హోమ్ / విద్య / కెరీర్ గైడెన్స్ / ఐఐఎఫ్‌టీ కోర్సుల వివరాలు..
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

ఐఐఎఫ్‌టీ కోర్సుల వివరాలు..

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ (ఐఐఎఫ్‌టీ)కు న్యూఢిల్లీ, కోల్‌కతాలలో క్యాంపస్‌లు ఉన్నాయి. ఈ ఇన్‌స్టిట్యూట్ ఎంబీఏ (ఇంటర్నేషనల్ బిజినెస్) కోర్సును అందిస్తుంది.

మాస్టర్ ఆఫ్ ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్ కోర్సును పూర్తి చేసిన వారికి ఎటువంటి అవకాశాలు ఉంటాయి?    
-బాలు, నిజామాబాద్.

ప్రస్తుత జాబ్ మార్కెట్లో ఫైనాన్స్, అకౌంటింగ్ స్పెషలైజేషన్స్‌కు మంచి డిమాండ్ ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రవేశపెట్టిన కోర్సుల్లో మాస్టర్ ఆఫ్ ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్ ఒకటి. ఫైనాన్స్, అకౌంటింగ్ రంగాలకు సంబంధించి కావల్సిన పరిజ్ఞానం, నైపుణ్యాలను అందించే లక్ష్యంతో రూపొందించిన కోర్సు ఇది. ఈ కోర్సు పూర్తి చేసిన తర్వాత బ్యాంకులు, స్టాక్ బ్రోకింగ్ కంపెనీలు, ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్, మేనేజ్‌మెంట్ కంపెనీలు, ఇన్సూరెన్స్ మేనేజ్‌మెంట్, మ్యూచువల్ ఫండ్స్, రిస్క్ మేనేజ్‌మెంట్, ఈక్విటీ రీసెర్చ్ వంటి సంస్థల్లో మేనేజీరియల్ హోదాలో స్థిరపడొచ్చు. కామర్స్ బ్యాక్ గ్రౌండ్‌తో ఈ తరహా కోర్సులను పూర్తి చేసిన వారికి ఫైనాన్షియల్ మార్కెట్స్‌లో మంచి డిమాండ్ ఉంది. ఇంగ్లిష్‌పై పట్టు, కంప్యూటర్ పరిజ్ఞానం, సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటే కెరీర్‌లో రాణించవచ్చు.

ఐఐఎఫ్‌టీ ఆఫర్ చేసే కోర్సుల వివరాలను తెలపండి?
- మోహన్, నర్సంపేట.

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ (ఐఐఎఫ్‌టీ)కు న్యూఢిల్లీ, కోల్‌కతాలలో క్యాంపస్‌లు ఉన్నాయి. ఈ ఇన్‌స్టిట్యూట్ ఎంబీఏ (ఇంటర్నేషనల్ బిజినెస్) కోర్సును అందిస్తుంది. అర్హత: గ్రాడ్యుయేషన్. రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేసిన విద్యార్థులకు నిర్వహించే గ్రూప్ డిస్కషన్, ఎస్సే రైటింగ్, ఇంటర్వ్యూ ద్వారా  ప్రవేశం కల్పిస్తారు. రాత పరీక్ష మల్టిపుల్ చాయిస్ విధానంలో ఉంటుంది. ఇందులో ఇంగ్లిష్ కాంప్రెహెన్షన్, జనరల్ నాలెడ్జ్ అండ్ అవేర్‌నెస్, లాజికల్ రీజనింగ్, క్వాంటిటేటివ్ అనాలిస్ వంటి నాలుగు విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి. రెండు గంటల్లో సమాధానాలు గుర్తించాలి. అంతేకాకుండా ఎగ్జిక్యూటివ్ డిప్లొమా ఇన్ ఇంటర్నేషనల్ బిజినెస్, ఎగ్జిక్యూటివ్ పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ఇండస్ట్రియల్ మార్కెటింగ్, ఎగ్జిక్యూటివ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ క్యాపిటల్ అండ్ ఫైనాన్షియల్ మార్కెట్స్, పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ఇంటర్నేషనల్ బిజినెస్, అడ్వాన్స్‌డ్ డిప్లొమా ఇన్ ఇంటర్నేషనల్ బిజినెస్ వంటి కోర్సులను కొన్ని రకాల సర్టిఫికెట్ ప్రోగ్రామ్‌లను కూడా ఐఐఎఫ్‌టీ ఆఫర్ చేస్తుంది.

ఆన్‌లైన్ కోర్సుల ప్రాధాన్యత ఏమిటి? ఏయే ఇన్‌స్టిట్యూట్‌లు ఈ కోర్సులను అందిస్తున్నాయి?
- శ్రీధర్, నిర్మల్.

ఉన్నత విద్య అంటే ఆసక్తి ఉన్నా.. అందుకు తగిన సమయం చిక్కని వృత్తి నిపుణులు, ఉద్యోగస్తులకు ఆన్‌లైన్ కోర్సులు ఉపయోగకరంగా ఉంటాయి. దేశంలో ఏ మూల నుంచైనా  ఈ కోర్సులను పూర్తి చేయొచ్చు. అంతేకాకుండా ప్రముఖ విశ్వవిద్యాలయాల్లోని ప్రొఫెసర్ల పాఠాలను వినే అవకాశం కూడా లభిస్తుంది.ఆన్‌లైన్ కోర్సులను సెల్ఫ్-లెర్నింగ్ పద్ధతి లేదా ప్రొఫెసర్ కేంద్రకంగా ఉండే మాధ్యమంలో నిర్వహిస్తారు. ప్రాక్టికల్స్‌కు అంతగా ప్రాముఖ్యం లేని సబ్జెక్ట్‌లలో ఈ కోర్సులను సాధారణంగా ఆఫర్ చేస్తారు. ఎంచుకున్న సబ్జెక్ట్‌ను బట్టి కాల వ్యవధి ఆధారపడి ఉంటుంది. కొన్ని కోర్సులను వారాలపాటు నిర్వహిస్తే.. మరికొన్ని కోర్సులను పూర్తి చేయడానికి ఏడాది సమయం పట్టొచ్చు.

ఆన్‌లైన్ డిగ్రీలకు జాబ్ మార్కెట్‌లో గుర్తింపు కూడా లభిస్తుంది. దేశంలోని చాలా ఇన్‌స్టిట్యూట్‌లు ఆన్‌లైన్ కోర్సులను ప్రవేశపెట్టాయి. వీటిలో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, మేనేజ్‌మెంట్ స్టడీస్‌కు సంబంధించి ఆఫర్ చేస్తున్న కోర్సులకు ఆదరణ ఎక్కువగా ఉంటోంది. జేవియర్స్ లేబర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ), సర్టిఫికెట్ ప్రోగ్రామ్ ఇన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, ముద్ర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికేషన్ అహ్మదాబాద్ (మైకా), సర్టిఫికెట్ ప్రోగ్రామ్ ఇన్ మార్కెట్ రీసెర్చ్ అండ్ డేటా అనలిటిక్స్ కోర్సులను అందిస్తున్నాయి. ఇండియా టుడే గ్రూప్ కూడా మీడియాతోపాటు వివిధ విభాగాలకు సంబంధించిన కోర్సులను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తుంది.

పీజీ స్థాయిలో పెట్రోలియం స్పెషలైజేషన్‌తో అందుబాటులో ఉన్న కోర్సులు, ఆఫర్ చేస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లేవి? 
- బాలా, మహబూబ్‌నగర్.

పెట్రోలియం ఇంజనీర్ అభ్యర్థులకు అవకాశాలకు కొదవలేదని చెప్పొచ్చు. ఎందుకంటే పెట్రోలియం, సంబంధిత ఉత్పత్తులకు డిమాండ్ పెరగడమే తప్ప తగ్గడమనే మాట తలెత్తదు. డిమాండ్ పెరగడం అంటే తదనుగుణంగా నూతన ఉద్యోగాల సృష్టి జరుగుతుందనే భావించాలి. కాబట్టి ఈ కోర్సును పూర్తి చేసిన ప్రతి విద్యార్థికి ఉద్యోగం ఖాయమని చెప్పొచ్చు. వీరు ఆయిల్ కంపెనీలు, గ్యాస్ పరిశ్రమలు, మైనింగ్ కంపెనీలు తదితరాల్లో అవకాశాలను దక్కించుకోవచ్చు. పీజీ స్థాయిలో పెట్రోలియం స్పెషలైజేషన్‌తో కోర్సులను అందిస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లు..

యూనివర్సిటీ ఆఫ్ పుణే, ఎంఎస్సీ (పెట్రోలియం టెక్నాలజీ) కోర్సును అందిస్తుంది. సంబంధిత సబ్జెక్ట్‌లో డిగ్రీ పూర్తి చేసిన వారు ఈ కోర్సుకు అర్హులు. వివరాలకు: www.unipune.ac.in రాజీవ్‌గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం టెక్నాలజీ-రాయ్‌బరేలీ, ఎంటెక్ (పెట్రోలియం ఇంజనీరింగ్) కోర్సును ఆఫర్ చేస్తుంది. అర్హత: సంబంధిత అంశంలో బీటెక్. గేట్ స్కోర్ ఆధారంగా ప్రవేశం ఉంటుంది.

వివరాలకు: www.rgipt.ac.in యూనివర్సిటీ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ స్టడీస్- డెహ్రాడూన్, ఎంటెక్ (పెట్రోలియం ఎక్స్‌ప్లోరేషన్) కోర్సును అందిస్తుంది. అర్హత: 60 శాతం మార్కులతో బీటెక్ (కెమికల్/మెకానికల్) లేదా ఎంఎస్సీ (జియాలజీ/జియోఫిజిక్స్/ ఫిజిక్స్). అదేవిధంగా సీనియర్ సెకండరీ స్థాయిలో కూడా 60 శాతం మార్కులు కలిగి ఉండాలి.

పీఓజీఎల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ పెట్రోలియం అండ్ ఎనర్జీ డెవలప్‌మెంట్-గువహటి, ఎంఎస్సీ (పెట్రోలియం, పలు స్పెషలైజేషన్‌‌సతో) కోర్సును ఆఫర్ చేస్తుంది. రాత పరీక్ష ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు.

వివరాలకు: poglinstitute.org ను సంప్రదించగలరు.

ఆధారము: సాక్షి

2.97222222222
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు