హోమ్ / విద్య / కెరీర్ గైడెన్స్ / సైన్స్‌ గ్రాడ్యుయేట్లు ఈ రంగాల్లో రాణించొచ్చు
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

సైన్స్‌ గ్రాడ్యుయేట్లు ఈ రంగాల్లో రాణించొచ్చు

సైన్స్‌ గ్రాడ్యుయేట్లకు ఎమర్జింగ్‌ కెరీర్స్‌గా గుర్తింపు పొందిన రంగాలు కొన్ని ఉన్నాయి. వాటిలో కొన్ని.

ఏటా లక్షలాది మంది గ్రాడ్యుయేట్లు మార్కెట్‌లోకి వస్తున్నారు. డిగ్రీ, ఇంజనీరింగ్‌, పీజీ పట్టాతో పాటు ఒకట్రెండు కంప్యూటర్‌ లాంగ్వేజ్‌లు, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ను నేర్చుకున్నా కెరీర్‌ ఆప్షన్స్‌ అందని ద్రాక్షల్లా ఊరిస్తూనే ఉన్నాయి. నలుగురు నడిచే దారిని కాకుండా కాస్త భిన్నమైన మార్గాన్ని ఎంచుకోగలిగితే కెరీర్‌ జర్నీ సాఫీగా మొదలైనట్టే. సైన్స్‌ గ్రాడ్యుయేట్లకు ఎమర్జింగ్‌ కెరీర్స్‌గా గుర్తింపు పొందిన రంగాలు కొన్ని ఉన్నాయి. వాటిలో కొన్ని..

ఈ ఉద్యోగం పాతదే అయినా.. ఇందులో అవకాశాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ రంగంలో ఏటా నలభై శాతానికిపైగా అభివృద్ధి కనిపిస్తోంది.

స్కిల్స్‌:

  • గణితం, స్టాటిస్టిక్స్‌పై మంచి పట్టు
  • లాజికల్‌, అనలిటికల్‌ స్కిల్స్‌
  • గుడ్‌ కమ్యూనికేషన్‌

 

ఎలా ఉంటుంది:

డాటా అనలిస్ట్‌ పనిలో మార్కెట్‌ రీసెర్చ్‌ ఎక్కువగా ఉంటుంది. వివిధ మార్గాల ద్వారా అవసరమైన డాటా కలెక్ట్‌ చేయడం, ఆ డాటాను బిజినెస్‌ ఆపరేషన్స్‌, డెసిషన్‌ మేకింగ్‌ తదితర అవసరాలకు తగ్గట్టుగా అనలైజ్‌ చేయడం ఉంటుంది.

ప్రారంభ వేతనం: 3.5 లక్షల నుంచి 7 లక్షలు (ఏడాదికి)

 

సైబర్‌ సెక్యూరిటీ స్పెషలిస్ట్‌

ప్రపంచమంతటా ఇప్పుడు ఇంటర్నెట్‌ విస్తరించింది. ఈ నేపథ్యంలో సైబర్‌ సెక్యూరిటీ స్పెషలిస్ట్‌లకు డిమాండ్‌ పెరుగుతోంది. ఈ రంగంలోకి అడుగుపెడితే భవిష్యత్తుకు ఎలాంటి ఢోకా లేదంటున్నారు నిపుణులు.
స్కిల్స్‌:

  • నెట్‌వర్క్‌ సెక్యూరిటీ పరిజ్ఞానం
  • సైబర్‌ ఫోరెన్సిక్‌
  • సైబర్‌ లా
  • లైనక్స్‌ అండ్‌ యునిక్స్‌పై పట్టు

 

ఎలా ఉంటుంది:
పనిచేస్తున్న సంస్థకు రక్షణ కల్పించడమే సైబర్‌ సెక్యూరిటీ డ్యూటీ. మాల్‌వేర్‌ అనలసిస్‌, టెస్టింగ్‌, రెమిడేషన్‌ ప్రాసెస్‌, సైబర్‌ దాడులను అడ్డుకోవం మొదలైనవి చేయాల్సి ఉంటుంది.

ప్రారంభ వేతనం: 4 లక్షల నుంచి 6.5 లక్షలు (ఏడాదికి)


మొబైల్‌ యాప్‌ డెవలపర్‌
మోస్ట్‌ ఎమర్జింగ్‌ కెరీర్‌గా మొబైల్‌ యాప్‌ డెవలపింగ్‌ దూసుకుపోతోంది. కంప్యూటర్‌ సైన్స్‌ గ్రాడ్యుయేట్లకు ఈ రంగంలో అపరిమితమైన అవకాశాలున్నాయి. మొబైల్స్‌ రంగంలో వస్తున్న విప్లవాత్మకమైన మార్పులను అందిపుచ్చుకుంటే ఇందులో సులభంగా విజయం సాధించవచ్చు. జీతభత్యాలు కూడా ఊహించనంత వేగంగా పెరుగుతాయి.
స్కిల్స్‌

జావాస్ర్కిప్ట్‌, ఛిు ఫర్‌ విండోస్‌

  • జావా, C++ లేదా ఫర్‌ ఆండ్రాయిడ్‌
  • ఆబ్జెక్టివ్‌ - C లేదా స్విఫ్ట్‌ ఫర్‌ ఐఓఎస్‌

ప్రారంభ వేతనం: 3 లక్షల నుంచి 6.5 లక్షలు (ఏడాదికి)

ఆధారము: ఆంధ్రజ్యోతి

2.9696969697
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు