హోమ్ / విద్య / కెరీర్ గైడెన్స్ / నేటి జట్టుకు మేటి సూత్రాలు
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

నేటి జట్టుకు మేటి సూత్రాలు

టీమ్‌లోని సభ్యులందరి మధ్య బాగా సన్నిహిత బంధం ఉండాలి. ఆ బంధం ప్రాజె క్ట్‌ను సక్సెస్‌ దిశగా నడిపించేలా ఉండాలి. టీమ్‌ సభ్యులకూ టీమ్‌ నాయకులకూ మధ్యనుండే కమ్యూనికేషన్‌ కూడా ఉభయ మార్గంగా ఉండాలి.

ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్‌

టీమ్‌లోని సభ్యులందరి మధ్య బాగా సన్నిహిత బంధం ఉండాలి. ఆ బంధం ప్రాజె క్ట్‌ను సక్సెస్‌ దిశగా నడిపించేలా ఉండాలి. టీమ్‌ సభ్యులకూ టీమ్‌ నాయకులకూ మధ్యనుండే కమ్యూనికేషన్‌ కూడా ఉభయ మార్గంగా ఉండాలి.

 

బలమైన నాయకత్వం

బాస్‌లో ఉండే వేగమే టీమ్‌ వేగంగా ఉంటుంది. టీమ్‌ లీడర్‌ మొత్తం టీమ్‌ను చైతన్యపరిచేలా ఉండాలి. టీమ్‌ లీడర్‌ ఎప్పుడూ వ్యక్తిగత లక్ష్యాల వేపు పోకుండా టీమ్‌ లక్ష్యాలనే పరమావధిగా తీసుకోవాలి. పైగా టీమ్‌ లీడర్‌ దిశా నిర్దేశం వహించేలా, వారు చేపట్టే ప్రతిదీ టీమ్‌ మెంబర్లను ఫోకస్‌ చేసేలా ఉండాలి.


ప్రభావవంత ప్రాతినిధ్యం

బాధ్యతాయుతంగా ఉండడం ఎంత ముఖ్యమో, చేపట్టిన పనిని టీమ్‌ సభ్యుల సామర్ధ్యంతో అయినా, పర్‌ఫెక్ట్‌గా నిర్వహించడం కూడా అంతే ముఖ్యం.
వైరుధ్యాల పరిష్కారం

టీమ్‌లో తలెత్తే వైరుధ్యాల్ని పరిష్కరించడం అన్నిటికన్నా ఒక ప్రధాన బాధ్యత అవుతుంది. ఎంత తీవ్రమైనా వైరుధ్యమైనా, పరిణతితో వ్యవహరిస్తే ఎక్కడా చిన్న మచ్చయినా మిగలకుండా పరిష్కార మవుతుంది. అభిప్రాయపరమైన విభేదాలు ఏమున్నా అవి టీమ్‌ సామర్థ్యానికి అడ్డుపడకూదు.

 

నమ్మకం

టీమ్‌లోని సభ్యలందరి మధ్య ఉండే అనుబంధమంతా టీమ్‌ ఓరియెంటేషన్‌తో ఉండాలి. టీమ్‌ సభ్యుంలదరి మధ్యా ఎప్పటికప్పుడు కొత్తగా, ఒక సుహృద్భావ వాతావరణం ఉండే చూడాలి. పనిచేసే సంస్థ అబివృద్దికి తోడ్ప టీమ్‌ పురోగతికి తోడ్పడుతుందని అనిపిస్తే తప్ప, టీమ్‌ రహస్యాల్ని ఎప్పుడూ బహిర్గతం చేయకూడదు.

సామాన్య లక్ష్యాలు

ఏ టీమ్‌ ను చూసినా విరుద్ధాభిప్రాయాలుండే కొంతమంది వ్యక్తుల సమూహ ంగానే ఉంటుంది. అందుకే వీరి మధ్య సహజంగానే వైరుధ్యాలు ఉంటాయి. అయినా, దృష్లి అంతా సాధారణ లక్ష్యాలు సాఽధించే దిశగా ఉండాలి. అందుకే వ్యక్తిగత దృక్కోణానికి దూరంగా ఉంచుతూ సంస్ధాగతమైన లక్ష్యాలని జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. సంయుక్తంగా పాటుపడుతూ ఆ లక్ష్యాల మీద దృష్టి సారించాలి.

గౌరవం

సంస్థల్లో సమన్వయంతో పనిచేయడం ఎంతో ముఖ్యం సభ్యులు ఒకరినొకరు పరస్పరం అర్థం చేసుకోవడం ఎంత ముఖ్యమో, పరస్పరం ఎంతో గౌరవంతో ఉండడం కూడా అంతే ముఖ్యం. అలాగే ఇతరుల సామర్ధ్యాన్నీ, దృక్పథాల్నీ, చర్యల్నీ గౌరవించాలి. అయితే, అవి వైరుధ్యాల్ని తగ్గించేవిగా ఉండాలి. ప్రతి పనీ మృదువుగానూ ఉత్పాదకతను పెంచేలా చూడాలి.

 

సంయుక్తంగా

టీమ్‌ ఎప్పుడూ సంయుక్త తత్వంతో ఉండాలి,. అందరికీ ప్రయోజనం కలిగేలా ఉండాలి. సంస్థలు టీమ్‌ నిర్మాణాన్ని వృద్ధి చేసే ప్రయత్నాలు చేయాలి. సంస్థల్లో ప్రతి నెలా మీటింగ్‌ జరగడం వల్ల సంస్థలు బలపడటంతో వాటి మధ్యబంధం పెరుగుతుంది.

 

నెగిటివిటీకి దూరంగా

నెగిటివ్‌నె్‌సను గానీ, అసూయ, అయిష్టాల్ని మనసుకు దూరంగా ఉంచాలి. అలాగే ఉత్పాదకతకు దోహదం చేయని, అనారోగ్యకర చర్చల్లో పాల్గొనకూడదు.

 

ఒక మోడల్‌గా


టీమ్‌లోని ప్రతి సభ్యుడూ అతని కార్యధక్షతతో ఇతరులకు స్పూర్తి దాయకంగా ఉండాలి. లక్ష్యాన్ని అందుకునేందుకు ఒక అసాధారణ ప్రతిభతో సంస్థ స్థాయిని అను నిత్యం అభివృద్ధిలోకి తీసుకువెళ్లాలి.

ఆధారము: ఆంధ్రజ్యోతి

 

3.00980392157
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు