హోమ్ / విద్య / కెరీర్ గైడెన్స్ / అన్నింట్లోనూ ముందుంటూ
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

అన్నింట్లోనూ ముందుంటూ

ఏ సంస్థలోనైనా, ఉత్తములు, సమర్థులే ఎక్కువగా మనగలుగుతారు. ఒక సంస్థ వ్యక్తుల్లోని ఏ యోగ్యతలను అమితంగా కోరుకుంటుందంటే..

ఏ సంస్థలోనైనా, ఉత్తములు, సమర్థులే ఎక్కువగా మనగలుగుతారు. సంస్థల పురోగతి అయినా, అందులోని ఉద్యోగుల అభివృద్ధి అయినా అది ఆ ఉద్యోగుల్లోని యోగ్యతల మీదే ఆధారపడి ఉంటుంది. అందుకు విరుద్ధంగా వ్యవహరించే ఎవరినైనా తొలగించడానికి ఏ కంపెనీ వెనుకాడదు. ఇంతకీ ఒక సంస్థ వ్యక్తుల్లోని ఏ యోగ్యతలను అమితంగా కోరుకుంటుందంటే..

కమ్యూనికేటర్‌

ప్రతి కంపెనీ, మంచి ఆలోచనలు, స్పష్టమైన వ్యక్తీకరణ ఉన్నవారినే తమతో పాటు తీసుకువెళుతుంది. మాటల్లోనైనా, రాతల్లోనైనా ఈ రెండూ కోరుకుంటుంది. ఎందుకంటే అస్పష్టమైన, అర్థరహితమైన వ్యక్తీకరణ వల్ల కంపెనీ ఉద్యోగుల మధ్య పలురకాల సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది.
మరింత బాధ్యతగా...
అవసరమైనప్పుడు అదనపు బాధ్యతులను కూడా స్వీకరించే స్థితిలో ఉద్యోగులు ఉండాలని ఏ సంస్థ అయినా కోరుకుంటుంది. కంపెనీ తాను నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించే క్రమంలో మామూలు రోజువారీ విధులకన్నా మిన్నగా ఉద్యోగులు ఎంతో చేయాలనుకుంటుంది. కంపెనీకి ఏదైనా సమస్య ఎదురైనప్పుడు కూడా వాటిని పరిష్కరించే దిశగా కూడా బాగా ఆలోచించి ఆపత్కాలంలో ఉద్యోగులు ఆదుకోవాల
నుకుంటుంది.
టీమ్‌ ప్లేయర్‌
చాలా కంపెనీల్లో ఉద్యోగులు కొన్ని వేరు వేరు బృందాలుగా ఉంటారు. ఆ బృందంలో బాగా సమర్థులైన వారే ఉండాలని కూడా కంపెనీ కోరుకుంటుంది. ఎవరికి వారు ఒక వ్యక్తిగా తనకు అప్పగించిన విధుల్ని నిర్వర్తిస్తూనే ఉంటారు. అందులో అంత విశేషమేమీ లేదు. అందుకు భిన్నంగా, ఆయా బృందాలతో కలుపుగోలుగా ఉంటూ ఒక సమష్టి బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించడంలోనే విశేషం ఉంది.

ఎవరి గౌరవం వారికే...
చాలా ఆఫీసుల్లో తమ సహోద్యోగులు తమదైన ప్రతిభతో సాధించిన కీర్తిని తాము కొట్టేయాలనుకుంటారు. దీనివల్ల అసలు వ్యక్తికి ఆ గౌరవం దక్కకుండా పోవడంతో పాటు, అతడు తీవ్రమైన మానసిక కుంగుబాటుకు గురవుతారు. అతనిలోని సృజనాత్మకత అంతటితో నశిస్తుంది. ఒక చిత్తశుద్ధి గల ఉద్యోగి తన సహోద్యోగి అసాధరణ ప్రతిభను అభినందించడంతో పాటు ఆ విషయంలో అవసరమైతే తన వంతు సాయాన్ని కూడా అందచేస్తాడు. ఇది అవతలి వ్యక్తికి చేయూత కావడమే కాకుండా, సమష్టిగా కంపెనీ పురోగతికి ఎంతో దోహదం చేస్తుంది.
ఆధారము: ఆంధ్రజ్యోతి
3.03333333333
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు