పదో తరగతి పూర్తి చేసినవారికి చక్కని అవకాశం.. అగ్రికల్చరల్ పాలిటెక్నిక్. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో వ్యవసాయాభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడానికి నిష్ణాతులైన సిబ్బంది అవసరం. ఉన్నత విద్యను అభ్యసించలేని గ్రామీణ ప్రాంత యువకులు స్వయంఉపాధిని పొందాలనే ఉద్దేశంతో అగ్రికల్చర్ కోర్సులను ప్రవేశపెట్టారు. ఇందులో రెండేళ్ల అగ్రికల్చర్, విత్తన సాంకేతిక పరిజ్ఞానం (సీడ్ టెక్నాలజీ), మూడేళ్ల అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ కోర్సులు ఉన్నాయి. మన రాష్ట్రంలో ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ వ్యవసాయ సంబంధమైన కోర్సులను అందిస్తోంది. ఈ యూనివర్సిటీకి అనుబంధంగా రాష్ట్రవ్యాప్తంగా అగ్రికల్చరల్ పాలిటెక్నిక్ కళాశాలలున్నాయి.
అర్హత: కనీసం 5.0 గ్రేడ్ పాయింట్ (ఎస్సీ, ఎస్టీ, శారీరక వికలాంగులకు 4.0 గ్రేడ్ పాయింట్)తో పదో తరగతి ఉత్తీర్ణత. విద్యార్థులు తమ పదేళ్ల విద్యా కాలంలో కనీసం నాలుగేళ్లు గ్రామీణ ప్రాంతంలో చదివి ఉండాలి. ఇంటర్మీడియెట్, అంతకంటే ఎక్కువ చదివినవారు అర్హులు కాదు.
ఎంపిక: పదో తరగతిలో గ్రేడ్ పాయింట్ ఆధారంగా.
వయోపరిమితి: నిర్దేశిత తేదీ నాటికి 15-22 ఏళ్ల మధ్య వయసు ఉండాలి.
సీట్లు: దాదాపు 23 ప్రభుత్వ, 22 ప్రైవేటు కళాశాలలు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో అగ్రి పాలిటెక్నిక్ (ప్రభుత్వ సీట్లు- 675, ప్రైవేటు సీట్లు-840), విత్తన సాంకేతిక పరిజ్ఞానం (ప్రభుత్వ సీట్లు - 85, ప్రైవేటు సీట్లు - 150), అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ (ప్రభుత్వ సీట్లు - 30, ప్రైవేటు సీట్లు - 150).
ఉన్నత విద్య:
అగ్రికల్చరల్ పాలిటెక్నిక్, విత్తన సాంకేతిక పరిజ్ఞానం కోర్సులు పూర్తిచేసిన విద్యార్థులు నాలుగేళ్ల బీఎస్సీ (అగ్రికల్చర్) కోర్సులో ప్రవేశాలకు నిర్వహించే అగ్రిసెట్ రాయొచ్చు. వయసు నిర్దేశిత తేదీనాటికి 17 ఏళ్లపైన ఉండాలి. గరిష్టంగా 22 ఏళ్లు మించరాదు. మొత్తం 93 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రవేశపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది. బీఎస్సీ (అగ్రి) పూర్తయ్యాక ఎంఎస్సీ (అగ్రి), పీహెచ్డీ కూడా పూర్తి చేయొచ్చు.
ఉద్యోగావకాశాలు:
మన దేశం ప్రధానంగా వ్యవసాయాధారిత దేశం. పారిశ్రామికంగా దేశం పురోగమిస్తున్నప్పటికీ ఇప్పటికీ దేశ జనాభాలో 70 శాతం మంది వ్యవసాయం, దాని అనుబంధ రంగాలపై ఆధారపడి జీవిస్తున్నారు. ప్రస్తుతం వ్యవసాయ రంగం ఆధునికతను సంతరించుకుంటోంది. చీడపీడలను తట్టుకోగలిగి, ఎక్కువ దిగుబడినిచ్చే వంగడాలను వాడుతున్నారు. అంతేకాకుండా వ్యవసాయ పనుల్లో యంత్రాల వాడకం కూడా ఎక్కువైంది. ఈ నేపథ్యంలో సంబంధిత వ్యవసాయ పరికరాలు, విత్తన పరిజ్ఞానంపై అవగాహన ఉన్న నిపుణుల అవసరం ఏర్పడుతోంది. వ్యవసాయ రంగంలో అపార వృద్ధిని గమనించిన బహుళజాతి సంస్థలు కూడా సొంత వ్యవసాయ క్షేత్రాలను ఏర్పాటు చేసుకుంటున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, వివిధ స్వచ్ఛంద సంస్థలు గ్రామీణాభివృద్ధికి.. అందులోనూ వ్యవసాయాభివృద్ధికి పెద్దపీట వేస్తున్నాయి. వీటన్నింటిలో వివిధ హోదాల్లో అవకాశాలుంటాయి. విత్తన కంపెనీలు కూడా వీరిని నియమించుకుంటున్నాయి. కాబట్టి వ్యవసాయ కోర్సులు పూర్తిచేసినవారికి మంచి అవకాశాలున్నాయని చెప్పొచ్చు. సొంత వ్యవసాయ భూమి ఉన్నవారికి ఈ కోర్సు ఎంతో ఉపయోగపడుతుంది.
అయితే ఉన్నతవిద్యపరంగా కేవలం బీఎస్సీ అగ్రిలో 93 సీట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అంటే ప్రతిఏటా దాదాపు 1900 మంది పాలిటెక్నిక్ అగ్రికల్చర్, సీడ్ టెక్నాలజీలలో కోర్సులు పూర్తిచేస్తే బీఎస్సీలో ఉన్న సీట్లు అతి స్వల్పం. బీఎస్సీ అగ్రిలో సీటురానివారు ఉన్నత విద్య చదివే అవకాశం లేదు. ఇంటర్లో మాత్రమే చేరే అవకాశం ఉంది. అగ్రికల్చర్ ఇంజనీరింగ్‌లో చేరినవారికి గ్రాడ్యుయేషన్ చేసే అవకాశం ఇంకా కల్పించలేదు. పాలిటెక్నిక్ స్థాయిలో ఉద్యోగావకాశాలు ఎక్కువగా ప్రైవేటు రంగంలోనే ఉంటాయి. వీటిని విద్యార్థులు గుర్తుంచుకోవాలి.
ఆర్ట్స్ నుంచి ఆర్కిటెక్చర్ వరకు..సైన్స్ నుంచి సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ వరకు.. నేటి కార్పొరేట్ యుగంలోనూ.. ఏవిభాగంలో డిగ్రీ పూర్తిచేసిన వారికైనా సర్కారీ కొలువుపై తగని మక్కువ.బ్యాచిలర్స్ డిగ్రీ అర్హతగా అత్యున్నత సివిల్ సర్వీసెస్ మొదలు ఎన్నో కేంద్రప్రభుత్వ విభాగాల్లో నిరంతరం పోస్టుల భర్తీకి కేరాఫ్‌గా నిలుస్తోంది..యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ). ఇందుకోసం జాతీయ స్థాయిలోపరీక్షలు నిర్వహిస్తోంది. 2015లో నిర్వహించే పరీక్షలకు యూపీఎస్సీక్యాలెండర్ ఇయర్ ప్రకటించిన నేపథ్యంలో.. బ్యాచిలర్స్ డిగ్రీ అర్హతగా అందేకేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, నిర్వహించే పలు పరీక్షలు..విజయానికి నిపుణులసూచనలు...
సివిల్ సర్వీసెస్.. సర్వోన్నత పరీక్ష
డిగ్రీ నుంచి బీటెక్, ఎంబీబీఎస్ వంటి వృత్తి విద్య కోర్సుల ఉత్తీర్ణుల వరకు పరిచయం అవసరం లేని, అత్యంత క్రేజ్ కలిగిన పరీక్ష.. సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీస్, ఇండియన్ ఫారెన్ సర్వీస్, ఇండియన్ రెవెన్యూ సర్వీస్ తదితర 20కిపైగా అఖిల భారత సర్వీసులకు అభ్యర్థులను ఎంపిక చేసే సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్‌కు ఏటేటా పోటీ పెరుగుతోంది.
విద్యార్హతలు: ఏదేని బ్యాచిలర్స్ డిగ్రీలో ఉత్తీర్ణత.
వయో పరిమితి:21 నుంచి 32 ఏళ్ల మధ్యలో ఉండాలి.
ప్రకటన: సాధారణంగా ప్రతి ఏటా జనవరి/ ఫిబ్రవరి నెలల్లో ప్రకటన వెలువడుతుంది. 2015లో మే 16న నోటిఫికేషన్ విడుదలవుతుంది.
2015 ఆగస్టు 23న ప్రిలిమినరీ పరీక్ష జరుగుతుంది.
ఎంపిక విధానం: సివిల్ సర్వీసెస్ ఎంపిక విధానం మూడు దశల్లో ఉంటుంది. అవి.. ప్రిలిమినరీ; మెయిన్స; పర్సనాలిటీ టెస్ట్.
ప్రిలిమినరీ
మొత్తం రెండు పేపర్లుగా 400 మార్కులకు ఈ పరీక్ష ఉంటుంది.
పేపర్-1లో జనరల్ అవేర్నెస్, జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ నుంచి ప్రశ్నలు ఉంటాయి.
పేపర్-2లో కాంప్రహెన్షన్; ఇంటర్ పర్సనల్ స్కిల్స్; లాజికల్ రీజనింగ్ అండ్ అనలిటికల్ ఎబిలిటీ; డెసిషన్ మేకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్, జనరల్ మెంటల్ ఎబిలిటీ; బేసిక్ న్యూమరసీ, ఇంగ్లిష్ లాంగ్వేజ్ కాంప్రహెన్షన్ అంశాల నుంచి ప్రశ్నలు ఉంటాయి.
సక్సెస్ టిప్స్: ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహించే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్‌లో పేపర్-1లో విజయానికి అభ్యర్థులు నిర్దేశిత సిలబస్‌లోని అంశాలకు సంబంధించి ప్రాథమిక పరిజ్ఞానంతోపాటు, ఆయా అంశాలను సమకాలీన పరిణామాలతో అనుసంధానం చేసుకుంటూ చదవాలి. ఈ క్రమంలో ప్రాథమిక నైపుణ్యం కోసం ఎన్సీఈఆర్టీ హైస్కూల్ స్థాయి పుస్తకాలను చదవాలి. పేపర్-2 అభ్యర్థుల్లోని డెసిషన్ మేకింగ్ స్కిల్స్, భాష నైపుణ్యం, మ్యాథమెటికల్ స్కిల్స్, రీజనింగ్, స్పాంటేనిటీని ప్రశ్నించే విధంగా ఉంటుంది. దీనికోసం అభ్యర్థులు రీజనింగ్, అర్థమెటిక్ అంశాలతోపాటు, కాంప్రహెన్షన్ కోసం ఇంగ్లిష్ దినపత్రికలను చదవడం, వొకాబ్యులరీని పెంచుకోవడంపై దృష్టిపెట్టాలి.
మెయిన్ ఎగ్జామినేషన్: పూర్తి డిస్క్రిప్టివ్ విధానంలో నిర్వహించే మెయిన్ ఎగ్జామ్‌లో ఏడు పేపర్లు ఉంటాయి. వీటితోపాటు మరో రెండు అర్హత పేపర్లు ఉంటాయి. వాటిలో ఒకటి భారత రాజ్యాంగం గుర్తించిన ఏదైనా భాషా పేపర్, మరొకటి ఇంగ్లిష్. ఈ రెండు పేపర్ల మార్కులను పరిగణనలోకి తీసుకోరు. ఎంపికలో పరిగణనలోకి తీసుకునే పేపర్లు..
మొత్తం 1750 మార్కులకు మెయిన్ ఎగ్జామినేషన్ ఉంటుంది.
ఇందులో పేపర్-6, 7లకు సంబంధించి అభ్యర్థులు కమిషన్ నిర్దేశించిన 25 ఆప్షనల్ సబ్జెక్ట్‌ల్లో ఏదో ఒకదాన్ని ఎంపిక చేసుకోవచ్చు.
జనరల్ స్టడీస్-1లో హిస్టరీ అండ్ జాగ్రఫీ; జనరల్ స్టడీస్-2లో పాలిటీ, గవర్నెన్స్, అంతర్జాతీయ అంశాలు, సామాజిక న్యాయం;
జనరల్ స్టడీస్-3లో సైన్స్ అండ్ టెక్నాలజీ అంశాలు; జీఎస్-4లో ఎథిక్స్, ఇంటెగ్రిటీ, ఆప్టిట్యూడ్ అంశాలపై ప్రశ్నలు ఉంటాయి.
సక్సెస్ టిప్స్:పూర్తిగా డిస్క్రిప్టివ్ విధానంలో నిర్వహించే మెయిన్ పరీక్షలో విజయానికి అభ్యర్థులు ముందుగా ఒక అంశానికి సంబంధించి భావ వ్యక్తీకరణ సామర్థ్యాన్ని పెంచుకోవాలి. నిర్దిష్ట అంశంపై సూటిగా స్పష్టంగా సమాధానం ఇచ్చే విధంగా ఆయా విభాగాల్లోని ముఖ్యాంశాలను గుర్తించే నైపుణ్యం సొంతం చేసుకోవాలి. అదే విధంగా ప్రిలిమ్స్‌లో పేర్కొన్న జనరల్ స్టడీస్ అంశాలను ముందునుంచే మెయిన్స్‌లోని జనరల్ స్టడీస్ అంశాలతో అనుసంధానం చేసుకుంటూ డిస్క్రిప్టివ్ తరహాలో ప్రిపరేషన్ సాగిస్తే మెరుగైన ఫలితాలు ఆశించొచ్చు.
ఇంటర్వ్యూ: మెయిన్సలో ఉత్తీర్ణత సాధించినవారిని ఖాళీలు, రిజర్వేషన్స ఆధారంగా ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. దీనికి మార్కులు 275.
సీఏపీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్స్
కేంద్ర సాయుధ దళాల్లో గ్రూప్-ఎ గెజిటెడ్ అధికారి హోదాలో అడుగుపెట్టేందుకు మార్గం వేసే పరీక్ష.. యూపీఎస్సీ నిర్వహించే సీఏపీఎఫ్(సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్) అసిస్టెంట్ కమాండెంట్స్ ఎగ్జామినేషన్. బ్యాచిలర్స్ డిగ్రీ అర్హతగా నిర్వహించే ఈ పరీక్షలో విజయం సాధించడం ద్వారా సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, సశస్త్ర సీమాబల్, ఇండో-టిబెటిన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ విభాగాల్లో అసిస్టెంట్ కమాండెంట్‌గా కెరీర్ ప్రారంభించొచ్చు.
విద్యార్హత: బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత.
వయో పరిమితి: ప్రకటన వెలువడిన సంవత్సరంలో ఆగస్ట్ 1 నాటికి 20 నుంచి 25 ఏళ్ల మధ్యలో ఉండాలి. 2015కు సంబంధించి ఏప్రిల్ 11న నోటిఫికేషన్ వెలువడనుంది.
ఎంపిక విధానం:సీఏపీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్స్ ఎంపిక విధానం రెండు దశల్లో ఉంటుంది. అవి.. రాత పరీక్ష, ఇంటర్వ్యూ.
రాత పరీక్ష ఇలా: రాత పరీక్ష రెండు పేపర్లుగా ఉంటుంది.
పేపర్-1 జనరల్ ఎబిలిటీ అండ్ ఇంటెలిజెన్స్: అభ్యర్థుల్లోని జనరల్ నాలెడ్జ్, సమకాలీన అంశాలపై అవగాహనను పరీక్షించే విధంగా
ఈ పేపర్లో ప్రశ్నలు ఉంటాయి. మొత్తం 125 ప్రశ్నలతో 250 మార్కులకు నిర్వహించే పేపర్-1లో భారత చరిత్ర, రాజ్యాంగం, ఎకానమీ, జాగ్రఫీ, సైన్స్, మ్యాథ్స్, రీజనింగ్, పర్యావరణం-జీవవైవిధ్యం, కరెంట్ అఫైర్స్ అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఈ పేపర్లో అత్యధిక మార్కులు సాధించాలంటే ముందుగా అన్ని సబ్జెక్ట్‌లకు సంబంధించి ఆరు నుంచి 12వ తరగతి వరకు ఎన్సీఈఆర్టీ పుస్తకాలను చదవాలి. ఫలితంగా అన్ని అంశాలకు సంబంధించి బేసిక్ కాన్సెప్ట్స్, ఫార్ములాలపై ప్రాథమిక అవగాహన లభిస్తుంది. కరెంట్ అఫైర్స్ విషయంలో ప్రధానంగా ఆర్థిక-రాజకీయ పరిణామాలపై దృష్టి సారించడం ఉపకరిస్తుంది.
పేపర్-2- ఎస్సే, ప్రెసిస్ రైటింగ్ అండ్ రీడింగ్ కాంప్రహెన్షన్:
మార్కులు - 200. ఈ పేపర్లో ఎస్సే రైటింగ్ విభాగంలో నిర్దేశిత అంశాలపై మూడు వందల పదాలకు మించకుండా చిన్నపాటి వ్యాసాలు రాయాల్సి ఉంటుంది. ప్రెసిస్ రైటింగ్, రిపోర్ట్ రైటింగ్, రీడింగ్ కాంప్రహెన్షన్‌లపై మిగతా ప్రశ్నలు ఉంటాయి. ఈ విభాగంలో రాణించాలంటే.. అభ్యర్థులకు బేసిక్ ఇంగ్లిష్ గ్రామర్‌పై పట్టుతోపాటు, భావ వ్యక్తీకరణ నైపుణ్యాలు అవసరం. ఇందుకోసం ఇంగ్లిష్ దినపత్రికల్లోని ఎడిటోరియల్స్, ఇతర వ్యాసాలు చదివి.. అందులోని ముఖ్యాంశాలతో సొంత శైలిలో పరీక్షలో నిర్దేశించిన మాదిరిగానే 300 పదాల్లో సారాంశాలను క్రోడీకరించడం ప్రాక్టీస్ చేయాలి. రాత పరీక్షలో నిర్ణీత కటాఫ్ మార్కులు పొందిన అభ్యర్థులకు 150 మార్కులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్
అఖిల భారత సర్వీసుల్లో భాగంగా కేంద్ర అటవీ శాఖలో డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ లేదా డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ హోదాతో కెరీర్ ప్రారంభించేందుకు అవకాశం కల్పించే పరీక్ష ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామినేషన్. అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ స్థాయిలో.. యానిమల్ హజ్బెండరీ అండ్ వెటర్నరీ సైన్స్, బోటనీ, కెమిస్ట్రీ, జువాలజీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్‌లలో ఏదో ఒకటి ప్రధానాంశంగా చదివిన అభ్యర్థులు లేదా బీఎస్సీ (అగ్రికల్చర్) లేదా బీఎస్సీ (ఫారెస్ట్రీ) లేదా ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులు ఈ పరీక్షకు అర్హులు.
వయో పరిమితి: నోటిఫికేషన్ వెలువడిన సంవత్సరంలో జూలై 1 నాటికి 21 నుంచి 30 ఏళ్ల మధ్యలో ఉండాలి.
ఎంపిక విధానం:ఐఎఫ్ఎస్ ఎంపిక విధానం మూడు దశలుగా ఉంటుంది. అవి.. ప్రిలిమినరీ, మెయిన్స్, పర్సనాలిటీ టెస్ట్.
ప్రిలిమినరీ:రెండేళ్ల క్రితం వరకు ఐఎఫ్ఎస్కు ప్రిలిమినరీ పరీక్షను యూపీఎస్సీ ప్రత్యేకంగా జరిపేది. గతేడాది నుంచి సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షనే ఐఎఫ్ఎస్ ఔత్సాహికులకు కూడా నిర్వహిస్తోంది. అంటే.. ఐఎఫ్ఎస్ మెయిన్సకు హాజరవ్వాలనుకునే అభ్యర్థులు ముందుగా సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీలో ఉత్తీర్ణత సాధించాలి.
మెయిన్స్:ప్రిలిమినరీలో ఉత్తీర్ణత సాధించినవారికి నిర్వహించే పరీక్ష మెయిన్స్ ఎగ్జామినేషన్. డిస్క్రిప్టివ్ విధానంలో ఉండే ఈ పరీక్షలో 1400 మార్కులకు మొత్తం ఆరు పేపర్లు ఉంటాయి. పేపర్-1 (జనరల్ ఇంగ్లిష్- మార్కులు-300); పేపర్-2 (జనరల్ నాలెడ్జ్ మార్కులు-300) అభ్యర్థులంతా తప్పనిసరిగా రాయాల్సిన పేపర్లు.పేపర్-3 నుంచి పేపర్-6 వరకు ఆప్షనల్ పేపర్లు. అభ్యర్థులు నిర్దేశించిన సబ్జెక్టుల్లో రెండింటిని ఆప్షనల్స్‌గా ఎంపిక చేసుకోవచ్చు. ఒక్కో పేపర్‌కు కేటాయించిన మార్కులు 200. ఖాళీల ఆధారంగా నిర్దిష్ట కటాఫ్ మార్కులు పొందిన అభ్యర్థులను మూడు వందల మార్కులకు నిర్వహించే పర్సనాలిటీ టెస్ట్‌కు ఎంపిక చేస్తారు.
ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామ్
బీటెక్ ఉత్తీర్ణులకు ఎంఎన్సీలకు దీటుగా ప్రభుత్వ రంగంలో కెరీర్ అవకాశాలను అందించే నియామక పరీక్ష ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్. ఇందులో విజయం సాధించినవారు ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్; మిలిటరీ ఇంజనీరింగ్, బోర్డర్ రోడ్స్ ఇంజనీరింగ్, ఇండియన్ రైల్వేస్, సెంట్రల్ వాటర్, సెంట్రల్ ఇంజనీరింగ్, జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా తదితర కేంద్ర ప్రభుత్వ ఇంజనీరింగ్ విభాగాల్లో గ్రూప్-1 స్థాయిలో అసిస్టెంట్ ఇంజనీర్స్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్‌గా ప్రవేశించొచ్చు.
విద్యార్హతలు
ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, సివిల్, మెకానికల్ ఇంజనీరింగ్‌లలో బ్యాచిలర్స్ డిగ్రీ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత.
2015వ సంవత్సరానికి సంబంధించి మార్చి 14, 2015న నోటిఫికేషన్ వెలువడనుంది.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.
రాత పరీక్ష వివరాలు
సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ అనే నాలుగు కేటగిరీల్లో ఆబ్జెక్టివ్ విధానంలో రాత పరీక్ష ఉంటుంది. సెక్షన్ వన్‌లో జనరల్ ఎబిలిటీ, జనరల్ ఇంగ్లిష్ సబ్జెక్ట్‌లు ఒక పేపర్‌గా, అభ్యర్థులు ఎంచుకున్న సబ్జెక్ట్‌లు పేపర్-2, పేపర్-3గా ఉంటాయి. ఒక్కో పేపర్‌కు 200 మార్కులు చొప్పున 600 మార్కులకు ఆబ్జెక్టివ్ విధానంలో సెక్షన్-1 ఉంటుంది. సెక్షన్-2 పూర్తిగా కన్వెన్షన్ విధానంలో ఉంటుంది. ఇందులో అభ్యర్థులు తాము ఎంపిక చేసుకున్న సబ్జెక్ట్‌లకు సంబంధించి రెండు పేపర్లు రాయాల్సి ఉంటుంది. ఒక్కో పేపర్‌కు కేటాయించిన మార్కులు 200. ఇలా మొత్తం 1000 మార్కులకు రాత పరీక్ష ఉంటుంది. రాత పరీక్షలో విజయం సాధించిన విద్యార్థులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
విజయం సాధించాలంటే: అభ్యర్థులకు బీటెక్ స్థాయిలో తమ అకడమిక్స్‌పై పరిపూర్ణ అవగాహన ఉంటే ఇంజనీరింగ్ సర్వీసెస్‌లో విజయం సులభమే. ఇంజనీరింగ్ సబ్జెక్ట్‌లకు సంబంధించి కాన్సెప్ట్స్, అప్లికేషన్ ఓరియెంటెడ్ ప్రాబ్లమ్స్‌ను ప్రాక్టీస్ చేయడం ఎంతో ఉపకరిస్తుంది. అదేవిధంగా గత ప్రశ్న పత్రాల పరిశీలన కూడా మరింత ఉపయుక్తంగా ఉంటుంది. అయితే సెక్షన్-1 లోని జనరల్ ఎబిలిటీలో ఎదురయ్యే హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రశ్నల సంసిద్ధత కోసం ఆరు నుంచి 12 తరగతుల ఎన్సీఈఆర్టీ పుస్తకాలు చదవడం లాభిస్తుంది. అదే విధంగా జనరల్ ఇంగ్లిష్ కోసం బేసిక్ గ్రామర్ అంశాలు, సెంటెన్స్ ఫార్మేషన్‌పై దృష్టి సారించాలి.
సివిల్స్.. ముందస్తు వ్యూహంతోనే విజయం
సివిల్ సర్వీసెస్ పరీక్ష అంటే చాలా మంది ఎంతో క్లిష్టమైంది, విజయం సాధించడం చాలా కష్టం అనే భావనలో ఉంటారు. కానీ నిర్దిష్ట ప్రణాళిక, వ్యూహం అనుసరిస్తే విజయం సులభమే. సివిల్స్‌లో విజయానికి అత్యంత ప్రధానమైన అంశం.. టైం మేనేజ్మెంట్. ఔత్సాహిక అభ్యర్థులు ఏడాది ముందుగా తమ ప్రిపరేషన్‌ను ప్రారంభిస్తే సత్ఫలితాలు సొంతమవుతాయి. చదివే ప్రతి అంశాన్ని శాస్త్రీయ దృక్పథంతో పరిశీలించాలి. నిర్దిష్ట అంశం నేపథ్యాన్ని సమకాలీన మార్పులకు అన్వయిస్తూ చదివితే సమయం ఆదా కావడంతోపాటు మెదడులో త్వరగా నిక్షిప్తం అవుతుంది. ఆప్షనల్ విషయంలో అభ్యర్థులు ఆందోళన చెందక్కర్లేదు. ఎంపిక చేసుకున్న ఆప్షనల్‌కు సంబంధించి.. సిలబస్‌ను అనుసరిస్తూ డిగ్రీ, పీజీ స్థాయి పుస్తకాలను చదివితే సులువుగానే విషయ పరిజ్ఞానం సొంతమవుతుంది. మెయిన్స్‌లో విషయ పరిజ్ఞానంతోపాటు అత్యంత ఆవశ్యకమైన అంశం భావవ్యక్తీకరణ. కాబట్టి అభ్యర్థులు రైటింగ్ ప్రాక్టీస్‌కు కూడా ప్రాధాన్యం ఇవ్వాలి. ఒక ప్రశ్నకు పరీక్షలో లభించే సమయాన్ని పరిగణనలోకి తీసుకుని ప్రిపరేషన్ దశలోనే సదరు సమయంలో సమాధానం ఇచ్చే విధంగా ప్రాక్టీస్ చేయాలి. గత ప్రశ్నపత్రాల పరిశీలన-సాధన, ఆయా అంశాలకు లభిస్తున్న వెయిటేజీ పరిశీలన వంటివి సివిల్స్‌లో విజయానికి ఉపకరించే ఇతర సాధనాలు.
- జి. సృజన, అసిస్టెంట్ కలెక్టర్ (అండర్ ట్రైనీ)
సివిల్స్-2012 విజేత (ఆల్ ఇండియా ర్యాంకు 44)
ఎంబీబీఎస్ నాలెడ్జ్‌తో సీఎంఎస్‌లో విజయం
ఎంబీబీఎస్‌లోని అకడమిక్ అంశాల్లో పూర్తి స్థాయి అవగాహన ఉంటే కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్‌లో సులువుగా విజయం సాధించొచ్చు. ఎయిమ్స్, ఇతర మెడికల్ పీజీ ఎంట్రెన్స్‌ల ప్రశ్నపత్రాలను, సీఎంఎస్ గత ప్రశ్నపత్రాలను సాధన చేస్తే విజయానికి 50 శాతం చేరువైనట్లే. ప్రధానంగా ిపీడియాట్రిక్స్, ప్రివెంటివ్ అండ్ సోషల్ మెడిసిన్ అంశాలు సులువుగా, ఎక్కువ మార్కులు పొందేలా ఉంటాయి. వీటిని నిర్లక్ష్యం చేయకూడదు.
- కొండేపూడి సురేశ్‌కుమార్
సీఎంఎస్-2013 విజేత
ఐఈఎస్ పలు కోణాల్లో విశ్లేషించుకుంటూ..
ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ఔత్సాహిక అభ్యర్థులు ఒక అంశాన్ని పలు కోణాల్లో విశ్లేషించుకుంటూ సాధించే నైపుణ్యం సొంతం చేసుకోవాలి. ప్రిపరేషన్ దశలో.. గేట్ ప్రశ్నపత్రాలు ప్రాక్టీస్ చేయడం కూడా లాభిస్తుంది. ఐఈఎస్ అభ్యర్థులు కేవలం తమ సబ్జెక్ట్ పేపర్స్కే కాకుండా.. జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంగ్లిష్ పేపర్‌పైనా దృష్టి పెట్టాలి. ప్రతి రోజు దీనికోసం కచ్చితంగా సమయం కేటాయించాలి. సాధారణంగా ప్రస్తుతం ఇంజనీరింగ్ విద్యార్థులు మూడో సంవత్సరం నుంచే గేట్ లక్ష్యంగా కృషి చేస్తున్నారు. గేట్ ప్రిపరేషన్‌ను ఐఈఎస్‌కు అనుసంధానం చేసుకోవడం, తద్వారా ఐఈఎస్‌లో విజయావకాశాలు మెరుగుపరచుకోవడం ఎంతో తేలిక.
- వై.వి.గోపాలకృష్ణ,
డెరైక్టర్, ఏస్ అకాడమీ
ఆధారము: సాక్షి
డబ్బుకు డబ్బు... సంఘంలో హోదా...మంచి భవిష్యత్ కల్పించే ఇంజనీరింగ్కోర్సులంటే ప్రస్తుతం యమక్రేజ్గా ఉంది. పైగా ఒకప్పుడు ఇంజనీరింగ్ కోర్సులంటే సామాన్యుడికి అందని ద్రాక్ష. లక్షలకు లక్షలు డబ్బులు పోస్తేగానీ ఇంజనీరింగ్ చదివే అవకాశమే లభించేది కాదు. కానీ - ఇప్పుడలాకాదు. సుమారు 675 ఇంజనీరింగ్ కాలేజీలు మనకు అందుబాటులోకి వచ్చాయి. పేద, మధ్యతరగతి వర్గాలకు చెందిన విద్యార్ధులు కూడా ఉన్నత విద్య అభ్యసించాలన్న సదుద్దేశంతో ప్రభుత్వమే ఫీజుల్ని భరిస్తోంది. యస్.సి., యస్.టి., బి.సి., ఇ.బి.సి., వర్గాల వరకు తగిన ధృవీకరణ పత్రాలు జతచేస్తే ఫీజు రీఎంబర్స్మెంట్ లభిస్తోంది. ఇంకా ఆసక్తి ఉన్న కోర్సులో జేరి కెరీర్‌ను అద్భుతంగా మలచుకోవడమే విద్యార్ధి చెయ్యవల్సిన పని!
శాస్త్ర సాంకేతిక రంగాలలో అరవై మూడేళ్ళ భారతం అత్యద్భుత ప్రగతి సాధిస్తోందంటే అందులో ప్రముఖపాత్ర ఇంజనీర్లదే అనడం సత్యదూరమేంకాదు. అయితే-అభివృద్ధి చెందుతున్న ప్రస్తుత దశలో కూడా ఎన్నో పెనుసవాళ్ళు మనముందున్నాయి. వీటిని అధిగమించాలంటే సుశిక్షితులైన ఇంజనీర్ల అవసరం మనకు ఎంతైనా ఉంది. చిన్న చిన్న ప్రయోగాల నుండి అంతరిక్ష పరిశోధనల వరకూ ఉపయోగించే కంప్యూటర్ల పనితీరును నియంత్రించడానికి కంప్యూటర్ ఇంజనీర్లు కావాలి. నౌకల తయారీ పరిశ్రమలో నౌకల నిర్మాణానికి మెరైన్ ఇంజనీర్లు అవసరం. కార్ల తయారీ, కొత్త పరికరాల ఉత్పత్తికి సంబంధించి మెకానికల్ ఇంజనీర్, ఖనిజాల ఉనికిని కనుగొని వాటిని వాణిజ్యానికి ఉపయోగపడేలా చేయడానికి మైనింగ్ ఇంజనీర్, రోడ్లు భవనాలు మరియు వంతెనలు ఇతర కట్టడాల నిర్మాణానికి సివిల్ ఇంజనీర్-ఇలా చెప్పుకుంటూ పోతే మనదేశ అభివృద్ధిలో అత్యంత కీలక భూమిక పోషించేది ఇంజనీర్లే!
మానవుడు మొట్టమొదటగా చక్రాన్ని కనుగొనడంతో మనిషి సాంకేతికంగా అభివృద్ధి చెందడం ప్రారంభించాడు. అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ డిమాండ్ తగ్గక నిత్యనూతనంగా ఉండే అతి కొద్ది కోర్సులలో ఇంజనీరింగ్ కోర్సులు అత్యంత ప్రాధాన్యతను సొంతం చేసుకున్నాయి.
పదవతరగతి చదివినవారు డిప్లొమా కోర్సులకు అర్హులైతే, మాధ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీతో ఇంటర్మీడియట్ పాసైనవారు ఇంజనీరింగ్ డిగ్రీ కోర్సులు చేసేందుకు అర్హులు. డిప్లొమా చెయ్యడానికి జజుజుూ చెయ్యాల్సి ఉంటుంది. ఇంజనీరింగ్ డిగ్రీ చెయ్యడానికి జుAవీజజుు చెయ్యాల్సి ఉంటుంది.
ఎమ్సెట్ పరీక్షలయ్యాయి. రిజల్సూ వచ్చాయి. ఇంక రేపోమాపో కౌన్సిలింగ్ ప్రారంభం కాబోతోంది. ఈ సందర్భంగా ఇంజనీరింగ్ కోర్సులు - వాటి ఉద్యోగావకాశాలను పరిశీలిద్దాం.
సివిల్ ఇంజనీరింగ్: రోడ్లు, భవనాలు, వంతెనలు మరియు చిన్న చిన్న కల్వర్టుల నుంచి భారీ ఆనకట్టల నిర్మాణానికి సంబంధించిన డిజైన్లను రూపొందించడం, వాటి నిర్మాణ అవకాశాలనూ, నిర్మాణ వ్యయాన్ని అంచనా వెయ్యడం, నిర్మాణంలో ఎటువంటి లోపాలూ తలెత్తకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవడం సివిల్ ఇంజనీర్ల కర్తవ్యం.
ఉద్యోగ అవకాశాలు : సివిల్ ఇంజనీరింగ్‌ను పూర్తిచేసిన వారికి రియల్ ఎస్టేట్స్ వంటి ప్రైవేటు సంస్థలు నిర్వహించే కన్స్ట్రక్షన్ వర్క్స్‌తో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలోగల రోడ్లు, భవనాల శాఖ వారిచే నిర్మితమయ్యే ప్రాజెక్టులలో ఉపాధి అవకాశం లభిస్తుంది. ఆర్థిక స్థోమత ఉండి నిర్వహణా సామర్ధ్యం గలవారు ఒక కన్స్ట్రక్షన్ సంస్థను స్థాపించి వేలాది మందికి ఉపాధి అవకాశాలను కల్పించవచ్చును.
మెకానికల్ ఇంజనీరింగ్ : ఇంజనీరింగ్‌లో గల అన్ని విభాగాలతో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సంబంధం గల ముఖ్యమైన విభాగమే మెకానికల్ ఇంజనీరింగ్. వివిధ పరిశ్రమలలో ఉత్పత్తి అయ్యే యంత్ర పరికరాల డిజైన్ నుండి ఉత్పత్తి వరకు ఈ మెకానికల్ ఇంజనీర్లపై ఆధారపడి ఉంటుంది.
ఉద్యోగ అవకాశాలు : ఆటోమొబైల్స్, రైల్వేలు మొదలగు ప్రైవేటు మరియు ప్రభుత్వ రంగ పరిశ్రమలలో ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ : మానవ మేధస్సుకు ప్రతీకగా నిలచిన ఎన్నో రకాల ప్రచార సాధనాలైన టెలిఫోన్, టెలివిజన్, సెల్‌ఫోన్, కంప్యూటర్ వీటన్నింటికి ఇంధనమైన విద్యుత్‌రంగానికి చెందిన సమస్త అంశాలను అధ్యయనం చేసే విభాగమే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్.
ఉద్యోగ అవకాశాలు : ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూర్తిచేసిన అభ్యర్ధులు ప్రభుత్వ రంగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆకాశవాణి, దూరదర్శన్ మరియు టెలికమ్యూనికేషన్ వంటి సంస్థలలో ఇతర ప్రైవేటు ఎలక్ట్రానిక్ పరిశ్రమలలో ఉపాధిని పొందవచ్చును.
కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ : 20వ శతాబ్దపు అద్భుత ఆవిష్కరణలైన కంప్యూటర్ల హార్డ్‌వేర్ (యంత్ర పరికరాలకు సంబంధించినది) మరియు సాఫ్ట్వేర్ (యంత్ర పరికరాలను పనిచేయించడానికి అవసరమైన ప్రోగ్రాం) లను అభివృద్ధి పరచడం కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్ల ప్రధాన విధి.
ఉద్యోగ అవకాశాలు : ఈ కోర్సును పూర్తిచేసినవారు మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్, విప్రో వంటి పెద్ద పెద్ద కంప్యూటర్ల తయారీ సంస్థలలో మెయింటెనెన్స్ ఇంజనీర్స్గానో లేదా సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్ డెవలపర్స్గానో ఉపాధిని పొందవచ్చును. వీరికి విదేశాలలో సైతం మంచి డిమాండ్ ఉంది.
కెమికల్ ఇంజనీరింగ్ : రబ్బరు, కాస్మొటిక్స్ వంటి వివిధ రకాలైన వస్తువులతో పాటు రసాయనాలు, క్రిమి సంహారక మందులు, ఎరువులు, ఔషధాలు, ప్లాస్టిక్, పెట్రో రసాయనాల ఉత్పత్తికి సంబంధించినదే కెమికల్ ఇంజనీరింగ్.
ఉద్యోగ అవకాశాలు : ఔషధ తయారీ పరిశ్రమలు, ఎరువుల కర్మాగారాలు, పెట్రోలియం రిఫైనరీలు మొదలగువాటిలో ఉపాధిని పొందవచ్చును.
మెరైన్ ఇంజనీరింగ్ : సముద్ర వ్యాపారం ద్వారా విదేశీ ఎగుమతులు, దిగుమతుల నుండి దేశరక్షణ వరకు నౌకాదళానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. ఇటు వాణిజ్యానికి అటు దేశరక్షణకు అవసరమైన విధంగా నౌకల డిజైన్లు, నిర్మాణం చేపట్టడం 'మెరైన్ ఇంజనీర్ల' ప్రధాన కర్తవ్యం.
ఉపాధి అవకాశాలు : మర్చంట్ నేవి, నౌకా నిర్మాణ సంస్థలో ఉపాధిని పొందవచ్చు.
మైనింగ్ ఇంజనీరింగ్ : భూమిలోపలగల ఖనిజాల నిల్వలను కనుగొనడం, వాటిని వెలికితీసి (బొగ్గు, ఇనుము, అల్యూమినియం మొదలగు) వినియోగానికి ఉపయోగపడే విధంగా రూపొందించడం తదితర విషయాలను గూర్చి వివరించేదే మైనింగ్ ఇంజనీరింగ్. రాష్ట్రవ్యాప్తంగా ఈ కోర్సుకు కొద్ది సీట్లు మాత్రమే అవకాశం ఉంటుంది.
ఉద్యోగ అవకాశాలు : ఈ కోర్సు పూర్తిచేసిన వారికి నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, కోల్ కాలరీస్, టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ, హిందుస్తాన్ జింక్ లిమిటెడ్ మొదలగు సంస్థలలో ఉద్యోగ అవకాశాలు ఉంటాయి.
ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్: విద్యుత్ రంగానికి చెందిన వివిధ రకాల యంత్ర సామాగ్రి రూపకల్పన విద్యుత్ పంపిణీ నిర్వహణ మొదలగు సమస్త విషయాలను అధ్యయనం చేసేదే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్.
ఉపాధి అవకాశాలు : ఈ కోర్సు పూర్తిచేసిన వారు ఎలక్ట్రిసిటీ బోర్డులు, ఎన్.టి.పి.సి.,పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఇతర ప్రైవేటు ఎలక్ట్రిసిటీ ఉత్పత్తి సంస్థలలో ఉపాధిని పొందవచ్చును.
సిరామిక్ ఇంజనీరింగ్ : సిరామిక్ వస్తువులైన గ్యాస్, సెమికండక్టర్స్, వాహనాల ఇంజన్ పరికరాలు, టెలీకమ్యూనికేషన్‌కు అవసరమైన ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్, టైల్స్ మరియు ఎలక్ట్రిక్ పవర్ లైన్ ఇన్సులేటర్స్ మొదలగు డిజైన్లు, వాటి ఉత్పత్తి ప్రక్రియను గూర్చి వివరించేదే ఈ సిరామిక్ ఇంజనీరింగ్.
మెటలర్జికల్ ఇంజనీరింగ్ : భూమి అట్టడుగు పొరల్లో లభించే ఖనిజాలే కాకుండా భూమిపై లభించే వివిధ మూలకాలు మిశ్రమ రూపంలో ఉంటాయి. వీటిని శుద్ధిచేసి, లోహాలను సంగ్రహించే ప్రక్రియను మెటలర్జీ అంటారు. ఇనుము, ఉక్కు, మరియు అల్యూమినియం కర్మాగారాలు, విశాఖ స్టీల్ ప్లాంట్లు, టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ మొదలగు వాటిలో మెటలర్జిస్టుగా ఉపాధిని పొందవచ్చును.
ఇండిస్టియల్ ఇంజనీరింగ్ (లేదా) ఇండిస్టియల్ డిజైనింగ్ : 'ఒక వస్తువు ధరకన్నా నాణ్యతకన్నా ముందు మనిషిని ఆకర్షింపజేసేది ఆ వస్తువు యొక్క బాహ్యరూపం'. అన్న మాటలు అక్షర సత్యం. అందుకే డిజైనింగ్ ఇంత ప్రాధాన్యతను సంతరించుకున్నది. మార్కెట్ పరిస్థితులు, వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు సరికొత్త డిజైన్లు రూపొందించి పాత ఉత్పత్తులకే కొత్తదనాన్ని అద్ది వస్తువులను నిత్యనూతనంగా మార్కెట్లోనికి ప్రవేశపెట్టడానికి ఇండిస్టియల్ డిజైనర్లు అవసరం.
పెట్రోలియం మరియు గ్యాస్ ఇంజనీరింగ్ : ఇతర విభాగాలతో పోలిస్తే ఉద్యోగ అవకాశాలు అరుదుగా ఉన్నప్పటికి పెట్రోలియం, శక్తి వనరుల మీద అధ్యయనం ఒక ఆసక్తికరమైన, ఆశాజనకమైన కెరీర్. మనదేశానికి సంబంధించినంత వరకు ఇవి అత్యంత అరుదైన, విలువైన వనరులు కావడమే ఇందుకు కారణం.
చమురు, సహజవాయువు పరిశ్రమల కోసం అవసరమైన ప్రొఫెషనల్స్‌ని తయారుచేయడానికి, వారి నైపుణ్యాలను మెరుగుపరచడానికి దేశంలో తొలిసారి ఏర్పాటైన సంస్థ (యూపిఇఎస్) యూనివర్శిటీ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ స్టడీస్.
బయోమెడికల్ ఇంజనీరింగ్ : ఇంజనీరింగ్ పరిజ్ఞానాన్ని జీవశాస్త్రంలో ఉపయోగించే విధానాన్నే బయోమెడికల్ ఇంజనీరింగ్ అంటారు. శస్త్రచికిత్సలో వినియోగించే వివిధ రకాల పరికరాల రూపకల్పన, ఉత్పత్తి, అభివృద్ధి పరచడం బయోమెడికల్ ఇంజనీరింగ్ ద్వారానే జరుగుతుంది. ఇటీవలి కాలంలో వైద్యసేవలలో వచ్చిన విప్లవాత్మకమైన మార్పులకు (ఉదా| కృత్రిమ గుండెను అమర్చడం, కృత్రిమ అవయవాల తయారీ మొ||) బయోమెడికల్ ఇంజనీర్లే ప్రధాన భూమికను నిర్వర్తిస్తారు.
ఉపాధి అవకాశాలు : వైద్య పరికరాల రూపకల్పన, తయారీ, అభివృద్ధి పరిచే పరిశ్రమలలో ఇంజనీర్లుగా, పరిశోధకులుగా ఉపాధిని పొందవచ్చును.
ఆధారము: విశాలాంధ్ర
కార్పొరేట్ కంపెనీల్లో కొలువు ఖాయం.. క్యాంపస్ రిక్రూట్మెంట్లో నెగ్గితే ఉజ్వల కెరీర్‌కు తొలి అడుగు.. మంచి పర్సంటేజీ సొంతం చేసుకుంటే మెరుగైన ప్యాకేజీ గ్యారెంటీ... ఏటా లక్షల మంది బీటెక్ వైపు అడుగులు వేయడానికి కారణాలివే..! కానీ నిరుత్సాహానికి గురవుతున్న విద్యార్థుల సంఖ్య కూడా ఎక్కువే. కంపెనీలు ఎంపిక చేసుకున్న ప్రముఖ కాలేజీల్లోనే క్యాంపస్ సెలక్షన్స్ నిర్వహిస్తుండటమే ఇందుకు కారణం! 2014-15 బ్యాచ్ మరో ఆరు నెలల్లో కోర్సు పూర్తి చేసుకోనుంది. దాదాపు అన్ని కళాశాలల్లో క్యాంపస్ సెలక్షన్స్ తుది దశకు చేరుకుంటున్నాయి. క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో ఉద్యోగం దక్కని విద్యార్థులు.. సొంతంగా
కొలువు సాధించేందుకు అనుసరించాల్సిన మార్గాలపై ఫోకస్..
వైపు ఐఐటీలు, ఎన్ఐటీలు, తదితర ప్రముఖ ఇన్‌స్టిట్యూట్‌ల్లో క్యాంపస్ సెలక్షన్స్‌లో ఒక్కో విద్యార్థికి డబుల్, ట్రిపుల్ ఆఫర్స్. మరోవైపు ఒక్క కంపెనీ కూడా ప్లేస్‌మెంట్స్ కోసం అడుగుపెట్టని కళాశాలలు కోకొల్లలు. ఇది మన దేశంలో నేడు ఇంజనీరింగ్ విద్యలో ఎదురవు తున్న విచిత్రమైన పరిస్థితి. దాంతో ప్రతిభావంతులైన విద్యార్థులెందరో అవకాశాలకు దూరమవుతున్నారు. అలాంటి ప్రతిభావంతులు స్వయంకృషిని నమ్ముకుని ముందుకు సాగితే టాప్ కంపెనీల్లో కొలువులు సొంతం చేసుకోవచ్చని అంటున్నారు నిపుణులు.
అకడమిక్‌తోపాటు అవసరమైన స్కిల్స్
స్వయం కృషితో కొలువు ఖాయం చేసుకోవాలనుకునే విద్యార్థులు అకడమిక్ పరిజ్ఞానంతోపాటు ముఖ్యంగా దృష్టిసారించాల్సిన అంశం.. స్కిల్స్. రెండు, మూడేళ్ల క్రితం వరకు స్కిల్స్ అంటే కేవలం కమ్యూనికేషన్ స్కిల్స్ అనే భావన ఉండేది. కానీ ఇప్పుడు స్కిల్స్ అంటే.. సాఫ్ట్ స్కిల్స్ (కమ్యూనికేషన్, పర్సనాలిటీ డెవలప్మెంట్).. పీపుల్ స్కిల్స్ (ఇంటర్ పర్సనల్ స్కిల్స్, టీం వర్కింగ్ కల్చర్, టీం బిల్డింగ్ స్కిల్స్).. బిజినెస్ స్కిల్స్ (డెసిషన్ మేకింగ్ స్కిల్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, ప్రాబ్లమ్ అనలైజింగ్ స్కిల్స్). ఉద్యోగాన్వేషణ చేస్తున్న అభ్యర్థులు ఈ మూడు స్కిల్స్ సొంతం చేసుకోవడానికి కృషిచేయాలి. వీలుంటే శిక్షణ పొందాలి. ముఖ్యంగా కమ్యూనికేషన్, ఇంటర్‌పర్సనల్ స్కిల్స్ విషయంలో ఎంత ముందుంటే అవకాశాలు అంత మెరుగవుతాయి. గ్రామీణ ప్రాంత విద్యార్థులు శిక్షణ తీసుకోవడం కచ్చితంగా ఉపకరిస్తుంది. బిజినెస్ స్కిల్స్గా పేర్కొంటున్న డెసిషన్ మేకింగ్ స్కిల్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్, ప్రాబ్లమ్ అనలైజింగ్ స్కిల్స్ అనేవి విద్యార్థుల వ్యక్తిగత ఆలోచనకు సంబంధించినవి. కాబట్టి ఔత్సాహిక విద్యార్థులు ఈ స్కిల్స్ పెంచుకునే విషయం లో తమ మేధస్సుకు పదునుపెట్టాలి. ముందుగా ఏదో ఒక వాస్తవ సమస్యను చేపట్టి వాటికి తమ ఆలోచనకు అనుగుణంగా పరిష్కార మార్గాలను కనుగొనాలి. ఆ తర్వాత సదరు సమస్యకు సంబంధిత నిపుణులు కను గొన్న పరిష్కారాలతో బేరీజు వేసుకోవాలి. దీనివల్ల తాము ఇంకా నేర్చుకోవాల్సిన అంశాలపై అవగాహన వస్తుంది. తద్వారా క్రమేణా విశ్లేషణ, సృజనాత్మక నైపు ణ్యాలు మెరుగవుతాయి. నియామక ప్రక్రియలో ఎదురయ్యే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడానికి సంసి ద్ధత లభిస్తుంది.
‘వే’స్.. టు ఫైండ్ వేకెన్సీస్
ఉద్యోగ వేటలో తొలుత ఎక్కడ ఖాళీలు ఉన్నాయి.. ఏ కంపెనీలు నియామకాలు చేపడుతున్నాయి.. తమ అర్హ తలకు అనుగుణంగా పోస్టులు ఏవి? అనే విషయాలపై దృష్టి పెట్టాలి. ఐదారేళ్ల క్రితం వరకు కంపెనీలు ఖాళీల భర్తీకి పత్రికా ప్రకటనలు విడుదల చేసేవి. ఇప్పుడంతా ఆన్లైన్ నోటిఫికేషన్స్ ట్రెండ్ నడుస్తోంది. కాబట్టి క్యాంపస్ సెలక్షన్స్‌లో విజయం సాధించని విద్యార్థులు.. వేకెన్సీలను గుర్తించే దశ నుంచే వైవిధ్యాన్ని చాటాల్సిన ఆవశ్యకత ఏర్పడింది.
ముందున్న మార్గాలు
పస్తుతం అన్ని కంపెనీలు రిక్రూట్మెంట్ నోటిఫికే షన్స్‌కు ఆన్లైన్ ప్రసార మాధ్యమాలనే వినియోగి స్తున్నాయి. ఉద్యోగార్థుల కోణంలో జాబ్ సెర్చ్ ఇంజన్స్ ముఖ్యమైన మార్గాలుగా నిలుస్తున్నాయి. కాబట్టి నౌకరీ డాట్ కామ్, మాన్స్టర్ ఇండియా డాట్ కామ్, టైమ్స్‌జాబ్స్ తదితర ఆన్లైన్ జాబ్ సెర్చ్ పోర్టల్స్‌ను నిరంతరం పరిశీలిస్తుండాలి. ఆయా జాబ్ పోర్టల్స్‌లో మెంబర్షిప్ తీసుకోవడం ద్వారా తమ అర్హతలకు సరిపడే ఉద్యోగాల వివరాలను నేరుగా తెలుసుకునే వీలుంటుంది.
ఆన్లైన్ జాబ్ సెర్చ్ పరంగా ఉపకరించే మరో ముఖ్యమైన మార్గం.. ట్విట్టర్, ఫేస్బుక్, లింక్డ్ఇన్, స్కిల్ పేజెస్ తదితర సోషల్ మీడియా వెబ్‌సైట్స్. లింక్డ్న్, స్కిల్ పేజెస్ డాట్ కామ్ వెబ్‌సైట్స్ ఆయా రంగాల్లో నిపుణులకు ఉద్దేశించినవిగా పేరు గడిస్తు న్నాయి. వీటిలో రిజిస్టర్ చేసుకోవడం వల్ల తమ వివరాలు నేరుగా సదరు రంగంలోని ప్రొఫెషనల్స్ వీక్షించే అవకాశం ఉంటుంది. ఇవి కూడా అవకాశా లను మెరుగుపరుస్తాయి.
వీటితోపాటు ఉద్యోగార్థులు తమ అర్హతలను పరిగ ణనలోకి తీసుకుంటూ సంబంధిత కంపెనీల వెబ్సై ట్స్‌ను నిరంతరం వీక్షిస్తుండాలి. జాబ్ కన్సల్టెన్సీలను సంప్రదించడం కూడా మేలు చేస్తుంది. ఒక కన్సల్టె న్సీలో అడుగుపెట్టే ముందు సదరు కన్సల్టెన్సీకి ఉన్న గుర్తింపు విషయాన్ని తెలుసుకోవడం మంచిది.
ఇంటర్న్షిప్నకైనా.. ఓకే చెప్పాలి
ప్రస్తుతం ప్రముఖ కంపెనీలన్నీ రెగ్యులర్ పోస్టుల భర్తీ నోటిఫికేషన్స్తోపాటు ఇంటర్న్‌షిప్ అవకాశాన్ని కూడా కల్పిస్తున్నాయి. ఔత్సాహికులు కేవలం పూర్తిస్థాయి జాబ్స్‌కే పరిమితం కాకుండా.. ఇంటర్న్‌షిప్ అవకాశాలకు కూడా ఓకే చెప్పడం మేలు. ఇలా ఇంటర్న్‌షిప్‌లో ఎంపికై కంపెనీలో చక్కటి పనితీరు కనబరిస్తే అక్కడే శాశ్వత ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది.
కోర్ బ్రాంచ్‌లు.. కలిసొచ్చే అదనపు సర్టిఫికేషన్స్
ఉద్యోగార్థుల విషయంలో అకడమిక్ డిగ్రీతోపాటు కలిసొ చ్చే ముఖ్య సాధనాలు.. సర్టిఫికేషన్స్. సదరు రంగంలో మారుతున్న పరిస్థితులు, అవసరాలకు అనుగుణంగా కొత్త అంశాలపై శిక్షణనిచ్చే కోర్సులివి. సాధారణంగా ఇవి మూడు నుంచి ఆరునెలల వ్యవధిలో ఉంటాయి. వీటిలో నైపుణ్యం ద్వారా తాజా పరిస్థితులు, కంపెనీలు కార్యకలా పాల నిర్వహణలో అనుసరిస్తున్న కొత్త విధానాలు/పద్ధ తులపై అవగాహన ఏర్పడుతుంది.సాఫ్ట్వేర్ నుంచి సివిల్ ఇంజనీరింగ్ వరకు ఇప్పుడు అన్ని రంగాల్లోనూ టెక్నాల జీ, సాఫ్ట్వేర్ మమేకం కావడంతో ఆయా రంగాలకు సం బంధించి సాఫ్ట్వేర్ కోర్సులూ అందుబాటులో ఉన్నాయి.
బ్రాంచ్‌లవారీగా ఉపకరించే సర్టిఫికేషన్‌స..ఈసీఈ
ఈఈఈ
మెకానికల్
సీఎస్ఈ
సివిల్ ఇంజనీరింగ్
రెజ్యుమే.. మోస్ట్ ఇంపార్టెంట్
అకడమిక్ సర్టిఫికెట్స్, అదనపు సర్టిఫికేషన్స్, ఆపర్చుని టీస్.. ఇలా అన్నిటిలో అవగాహన పొందినప్పటికీ.. ఉద్యోగ సాధనలో కీలకపాత్ర పోషిస్తుంది రెజ్యుమే. రెజ్యుమే అనేది రిక్రూటర్‌కు ఏ మాత్రం పరిచయం లేని ఒక అభ్యర్థికి సంబంధించి సమాచారం తెలుసుకునే సాధనం. ఇందులో పేర్కొన్న నైపుణ్యాలు, అర్హతలు, రెజ్యుమే రూపకల్పన తీరుతెన్నుల ఆధారంగానే అభ్యర్థి విషయంలో ఎంప్లాయర్‌కు ప్రాథమికంగా అవగాహన ఏర్పడుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని, అభ్యర్థులు తమను తాము ప్రతిబింబించుకునే విధంగా రెజ్యుమేను రూపొందించాలి. ఎంతో అప్రమత్తతో వ్యవహరించాలి. టైటిల్ నుంచి సిగ్నేచర్ కాలమ్ వరకు ప్రతి లైను, ప్రతి అక్షరం విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించి మరీ రెజ్యుమేను రూపొందించాలి.
మంచి రెజ్యుమేకు మార్గాలు..
కెరీర్ ఆబ్జెక్టివ్
రెజ్యుమేలో మొట్టమొదటి విభాగంగా పేర్కొనే కెరీర్ ఆబ్జె క్టివ్ను తెలపడంలో ఎంతో జాగ్రత్త వహించాలి. అనవసరపు పదాడంబరాలు ఉపయోగించొద్దు. అదే విధంగా కెరీర్ ఆబ్జెక్టివ్ వ్యక్తిగత లక్ష్యాలను పేర్కొంటూనే, ఆ లక్ష్యసాధన క్రమంలో నిర్వర్తించే విధులు సంస్థకు కూడా ఉపకరిస్తాయనే అంశాన్ని స్పష్టంగా, సరళంగా పేర్కొనాలి.
‘కీ’ స్కిల్స్ పదాలు
ప్రస్తుతం రెజ్యుమేలను స్వీకరించే ప్రక్రియ కూడా ఆన్లైన్ విధానంలో సాగుతోంది. దీంతో ఎంప్లాయర్స్ ముందుగానే తమకు అవసరమైన స్కిల్స్‌ను స్పష్టంగా పేర్కొంటున్నారు. ఆన్లైన్ డేటాబేస్ ఆధారంగా సదరు రెజ్యుమేల్లో స్కిల్స్‌కు సంబంధించి సమాచారం ఉందో లేదో కేవలం ఒక్క క్లిక్‌తో తెలుసుకోగలుగుతున్నారు. కాబట్టి రెజ్యుమేలో తప్పనిసరిగా నిర్దిష్ట స్కిల్స్‌కు సంబంధించి సమాచారం ఉండేలా చూసుకోవాలి.
అకడమిక్ అర్హతలు
రెజ్యుమేలో అకడమిక్ అర్హతలను పేర్కొనే విషయంలోనూ జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆరోహణ క్రమంలో ఈ వివరాలు తెలపడం మంచిది. అంటే ముందుగా బీటెక్, తర్వాత ఇంటర్మీడియెట్, ఆ తర్వాత పదో తరగతి వివరాలు.
పాజెక్ట్ వర్క్ వివరణ
బీటెక్ విద్యార్థుల రెజ్యుమేలో ఎంతో ఉపయోగపడే అంశం తాము చేపట్టిన అకడమిక్ ప్రాజెక్ట్‌పై సంక్షిప్త వివరణ. సదరు ప్రాజెక్ట్ ఉద్దేశం, తాము చేపట్టిన ప్రాజెక్ట్ వర్క్ ద్వారా తెలుసుకున్న సమస్యలు, సూచించిన పరిష్కార మార్గాల గురించి కొద్దిపాటి వివరణ ఇవ్వాలి. ఫలితంగా రిక్రూటర్‌కు సదరు అభ్యర్థి సొంతం చేసుకున్న క్షేత్ర స్థాయి నైపుణ్యంపైనా అవగాహన ఏర్పడుతుంది.
ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్
ప్రస్తుతం కంపెనీలు కేవలం అకడమిక్ అర్హతలకే పరిమితం కాకుండా ఆయా అభ్యర్థులు పాల్పంచుకున్న ఎక్స్ట్రాకరిక్యులర్ యాక్టివిటీస్‌పైనా దృష్టిపెడుతు న్నాయి. హెచ్ఆర్రౌండ్ ఇంటర్వ్యూలో ఈ అంశం ప్రధానంగా నిలుస్తోంది. ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్‌లో ముందుంటే అభ్యర్థులు మానసికంగానూ దృఢంగా ఉంటారని, విధుల నిర్వహణలో టీం వర్కింగ్ కల్చర్, ఇంటర్ పర్సనల్ రిలేషన్స్ పాటించడంలో ముందుంటారని కంపెనీల ప్రతినిధులు భావిస్తుండటమే ఇందుకు కారణం.
రిఫరెన్స్‌లు అవసరమా
కంపెనీకి దరఖాస్తు చేసుకునే సమయంలో పంపించే రెజ్యుమే విషయంలో చాలామంది అభ్యర్థులను ఆందోళనకు గురి చేస్తున్న అంశం రిఫరెన్స్‌లు పేర్కొనాలా? వద్దా? అనేది. రిఫరెన్స్‌లు అంటే.. కంపెనీకి అవసరమైనప్పుడు సదరు అభ్యర్థి అకడమిక్ నైపుణ్యాలు, ఆటిట్యూడ్, ఆప్టిట్యూడ్ గురించి చెప్పగలిగే వ్యక్తుల పేర్లు తెలపడం. ఈ వ్యక్తులు సదరు అభ్యర్థికి అకడమిక్ అంశాలు బోధించిన ప్రొఫెసర్లు లేదా సంబంధిత రంగంలో ప్రొఫెషనల్స్‌గా ఉండటం ఉపయుక్తం. వాస్తవానికి ప్రాథమిక దశలోనే రెజ్యుమేలో రిఫరెన్స్ పేర్లు తెలపాల్సిన అవసరం లేదనేది నిపుణుల అభిప్రాయం. నియామక ప్రక్రియలో తుది జాబితాలో నిలిచిన అభ్యర్థుల గురించి మాత్రమే కంపెనీలు తెలుసుకోవాలనుకుంటాయి. అలాంటి సందర్భాల్లోనే రిఫరెన్స్ పేర్ల ప్రస్తావన తెరపైకి వస్తుంది. కాబట్టి అభ్యర్థులు రిఫరెన్స్ నేమ్స్‌ను అందించడానికి సిద్ధం అనే దిశగా రెజ్యుమేలో ఆ అంశాన్ని పేర్కొనాలి. అతికొద్ది కంపెనీలు మాత్రమే దరఖాస్తు సమయంలోనే రిఫరెన్స్ పేర్లు లేదా రిఫరెన్స్ లెటర్స్ అడుగుతుంటాయి. అభ్యర్థులు తొలి దశలోనైనా, తుది దశలోనైనా రిఫరెన్స్ పేర్లు అందించేందుకు సిద్ధంగా ఉండాలి. ఈ రిఫరెన్స్ పేర్లు పేర్కొనడంలోనూ జాగ్రత్తగా వ్యవహరించాలి. తమకు తోచిన ప్రొఫెసర్ల పేర్లు చెప్పకుండా తమ గురించి పూర్తి స్థాయిలో తెలిసిన ప్రొఫెసర్లు లేదా ప్రొఫెషనల్స్ పేర్లు ఎంచుకోవడం మంచిది. రిఫరెన్స్ నేమ్స్‌గా పేర్కొంటున్న వారికి ముందుగానే ఆ విషయాన్ని చెప్పి అనుమతి తీసుకోవడం కూడా ఎంతో ముఖ్యం.
రెజ్యుమే ‘డూ’స్ అండ్ ‘డోన్ట్స్’
‘డూ’స్
‘డోన్ట్స్:
సాఫ్ట్ స్కిల్స్ కూడా ముఖ్యం
ఉద్యోగాన్వేషణలో ఉన్న ఇంజనీరింగ్ విద్యార్థులు కోర్ నాలెడ్జ్‌తోపాటు సదరు బ్రాంచ్‌కు సంబంధించి ప్రస్తుత పరిణామాలపై అవగాహన పెంచుకోవాలి. ఇందుకోసం సంబంధిత సెమినార్లకు హాజవరడం, తాజా జర్నల్స్ చదవడం ఉపయుక్తంగా ఉంటుంది. ప్రస్తుతం చివరి సెమిస్టర్లో ఉన్న విద్యార్థులు తమ భవిష్యత్తు లక్ష్యంపై స్పష్టత ఏర్పరచుకోవాలి. దానికి అనుగుణంగా ఇప్పటి నుంచే ఉద్యోగాన్వేషణ సాగిస్తే సర్టిఫికెట్ చేతికందేనాటికి సత్ఫలితాలు సొంతమవుతాయి.
- బి. చెన్నకేశవరావు, ప్రిన్సిపాల్, సీబీఐటీ
అదనపు నైపుణ్యాలపై దృష్టి
పోటీ ప్రపంచంలో ప్రతి రంగంలో ప్రతి వారం లేదా నెలకు కొత్త ఆవిష్కరణలు తెరమీదికొస్తున్నాయి. వీటి గురించి విద్యార్థులు అవగాహన పెంచుకోవాలి. అదే విధంగా మారుతున్న అవసరా లకు అనుగుణంగా కంపెనీలు కొత్త సాంకేతికతలను అందిపుచ్చుకుంటున్నాయి. అలాంటి వాటికి సంబంధించి అందుబాటులో ఉన్న సర్టిఫికేషన్ కోర్సులు చేయడం ద్వారా కొత్త నైపుణ్యాలు సొంతం చేసుకోవడం కూడా ముఖ్యం. ఈ సర్టిఫికేషన్స్ కేవలం సాఫ్ట్వేర్, ఐటీ రంగానికే పరిమితం అని భావించొద్దు. కోర్ బ్రాంచ్‌లలో సైతం ఎన్నో సర్టిఫికేషన్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. సదరు అభ్యర్థులు తమ రంగానికి అనుగుణమైన విభాగాల్లో అదనపు సర్టిఫికేషన్స్ చేయడం ద్వారా అదనపు నైపుణ్యాలు సొంతమై అవకాశాలు మెరుగవుతాయి.
- ప్రొఫెసర్ డి.వి.ఎల్.ఎన్. సోమయాజులు,
డీన్ (అకడమిక్స్)- నిట్ వరంగల్
సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్.. దేశఅత్యున్నత సర్వీసుల్లోకి ప్రవేశం కల్పించే ప్రతిష్టాత్మక పోటీ పరీక్ష.ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ వంటి సర్వీసులకు ప్రతిభావంతులను ఎంపిక చేసేందుకుయూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ఏటా సివిల్ సర్వీసెస్పరీక్షను నిర్వహిస్తోంది. సంప్రదాయ డిగ్రీ మొదలు టెక్నికల్ గ్రాడ్యుయేట్లవరకు.. ఫ్రెషర్స్ నుంచి వర్కింగ్ ప్రొఫెషనల్స్ వరకూ.. దేశవ్యాప్తంగా లక్షలమంది సివిల్స్‌కు పోటీపడతారు. లక్షల ప్యాకేజీల కార్పొరేట్ కొలువులనుకాదనుకొని.. ఐఏఎస్ కావడమే లక్ష్యంగా పరీక్షకు సిద్ధమయ్యేవారు ఎందరో!
ఉద్యోగ భద్రత.. సంఘంలో గౌరవప్రదమైన హోదా.. సమాజానికి సేవ చేసే అవకాశం..వెరసి సివిల్స్‌కు పోటీ పెరుగుతోంది. తీవ్ర పోటీ దృష్ట్యాఔత్సాహికులుదీర్ఘకాలిక పటిష్ట ప్రణాళికతో కృషి చేస్తే సక్సెస్సాధ్యమవుతుందంటున్నారు నిపుణులు. సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్-2015 క్యాలెండర్‌ను యూపీఎస్సీ ప్రకటించిన నేపథ్యంలో.. అభ్యర్థులు అనుసరించాల్సినవిధానాలు, విజయానికి మార్గాలు!!
200 రోజులు.. ప్రిలిమ్స్-2015కు అందుబాటులో ఉన్న సమయం..
100 రోజులు.. ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్‌కు మధ్య లభించే సమయం..
సిలబస్‌పై పట్టు.. తొలి మెట్టు
మానసిక సంసిద్ధత కోణంలో సాధించాలనే సంకల్పం ప్రధాన పాత్ర వహిస్తే.. పరీక్ష ప్రిపరేషన్ పరంగా సిలబస్‌పై పట్టు సాధించడం తొలి మెట్టు. ఔత్సాహిక అభ్యర్థులు ప్రిపరేషన్ ప్రారంభానికి ముందుగా యూపీఎస్సీ నిర్దేశించిన సిలబస్‌ను క్షుణ్నంగా అధ్యయనం చేసి పూర్తి అవగాహన పొందాలి. కేవలం ప్రిలిమ్స్ సిలబస్‌నే కాకుండా మెయిన్స్ సిలబస్‌ను కూడా పరిశీలించాలి. ఫలితంగా రెండు పరీక్షల్లో ఉమ్మడిగా ఉన్న అంశాలపై ఏకకాలంలో ప్రిపరేషన్ ప్లాన్ రూపొందించుకోవచ్చు. అదేవిధంగా గత ప్రశ్నపత్రాలను పరిశీలించాలి. దీనివల్ల ఆయా అంశాలకు లభిస్తున్న వెయిటేజీ; ప్రశ్నలు అడుగుతున్న తీరు; అభ్యర్థులకు తాము బలహీనంగా ఉన్న అంశాలు; మరింతగా దృష్టి సారించాల్సిన అంశాలపైనా అవగాహన ఏర్పడుతుంది. ఇది క్రమబద్ధమైన ప్రిపరేషన్‌కు దోహదపడుతుంది.
ఆప్షనల్.. ముందుగానే స్పష్టత
మెయిన్స్‌లో రెండు పేపర్లుగా ఉండే ఆప్షనల్ సబ్జెక్ట్ ఎంపికలో అభ్యర్థులు ముందుగానే స్పష్టతకు రావాలి. అందుకోసం వ్యక్తిగత అభిరుచి, అకడమిక్ నేపథ్యం, స్కోరింగ్ ఆప్షనల్, మెటీరియల్ లభ్యత వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. వాస్తవానికి గత కొన్నేళ్లుగా అభ్యర్థులు తమ విద్యా నేపథ్యంతో సంబంధంలేని పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఆంత్రోపాలజీ, సోషియాలజీ; లిటరేచర్; ఫిలాసఫీ వంటి సబ్జెక్ట్‌లను ఎంచుకొని విజయం సాధిస్తున్నారు. ఆయా సబ్జెక్ట్‌ల సిలబస్‌లో పేర్కొన్న అంశాలు తేలిగ్గా అర్థమయ్యేలా ఉండటం, మెటీరియల్ లభ్యతే అందుకు కారణంగా చెప్పొచ్చు. అయితే, అభ్యర్థులు ఆప్షనల్ ఎంపికలో తమ ఆసక్తికి కూడా ప్రాధాన్యమివ్వాలని నిపుణులు సూచిస్తున్నారు.
జీఎస్‌తో ప్రారంభించి
ఇటీవల కాలంలో సివిల్స్ పరీక్షల శైలిని పరిశీలిస్తే.. జనరల్ స్టడీస్, కాంటెంపరరీ ఇష్యూస్‌కు అధిక ప్రాధాన్యం లభిస్తోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని జనరల్ స్టడీస్‌తో ప్రిపరేషన్ ప్రారంభించడం మంచిది. దీనివల్ల అన్ని విభాగాలకు సంబంధించిన అంశాల గురించి తెలుసుకునే వీలు లభిస్తుంది. ప్రిపరేషన్ పరంగా అభ్యర్థులకు కలిసొచ్చే మరో అంశం.. డిస్క్రిప్టివ్ అప్రోచ్‌ను అనుసరించడం. దీన్ని గుర్తించి ఒక సబ్జెక్ట్ నిర్దిష్ట అంశాన్ని చదివేటప్పుడు విశ్లేషణాత్మకంగా అధ్యయనం చేయాలి. ఒక అంశం నుంచి విభిన్న కోణాల్లో స్పృశిస్తూ చదవాలి. అప్పుడు ప్రిలిమ్స్‌లోని ఆబ్జెక్టివ్ ప్రశ్నలకు; మెయిన్స్‌లోని డిస్క్రిప్టివ్ ప్రశ్నలకు సమాధానం ఇచ్చే సంసిద్ధత లభిస్తుంది.
వన్ షాట్ టు బర్డ్స్
అభ్యర్థులు ప్రిపరేషన్‌ను ‘వన్ షాట్ టు బర్డ్స్’ తీరులో సాగించాలి. అంటే.. ప్రిలిమ్స్, మెయిన్స్ ప్రిపరేషన్ ఒకే సమయంలో పూర్తి చేసుకునే విధంగా ముందుకు సాగాలి. ప్రిలిమ్స్‌లోని జనరల్ స్టడీస్; మెయిన్స్‌లోని జీఎస్ పేపర్లలో పేర్కొన్న అంశాలన్నీ దాదాపు ఒకే విధంగా ఉన్నాయి. దీంతో ప్రిపరేషన్ సమయంలోనే మెయిన్స్ పరీక్ష-సమాధానం శైలిని పరిగణనలోకి తీసుకుని విశ్లేషణాత్మక అధ్యయనం చేయడం వల్ల సమయం ఎంతో ఆదా అవుతుంది. ప్రిలిమ్స్‌కు, మెయిన్స్‌కు మధ్య ఉన్న తక్కువ వ్యవధిలో కొత్తగా మెయిన్స్ కోసం ప్రిపరేషన్ ప్రారంభించడం వల్ల ఆశించిన ఫలితం ఉండదు. ప్రిలిమ్స్ ప్రిపరేషన్ నుంచే మెయిన్స్ కోణంలో చదివితే రెండు పరీక్షల మధ్య సమయం రివిజన్‌కు ఉపయోగపడుతుంది.
కోర్ + కాంటెంపరరీ
అభ్యర్థులు అనుసరించాల్సిన మరో వ్యూహం.. కోర్ టాపిక్స్‌ను సమకాలీన అంశాలతో సమన్వయం చేసుకోవడం. ఇటీవల కాలంలో పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ వంటి అంశాల నుంచి అడిగే కరెంట్ అఫైర్స్ ప్రశ్నలు కూడా అంతర్లీనంగా కోర్ సబ్జెక్ట్ నాలెడ్జ్‌ను పరీక్షించే విధంగా ఉంటున్నాయి. ఉదాహరణకు తాజాగా ఏదైనా రాజ్యాంగ సవరణ చేపడితే.. ఆ సవరణకు సంబంధించి రాజ్యాంగంలో పేర్కొన్న అంశాల గురించి కూడా ప్రశ్నలు ఎదురవుతున్నాయి. కరెంట్ అఫైర్స్ అంటే కేవలం కొశ్చన్-ఆన్సర్ అనే పద్ధతిలో ప్రిపరేషన్‌కు స్వస్తి పలికి; కోర్ సబ్జెక్ట్‌తో సమన్వయం చేసుకుంటూ చదవాలి.
గ్రూప్-1తో సమన్వయం
తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు సివిల్స్ ప్రిపరేషన్‌ను గ్రూప్-1తో సమన్వయం చేసుకోవచ్చు. త్వరలో తెలంగాణలో గ్రూప్-1 ప్రకటన వెలువడొచ్చు. ఈ పరీక్షలో పాలిటీ, ఇండియన్ ఎకానమీ, ఇండియన్ జాగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ వంటివి సివిల్స్‌లోనూ ఉంటాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని సిద్ధమవ్వాలి.
ప్రిలిమ్స్ పేపర్-2 ప్రత్యేకంగా
అభ్యర్థులు ప్రత్యేకంగా దృష్టి సారించాల్సింది ప్రిలిమ్స్ పేపర్-2 (ఆప్టిట్యూడ్ టెస్ట్). డెసిషన్ మేకింగ్; ఇంగ్లిష్ కాంప్రహెన్షన్; జనరల్ మెంటల్ ఎబిలిటీ; బేసిక్ న్యూమరసీ విభాగాలతో ఉండే ఈ పేపర్లో విజయానికి కొంత కసరత్తు చేయాలి. టెన్త, +2 స్థాయిలో ఇంగ్లిష్, మ్యాథమెటిక్స్ అంశాలపై పట్టు సాధించాలి. ఫలితంగా బేసిక్ న్యూమరసీ, ఇంగ్లిష్ కాంప్రహెన్షన్‌లో రాణించొచ్చు. అదేవిధంగా ఇంగ్లిష్ పత్రికల ఎడిటోరియల్స్ చదవడం కూడా లాభిస్తుంది. అంతర్జాతీయ ప్రాముఖ్యమున్న అంశాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో.. ఇతర దేశాలతో చేసుకున్న ఒప్పందాలు-లక్ష్యాలు-ఉద్దేశాలపై అవగాహన ఉండాలి. జాతీయ స్థాయిలో కొత్తగా ప్రారంభించిన పథకాలు-లక్ష్యాలపై అవగాహన పెంచుకోవాలి.
సమయపాలన
అభ్యర్థులకు టైం ప్లానింగ్‌లో స్పష్టత ఉండాలి. అందుబాటులో ఉన్న సమయాన్ని పరిగణనలోకి తీసుకుంటే..- జూన్ నెలాఖరుకు ప్రిలిమ్స్ (మెయిన్స్ కోణంలోనూ) ప్రిపరేషన్ పూర్తి చేయాలి. ప్రతిరోజూ సగటున 8 గంటలు చదివే విధంగా ప్రణాళిక రూపొందించుకోవాలి.
ఇలా.. ఇప్పటి నుంచే ప్రతి దశలోనూ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తే సివిల్స్ లో విజయావకాశాలు మెరుగుపరుచుకోవచ్చు.
ప్రకటన తేదీ:మే 16, 2015
దరఖాస్తు చివరి తేదీ:జూన్ 12, 2015
ప్రిలిమ్స్ పరీక్ష తేదీ:ఆగస్ట్ 23, 2015
మెయిన్స్ పరీక్షలు: డిసెంబర్ 18 నుంచి (5 రోజులు)
సివిల్ సర్వీసెస్ పరీక్ష తీరుతెన్నులు :
మొత్తం మూడు దశల్లో (ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, మెయిన్ ఎగ్జామినేషన్, పర్సనాలిటీ టెస్ట్) ఉండే సివిల్ సర్వీసెస్ ఎంపిక ప్రక్రియలో ప్రిలిమ్స్, మెయిన్స్లు రాత పరీక్షలు. వీటిలో ఉత్తీర్ణత సాధించిన వారికి పర్సనాలిటీ టెస్ట్ నిర్వహిస్తారు.
ప్రిలిమినరీ ఎగ్జామినేషన్
పేపర్-1: జనరల్ స్టడీస్ - 200 మార్కులు
పేపర్-2: ఆప్టిట్యూడ్ టెస్ట్ - 200 మార్కులు
మెయిన్ ఎగ్జామినేషన్
పేపర్-1: జనరల్ ఎస్సే
పేపర్-2 : జనరల్ స్టడీస్-1(ఇండియన్ హెరిటేజ్ అండ్ కల్చర్, హిస్టరీ అండ్ జాగ్రఫీ ఆఫ్ వరల్డ్ అండ్ సొసైటీ)
పేపర్-3: జనరల్ స్టడీస్-2 (గవర్నెన్స్, కాన్స్టిట్యూషన్, పాలిటీ, సోషల్ జస్టిస్, ఇంటర్నేషనల్ రిలేషన్స్)
పేపర్-4: జనరల్ స్టడీస్-3 (టెక్నాలజీ, ఎకనామిక్ డెవలప్మెంట్, బయోడైవర్సిటీ, ఎన్విరాన్మెంట్, సెక్యూరిటీ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్)
పేపర్-5: జనరల్ స్టడీస్-4 (ఎథిక్స్, ఇంటిగ్రిటీ అండ్ ఆప్టిట్యూడ్)
పేపర్-6: ఆప్షనల్ సబ్జెక్ట్ పేపర్-1
పేపర్-7: ఆప్షనల్ సబ్జెక్ట్ పేపర్-2
ప్రతి పేపర్‌కు 250 మార్కులు చొప్పున 1750 మార్కులకు మెయిన్ ఎగ్జామినేషన్ జరుగుతుంది.
ఖాళీల ఆధారంగా 1:1.2 లేదా 1.3 నిష్పత్తిలో అభ్యర్థులను పర్సనాలిటీ టెస్ట్ (ఇంటర్వ్యూ-275 మార్కులు)కు ఎంపిక చేస్తారు.
రెగ్యులర్ ప్రాక్టీస్
సివిల్స్ ఔత్సాహిక అభ్యర్థులు ఇప్పటి నుంచే ఎలాంటి విరామం లేకుండా రెగ్యులర్‌గా ప్రిపరేషన్ సాగించాలి. చదివే అంశాలకు సంబంధించి రైటింగ్ ప్రాక్టీస్ కూడా ఎంతో ముఖ్యం. ఇది మెయిన్స్‌లో కలిసొస్తుంది. అంతేకాకుండా సెల్ఫ్ అసెస్మెంట్ కూడా లాభిస్తుంది. నిర్దిష్ట యూనిట్ పూర్తి కాగానే అందులో మోడల్ కొశ్చన్ పేపర్స్ సాల్వ్ చేయడం, ఇందుకోసం సమయాన్ని నిర్దేశించుకోవడం వంటి టెక్నిక్స్ అనుసరించాలి. మెటీరియల్ ఎంపిక విషయంలోనూ జాగ్రత్తగా వ్యవహరించాలి. సీనియర్లు, ఇతర మార్గాల ద్వారా సరైన మెటీరియల్‌ను ఎంపిక చేసుకోవాలి. ఒక పుస్తకాన్ని ఎంపిక చేసుకునే ముందు అందులో.. సిలబస్ మేరకు అన్ని అంశాలు కవరయ్యే విధంగా ఉండేలా చూసుకోవాలి. ఇలా మెటీరియల్ ఎంపిక నుంచే వ్యూహాత్మకంగా వ్యవహరిస్తే మంచి ఫలితం ఆశించొచ్చు.
- శ్రీరంగం శ్రీరామ్, డెరైక్టర్, శ్రీరామ్స్ ఐఏఎస్
కరెంట్ అఫైర్స్‌కు ప్రాధాన్యం
ఇటీవల కాలంలో యూపీఎస్సీ సివిల్స్ ప్రశ్నల సరళిని పరిశీలిస్తే కరెంట్ అఫైర్స్‌కు ప్రాధాన్యం పెరుగుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని సివిల్స్-2015 అభ్యర్థులు.. జూలై-2015కు ముందు ఒక సంవత్సర కాలంలో చోటు చేసుకున్న ముఖ్య పరిణామాలపై దృష్టి పెట్టాలి. ప్రధానంగా సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో విజయవంతమైన శాటిలైట్ ప్రయోగాలు, అంతర్జాతీయ ఒప్పందాలపై అవగాహన పెంచుకోవాలి. అభ్యర్థులు సబ్జెక్ట్‌పై అవగాహనతోపాటు పరీక్షలో రాణించే విధంగా మాక్ టెస్ట్‌లకు హాజరవ్వడం కూడా లాభిస్తుంది.
- వి. గోపాలకృష్ణ,డెరైక్టర్, బ్రెయిన్ ట్రీ అకాడమీ
రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి
సివిల్స్ విజయంలో రైటింగ్, షార్ట్ నోట్స్‌కు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. చదివిన ముఖ్యాంశాలను షార్ట్ నోట్స్ రూపంలో రాసుకోవాలి. అదేవిధంగా మెయిన్స్ కోణంలో రైటింగ్ ప్రాక్టీస్ చేయడం ఉపయుక్తం. పరీక్షలో ఒక ప్రశ్నకు లభించే సమయాన్ని దృష్టిలో పెట్టుకుని దానికి అనుగుణంగా సమాధానాలు రాసే విధంగా సిద్ధమవ్వాలి. జనరల్ ఎస్సేకు దిన పత్రికల్లోని ఎడిటోరియల్స్, యోజన వంటివాటిలో వ్యాసాలు చదివి ముఖ్యాంశాలతో సొంత నోట్స్ రూపొందించుకోవాలి.
- కృత్తిక జ్యోత్స్న, 30వ ర్యాంకర్, సివిల్స్-2014
ఆధారము: సాక్షి