హోమ్ / విద్య / కెరీర్ గైడెన్స్ / కానిస్టేబుల్‌ పరీక్ష హాల్‌టికెట్లు
పంచుకోండి

కానిస్టేబుల్‌ పరీక్ష హాల్‌టికెట్లు

తెలంగాణ పోలీస్‌ శాఖలోని ఆయా విభాగాల్లో 9281 కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకి ఏప్రిల్‌ 3న నిర్వహించనున్న అర్హత పరీక్షకు హాల్‌టికెట్లు శనివారం నుంచి ఆనలైనలో అందుబాటులో ఉంటాయి

 

తెలంగాణ పోలీస్‌ శాఖలోని ఆయా విభాగాల్లో 9281 కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకి ఏప్రిల్‌ 3న నిర్వహించనున్న అర్హత పరీక్షకు హాల్‌టికెట్లు శనివారం నుంచి ఆనలైనలో అందుబాటులో ఉంటాయి. ఆ రోజు ఉదయం 8 గంటల నుంచి ఏప్రిల్‌ ఒకటి అర్ధరాత్రి వరకు అభ్యర్థులు హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకునే అవకాశం ఉంటుంది. రిజిసే్ట్రషన్‌ నంబరు, మొబైల్‌ నంబరు, ఎస్‌ఎ్‌ససీ తత్సమాన హాల్‌టికెట్‌ నంబరులో దేన్నయినా ఉపయోగించి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.
అనివార్య కారణాలవల్ల హాల్‌టిక్కెట్‌ డౌన్లోడ్‌ కాకుంటే... support@tslprb.in వెబ్‌సైట్‌కి రిక్వెస్ట్‌ మెయిల్‌ పంపడం ద్వారా, లేదంటే 040-23150362, 462 నంబర్లకు ఫోనచేసి హాల్‌టికెట్‌ పొందవచ్చు. ఏప్రిల్‌ 3న మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు అర్హత పరీక్ష నిర్వహించనున్నారు. ఎలాంటి ఇబ్బందులకు అవకాశం లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో పెద్ద సంఖ్యలో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. అర్హత పరీక్ష నుంచి శిక్షణ వరకు ఎలాంటి విమర్శలకు తావులేకుండా ఉండేందుకు తొలిసారిగా బయోమెట్రిక్‌ విధానాన్ని ఉపయోగిస్తున్నారు. జేఎనటీయూ సహకారంతో నియామకబోర్డు అధికారులు ఇప్పటికే అర్హత పరీక్షకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఈ నేపథ్యంలో అర్హత పరీక్ష, అనుసరించాల్సిన విధానాలపై నియామకబోర్డు, జేఎనటీయూ అధికారులు, ఇతర అధికారులు డీజీపీ కార్యాలయంలో గురువారం భేటీ అయ్యారు. బయోమెట్రిక్‌ విధానం వాడకం, నిర్వహణలో అనుకోని ఇబ్బందులు ఎదురైతే తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.

 

ఆధారము: ఆంధ్రజ్యోతి

 

నావిగేషన్
పైకి వెళ్ళుటకు