অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ఇంటి నుంచి గృహిణులు చేసే జాబ్స్‌..

ఇంటి నుంచి గృహిణులు చేసే జాబ్స్‌..

ఇంటి నుంచి ఇల్లాళ్లు చేయగలిగే పార్ట్‌టైమ్‌ జాబ్స్‌ చాలా ఉన్నాయి. వీటిని చేయడం ద్వారా ఇంటి ఆర్థిక అవసరాల్లో ఇల్లాళ్లు చేదోడువాదోడుగా ఉంటారు. ఆర్థికంగా స్వతంత్రులు కావడంతోపాటు మానసికంగా ఎంతో ఆత్మవిశ్వాసాన్ని పొందుతారు. అయితే సరైన జాబ్‌ను ఎన్నుకోవడంలో వారి విజయం దాగుంది. ఇల్లాళ్లు ఇంటి నుంచి చేయగలిగే బెస్ట్‌ హోమ్‌ జాబ్స్‌ కొన్ని ఉన్నాయి. అవి...

  • చేతులతో తయారుచేసిన ఉత్పత్తులను ఆనలైనలో విక్రయించవచ్చు. ఉదాహరణకు నగల డిజైన, క్రాఫ్ట్స్‌, బట్టలు వంటి వాటికి ఎంతో డిమాండ్‌ ఉంది. ఇల్లాళ్లకు ఇవి వస్తే ఇంటి నుంచే వేలల్లో డబ్బును సంపాదించవచ్చు.
  • టీ షర్ట్స్‌ డిజైనింగ్‌ ఇంకొకటి. వీటి తయారీలో ఆడవాళ్లది అందెవేసిన చేయి. ఎందుకంటే సహజంగా వీరిలో సృజనాత్మక శక్తి ఎక్కువ. అంతేకాదు ఫొటోషా్‌పతో కూడా కొద్దిగా పరిచయం ఉంటే మంచిది. డిజైన బై హ్యూమన, త్రెడ్‌లెస్‌ వంటి వెబ్‌సైట్ల ద్వారా డిజైన చేసిన టీషర్టులను అమ్మవచ్చు. ఇల్లాళ్లలోని సృజనే ఇలాంటి బిజినె్‌సలకు అసలైన పెట్టుబడి.
  • ఇంట్లో తయారుచేసిన వంటపదార్థాలను ఆనలైనలో విక్రయించడం ద్వారా కూడా ఇల్లాళ్లు డబ్బును సంపాదించవచ్చు. పైగా ఈ పని చేయడం ఎంతో సులువు. ఇటీవల కాలంలో చాలామందిలో ఆరోగ్య స్పృహ ఎక్కువైంది. అందుకే ఇంట్లో తయారుచేసిన పదార్థాలను తినడానికి ఇష్టపడుతున్నారు. మసాలా వంటలకు దూరంగా ఉంటున్నారు. వాట్స్‌కుకింగ్‌.కామ్‌ వంటి వాటి ద్వారా ఇంట్లో తయారుచేసిన వంటకాలను ఆనలైనలో అమ్మొచ్చు. ఈ బిజినెస్‌ చేస్తున్న ఎందరో గృహిణులు నెలకు 20,000 రూపాయల కంటే ఎక్కువ సంపాదిస్తున్నారు. మీరు తయారుచేసిన పదార్థాలను స్థానికంగా అమ్మాలనుకుంటే వాట్స్‌కుకింగ్‌.కామ్‌లో రిజిస్టర్‌ చేయించుకోవాలి. మీరు తయారుచేసిన ఫేమస్‌ పదార్థాల ఫోటోలను కూడా ఆ వెబ్‌సైట్‌లో పెట్టొచ్చు. ఆర్డర్స్‌ను ఎస్‌ఎంఎస్‌ ద్వారా పొందుతారు.
  • సంప్రదాయ వంటకాలను ఇ-బుక్‌గా తేవొచ్చు. ఈ పుస్తకాలను ఆనలైనలో అమొ్ముచ్చు. పుస్తకాలతోపాటు వీడియో డివిడిలను కూడా అందజేస్తే ఇతర వ్యాపారస్తుల నుంచి వచ్చే పోటీని తట్టుకోగలుగుతారు.
  • ఇల్లాళ్లు ఇంట్లోనే ఉండి చేయగలిగే ఆనలైన ఉద్యోగాలు కూడా ఉన్నాయి. అంటే డేటా ఎంట్రీ, యాడ్‌ పోస్టింగ్‌, పెయిడ్‌ సర్వే వంటి పోస్టులన్న మాట. ఇవి ఇల్లాళ్లకు ఎంతగానో పనికొచ్చే జాబ్స్‌.
  • పర్సనల్‌ బ్లాగ్‌ క్రియేట్‌ చేసి అందులో కిచెన ప్రాడక్ట్స్‌ మీద రివ్యూలు రాయొచ్చు. మీ ఆర్టికల్‌ని సంబంధిత లింక్స్‌కు జతచేస్తే మర్చంట్‌ సైట్‌లో వాటిని రీడర్స్‌ చదువుతారు. బ్లాగింగ్‌ సక్సెస్‌ మీద నమ్మకం లేకపోతే ఇండియాలోని బెస్ట్‌ ఫుడ్‌ బ్లాగ్స్‌ ద్వారా స్ఫూర్తి పొందొచ్చు. ప్రతి ఒక్క కొనుగోలు అనంతరం రెఫరల్‌ లింక్‌ ద్వారా మీకు రావాల్సిన డబ్బులు చెల్లిస్తారు. దీన్నే అఫిలియేట్‌ మార్కెటింగ్‌ అంటారు. అందుకే అఫిలియేట్‌ మార్కెటింగ్‌ గురించి ఇల్లాళ్లు బాగా తెలుసుకోవాలి.
  • తమ ఉత్పత్తులు అమ్ముడుపోవడానికి చాలా కంపెనీలు ఇండిపెండెంట్‌ డిసి్ట్రబ్యూటర్‌షి్‌పని ఇస్తాయి. ఉత్పత్తుల అమ్మకానికి అనుగుణంగా కంపెనీలు కమిషన ఇస్తాయి. ఈరకమైన డిసి్ట్రబ్యూషనషి్‌పను ఉచితంగా ఇస్తారు. ఎన్ని ఉత్పత్తులు అమ్మితే అంత ఎక్కువ డబ్బులను సంపాదించగలరు.
  • ఛైల్డ్‌ ట్యూటర్‌గా కూడా పనిచేస్తూ ఇల్లాళ్లు ఇంటిపట్టున ఉండి డబ్బును సంపాదించవచ్చు. ఇప్పుడు అమ్మా, నాన్నలిద్దరూ ఉద్యోగాలు చేస్తుండడంతో వారి పిల్లలకు ట్యూటర్‌ అవసరం బాగా ఉంటోంది. చేయాల్సిందల్లా ఇంటి బయట ప్రైవేట్‌ ట్యూటర్‌ అనే బోర్డును తగిలిస్తే చాలు. పిల్లలే మీ దగ్గరికి వస్తారు.
  • ఇంట్లోనే ప్లేయింగ్‌ స్కూల్‌ను ప్రారంభించవచ్చు. మీతోపాటు ఒక అసిస్టెంట్‌ టీచర్‌ని పెట్టుకుంటే సరిపోతుంది. ప్లేయింగ్‌ స్కూళ్ల గురించి అవగాహన కావాలంటే ఇంటర్‌నెట్‌ను బ్రౌజ్‌ చేస్తే సరిపోతుంది. అలాగే వర్చువల్‌ కాల్‌సెంటర్‌ ఏజెంట్‌గా కూడా ఇంటి నుంచే పని చేయెచ్చు. ఈ జాబ్‌ను ఆఫర్‌ చేసే కంపెనీలు ఎన్నో ఉన్నాయి. ఇల్లాళ్లూ మరి నిరుత్సాహం వీడి రంగంలోకి దిగండి...

 

ఆధారము: ఆంధ్రజ్యోతి© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate