హోమ్ / విద్య / కెరీర్ గైడెన్స్ / ఇలా చదివితే నో టెన్షన్‌
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

ఇలా చదివితే నో టెన్షన్‌

స్లిప్‌ టెస్టులు, ఎస్సేలు, ప్రాజెక్టులు, క్విజ్‌లు....ఒక్కటా రెండా కాలేజ్‌లో ఉండే ఒత్తిడి అంతా ఇంతా కాదు. ఇన్ని చేసినా ఎగ్జామ్‌లో ఒక్కటి త్వరగా గుర్తుకురావు. దీనికి కారణం సరియైున పద్ధతిలో చదవకపోవడమే. చదివింది త్వరగా గుర్తుకు రావాలంటే కొన్ని మెథడ్స్‌ను ఫాలో కావాలంటున్నారు నిపుణులు. ఆ విశేషాలు ఇవి...

స్లిప్‌ టెస్టులు, ఎస్సేలు, ప్రాజెక్టులు, క్విజ్‌లు....ఒక్కటా రెండా కాలేజ్‌లో ఉండే ఒత్తిడి అంతా ఇంతా కాదు. ఇన్ని చేసినా ఎగ్జామ్‌లో ఒక్కటి త్వరగా గుర్తుకురావు. దీనికి కారణం సరియైున పద్ధతిలో చదవకపోవడమే. చదివింది త్వరగా గుర్తుకు రావాలంటే కొన్ని మెథడ్స్‌ను ఫాలో కావాలంటున్నారు నిపుణులు. ఆ విశేషాలు ఇవి...

ఫ్లాష్‌కార్డ్స్‌

ఇన్‌ఫర్మేషన్‌ను రీకాల్‌ చేసుకోవడానికి అంటే మెమొరీని రీకాల్‌ చేయడానికి డిజైన్‌ చేయబడినవే ఫ్లాష్‌కార్డులు. ఈ ఫ్లాష్‌కార్డులో ఒకవైపు ప్రశ్న, మరొకవైపు సమాధానం రాసుకోవచ్చు. వీటిని చూడటం వల్ల సమాధానం కోసం మెదడుపై ఫోర్స్‌ పెట్టడానికి అవకాశం ఉంటుంది. రిపిటేషన్‌ చేసుకోవడానికి అనువుగా ఉంటుంది. పదే పదే రిపిటేషన్‌ చేయడం వల్ల మెమొరి బిల్డప్‌ అవుతుంది. పదే పదే చదవడం వల్ల సమాచారాన్ని త్వరగా, సులువుగా రీకాల్‌ చేసుకోవచ్చు.

 

రివైజ్‌

పరీక్షకు ముందు రివైజ్‌ చేయడం వల్ల ఫలితం ఉండదని అనుకుంటారు. కానీ అది సరికాదు. ప్రతిరోజు కొంత సమాచారాన్ని రివైజ్‌ చే సుకోవడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. అయితే రివైజ్‌ చేయడంలో కూడా కొన్ని పద్ధతులుంటాయి. వాటిని ఫాలో కావాలి. ఫ్లో చార్ట్‌ మాదిరిగా రివిజన్‌ ఉండాలి. ఒకదానితో మరొకటి కనెక్ట్‌ అయి ఉండాలి. అప్పుడే బాగా గుర్తుంటుంది.

పాఠాల వీడియోలు

 

చదవడం కన్నా చూడటం వల్ల ఎక్కువగా గర్తుండిపోతుంది. కాబట్టి సంబంధిత పాఠాలకు సంబంధించిన వీడియోలను చూడాలి. యూట్యూబ్‌, ఎడ్యుకేషనల్‌ వెబ్‌సైట్‌లలో ఈ తరహా వీడియోలు లభిస్తాయి.

ప్రాక్టీస్‌ టెస్ట్‌లు

గత టెస్టులను ఆధారంగా చేసుకుని కొత్త ప్రాక్టీస్‌ టెస్టులను ప్రిపేర్‌ చేసుకోవాలి. ఎక్కువ టెస్టులను ప్రాక్టీస్‌ చేయడం వల్ల సబ్జెక్ట్‌పై తొందరగా గ్రిప్‌ వస్తుంది. ఎగ్జామ్‌లో తడబాటుకు అవకాశం లేకుండా పోతుంది.

నోట్స్‌ను తిరిగి రాయడం
చదివింది సులభంగా గుర్తుకు రావాలంటే పదే పదే రాయాలి. చదివింది చేతితో రాసినపుడు త్వరగా రీకాల్‌ అవుతుంది. లెక్చర్స్‌ చెప్పినపుడు రాయడం, చదివేటప్పుడు రాయడం, ఎగ్జామ్స్‌సమయంలో మళ్లీ నోట్స్‌ తిరిగి రాయడం వల్ల సబ్జెక్ట్‌ గుర్తుండి పోతుంది. క్లాస్‌ అయిపోయిన తరువాత నోట్స్‌ను నీట్‌గా రాసుకోవడం వల్ల కూడా ఫలితం ఉంటుంది. గ్రాస్పింగ్‌ పవర్‌ పెరుగుతుంది. ముఖ్యమైన అంశాలను బుల్లెట్స్‌ పెట్టి పాయింట్స్‌ రూపంలో రాసుకోవడం వల్ల తరువాత చదువుకోవడానికి అనువుగా ఉంటుంది. ఇలాంటి స్టడీ మెథడ్స్‌ను ఫాలో కావడం వల్ల పరీక్షల్లో సులభంగా విజయం సాధించవచ్చు.
ఆధారము: ఆంధ్రజ్యోతి

 

 

 

 

2.90990990991
ms.chinna Jun 05, 2017 04:45 PM

వ్వ్వ్ వెరీ గుడ్ అడ్వేటేజ్మెంట్

Anonymous Mar 17, 2017 07:44 PM

ఇది చాల ఉపయోగ కరంగా ఉంది .ధన్యవాదములు...

మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు