హోమ్ / విద్య / కెరీర్ గైడెన్స్ / భిన్నమైన కెరీర్లతో విభిన్నంగా
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

భిన్నమైన కెరీర్లతో విభిన్నంగా

భిన్నమైన కెరీర్లతో విభిన్నంగా

ఎవరడిగినా కాలేజీకి వెళ్లే యువత ఎంతసేపూ డాక్టరు, ఇంజనీరు, సైంటిస్టు, టీచరు లేదా సాఫ్ట్‌వేర్‌ ప్రొఫెషనల్‌ అవుతా అని అంటుంటారు. కానీ ఇవి కాకుండా గ్రేట్‌ కెరీర్స్‌ కొన్ని ఉన్నాయి. ఉదాహరణకు ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్‌ ఉద్యోగం. ఇందులో మంచి జీతం, ఇతర లాభాలు ఎన్నో ఉన్నాయి. ఈ ఉద్యోగం చేసేవాళ్లు ఎంతో నాణ్యమైన జీవితం గడపగలరు. ఇంకొకటి టవర్‌ టెక్నిషియన్.

ఈ ఉద్యోగంలో అవుట్‌డోర్‌ పని ఎక్కువగా ఉంటుంది. తిరగడం ఇష్టం ఉండేవారికి ఇది ఎంతో బాగుంటుంది. దీనికి ప్రయాణాలు బాగా చేయాల్సి ఉంటుంది. ఉద్యోగంలో బోర్‌ని అస్సలు ఫీలవరు. ఎందుకంటే ప్రతి వారం ఒక కొత్త టౌన్‌లో పనిచేస్తారు. మీ కింద సిబ్బంది కూడా ఉంటారు. ఇంకొక విశేషమేమిటంటే ఈ ఉద్యోగానికి డిగ్రీ ఉండనవసరం లేదు. చదువు తప్పనిసరి కాదు.
జియోమేటిక్‌ ఇంజనీరింగ్‌ లేదా లాండ్‌ సర్వేయింగ్‌. సర్వసాధారణంగా సర్వేయర్స్‌గా మధ్యవయస్కులు ఉంటారు. కానీ యువత ఈ కెరీర్‌ని చేపడితే పని ఎంతో వేగంగా చేయగలరు. ఒకసారి ప్రొఫెషనల్‌ లైసెన్స్ చేతికి వస్తే చాలు ఆ ఉద్యోగానికి మంచి జీతం వస్తుంది. ఇండస్ట్రియల్‌ డిజైన్ మరో కొత్త కెరీర్‌. ఎక్సైటింగ్‌ కెరీర్‌. ఇది ఫ్యూజన్ ఆర్ట్, ఇంజనీరింగ్‌ల మిశ్రమమని చెప్పొచ్చు. ఉద్యోగం చాలా చాలెంజింగ్‌గా, ఎంతో వైవిధ్యంగా, సృజనాత్మకంగా ఉంటుంది. డిజైనింగ్‌ కనసల్టెన్సీస్‌లో ఉద్యోగ వాతావరణం బాగుంటుంది. ఆర్డినెన్స్ టెక్నీషియన్‌గా కూడా చేయొచ్చు.
ఇందులో సీనియారిటీ పెరిగే కొద్దీ జీతం బాగా పెరుగుతుంది. కోర్టు స్టెనోగ్రాఫర్‌ మూడు సంవత్సరాల కోర్సు. కానీ చాలామంది దీన్ని నాలుగు సంవత్సరాలకు పూర్తిచేస్తుంటారు. గ్రామర్‌పై పట్టు బాగా ఉండి, భాషా పటిమ, వేగంగా రాసే నేర్పు ఉంటే ఈ కెరీర్‌లో ఎంతో సక్సెస్‌ అవుతారు. ఇండిపెండెంట్‌గా వర్కు చేసుకోగలరు. ఇంటి నుంచి కూడా పనిచేయొచ్చు. ఇక జీతమంటారా బాగా ఉంటుంది.
మరో సరికొత్త కెరీర్‌ పేకేజింగ్‌ ఇంజనీరింగ్‌. ఇందులో డిగ్రీని ఆఫర్‌ చేసే ఇనస్టిట్యూషన్లను వేళ్లమీద లెక్కపెట్టొచ్చు. ఈ కోర్సు అంత కష్టంగా ఏమీ ఉండదు. ఒకసారి గ్రాడ్యుయేషన పూర్తి చేసిన తర్వాత ఉద్యోగం అందుబాటులో ఉంటుంది వీళ్లకు. ఆడియోలజిస్టు ఇంకో కెరీర్‌. వీరిని హియరింగ్‌ ఎయిడ్‌ ప్రాక్టీషనర్స్‌ అని కూడా అంటారు. వీరికి బాగా డిమాండ్‌ ఉంది. వృద్ధులతో పాటు ఇటీవల పెరిగిన ఐపాడ్‌ కల్చర్‌, పెద్ద సౌండ్‌తో పాటలు వినడం లాంటివి ఆడియాలజిస్టుల అవసరాన్ని పెంచుతున్నాయి. ఇందులో జీతం బాగా ఇస్తారు. ఉద్యోగ అవకాశాలు కూడా బాగానే ఉన్నాయి. వీరు ఎందరికో ఉపయోగపడతారు.

ఆరోగ్యరంగానికి ఇటీవల కాలంలో అంతర్జాతీయంగా ఎంతో ప్రాధాన్యత పెరుగుతోంది. ఈ రంగంలో హాస్పిటల్‌ టెక్నాలజీ రిపైర్లు చేసే ఉద్యోగులు కూడా ఉంటారు. వీళ్లు మెడికల్‌ ఎక్విప్‌మెంట్‌ రిపైర్‌ కంపెనీలో ఉద్యోగం చేయొచ్చు. హాస్పిటల్స్‌లో కూడా టెక్నీషియనగా సేవలందించవచ్చు. విధుల్లో భాగంగా వీళ్లు వేరే ప్రాంతాలకు, రాషా్ట్రలకు కూడా వెళ్లాల్సివస్తుంటుంది. యువతకు ఎంతో ఉపయోగపడే మరో కెరీర్‌ ఇంటర్నల్‌ ఆడిటింగ్‌. ఈ కెరీర్‌లో పెద్ద పెద్ద కంపెనీలకు పనిచేసే అవకాశాలు వస్తాయి.

ఎన్విరానమెంటల్‌ మేనేజ్‌మెంట్‌ కూడా మంచి కెరీర్‌. ఇందులో జీతం కూడా బాగా ఉంటుంది. అలాగే బయోఇన్ఫర్మేటిక్స్‌ కూడా బాగా డిమాండ్‌ ఉన్న కెరీర్‌. ఫ్యూనరల్‌ డైరక్టర్లు కూడా ఉంటారు. ఇది కూడా బాగా డబ్బు సంపాదించడానికి వీలున్న కెరీర్‌. జియోస్పేషియల్‌ లేదా జియోగ్రాఫిక్‌ ఇన్ఫర్మేషన సిస్టమ్స్‌ కూడా మంచి కెరీర్‌. ఇందులో మ్యాప్‌లను రూపొందించడం, కాలుష్యాన్ని ట్రాక్‌ చేయడం, సివిల్‌ ప్లానింగ్‌, శాటిలైట్‌ ఇమేజరీ ఇంటర్‌ప్రెటేషన్ లాంటివి చేయాల్సి ఉంటుంది. సో...వెరైటీ కెరీర్‌ ఎంచుకోండి నలుగురిలో విభిన్నంగా ఉండండి.

ఆధారము: ఆంధ్రజ్యోతి

2.91089108911
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు