অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

10వ తరగతి తర్వాత

10వ తరగతి తర్వాత

సుస్థిర కెరీర్ ప్రగతి దిశగా చేసే ప్రయాణంలో పదోతరగతి తొలి సోపానం.

ఇంతటి కీలకమైన దశను దాటిన తర్వాత ఏ కోర్సులో చేరాలి? ఎందులో చేరితే అవకాశాలు ఎలా ఉంటాయి? ఇలాంటి ప్రశ్నలు ఎదురవుతాయి.

హెచ్ఈసీ : సామాజిక అంశాలపై అవగాహన, సమాజంలో ఎప్పటికప్పుడు చోటు చేసుకునే పరిణామాలను అన్వేషించే నైపుణ్యం ఉన్నవారికి సరైన గ్రూప్ హెచ్ఈసీ. ఇంటర్ హెచ్ఈసీ పూర్తి చేసిన తర్వాత ఉన్నత విద్యా పరంగా ఎన్నో అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. సర్టిఫికెట్ కోర్సుల నుంచి డిగ్రీ స్థాయి వరకు వివిధ కోర్సులను వీరు అభ్యసించవచ్చు. సంప్రదాయ డిగ్రీ కోర్పులతో పాటు జాబ్ ఓరియెంటెడ్ డిప్లోమా కోర్సులు విద్యార్థులకు అందుబాటు లో ఉన్నాయి. ఉన్నత విద్య మాత్రమే కాకుండా ఉన్నతోద్యోగాల దిశగా కూడా అనేక అవకాశాలున్నాయి.

ఇంటర్మీడియెట్ ఎంపీసీ : ఇంజనీర్ గా కెరీర్ లో స్థిరపడాలనుకునే వారు ఇంటర్మీడియెట్ లో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ (ఎంపీసీ) గ్రూపులో చేరొచ్చు. గణితం పై ఆసక్తి ఉండి, వివిధ సూత్రాలను వేగంగా అన్వయించే నైపుణ్యాలు ఉన్న విద్యార్థులకు ఎంపీసీ సరైన గ్రూప్. ఐఐటీ, నిట్ లు, టాప్ ఇంజనీరింగ్ కళాశాలల్లో ఇంజనీరింగ్ సీటు సంపాదించాలంటే ఇంటర్ లో చేరిన మొదటి రోజు నుంచి ఆ లక్ష్యాన్ని చేరుకునేందుకు కృషి చేయాలి. ఎంసెట్, జేఈఈ మెయిన్, జేఈఈ అడ్వాన్స్డ్, బిట్ శాట్ తదితర పోటీ పరీక్షల్లో మంచి ర్యాంకు కోసం కృషి చేయాలి. ఇంజనీరింగ్ కెరీర్ పై ఆలోచన లేని వారు, ఎంపీసీ తర్వాత బ్యాచిలర్ డిగ్రీ స్థాయిలో బీఎస్సీలో అడుగు పెట్టి, తర్వాత ఎమ్మెస్సీ, పీహెచ్డీ వంటి ఉన్నత విద్యను అభ్యసించి పరిశోధనలు దిశగా వృత్తి జీవితాన్ని సుస్థిరం చేసుకోవచ్చు.

సీఈసీ, ఎంఈసీ : వ్యాపార వ్యవహారాలు, గణాంకాల విశ్లేషణ పై ఆసక్తి ఉన్న వారికి సరైన గ్రూపులు సీఈసీ, ఎంఈసీ. ప్రస్తుత కార్పొరేట్ యుగంలో వ్యాపార, పారిశ్రామిక రంగం శరవేగంగా విస్తరిస్తోంది. ఈ క్రమంలో కామర్స్ లో నైపుణ్యాలున్నవారికి అవకాశాలు పలకరిస్తున్నాయి. వీటిని అందిపుచ్చుకునేందుకు సరైన కోర్సులు సీఈసీ, ఎంఈసీ అని చెప్పొచ్చు. చార్టర్డ్ అకౌంటెన్సీ కాస్ట్ అకౌంటెన్సీ కంపెనీ సెక్రటరీ వంటి ప్రొఫెనల్ కోర్సుల్లో రాణించేందుకు అనుకూలమైన గ్రూప్లు సీఈసీ,

బైపీసీతో వైద్యం : మొక్కలు, జంతువులపై ఆసక్తి ఉండి, విశ్లేషణాత్మక నైపుణ్యాలున్న వారికి సరిపడే గ్రూప్ బైపీసీ (బోటనీ, జువాలజీ, ఫిజిక్స్ కెమిస్ట్రీ). వైద్య వృత్తిలో స్థిరపడాలనుకునే వారు తొలుత పూర్తిచేయాల్సిన గ్రూప్ ఇది. దీని సిలబస్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి కషపడి చదివే తత్వం ప్రధానం. ఈ గ్రూఫ్ లో ప్రాక్టికల్స్ కు ప్రాధాన్యం ఉంటుంది. అందువల్ల తరగతి గదిలో నేర్చుకున్న అంశాలను, ప్రయోగశాలలో పరిశీలించే విధంగా సన్నద్ధత అవసరం. బైపీసీ, సీఎంసీ తదితర పరీక్షల ద్వారా ఎంబీబీఎస్ లో చేరి డాక్టర్ గా జీవితంలో స్థిర పడటం సుదీర్ఘ ప్రక్రియనే చెప్పాలి. రెండేళ్ల పాటు ఇంటర్ చదివిన తర్వాత ఎంబీబీఎస్, ఆ తర్వాత పీజీ కోర్సు చేయాలి. అందువల్ల ఆసక్తి, కుటుంబ, ఆర్థిక పరిస్థితి ఆధారంగా బైపీసీలో చేరడంపై నిర్ణయం తీసుకోవాలి.

నోటిఫికేషన్ కోర్సులు

అర్హత : పదవ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారు ఇంటర్మీడియట్ రెండేళ్ల కోర్సుల్లో ప్రవేశించవచ్చు. ఆరు కేటగిరీల్లో మొత్తం 27 కోర్సులు అందుబాటులో ఉన్నాయి.

కెరీర్ : బ్రాంచ్ కి అనుగుణంగా ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో అవకాశాలుంటాయి. ప్రభుత్వ రంగంలో రైల్వేలు, గెయిల్, సెయిల్ వంటి భారీ కంపెనీల్లోనూ అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు. స్వయం ఉపాధి దిశగా వెల్గొచ్చు. ఇంటర్ వొకేషనల్ కోర్సుల్లో ముఖ్యమైనవి ఇంజనీరింగ్, టెక్నాలజీ కోర్సులు. వీటిని పూర్తిచేసింది తడవు తక్షణ ఉపాధి లభిస్తుంది.

ముఖ్యమైనవి

ఆటోమొబైల్ ఇంజనీరింగ్ టెక్నీషియన్ : కరిక్యులం : వర్క్ షాప్ టెక్నాలజీ, బేసిక్ మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఆటో పవర్ ప్లాంట్, ఆటో ట్రాన్స్ మిషన్ అండ్ ఎలక్ట్రికల్ సిస్టమ్స్ ఆటో సర్వీసింగ్ అండ్ మెయింటెనెన్స్.

ఉద్యోగావకాశాలు : ఆటో మెకానిక్ వెహికల్ సర్వీస్ టెక్నీషియన్, ఆటో ఫిట్టర్, స్పేర్ పార్ట్స్ సేల్స్ అసిస్టెంట్/ మ్యానుఫ్యాక్చర్ రిప్రెజెంట్, ఇన్సూరెన్స్ అండ్ లాస్ అసెసర్ అసిస్టెంట్, లెబారెటరీ అసిస్టెంట్, ఆటో ఎలక్ట్రిషియన్.

మెకానికల్ ఇంజనీరింగ్ టెక్నీషియన్ : ఉద్యోగావకాశాలు: ప్రభుత్వ ప్రైవేటు సంస్థల మెకానికల్ విభాగాలు; ఆటోమొబైల్ సర్వీస్ సెంటర్ల టెక్నీషియన్, రిఫ్రిజిరేషన్, ఎయిర్కండీషనింగ్ సర్వీస్ సెంటర్ల టెక్నీషియన్, వర్క్ షాప్ టెక్నీషియన్, పవప్ ప్లాంట్ ల టెక్నీషియన్, సోలార్ సిస్టమ్ టెక్నీషియన్.

  • ఇంజనీరింగ్, టెక్నాలజీ కోర్సుల్లో వాటర్ సప్లై అండ్ శానిటరీ ఇంజనీరింగ్; డీటీపీ అండ్ ప్రింటింగ్ టెక్నాలజీ కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి.

ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ టెక్నీషియన్ : ఉద్యోగావకాశాలు : ఎల క్ట్రానిక్ ఎక్విప్మెంట్ అసెంబ్లీస్, ఎలక్ట్రానిక్ ఎక్విప్ మెంట్ టెస్టర్రిపైరర్, ఎలక్ట్రానిక్ ఎక్విప్ మెంట్స్ సేల్స్ అండ్ సర్వీస్,

ఎలక్ట్రికల్ టెక్నీషియన్ : ఉద్యోగావకాశాలు : ఎలక్ట్రానిక్ ఉపకరణాల అసెంబ్లర్, టెస్టర్, ఇన్స్టలేషన్ అండ్ సర్వీస్, రిపైరర్, వైండర్/రివైండర్ (మోటార్), సేల్స్ మ్యాన్.

టిఐ/ఐటిసి : ఇండస్ట్రియల్ టైనింగ్ ఇన్స్టిట్యూట్ (ప్రభుత్వ), ఇండస్ట్రీయల్ ట్రైనింగ్ సెంటర్ (ప్రైవేటు)లు సాంకేతిక రంగంలో శిక్షణ ఇచ్చే సంస్థలు. ఇవి కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని డెరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఎంప్లాయ్ మెంట్ అండ్ టైనింగ్ (డీజీఈటీ) పర్యవేక్షణలో పనిచేస్తున్నాయి.

అర్హత : ఐటీఐ/ఐటీసీ లలోని ట్రేడ్లలో పదోతరగతి లేదా తత్సమాన అర్హతతో చేరవచ్చు.

కోర్సులు : ఐటీఐ/ఐటీసీలలో మూడు నెలలు మొదలుకొని మూడేళ్లకాల పరిమితి గల ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఫిట్టర్, ఎలక్ట్రిషియన్, వెల్డర్, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, టర్నర్ రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండీషనింగ్ తదితర కోర్సులున్నాయి.

స్వయం ఉపాధి దిశగా : ఉన్నత విద్యనభ్యసించడానికి ఆర్థిక ఇబ్బందులు ఎదురైతే స్వయం ఉపాధి దిశగా కూడా ఎన్నో సంస్థలు స్వల్పకాలిక శిక్షణ కోర్సులను అందిస్తున్నాయి. సెట్విన్, స్వామి రామానంద తీర్థ రూరల్ ఇన్స్టిట్యూట్, ఏపీ ఇంటర్మీడియెట్ బోర్డ్, ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ వంటి సంస్థలు ప్రస్తుత జాబ్ మార్కెట్కు అవసరమైన ఎన్నో కోర్సులను అతి తక్కువ రుసుముకే అందిస్తున్నాయి. ఆయా సంస్థలు అందించే కోర్సుల్లో డేటా ఎంట్రీ ఆపరేటర్, ఎలక్ట్రిషియన్ ట్రేడ్, సెల్ ఫోన్ రిపేరింగ్, ట్రాక్టర్ డ్రైవింగ్ ఫుట్వేర్ డిజైన్, స్టోర్ కీపర్, హౌస్ క్రీపింగ్, గార్మెంట్ తయారీ, బేకరీ అండ్ కన్ఫెక్షనరీ, పుట్టవంటి ఎన్నో కోర్సులు అందుబాటులో ఉన్నాయి.

కోర్సులు - విభాగాలు

ఇంటర్మీడియెట్

  • ఎంపీసీ
  • బైపీసీ
  • సీఈసీ
  • ఎంఈసీ
  • హెచ్ఈసీ

పాలిటెక్నిక్

  • సివిల్ ఇంజనీరింగ్
  • మెకానికల్ ఇంజనీరింగ్
  • ఆటోమొబైల్
  • రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండీషనింగ్
  • ఈఈఈ, ఈసీఈ
  • కంప్యూటర్ ఇంజనీరింగ్

ఐటీఐ/ఐటీసీ

  • ఫిట్టర్
  • ఎలక్ట్రిషియన్
  • ఇన్స్ స్ట్రూమెంట్ మెకానిక్
  • వెల్డర్, టర్నర్, ప్లంబర్
  • కంప్యూటర్ ఆపరేటర్, ప్రోగ్రామింగ్ అసిస్టెంట్

ఇంటర్ వొకేషనల్ కోర్సులు

  • క్రాప్ ప్రొడక్షన్ అండ్ మేనేజ్ మెంట్
  • అకౌంటింగ్ అండ్ ట్యాక్సేషన్
  • ఆటోమొబైల్ ఇంజనీరింగ్ టెక్నీషియన్
  • కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్
  • ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ టెక్నీషియన్

వ్యవసాయ పాలిటెక్నిక్ లు

  • డిప్లొమా ఇన్ అగ్రికల్చర్
  • డిప్లొమా ఇన్ సీడ్ టెక్నాలజీ
  • అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ డిప్లోమా

వ్యవసాయ పాలిటెక్నిక్ లు గ్రామీణ యువత స్వయం ఉపాధి కల్పించుకోవాలనే ఉద్దేశంతో రాష్ట్రంలో వ్యవసాయ పాలిటెక్నిక్ లు ఏర్పాటు చేశారు. పాలిటెక్నిక్ లలో మూడు రకాల కోర్సులున్నాయి. అవి, డిప్లొమా ఇన్ అగ్రికల్చర్, డిప్లోమా ఇన్ సీడ్ టెక్నాలజీ, అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ డిప్లొమా, డిప్లోమా ఇన్ అగ్రికల్చర్, డిప్లొమా ఇన్ సీడ్ టెక్నాలజీ కోర్సుల కాల పరిమితి రెండేళ్లు. ఇంజనీరింగ్ కోర్సు కాల పరిమితి మూడేళ్లు.

అర్హత ప్రధేశాలు : పదేళ్ల చదువు కాలంలో కనీసం నాలుగేళ్లు గ్రామీణ ప్రాంత పాఠశాలలో చదివి ఉండాలి. పదోతరగతి లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత. ఇంటర్, ఆపై కోర్సులు పూర్తి చేసిన వారు అర్హులు కారు. అర్హత పరీక్షలో సాధించిన గ్రేడ్. పాయింట్ యావరేజ్(జీపీఏ) ప్రకారం కోర్సులలో ప్రవేశాలు కల్పిస్తారు.

అవకాశాలు : వ్యవసాయ డిప్లోమా కోర్సులు పూర్తి చేసిన వారికి ఎరువులు, పురుగు మందులు, విత్తనాల సంస్థలు వంటి వాటిలో ఉద్యోగాలు లభిస్తాయి. సాంత్ర ప్రాజెక్టులతో స్వయం ఉపాధి దిశగా అడుగులు వేయొచ్చు. ప్రారంభంలో రూ.15వేల వరకు వేతనం లభిస్తుంది.

పాలిటెక్నిక్ కోర్సులు : తక్కువ ఖర్చుతో పూర్తయ్యే ఇంజనీరింగ్ డిప్లోమా కోర్సులు యువత సత్వర ఉపాధి పొందేందుకు వీలుకల్పిస్తున్నాయి. చిన్న వయసులోనే ఉన్నత ఉద్యోగాలు, అత్యున్నత సాంకేతిక విద్య దిశగా ప్రయాణించేందుకు పునాదులు వేస్తున్నాయి.

అర్హత : పదోతరగతి లేదా తత్సమాన అర్హతతో పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ రాయొచ్చు. ఈ పరీక్షను స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (ఎస్భీటీఈటీ) నిర్వహిస్తోంది. ఇందులో సాధించిన ర్యాంకు ద్వారా ప్రభుత్వ ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలలలో డిప్లోమా కోర్సుల్లో ప్రవేశాలు పొందొచ్చు.

మూడేళ్ల కోర్సులు : సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండీషనింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ వంటి బ్రాంచులున్నాయి. మూడున్నరేళ్ల కోర్సులు కంప్యూటర్ ఇంజనీరింగ్, ఎంబెడెడ్ సిస్టమ్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ వంటివి.

కెరీర్ : పాలిటెక్నిక్ డిప్లోమా కోర్సులు పూర్తిచేసిన వారు ఇంజనీరింగ్ బ్యాచిలర్ డిగ్రీ (బీటెక్/బీఈ) కోర్సుల్లో నేరుగా రెండో సంవత్సరంలో లేటరల్ ఎంట్రీ స్కీం ద్వారా ప్రవేశించవచ్చు. దీనికి ఈ-సెట్ రాయాల్సి ఉంటుంది. ఉద్యోగాల పరంగా చూస్తే ప్రభుత్వ ప్రైవేటు రంగ సంస్థలలో అవకాశాలు లభిస్తాయి. వీటికి సంబంధించి ఎంప్లాయ్ మెంట్ న్యూస్, ప్రముఖ దినపత్రికలలో ప్రకటనలు వెలువడుతుంటాయి. డిప్లోమా కోర్సులు పూర్తి చేసిన వారు స్వయం ఉపాధిని కూడా పొందొచ్చు.

వేతనాలు : చేరిన సంస్థను బట్టి రూ.15వేల నుంచి రూ.20 వేల వరకు ప్రారంభ వేతనం ఉంటుంది.

పదో తరగతి అర్హతతో

రైల్వే జాబ్స్

పోస్టులు : కమర్షియల్ క్లర్క్, టికెట్ ఎగ్జామినర్ (టికెట్ కలక్టర్), ట్రైన్స్ క్లర్క్.

ఎంపిక విధానం : రెండు దశల్లో నిర్వహించే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ రాత పరీక్ష మెడికల్ టెస్ట్ ద్వారా.

వయోపరిమితి : 18 నుంచి 30 ఏళ్ల మధ్యలో ఉండాలి.

వేతన శ్రేణి : రూ.5,200 – 20,200 + గ్రేడ్ పే రూ.2000

పోస్టులు : అకౌంట్స్ క్లర్క్ కం టైపిస్ట్, జూనియర్ క్లర్క్ కం టైపిస్ట్.

ఎంపిక విధానం : రాత పరీక్ష, టైప్ పరీక్ష ద్వారా.

వయోపరమితి : 18 నుండి 30 ఏళ్ళు.

వేతన శ్రేణి : రూ.5,200 - రూ.20,200

పోస్టు : ఆర్.పీ.ఎఫ్ కానిస్టేబుల్

ఎంపిక విధానం : ఫిజికల్ టెస్ట్, రాత పరీక్షల ద్వారా

వయోపరిమితి: 18 నుంచి 30 ఏళ్లు

వేతన శ్రేణి : రూ.5,200 నుంచి రూ.20,200

వెబ్ సైబ్ : www.rrcb.gov.in

డిఫెన్స్ జాబ్స్

ఇండియన్ ఎయిర్ ఫోర్స్

పోస్టు : ఎయిర్మెన్ గ్రూప్ – వై మ్యుజీషియన్ ట్రేడ్

అర్హత : పదోతరగతిలో 45 శాతం మార్కులు.

వయస్సు : 16న్నర ఏళ్ల నుంచి 19న్నర ఏళ్లు.

ఎంపిక విధానం : రాత పరీక్ష ఫిజికల్ టెస్ట్ ల ద్వారా, సంబంధిత సంగీత పరికరంలో ప్రావీణ్యం ఉండాలి.

వేతన శ్రేణి : రూ.5,200 - 20,200 + గ్రేడ్ పే రూ.2000

వెబ్ సైట్ : http://careerairforce.nic.in

ఇండియన్ నేవిపోస్ట్

మెట్రిక్ రిక్రూట్ – స్టివార్డ్/కుక్స్; మ్యూడిషియన్లు.

వయోపరిమితి : 7 – 21 ఏళ్ళు, నిర్దేశిత శారిరిక ప్రమాణాలు తప్పనిసరి.

వెబ్ సైట్ : www.joinindiannavy.gov.in

ఇండియన్ ఆర్మీపోస్టు

సోల్జర్ జనరల్ డ్యూటీ

అర్హత : పదోతరగతిలో కనీసం 45 శాతం మార్కులు సాధించాలి.

వయోపరిమితి : 17న్నర నుంచి 21 ఏళ్లు.

ఎంపిక విధానం: రాతపరీక్ష దేహదారుఢ్య వైద్య ఆరోగ్య పరీక్షల ద్వారా.

వెబ్ సైట్ : http://indianarmy.nic.in

ఏపీఎస్ఆర్టీసీ

పోస్టు : బస్ కండక్టర్.

ఎంపిక విధానం : పదోతరగతి మార్కులతో.

పోస్టు : బస్ డ్రైవర్.

ఇతర అర్హతలు : హెవీ మోటార్ వెహికల్ పెర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్స్ తో పాటు నిర్దేశిత అనుభవం తప్పనిసరి

సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ - సీఐఎస్ఎఫ్ పోస్టు

కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ).

వయోపరిమితి: 18-23 ఏళ్లు.

వేతన శ్రేణి : రూ. 5,200 – 20,200 + గ్రేడ్ పే రూ. 2,000

ఎంపిక విధానం : వివిధ దేహదారుఢ్య రాత పరీక్ష ఆరోగ్య పరీక్షల ద్వారా. వెబ్ సైట్ : http://www.cisf.gov.in

సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) పోస్టు

కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ).

వయోపరిమితి : 18 - 23 ఏళ్లు.

వేతన శ్రేణి : రూ.5,200 – 20,200 + గ్రేడ్ పే రూ.2,000

ఎంపిక విధానం : దేహదారుడ్య పరీక్షలు, రాత పరీక్ష ఆరోగ్య పరీక్షల ద్వారా

వెబ్ సైట్ : http://crpf.nic.in

బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) పోస్టు

కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ).

వయోపరిమితి : 18 - 23 ఏళ్లు.

వేతన శ్రేణి : రూ.5,200 – 20,200 + గ్రేడ్ పే రూ.2,000

ఎంపిక విధానం : దేహదారుడ్య పరీక్షలు, రాత పరీక్ష ఆరోగ్య పరీక్షల ద్వారా

వెబ్ సైట్ : http://bsf.nic.in

ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ఐటీబీపీఎఫ్) పోస్టు

కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ).

వయోపరిమితి: 18 - 23 ఏళ్లు.

వేతన శ్రేణి : రూ.5,200 – 20,200 + గ్రేడ్ పే రూ.2,000

ఎంపిక విధానం : దేహదారుఢ్య పరీక్షలు, రాత పరీక్ష ఆరోగ్య పరీక్షల ద్వారా

పోస్టు : కానిస్టేబుల్ (లైన్ మెన్)

వయోపరిమితి : 18 - 23 ఏళ్లు

వేతన శ్రేణి : రూ.5,200 – 20,200 + గ్రేడ్ పే రూ.2,000

ఎంపిక విధానం : దేహదారుడ్య పరీక్షలు, రాత పరీక్ష ఆరోగ్య పరీక్షల ద్వారా పైన తెలిపిన అన్ని ఇండోటిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ ఉద్యోగాలకు సంబంధించి పూర్తి వివరాలు www.itbpolice.nic.in లో చూడొచ్చు.

చివరిసారిగా మార్పు చేయబడిన : 1/16/2024



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate