హోమ్ / విద్య / కెరీర్ గైడెన్స్ / ఆన్‌లైన్ కౌన్సెలింగ్‌ అండ
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

ఆన్‌లైన్ కౌన్సెలింగ్‌ అండ

ఆన్‌లైన్ కెరీర్‌ కౌన్సెలింగ్‌ యువతకు ఒక గొప్ప గిఫ్టని చెప్పాలి. ప్రపంచంలో ఏ మూలనున్న విద్యార్థికైనా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. పదవతరగతి, డిగ్రీల తర్వాత చదివే కోర్సులకు ఆనలైన కెరీర్‌ కౌన్సెలింగ్‌ ఎంతో ఉపయోగపడుతుంది. గతంలో కౌన్సెలింగ్‌ అవకాశాలు పరిమితంగా ఉండేవి.

ఆన్‌లైన్ కెరీర్‌ కౌన్సెలింగ్‌ యువతకు ఒక గొప్ప గిఫ్టని చెప్పాలి. ప్రపంచంలో ఏ మూలనున్న విద్యార్థికైనా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. పదవతరగతి, డిగ్రీల తర్వాత చదివే కోర్సులకు ఆనలైన కెరీర్‌ కౌన్సెలింగ్‌ ఎంతో ఉపయోగపడుతుంది. గతంలో కౌన్సెలింగ్‌ అవకాశాలు పరిమితంగా ఉండేవి.

కానీ ఇప్పుడు విద్యార్థులు ఉన్నచోట నుంచి కెరీర్‌ గురించిన వివరాలను, మంచి చెడ్డలను తెలుసుకునే వీలు ఆనలైన కెరీర్‌ కౌన్సెలింగ్‌ కల్పిస్తోంది. ఆనలైన యాప్టిట్యూడ్‌ టెస్ట్‌లు, స్కైప్‌, ఆనలైన మరియు ఫోన సెషన్ల ద్వారా కెరీర్‌ పరంగా విద్యార్థులను వెంటాడుతున్న ఎన్నో సందేహాలను ఆనలైన కెరీర్‌ కౌన్సిలర్లు తీరుస్తారు. దాంతో యువత తమ కెరీర్‌ పరంగా కచ్చితమైన నిర్ణయాన్ని తీసుకోగలుగుతారు.

కెరీర్‌ కౌన్సెలింగ్‌ విద్యార్థులకే కాదు వారి తల్లిదండ్రులకు కూడా మార్గదర్శిగా ఉంటుంది. విద్యార్థులు మంచి కౌన్సిలర్ల చేతుల్లో పడితే వారి కెరీర్‌కు ఎలాంటి ఢోకా ఉండదు. ఇటీవల నిర్వహించిన ఒక సర్వేలో 80 శాతం మంది యువత ఉద్యోగాల పరంగా తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారని వెల్లడైంది. కెరీర్‌ ఎంపికలో వారు చేసిన పొరబాటే ఇందుకు కారణమని తేలింది.

అలాంటి పరిస్థితులు ఎదురుకాకుండా కెరీర్‌ కౌన్సిలర్లు విద్యార్థుల్లో ఉన్న అసలైన ప్రతిభా సామర్థ్యాలను గుర్తించడానికి యాప్టిట్యూడ్‌ టెస్టు పెడతారు. ఈ పరీక్షలో వచ్చిన స్కోరును బట్టి చదువులో ఆ విద్యార్థి బలం, బలహీనతలను కౌన్సిలర్లు గుర్తిస్తారు. అందుకు అనుగుణంగా విద్యార్థులు తమ భవిష్యత కెరీర్‌కు బాటలు వేసుకుంటారు.

ఆనలైన కెరీర్‌ కౌన్సెలింగ్‌ సరైన కోర్సును ఎంపిక చేసుకోవడంలో ఎంతగానో సహాయపడుతుంది. ఇంటర్‌మీడియట్‌ అనంతరం విద్యార్థులు ఏ కోర్సులో చేరాలి అని తీవ్ర గందరగోళానికి గురవుతుంటారు. ఇలాంటి సందర్భాలలో సరైన కెరీర్‌ను ఎంచుకోవడంలో ఆనలైన కెరీర్‌ కౌన్సెలింగ్‌ ఎంతగానో ఉపయోగపడుతుంది.

అంతేకాదు దీనివల్ల కెరీర్‌ను సరిగా ప్లాన చేసుకోగలుగుతారు. ఏ కోర్సులూ వద్దనుకుంటే ప్రత్యామ్నాయ మార్గం కూడా ఆనలైన కెరీర్‌ కౌన్సెలింగ్‌ చూపుతుంది. గ్రాడ్యుయేషన తర్వాత కూడా కోర్సును ఎంచుకోవడంలో కెరీర్‌ కౌన్సెలింగ్‌ సహయపడుతుంది.

గ్రాడ్యుయేషన పూర్తిచేసి, వర్కు అనుభవం కూడా ఉండి వేరే కెరీర్‌లోకి వెళ్లాలనుకుంటే లేదా ఉన్నత చదువులు చదవాలనుకుంటే కెరీర్‌ కౌన్సిలర్లు తగిన సలహాలు ఇస్తారు.

ఆనలైన కెరీర్‌ కౌన్సెలింగ్‌ వల్ల కొన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఇది మంచి కెరీర్‌ కౌన్సిలర్లను అందుబాటులోకి తెస్తుంది. కెరీర్‌ అసె్‌సమెంట్‌ చేస్తుంది. ఆప్టిట్యూడ్‌ టెస్టు పెడుతుంది. విద్యార్థులకు ఆనలైనలో పెట్టే యాప్టిట్యూడ్‌ టెస్టు వల్ల పర్సనాలిటీ ప్రొఫైల్‌, యాప్టిట్యూడ్‌ ప్రొఫైల్‌ తెలుస్తుంది.
అంతేకాదు వారి కెరీర్‌ పాత ఏమిటో నిర్థారించబడుతుంది. ఎక్స్‌పర్ట్‌ కెరీర్‌ కౌన్సిలర్లతో ఇంటరాక్ట్‌ అవాలనుకునేవాళ్లు ఫోను ద్వారా లేదా స్కైప్‌ ద్వారా వాళ్లతో మాట్లాడొచ్చు. చాట్‌ చేయొచ్చు. కెరీర్‌ కౌన్సెలింగ్‌ ద్వారా విద్యార్థులలో ఉన్న సామర్థ్యాలను బయటకు తీయొచ్చు.
అయితే ఆనలైన కెరీర్‌ కౌన్సెలింగ్‌కు కావాల్సిందల్లా ఇంటర్‌నెట్‌ కనెక్షన. అది ఉంటే విద్య సంబంధమైన విషయాలను ఉన్నచోట నుంచే తెలుసుకోవచ్చు.
ఆధారము: ఆంధ్రజ్యోతి

 

 

2.9696969697
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు