హోమ్ / విద్య / కెరీర్ గైడెన్స్ / 2016 భవిష్యత్తు వీటిదే!
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

2016 భవిష్యత్తు వీటిదే!

డిమాండ్‌ ఉండే రంగాలను ఎంచుకుంటే జాబ్‌ సాధించడం సులువవుతుంది. అందుకే కోర్సు ఎంపిక చేసుకునే సమయంలోనే ఏయే రంగాల్లో ఎక్కువ అవకాశాలు ఉన్నాయన్న విషయాన్ని గమనించాలని అంటున్నారు నిపుణులు.

డిమాండ్‌ ఉండే రంగాలను ఎంచుకుంటే జాబ్‌ సాధించడం సులువవుతుంది. అలా కాకుండా ఉద్యోగాల్లో గ్రోత్ లేని రంగాన్ని ఎంచుకుంటే జాబ్‌ సాధించడం కాస్త కష్టమవుతుంది. అందుకే కోర్సు ఎంపిక చేసుకునే సమయంలోనే ఏయే రంగాల్లో ఎక్కువ అవకాశాలు ఉన్నాయన్న విషయాన్ని గమనించాలని అంటున్నారు నిపుణులు. ఆ విశేషాలు తెలుసుకోవాలంటే చదవండి.

సాఫ్ట్‌వేర్‌ అప్లికేషన్‌ డెవలపర్స్‌

అర్హత : సంబంధిత విభాగంలో బ్యాచిలర్‌ డిగ్రీ, ఎంట్రీలెవెల్‌లో చేరాలనుకునే వారికి ప్రాక్టికల్‌ ఎక్స్‌పీరియన్స్‌ అవసరం.
ఈ రంగంలో ఉద్యోగాలకు కొదవలేదు. వేగంగా విస్తరిస్తున్న రంగాల్లో ఐటీరంగం ఎప్పుడూ ముందు స్థానంలో ఉంటుంది. రాబోయే పదేళ్లలో ఈ రంగంలో ఉదోగ్యాల పెరుగుదల 23 శాతం ఉంటుందని అంచనా వేస్తున్నారు. అంతే కాకుండా జీతం కూడా ఎక్కువే. పాతిక వేల జీతంతో ఉద్యోగం ప్రారంభించాలనుకునే వారికి ఐటీసెక్టర్‌ బెస్ట్‌ ఆప్షన్‌గా ఉంటుంది. ప్రతిచోటా, ప్రతిపనిలోనూ సాఫ్ట్‌వేర్‌ ప్రోగ్రామింగ్‌ అవసరమవుతోంది. రాబోయే రోజుల్లో అవసరాలకు తగినట్టుగా వాటిలో మార్పులు చేయాల్సి వస్తుంది. కాబట్టి ఈ రంగంలో ఉద్యోగాలకు ఎప్పుడూ డిమాండ్‌ ఉంటుందని అంటున్నారు నిపుణులు.

 

ఆర్గనైజేషనల్‌ సైకాలజిస్ట్‌

అర్హత : మాస్టర్‌ డిగ్రీ ఇన్‌ సైకాలజీ
భవిష్యత్తులో సైకాలజిస్ట్‌లకు మంచి డిమాండ్‌ ఉండే అవకాశం ఉంది. పెద్ద పెద్ద కంపెనీలు సైతం సైకాలజిస్ట్‌ల అవసరాన్ని గుర్తిస్తున్నాయి. పోటీ రంగంలో నెగ్గుకు రావాలన్నా, కంపెనీ ఉన్నత స్థానాలకు చేరుకోవాలన్నా ఉద్యోగులు మానసికంగా బలంగా ఉండాలనే విషయాన్ని కంపెనీలు అర్థం చేసుకున్నాయి. అంతేకాకుండా వ్యాపారంలోనూ సైకలాజికల్‌ ప్రిన్సిపుల్స్‌ను వర్తింపచేయడం, ఎంప్లాయుస్‌ పర్‌ఫార్మెన్స్‌ను పెంచడం వంటి వన్నీ సైకాలజి్‌స్టల చేతుల్లోనే ఉంటాయి. అందుకే కంపెనీలు తప్పనిసరిగా సైకాలజి్‌స్టలను ఎంపిక చేసుకుంటున్నాయి. రాబోయే పదేళ్లలో ఈ ఉద్యోగాలు 26 శాతం పెరిగే అవకాశం ఉందని అంచనా.

పర్సనల్‌ ఫైనాన్స్‌ అడ్వైజర్‌

అర్హత : సంబంధిత విభాగంలో బ్యాచిలర్‌ డిగ్రీ
వేగంగా విస్తరిస్తున్న ఉద్యోగాల్లో ఇది ఒకటి. రాబోయే పదేళ్లలో 30 శాతం వృద్ధి ఉంటుందని అంచనా. చాలా మందికి డబ్బులు ఎక్కడ ఇన్వెస్ట్‌ చేయాలో తెలియదు. ఎందులో ఇన్వెస్ట్‌ చేస్తే మంచి రాబడి వస్తుందో అవగాహన ఉండదు. వీరందరూ ఫైనాన్స్‌ అడ్వైజర్‌లపైనే ఆధారపడతారు. కాబట్టి మంచి డిమాండ్‌ ఉంటుంది. వృత్తిలో ఎదుగుదల కూడా వేగంగా ఉంటుంది. సర్కిల్‌ పెరగడానికి స్కోప్‌ ఉండే ఆక్యుపేషన్‌ ఇది.

 

సర్వే రీసెర్చర్స్‌

అర్హత : మాస్టర్‌ డిగ్రీ

కంపెనీలు వ్యాపార విస్తరణ నిర్ణయాలు తీసుకునే ముందు సైంటిఫిక్‌గా సర్వేలు, రీసెర్చ్‌లు చేయిస్తున్నాయి. ఆ తరువాతే ముందడుగు వేస్తున్నాయి. ఏ ప్రాజెక్ట్‌ మొదలుపెట్టాలన్నా దానివల్ల కలిగే లాభ, నష్టాలను ముందే తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అందుకే ఈ ఫీల్డ్‌లో ఉద్యోగాలకు డిమాండ్‌ పెరుగుతోంది. 2022 కల్లా ఈ ఉద్యోగాలు 18 శాతం పెరిగే అవకాశం ఉందని అంచనా.

 

వెబ్‌ డిజైనర్స్‌


అర్హత : బ్యాచిలర్‌ డిగ్రీ, ఎంట్రీలెవెల్‌ అభ్యర్థులకు ప్రాక్టికల్‌ ఎక్స్‌పీరియన్స్‌ తప్పనిసరి.
వెబ్‌ ప్రపంచం ఎంతగా విస్తరించిందో తెలిసిందే. చిన్న చిన్న కంపెనీలు, సంస్థలు సొంతం వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేసుకుంటున్నాయి. వెబ్‌సైట్ల రూపకల్పన, నిర్వహణలో వెబ్‌డిజైనర్ల పాత్ర చాలా కీలకం. రాబోయే రోజుల్లో ఈ రంగంలో ఉదోగ్యాల వృద్ధి 20 శాతం ఉంటుందని భావిస్తున్నారు. ముందు ముందు ఈ రంగంలో విస్తరణ మరింత జరిగే అవకాశం ఉంది. హై ప్రొఫెషనల్స్‌ ‌ డిమాండ్‌ ఎక్కువగా ఉంటుంది. సర్వీస్‌ను బట్టి వేతనాలు ఉంటాయి. వెబ్‌డిజైనర్‌గా ప్రముఖ కంపెనీలో చేరితే జీతం నెలకు 40 వేలకు పైనే వచ్చే అవకాశం ఉంది.

 

ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజనీర్స్‌

అర్హత : సంబంధిత సబ్జెక్టులో బ్యాచిలర్‌ డిగ్రీ
వాతావరణ సమస్యలపై ప్రపంచం దృష్టి సారిస్తోంది. ప్రకృతిని కాపాడుకుంటే తప్ప మనుగడ సాధించలేమనే విషయాన్ని అందరూ గుర్తించారు. ప్రకృతికి దూరంగా జీవించడం సాధ్యం కాదనే విషయాన్ని తెలుసుకున్నారు. వాతావరణ మార్పులు, తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం చేయడానికి ఉద్యోగాల కల్పన జరిగే అవకాశం ఉంది. ఎన్విరాన్‌మెంట్‌ టెక్నాలజీకి సంబంధించి ఉద్యోగాలకు డిమాండ్‌ పెరిగే అవకాశం ఉంది. ఈ రంగంలో 15 శాతం ఉద్యోగాల వృద్ధి ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

 

మెడికల్‌ అసిస్టెంట్స్‌

అర్హత : సంబంధిత రంగంలో డిప్లొమా
ఈ ఏడాది ఫార్మా సంబంధ రంగంలో ప్రొఫెషనల్స్‌కు మంచి డిమాండ్‌ ఉంటుందని నిపుణుల అంచనా. మెడికల్‌ అసిస్టెంట్స్‌కు సైతం డిమాండ్‌ ఉంటుందని, ఈ ఉద్యోగాల్లో గ్రోత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. రాబోయే ఐదేళ్లలో ఈ రంగంలో ఉద్యోగాల వృద్ధి 22 శాతం ఉండే అవకాశం ఉంది. జీతం పాతిక వేల వరకు ఉంటుంది.

 

అథ్లెటిక్‌ ట్రెయినర్స్‌

అర్హత : బ్యాచిలర్‌ డిగ్రీ

ఎక్కువ మంది ఈ రంగం వైపు దృష్టి సారించరు. కానీ రాబోయే ఐదేళ్లలో ఈ రంగంలో ఉద్యోగాల వృద్ధి 30 శాతం ఉంటుందని అంచనా. మంచి జీతం, హోదా కోరుకునే వారు ఈ ఫీల్డ్‌ను ఎంచుకోవచ్చు. వృత్తిలో ఎదుగుదలతో పాటు సంతృప్తి ఉంటుంది. స్పోర్ట్స్‌ పట్ల ఆసక్తి ఉండే వారికి ఇది మంచి రంగం.

 

పర్సనల్‌ అండ్‌ హోమ్‌ కేర్‌ అసిస్టెంట్స్‌

ఎక్కువ గ్రోతకు ఆస్కారం ఉన్న ఫీల్డ్‌ ఇది. ఇంట్లో భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగాలు చేయడం సర్వసాధారణమై పోయింది. ఇలాంటి సమయంలో చిన్న పిల్లలను చూసుకోవడానికి, వృద్ధులను చూసుకోవడానికి హోమ్‌ కేర్‌ అసిస్టెంట్స్‌ అవసరమవుతున్నారు. రాబోయే ఐదేళ్లలో ఈ రంగంలో ఉద్యోగాల్లో వృద్ధి 48 శాతం ఉంటుందని అంచనా. జీతం 20 వేల వరకు లభిస్తుంది. అనుభవాన్ని బట్టి జీతంలో పెరుగుదల ఉంటుంది.

బయోమెడికల్‌ ఇంజనీర్స్‌

అర్హత : సంబంధిత రంగంలో బ్యాచిలర్‌ డిగ్రీ

హెల్త్‌కు ఉన్న ప్రాధాన్యం తెలిసిందే. మెడికల్‌ రంగంలో కొత్త ఆవిష్కరణలు చేయడం, సమస్యలకు పరిష్కారాలు కనుక్కోవడం వంటివి ఈ ఉద్యోగంలో భాగంగా ఉంటాయి. జీతం ఎక్కువగా ఉండాలని కోరుకునే వారు ఈ ఫీల్డ్‌ను ఎంచుకోవచ్చు. బయోమెడికల్‌ ఇంజనీర్స్‌కు రాబోయే రోజుల్లో డిమాండ్‌ పెరిగే అవకాశం ఉంది. ఈ రంగంలో ఉద్యోగాల సంఖ్య 27 శాతం పెరిగే అవకాశం ఉందని అంచనా.

ఆధారము: ఆంధ్రజ్యోతి

2.99
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు