హోమ్ / విద్య / కెరీర్ గైడెన్స్ / అవకాశాన్ని అందిపుచ్చుకోండి
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

అవకాశాన్ని అందిపుచ్చుకోండి

ఉన్నత చదువుల కోసం విశ్వవిద్యాలయాల్లో అడుగుపెట్టే విద్యార్థులు కెరీర్‌లో టాప్‌లో ఉండడానికి కొన్ని టిప్స్‌ను తప్పనిసరిగా పాటించాలి. అవి..

ఉన్నత చదువుల కోసం విశ్వవిద్యాలయాల్లో అడుగుపెట్టే విద్యార్థులు కెరీర్‌లో టాప్‌లో ఉండడానికి కొన్ని టిప్స్‌ను తప్పనిసరిగా పాటించాలి. అవి...

మీ ఆసక్తులేమిటో మీకు మీరే గుర్తించాలి. చదువుకునేటప్పుడు ఆర్జించిన నైపుణ్యాన్ని ఉపయోగించి మీకు నచ్చిన రంగంలో నెంబర్‌వన్‌గా నిలిచేలా కృషిచేయాలి.
మంచి ఉద్యోగంలో చేరాలంటే కష్టపడాలి. అందుకోసం ముందస్తు ప్లానింగ్‌ ఎంతో అవసరం. అవకాశాలు వచ్చే వరకూ వేచి ఉండకుండా మంచి అవకాశాలను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకోవాలి. ఉద్యోగాలు దొరకడమంటే ఆషామాషీ కాదు. అందులోనూ ఇప్పుడు ప్రతి రంగంలోనూ తీవ్రమైన పోటీ పరిస్థితులు నెలకొన్నాయని మరవద్దు.
విశ్వవిద్యాలయంలో చదివేటప్పుడు తమ రోజువారీ ఖర్చుల కోసం చాలామంది విద్యార్థులు పార్ట్‌టైమ్‌ జాబ్స్‌ చేస్తుంటారు. ఇది మంచి ఆలోచనే. కానీ ఆ చేసే పని మీరు చదువుతున్న చదువుకు ఉపయోగపడేలా ఉండేలా చూసుకుంటే ఇంకా మంచిది. అదే సమయంలో ఇటు ఉద్యోగం, అటు చదువు, మరోవైపు ఆర్థిక సమస్యలతో చాలామంది విద్యార్థులు ఒత్తిడికి గురవుతుంటారు. అలా ఒత్తిడికి గురికాకుండా ప్రత్యామ్నాయ మార్గాలను వారు ఆలోచించుకోవాలి. ఫైనాన్స్‌ సమస్య ఉంటే యూనివర్సిటీలో ఉండే స్టూడెంట్‌ అడ్వైజ్‌ సెంటర్లను ఆశ్రయిస్తే మంచిది. అవి మీరు ఎదుర్కొంటున్న చాలా సమస్యలను పరిష్కరించగలవు. మీ ఒత్తిడిని తగ్గించగలవు. అలాగే తక్కువ వడ్డీకి రుణాలిచ్చే సౌకర్యాలు ఏవైనా ఉంటే అలాంటి విషయాలను కూడా తెలుసుకుంటుండాలి.
యూనివర్సిటీల్లో జరిగే రకరకాల సాంస్కృతిక, విజ్ఞాన కార్యక్రమాల్లో పాల్గొనాలి. ఇవి కూడా కెరీర్‌లో ఎంతో ప్లస్‌ పాయింట్‌ అవుతాయి. స్వచ్ఛందంగా సమాజసేవ చేయడం వంటివి మీ సివికి అదనపు అర్హతలుగా పరిగణించబడతాయి. రకరకాల కార్యక్రమాల్లో పాలుపంచుకోవడం వల్ల వర్క్‌ప్లేస్‌ స్కిల్స్‌ను కూడా పెంచుకోగలుగుతారు. టీమ్‌ వర్కులో ఉత్సాహంగా పాల్గొంటారు. మీ జ్ఞానాన్ని నలుగురికి పంచుతారు. అలాగే పనిలోని మెలకువలను తోటివారితో షేర్‌ చేసుకుంటూ మీ సామర్థ్యాన్ని ఇంకా పెంచుకుంటారు.

విశ్వవిద్యాలయంలో ప్రొఫెషనల్‌ నెట్‌వర్కింగ్‌ను కొనసాగిస్తే మంచి ఫలితాలుంటాయి. అలాగే కెరీర్‌ పరంగా వచ్చిన ఏ అవకాశాన్నీ వదలుకోకుండా ఉపయోగించుకోవాలి. యూనివర్సిటీల్లో తరచూ జరిగే గెస్ట్‌ లెక్చర్లను మిస్‌ అవద్దు. వారి నుంచి సబ్జక్టు పరంగా మీ అనుమానాలను తీర్చుకోవచ్చు. క్యాంప్‌సలో జరిగే కెరీర్‌ ఫెయిర్స్‌కు వెడుతుండాలి.

విశ్వవిద్యాలయంలోని కెరీర్‌ సెంటర్స్‌కు వెడుతుండాలి. ఇవి మంచి రిసోర్సు సెంటర్లు. అక్కడి టీమ్స్‌ మీ కెరీర్‌కు సంబంధించి ఎన్నో విలువైన సలహాలను ఇస్తాయి.
మీకంటూ ఒక మెంటర్‌ ఉండేట్టు చూసుకోవాలి. వాళ్లు లెక్చరర్లు కావొచ్చు. ట్యూటర్లు కావొచ్చు. వేరెవరైనా గురువు కావొచ్చు.

పిజి చేస్తున్నా ఇంటర్వ్యూలకు హాజరవకుండా మాత్రం ఉండకండి. వాటికి తరచూ హాజరవడం వల్ల ఇంటర్వ్యూలను ఎలా ఎదుర్కోవాలో తెలుస్తుంది. అంతేకాదు ఈ ఇంటర్వ్యూలు మిమ్మల్ని కెరీర్‌-రెడీగా తీర్చిదిద్దుతాయి.

 

ఆధారము: ఆంధ్రజ్యోతి

2.90740740741
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు