హోమ్ / విద్య / కెరీర్ గైడెన్స్ / ఆఫీస్‌కు ఆలస్యంగా వెళ్లకుండా..
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

ఆఫీస్‌కు ఆలస్యంగా వెళ్లకుండా..

ఆఫీస్‌కు ఆలస్యంగా వెళ్లకుండా..

ఆఫీసులో మరుసటి రోజున చేపట్టాల్సిన పనుల ప్రణాళికను ఒక రోజు ముందే సిద్ధం చేసుకోవాలి. ఆ ప్రణాళికను ఆచరణలో పెట్టడానికి అవసరమైనవన్నీ ముందే సమకూర్చుకోవాలి కూడా. ఇలా చేయడం వల్ల ఆ రోజున ఒత్తిడికి గురయ్యే అవకాశం గానీ, అతి ముఖ్యమైన విషయాల్ని మరిచిపోవడం గానీ, జరగదు.

లేట్‌నైట్‌ పార్టీలకు వెళ్లడం, లేదా వర్కింక్‌ డేస్‌లల్లో ఆలస్యంగా నిద్రపోవడం మానకుంటే అది మీకెంతో మంచి చేస్తుంది.
రేపటి మధ్యాహ్న భోజనం గురించి ఈ రోజే ప్లాన్‌ చేయండి. ఆ భోజనం ఇంటినుంచే తీసుకువెళ్లడం ద్వారా కచ్ఛితమైన వేళకే లంచ్‌ ఇంటర్వెల్స్‌కు వెళ్లగలుగుతారు.
మీ పనికోసం అవసరమైనవన్నీ అంతకు ముందు రాత్రే సమకూర్చుకోవాలి. దీనివల్ల ఆఫీసుకు వెళ్లే సమయంలో హ డావిడి ఉండదు. సమయాభావ సమస్య ఉండకపోవడం వల్ల మీ వర్క్‌ గురించి సావధానంగా కూడా ఆలోచించగలుగుతారు.
ఇంటిపనులు, ఇతర బాధ్యతలన్నీ ఆ ముందురోజు రాత్రే పూర్తిచేయాలి తప్ప ఉదయం వేళ పెట్టుకోకూడదు. మీరు రేపు ధరించబోయే దుస్తుల్ని ఆ రాత్రే ఐరన్‌ అయిపోయేలా చేసుకోవాలి. ఉదయం వేళ ఆ పనుల్లో పడితే చాలా సమయం వృధా అయిపోతుంది.
మీ పిల్లలు పూర్తిగా మీ మీదే ఆధారపడుతున్నప్పుడు మీ జీవిత భాగస్వామి సహకారం తీసుకోవాలి. లేదంటే అప్పటికే మీ తొలి బిడ్డ కాస్త పెద్ద వాడైతే కొంత సహకారం తీసుకోవాలి. వాళ్లు ఏమేం పనులు చేయాలో కూడా విభజించాలి.
ఆఫీసును చేరుకునే ఇతర దారులన్నీ తెలిసి ఉండాలి. రోజు వెళ్లే దారి ఏ కారణంగానైనా జనంతో కిక్కిరిసిపోయినప్పుడు మరో దారిలోంచి వెళ్లే అవకాశం ఉంటుంది. దీని వల్ల రోడు ప్రమాదాల సమస్య కూడా కొంత వరకు తగ్గుతుంది.

అన్నింటినీ మించి అరగంట ముందే ఆఫీసుకు చేరే విధంగా ప్లాన్‌ చేసుకోవడం ఎంతో అవసరం.

ఆధారము: ఆంధ్రజ్యోతి

2.98148148148
రేటింగ్ చేయుటకు చుపించిన నక్షత్రము పైన క్లిక్ చేయండి
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు