి, మూగ ప్రభుత్వ వసతిగృహ కళాశాల- 1 (బాపట్ల)
  • ఎ.పి.ఆర్‌.జె.సి. జూనియర్‌ కళాశాలలు - 2 (నాగార్జునసాగర్‌,గుంటూరు)
  • సాంఘిక సంక్షేమ జూనియర్‌ కళాశాలలు - 6 (అచ్చంపేట, కారంపూడి, సత్తెనపల్లి, అమరావతి, బాపట్ల, నాగార్జునసాగర్‌)
  • ప్రయివేటు కో ఆప రేటివ్‌ జూనియర్‌ కళాశాలలు - 4
  • ప్రయివేటు ఇన్సెంటివ్‌ జూనియర్‌ కళాశాలలు - 9
  • ఎయిడెడ్‌ జూనియర్‌ కళాశాలలు - 27
  • ఎయిడెడ్‌ డిగ్రీ కళాశాలలు - 33
  • ప్రయివేటు అన్‌ఎయిడెడ్‌ జూనియర్‌ కళాశాలలు - 159
  • ప్రయివేటు అన్‌ఎయిడెడ్‌ వృత్తివిద్య జూనియర్‌ కళాశాలలు - 28

గుంటూరు నగరంలోని కళాశాలల ఫోన్‌ నెంబర్లు

  • ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాల, సాంబశివపేట : 0863 - 2217134
  • ప్రభుత్వ వృత్తి విద్య బాలికల జూనియర్‌ కళాశాల, సాంబశివపేట : 0863 - 2222591
  • ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, సాంబశివపేట : 0863 - 2220093
  • ప్రభుత్వ రెసిడెన్షియల్‌ జూనియర్‌ కళాశాల (ఉర్దూ), లాలాపేట : 0863 - 2225840
  • బండ్లమూడి హనుమాయమ్మ జూనియర్‌ కళాశాల, బ్రాడీపేట : 0863 - 2230523
  • ఆంధ్రా క్రైస్తవ కళాశాల (జూనియర్‌, డిగ్రీ, న్యాయ విద్య) సాంబశివపేట : 0863 - 2322046
  • హిందూ కళాశాల (జూనియర్‌, డిగ్రీ), పెద్ద మార్కెట్‌ కూడలి : 0863 - 2220134
  • జాగర్లమూడి కుప్పుస్వామి చౌదరి (జె.కె.సి.) కళాశాల (జూనియర్‌, డిగ్రీ), జె.కె.సి. నగర్‌ : 0863 - 2351062
  • తెల్లాకుల జాలయ్య పోలిశెట్టి సోమసుందరం (టి.జె.పి.ఎస్‌.) కళాశాల (జూనియర్‌, డిగ్రీ), కంకరగుంట : 0863 - 2230852
  • ఆంధ్రా ముస్లిం కళాశాల, పొన్నూరు రోడ్డు : 0863 - 2223684
  • శ్రీచైతన్య జూనియర్‌ కళాశాల, లక్ష్మీపురం : 0863 - 2354364
  • ఎన్‌.ఆర్‌.ఐ. జూనియర్‌ కళాశాల, లక్ష్మీపురం : 0863 - 6458999
  • గౌతమ్‌ జూనియర్‌ కళాశాల, లక్ష్మీపురం : 0863 - 2232192
  • అభ్యుదయ మహిళా కళాశాల (జూనియర్‌, డిగ్రీ), లక్ష్మీపురం : 0863 - 2231359
  • మాజేటి గురవయ్య జూనియర్‌ కళాశాల, బ్రాడీపేట : 0863 - 2211807
  • మహావీర్‌ జూనియర్‌ కళాశాల, నల్లచెరువు : 0863 - 2356126
  • శ్రీమేథ జూనియర్‌ కళాశాల, బ్రాడీపేట : 0863 - 2255891
  • మాస్టర్‌ మైండ్స్‌ జూనియర్‌ కళాశాల, బ్రాడీపేట : 0863 - 6634508

నరసరావుపేట

  • శ్రీ సుబ్బరాయ నారాయణ కళాశాల, నరసరావుపేట
  • పాలడుగు నాగయ్య చౌదరి, కొత్త రఘురామయ్య కళాశాల, నరసరావుపేట

పొన్నూరు

  • పీబీఎన్‌ కళాశాల, పొన్నూరు 242014
  • కె.ఎస్‌.జె. కళాశాల, పొన్నూరు 242055
  • ఎ.ఎస్‌.ఎం.జి.జె కళాశాల, పొన్నూరు 242179
  • భావనారాయణ సంస్కృత కళాశాల, పొన్నూరు 242021
  • సుజాత జూనియర్‌ కళాశాల, పొన్నూరు 247748
  • బాలాజి కళాశాల, పొన్నూరు 243307
  • పొన్నూరు జూనియర్‌ కళాశాల, పొన్నూరు 242127

మాచర్ల

  • శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డి డిగ్రీ కళాశాల, మాచర్ల
  • ఆంధ్రప్రదేశ్‌ గురుకుల డిగ్రీ కళాశాల, విజయపురి సౌత్‌, మాచర్ల మండలం

రేపల్లె

  • ఏ బీ ఆర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల,  రేపల్లె
  • ప్రభుత్వ జూనియర్‌ కళాశాల,  రేపల్లె
  • ఐఆర్‌ఈఎఫ్‌ విద్యాసంస్థలు. రేపల్లె
  • రేపల్లె క్రిస్టియన్‌ జూనియర్‌, డిగ్రీ కళాశాలలు,  రేపల్లె
  • జేఎల్‌బీ, ఎస్‌ఎన్‌బీటీ మహిళా కళాశాలలు,  రేపల్లె
  • హర్షవర్ధన్‌ పీజీ కళాశాల, పొన్నపల్లి, చెరుకుపల్లి మండలం

తెనాలి

  • వివేకా విద్యా సంస్థలు,  తెనాలి 225470
  • సాయి విద్యా సంస్థలు,  తెనాలి 224635
  • తాలూకా జూనియర్‌ కళాశాల 229332
  • జె.ఎం.జె. కళాశాల, అంగల కుదురు రోడ్డు,  తెనాలి 225994
  • వి.ఎస్‌.ఆర్‌. అండ్‌ ఎన్‌.వి.ఆర్‌. కళాశాలలు, ఐతానగర్‌, తెనాలి 226961
  • అంబేద్కర్‌ కళాశాల, చినరావూరు పార్కు దగ్గర,  తెనాలి
  • ఎ.ఎస్‌.ఎన్‌. డిగ్రీ కళాశాల, ప్రకాశం రోడ్డు,  తెనాలి 228821.
  • ఘట్టమనేని కృష్ణ కళాశాల, బుర్రిపాలెం,  తెనాలి మండలం 238322
  • గుప్తా కళాశాల, బుర్రిపాలెం రోడ్డు,  తెనాలి 224439

పిడుగురాళ్ల

  • ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, పిడుగురాళ్ల 9440684939
  • నవీన డిగ్రీ, జూనియర్‌ కళాశాల, పిడుగురాళ్ల 9848111349
  • టి.ఎస్‌.రెడ్డి డిగ్రీ కళాశాల, పిడుగురాళ్ల 9440263754
  • నలంద జూనియర్‌ కళాశాల, పిడుగురాళ్ల 9440884127
  • విద్యార్థి జూనియర్‌ కళాశాల, పిడుగురాళ్ల 9959838083
  • ఆక్స్‌ఫర్డ్‌ జూనియర్‌ కళాశాల, పిడుగురాళ్ల 9951070121
  • శారదా జూనియర్‌ కళాశాల, పిడుగురాళ్ల 9985838922
  • నారాయణ జూనియర్‌ కళాశాల, దాచేపల్లి 9985412059
  • వికాస జూనియర్‌ కళాశాల, దాచేపల్లి 9985246365
  • నోబుల్‌ జూనియర్‌ కళాశాల, దాచేపల్లి 9440835031
  • నవోదయ జూనియర్‌ కళాశాల, గురజాల
  • జయభారత్‌ జూనియర్‌ కళాశాల, గురజాల
  • నవోదయ డిగ్రీ కళాశాల, గురజాల
  • ఇగ్నీషియస్‌ డిగ్రీ కళాశాల, గురజాల

వినుకొండ

  • ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, వినుకొండ
  • ప్రభుత్వ డిగ్రీ కళాశాల, వినుకొండ
  • కృష్ణవేణి జూనియర్‌ కళాశాల, వినుకొండ 275714
  • శ్రీవాణి జూనియర్‌ కళాశాల, వినుకొండ 9440107321
  • గీతాంజలి జూనియర్‌ కళాశాల, వినుకొండ 9440214144
  • రాధా డిగ్రీ కళాశాల, వినుకొండ 9440163917
  • సాయి డిగ్రీ కళాశాల, వినుకొండ

సత్తెన్నపల్లి

  • ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, సత్తెనపల్లి

కొల్లూరు

  • శ్రీ రామా రూరల్‌ గురుకుల పాఠశాల, చిలుమూరు, కొల్లూరు మండలం
  • జి.వి.ఎస్‌.ఆర్‌. అండ్‌ ఎస్‌.ఎ.ఆర్‌. కళాశాల, కొల్లూరు

బాపట్ల

  • బాపట్ల ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్ కళాశాల, బాపట్ల 08643-224066

చిలకలూరిపేట

  • టీ ఆర్‌ ఎన్‌ ఎస్‌ సీ వీ ఎస్‌ కళాశాల, చిలకలూరిపేట 08647-253500
  • కాకతీయ విద్యా సంస్థలు చిలకలూరిపేట 08647-254610
  • కాసు వెంగళరెడ్డి జూనియర్‌ కళాశాల, చిలకలూరిపేట 08647-251247
  • ఏ ఎం జీ విద్యా సంస్థలు, చిలకలూరిపేట 08647-254031
  • సాదినేని చౌదరయ్య కళాశాల, చిలకలూరిపేట 08647-255871
  • మోడరన్‌ విద్యా సంస్థలు, చిలకలూరిపేట 08647-253624
  • చైతన్య విద్యా సంస్థలు, చిలకలూరిపేట 9951166545
  • చార్లెస్‌ కళాశాల, చిలకలూరిపేట 08647-256612
  • వివేకానంద విద్యాసంస్థలు, చిలకలూరిపేట 9848046022
  • విజేత జూనియర్‌ కళాశాల, చిలకలూరిపేట 08647-254048

వైద్య కళాశాలలు:

  • జిల్లాలో ప్రభుత్వ ఆధ్వర్యంలో గుంటూరు వైద్యకళాశాల ఏర్పాటు చేశారు.
  • జిల్లాలో బోధనాసుపత్రిగా ప్రభుత్వ సమగ్ర వైద్యశాల ఉంది. దీనిలో 1177 పడకలు ఉన్నాయి. సూపర్‌ స్పెషాలిటీ వైద్యసేవలు అందుతున్నాయి.
  • జిల్లాలో 75 పీ హెచ్‌ సీ లు, 5 సీ హెచ్‌ సీ లుతో పాటు తెనాలిలో జిల్లా ఆసుపత్రి ఉన్నాయి.
  • జిల్లాలో ఫార్మాస్యూటికల్‌ కంపెనీలు 12

ప్రైవేటు యాజమాన్యం ఆధ్వర్యంలో వైద్య కళాశాలలు

  • ఎన్నారై  వైద్య కళాశాల  చినకాకాని, మంగళగిరి రూరల్‌ ఫోన్‌ నంబరు: 08645 248520
  • కాటూరి  వైద్య కళాశాల  చినకోండ్రుపాడు, ప్రత్తిపాడు మండలం ఫోన్‌ నంబరు: 0863 2288555
  • సిబార్‌ దంత వైద్యశాల తక్కెళ్లపాడు, పెదకాకాని మండలం

ఫార్మసీ కళాశాలలు

  • చలపతి ఫార్మసీ కళాశాల  లాం, తాడికొండ మండలం
  • హిందూ ఫార్మసీ కళాశాల గుంటూరు

ఆధారము: ఈనాడు

శిక్షణా కేంద్రాలు

నగరంలోని కంప్యూటర్‌ శిక్షణా కేంద్రాలు

  • టెక్నాలజీస్‌  బ్రాడీపేట : 9949524991
  • అక్షయ కంప్యూటర్స్‌ బ్రాడీపేట : 9848590023
  • కేర్‌ కంప్యూటర్‌ ఎడ్యుకేషన్‌  అరండల్‌పేట : 9848095883
  • సీ ఎన్‌ టెక్నాలజీస్‌  విద్యానగర్‌ : 9989871125
  • ఎన్‌ ఎస్‌ ఎం ఇన్‌ఫోటెక్‌  అరండల్‌పేట : 2254455
  • ఆర్‌ టీ ఎస్‌ కంప్యూటర్‌ ట్రైనింగ్‌  బ్రాడీపేట : 2214057
  • యు ఐ టీసీ కంప్యూటర్‌ ఎడ్యుకేషన్‌ అరండల్‌పేట : 9059494786
  • మోటివ్‌ కంప్యూటర్‌ ఎడ్యుకేషన్‌ అరండల్‌పేట : 2232531
  • ఎం ఆర్‌ ఐ కంప్యూటర్‌ ఎడ్యుకేషన్‌  సాంబశివపేట : 9010814302
  • వాక్‌ ఇన్‌ టెక్నాలజీస్‌  బృందావన్‌గార్డెన్స్‌ : 8801782839
  • బాలాజీ ఇన్‌ఫోటెక్‌  బ్రాడీపేట : 2339603
  • శివానీ కంప్యూటర్‌ ఎడ్యుకేషన్‌ రఘుమాన్షన్‌  బ్రాడీపేట : 2217407
  • కాడ్‌ ఐ టెక్నాలజీస్‌ మెయిన్‌రోడ్డు అరండల్‌పేట : 9440122233
  • లక్ష్య ఇన్‌ఫోటెక్‌  బ్రాడీపేట : 2333661
  • న్యూసాఫ్టెక్‌ కంప్యూటర్స్‌ : 9246474234
  • ఓఎస్‌ఎస్‌ కంప్యూటర్స్‌  బ్రాడీపేట : 2252365
  • ఎస్‌ వీ కంప్యూటర్స్‌  బ్రాడీపేట : 9985446788
  • సైస్‌ కంప్యూటర్‌ ఎడ్యుకేషన్‌ : 32032078
  • స్కైటెక్‌  అరండల్‌పేట : 6535898
  • టిక్ట్‌ కంప్యూటర్స్‌  అరండల్‌పేట : 2227028
  • విస్సా కంప్యూటర్స్‌  బ్రాడీపేట : 6647644
  • మోడల్‌ మల్టీమీడియా : 0863-2354880
  • ఎరీనా యానిమేషన్స్‌  బ్రాడీపేట : 2354880
  • సీ జీ పీ యానిమేషన్స్‌ : 9866709562
  • ద ఫిక్సెల్‌ వ్యూ  చంద్రమౌళినగర్‌ : 6456868
  • ప్యాట్రిక్స్‌  బ్రాడీపేట : 9948041488
  • మోడల్‌ మల్టీమీడియా  బ్రాడీపేట : 2354880

కంప్యూటర్‌ సర్వీస్‌ సెంటర్స్‌

  • లక్ష్యా ఇన్‌ఫోటెక్‌ , లక్ష్మీపురం రోడ్డు : 2333661
  • అక్షయ కంప్యూటర్స్‌  అరండల్‌పేట : 984859023
  • బీఆర్‌ సిస్టమ్స్‌  బ్రాడీపేట : 2321383
  • కంట్రీ కంప్యూటర్‌ టెక్నాలజీస్‌  లక్ష్మీపురం : 2331969
  • చరణ్‌ ఇన్‌ఫోటెక్‌ : 7416161615
  • కంపాక్‌ షోరూం  బృందావన్‌గార్డెన్స్‌ : 2326633
  • దీప్తి కమ్యూనికేషన్స్‌  అరండల్‌పేట : 2330003
  • డిజిటల్‌ ప్లానెట్‌  బ్రాడీపేట : 2326399
  • ఈ ఎస్‌ ఎస్‌ టెక్నాలజీస్‌  బ్రాడీపేట : 2250317
  • డీఎస్‌ యూనిక్స్‌ ఇన్‌ఫోటెక్స్‌,  అరండల్‌పేట : 2230094
  • సీ ఎస్‌ కంప్యూటింగ్‌ సొల్యూషన్స్‌, అరండల్‌పేట : 9966302905
  • సి వెల్‌ టెక్నాలజీ, పట్టాభిపురం : 2251880
  • కష్టమర్‌ కేర్‌ కంప్యూటర్స్‌  బ్రాడీపేట : 9966302905
  • దుర్గాసాయి కంప్యూటర్స్‌,  తెనాలి రోడ్‌ : 9330063880
  • ఈశ్వర్‌ టెక్నాలజీస్‌,  బ్రాడీపేట : 9849328369
  • ఎక్సెల్‌ ఎలక్ట్రానిక్స్‌,  అరండల్‌పేట : 2232188
  • ఆర్‌ ఎం ఎస్‌ కంప్యూటర్స్‌ వరల్డ్‌,  బ్రాడీపేట : 9985363849
  • సిలికాన్‌వాలీ కంప్యూటర్స్‌,  అరండల్‌పేట : 6645110

చేతి వృత్తుల శిక్షణా సంస్థలు

  • ఆంధ్రాబ్యాంకు గ్రామీణాభివృద్థి సంస్థ,  కొత్తపేట : 9440915708, 0863-2336912
  • జనశిక్షణ సంస్థ, లక్ష్మీపురం : 2323247, 2328147

ఆధారము: ఈనాడు

వృత్తి విద్య

ఇంజినీరింగ్‌ కళాశాలలు:

  1. న్యూటన్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ అలిగురాజపల్లి ఆఫ్‌ ఇంజినీరింగ్‌ ; మాచర్ల
  2. చుండి రంగనాయకులు గణపవరం ఇంజనీరింగ్‌ కళాశాల ; చిలకలూరిపేట
  3. బాపట్ల ఇంజినీరింగ్‌ మహాత్మాజిపురం, కళాశాల ;  బాపట్ల
  4. మిట్టపల్లి ఇంజినీరింగ్‌ తుమ్మలపాలెం,కళాశాల  ఎన్‌.హెచ్‌-5 గుంటూరు
  5. నర్సరావుపేట ఇంజినీరింగ్‌ యలమంద గ్రామం, కళాశాల ; నర్సరావుపేట
  6. వీ వీ ఐటీ కళాశాల నంబూరు,  పెదకాకాని
  7. కోనేరు లక్ష్మయ్య వడ్డేశ్వరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ ; తాడేపల్లి మండలం
  8. విజ్ఞాన్‌ ఇంజినీరింగ్‌ కళాశాల వడ్లమూడి,  చేబ్రోలు మండలం
  9. గుంటూరు ఇంజినీరింగ్‌ కళాశాల బోయపాలెం,  ఎన్‌హెచ్‌-5 గుంటూరు
  10. చలపతి ఇంజినీరింగ్‌ కళాశాల  లాం,  తాడికొండ మండలం
  11. ఎన్నారై ఇంజినీరింగ్‌ కళాశాల  మేడికొండూరు మండలం

జిల్లాలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలల వివరాలు

  1. ఎం.బి.టి.ఎస్‌. నల్లపాడు, 99123- 42014
  2. ప్రభుత్వ మహిళా  గుజ్జనగుండ్ల, 99123-42015
  3. చుండి రంగనాయకులు;  గణపవరం, 99123-42040
  4. ప్రభుత్వ జౌళీ ; నల్లపాడు, 99123-42063
  5. ప్రభుత్వ మైనార్టీ;  నల్లపాడు, 99123-42096
  6. బాపట్ల పాలిటెక్నిక్‌ కళాశాల  ; బాపట్ల 99123-42106
  7. ప్రభుత్వ పాలిటెక్నిక్‌  కళాశాల . పొన్నూరు
  8. ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల
  9. పాలిటెక్నిక్‌ కళాశాల;  గుంటూరు
  10. పాలిటెక్నిక్‌ కళాశాల ; చిలకలూరిపేట

ఆధారము: ఈనాడు

చివరిసారిగా మార్పు చేయబడిన : 5/28/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate