హోమ్ / విద్య / కెరీర్ గైడెన్స్ / భూగ్రహ అధ్యయనము – ఉద్యోగ అవకాశములు- ప్రగతి
పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

భూగ్రహ అధ్యయనము – ఉద్యోగ అవకాశములు- ప్రగతి

భూగ్రహ అధ్యయనము – ఉద్యోగ అవకాశములు- ప్రగతి

భూ శాస్త్రము  ( అర్త్ సైంస్ లేక జియో సైంస్ అని తరచుగా పిలువబడేవి)  భూ గ్రహమును గురించి  అధ్యయనము చేసే శాస్త్రము.  ఈ భూ  శాస్త్రములో  అనేక భాగాలు ఉన్నవి, అవి: భౌగోళిక శాస్త్రము, (జాగ్రఫీ),  భూమిలోని శిలలు వగయిరా అద్యయనము చేసే శాస్త్రము –జియాలజీ,, భూ భౌతిక శాస్త్రము  -జియో ఫిజిక్స్, మట్టి/ భూమి  గురించి అధ్యయనము చేసే శాస్త్రము - సాయిల్ సైంస్ ,  జీవులు పరిసరాలకు మధ్య వుండే సంబంధానికి గురించి అధ్యనముఛేసే శాస్త్రము- ఈకాలజీ , సముద్రాలను గుంచి అధ్యయనముచేసే శాస్త్రము-ఓషనోగ్రఫీ,  భూమిని ఆవరించియున్న వాతావరణమును గురించి  అధ్యయనముచేసేశాస్త్రములు -ఎట్మాస్ఫరిక్ సైంసెస్ , వీటిలో వాతావరణముగురించి ముందు సూచనలు ఇచ్చేశాస్త్రము- మెటీరియలాజీ,  ప్రదేశము/ప్ర్రాంతవాతావరణమునుగురించి అధ్యయనముచేసే శాస్త్రము     - క్లైమేటాలజీ.

ఈ భూ శాస్త్రముతో  సంబంధించిన ఉద్యోగములు బయటప్రదేశములలో (ఫీల్డ్ వర్క్) పని చేసేవిగాను, భూ సమాచారసేకరణ, పరిశోధన, ఉన్నసమాచారమును విశ్లేషణ చేయుట, నమూనాలను తయారుచేయుట మొదలగు పనులతోకూడినదైవుంటుంది.

ఈభూశాస్త్రము  పైన వివరించిన  వేర్వేరు  విభాగాలు , వాట్లలో ప్రత్యేక మైన  అనేక సబ్జక్టులతో,ఉప విభాగాలు,ఉప ప్రత్యేకత కలిగినవి ఒక ప్రత్యేకతపై కేన్ద్రీ క్రుతమైనవి  గావుంటాయి.  అవి ఈ విధముగా  వుంటాయి:

క్లైమేట్ సైంస్ , మెటీరియాలజీ, ఓషన్ సైంస్, మినరాలజీ, అట్మాస్ఫరిక్ సైంస్ , సిస్మొలాజీ, డిజాస్టర్  మెనేజ్మెంట్, జివాలజీ ,  జియో ఫిజిక్స్,  పోలార్ సైంస్, క్రిస్ఫోరిక్ సైంస్ , జిఓ ఇంజనీరింగ్,  పాలిఓ

క్లైమటా లజీ, బయోజియో కెమిస్ట్రీ ,జిఒమొర్ఫాలజీ, జాగ్రఫీ, జిఓమాగ్నటిస్మ్, కెమికల్ ఓషనోగ్రఫీ , అప్లైడ్ జిఒ ఫిజిక్స్, ఓషనోగ్రఫీ, మరీన్ జిఒఫొజిక్స్, జిఓ ఇంఫర్మటిక్స్, రిమోట్ సెంసింగ్, అండ్ జి.ఐ. ఎస్.  జిఓ స్పాషిఅల్ స్టడీస్ , అప్లైడ్ జిఓలజీ,  మరీన్ జిఒలజీ, ఎన్విరోన్మెంటల్ జిఒలజీ,  మౌన్ టెన్ జిఒలజీ,  అర్థ్ అండ్  ప్లానిటరీ సైంస్,  ఆయిల్ అండ్ మైనింగ్,  అప్లైడ్ జిఒ సైంస్,మొదలయినవి.

ఉద్యొగ అవకాశాలు

ఒక వ్రుత్తిగా భూ శాస్త్రముచాలా ముఖ్యమైనది, ఎందుకంటె,ప్రజలు భూ  ఆకారమునుగురించి, దానిలోజరిగే ప్రక్రియలను గురించి తెలిసికొనుటకు ఉత్సుకులై ఉంటారు.

పరంపరాగతముగా  ఈ భూ శాస్త్రము లో, ఉపాధిఅవకాశాలు  విద్యా సంస్తలలోను, ప్రభుత్వరంగములోను, పరిసరాలను గురించి సొధించే కంసల్టెంసీ సర్వీసెస్ లోను, పెట్రోల్ మరియుమైనింగ్ సెక్టర్ లొ ఉంటాయి.  ఈ రంగాలలో ఎక్కువగా  ఉద్యొగులను ఎక్కువ సమయముకొరకు తీసుకొందురు. సరి యైన విద్యా అర్హతలు, సరిఅయిన సబ్జక్టు ఉన్నవారికి ఈ భూ శాస్త్ర పరిధిలొచాలా మంచి ఉద్యొగఅవకాశాలుఉంటవి . భూ శాస్త్రవేత్తలు  భూమిని గురించి అందులోజరిగేప్రక్రియలను గురించి అన్వేషించుతుంటారు.

భూ శాస్త రంగము చాలా విశాలమైనది .   ఉద్యొగఅవకాశాలు అభ్యర్దుల విద్యాఅర్హతలు, వారు తీసుకున్న సబ్జెక్ట్, స్పెషలైజేషన్ల మీదా అధార పడిఉంటుంది.  భూ శాస్త్ర వేత్తలు  వారి ఉద్యోగ అవకాశములు  హైడ్రాలజీ సాయిల్ సైంస్,  మెటీరియాలజీ,  జియాలజీ, తొ సంబంధిత సంస్తలలోను, లేక ఆయిల్ మరియు గాస్ తీసే సంస్తలలో పొందగలుగుతారు.  ప్రభుత్వ రంగము వారు,  ఎన్విరోన్మెంటల్ కంసల్టింగ్  సంస్తలు ఆయిల్ మరియు గాస్ తీసే  సంస్తలు, ఇతర భూశాస్త్ర సంబంధితమైన కంసల్టెంసీ చేసే సంస్తలు  ఈభూ శాస్త్రవేత్తలకు ఉద్యొగ అవకాశాలుకల్పించగలుగుతారు. ఈ భూ శాస్త్రవేత్తల ఉద్యోగములు, హోదాలు  జిఓసైంటిస్ట్,  జివాలజిస్ట్,మెటీరియాలజిస్ట్, జిఓ ఫిజిష్ట్   జిఓ హైడ్రాలజిస్త్ వగయిరాగా ఉంటాయి.  పెద్ద  చదువులు, రీసర్చ్ చేసే వారికి వివిధజాతీయ,అంతర్జాతీయ  సంస్తలలొను,హిమాలయన్ స్టడీస్,  సౌత్ఓషన్ డ్రిల్లింగ్  ప్రోగ్రాములు,  ఆర్కిటిక్ మిషన్ , అంటార్కిటిక్ మిషన్  లాటిచోట,మరియు కామెట్  మిషన్, స్పేస్ ఎక్స్ప్లోరీంగ్,  ప్రోగ్రాములు వగయిరాలలోకూడా అవకాశములురావచ్చు

ముఖ్యమైన కోర్సులు:

భూ శాస్త్రరంగములో వివిధశాఖల అభ్యర్ధులు అవసరమై ఉంటారు.  డిగ్రీ/డిప్లమా కోర్సులుఅనేక  యూనివర్సిటీలు, విద్యాసంస్తలు దేశములోను, విదేశములలోను  నడుపుచున్నారు . ఈరంగములో ఉత్సాహము ఉన్నవారు  ఈభూ శాస్త్రము లొ వారికి తగిన వేరు వేరు  సబ్జక్టులలొ అభ్యసించవచ్చు.  కొన్నిముఖ్యమైనకోర్సులుక్రింద వివరించ బడినవి:

బి ఎస్సి -  జనరల్ సైంస్ లేక బయలాజికల్  సైంసెస్, నాచురల్  సైంస్.

ఎం ఎస్సి – జిఒలజీ,జిఒఫిజిక్స్, లేక జాగ్రఫీ.

ఎం టెక్- రిమోట్ సెంసింగ్ & జిఐ ఎస్ , జిఒ ఇంఫర్మటిక్స్,  మైనింగ్ ఇంజనీరింగ్.

పి జి డిప్లమా‌ ‌‌  - రిమోట్ సెంసింగ్ & జిఐ ఎస్ , జిఒ ఇంఫర్మటిక్స్,  మైనింగ్ ఇంజనీరింగ్.

షార్ట్ టరమ్  కోర్సెస్/పి జి. డిప్లమా

పి ఎచ్ డి- ఇన్ అర్థ్, ఓషన్, లేక ప్లానిటరీ సైంస్,  జిఒ ఫిజిక్స్.

రీ సర్చ్ సెంటర్లు/విద్యా సంస్తలు

ఎవరయినా వారి ఉద్యోగ అవకాశములకొరకు, లేక వారి ముందు చదువులకు, లేక రీసర్చ్  కి వారికి తగిన   అనేక విద్యాసంస్తలు ఉన్నవి.  వాటిలో కొన్ని ముఖ్యమైనవి: :

నేషనల్ సెంటర్  ఫర్ అర్త్ సైంస్  స్టడీస్ , తిరువనంతపురం

నేషనల్ సెంటర్  ఫర్ అంటార్కిటిక్  అండ్ ఓషన్ రీసర్చ్, గోవా

నేషనల్ సెంటర్  ఫర్ సీస్మాలజీ (ఎన్ సి ఎస్) ఎం ఓఇ ఎస్

ఇన్డియన్  నేషనల్ సెంటర్  ఫర్ ఓషన్ ఇంఫర్మేషన్ సర్వీసెస్ ,( ఐ ఎన్ సి ఒ ఐ ఎస్)  హైదరాబాద్

నేషనల్ సెంటర్  ఫర్ మీడియం రేన్జ్  వెదర్ ఫోర్కాస్టింగ్  (ఎన్ సి ఎం ఆర్ డబ్ల్యు ఎఫ్ ) నొయిడా

నేషనల్  ఇంస్టిట్యుట్  ఆఫ్ ఓషన్ టెక్నాలజీ, చెన్నయ్

ఇంటిగ్రేటెడ్  కోస్టల్  అండ్ మరీన్  ఏరియా  మెనేజ్మెంట్ ప్రొజెక్ట్ డైరెక్టరేట్ (ఐ సి ఎం ఎ ఎం  పి డి ), చెన్నయ్

వాడియా ఇంస్టిట్యుట్ ఆఫ్ హిమాలయన్  జియాలజీ ,డెహ్రాడూన్

నేషనల్  సెంటర్ ఫర్  సీస్మాలజీ , నొయ్డా

నేషనల్ ఇంస్టిట్యుట్ ఆఫ్ ఓషనోగ్రఫీ, గోవా

సెంటర్ ఫర్ మరీన్ లివింగ్ రిసోర్సెస్ &ఈకాలజీ  (సి ఎం ఎల్ ఆర్ ఇ ) కొచ్చి

ఇండియా మెటీరియాలజికల్ డిపార్ట్మెంట్, (ఐ ఎం డి) న్యూ డిల్లి

ఇండియన్  ఇంస్టిట్యుట్ ఆఫ్ ట్రాపికల్  మెటీరియాలజి (ఐఐ టిఎం) పుణె

డిపార్ట్మెంట్ ఆఫ్ అర్త్ సైంస్  ఐఐటి,రూర్కీ

సెంటర్ ఫర్ అర్త్ సైంసె స్-  ఇండియన్ ఇంస్టిట్యుట్ ఆఫ్ సైంస్  బంగళూర్

స్కూల్  ఆఫ్ అర్త్ , ఓషన్ అండ్ క్లైమేట్  సైంసెస్, ఐఐటి, భువనేష్వర్

భూ శాస్త్రమును బొధించే  యూనివర్సిటీలు చాలా ఉన్నవి  అందులో కొన్ని క్రింద ఉదహరించబడినవి.

 • యూనివర్సిటీ  ఆఫ్ అలహాబాద్
 • లక్నొ యూనివర్సిటీ
 • యూనివర్సిటీ ఆఫ్ దిల్లి
 • అన్నా యూనివర్సిటీ, చెన్నయ్
 • బనారస్ హిందూ యూనివర్సిటీ
 • ఆలిగడ్ ముస్లిం యూనివర్సిటీ
 • యూనివర్సిటీ ఆఫ్ జమ్మూ
 • యూనివర్సిటీ ఆఫ్ కల్ కత్తా
 • పంజాబ్ యూనివర్సిటీ,  చండీగడ్
 • యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్
 • ది  ఎం ఎస్ యూనివర్సిటీ ఆఫ్ బరోడా
 • సావిత్రీ బాయ్  ఫులే  పుణే యూనివర్సిటీ
 • కురుక్షేత్రా యూనివర్సిటీ
 • గువహటీ యూనివర్సిటీ
 • ప్రెసిడెంసీ యూనివర్సిటీ, కల్ కత్తా
 • కుమావ్ యూనివర్సిటీ నైనితాల్
 • సిక్కిం యూనివర్సిటీ గాంగ్టాక్
 • రాష్ట్రసంత్  తుకాడోజీ మహరాజ్ నాగ్ పూర్ యూనివర్సిటీ, నాగ్ పూర్
 • భారతీ దాసన్ యూనివర్సిటీ తిరుచిరాపల్లి
 • మోహన్ లాల్ సుఖాడియా యూనివర్సిటీ, ఉదయ్ పూర్
 • సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్నాటక
 • యూనివర్సిటీ ఆఫ్ కేరళ, తిరువనంత పురం
 • జాదవ్ పూర్ యూనివర్సిటీ కల్ కత్త
 • అన్నామలై యూనివర్సిటీ, పరంగిపేట్టై
 • ఆంధ్రా యూనివర్సిటీ, విశాఖపట్నం
 • పాండిచెర్రి యూనివర్సిటీ, పోర్ట్ బ్లైర్
 • మరియు ప్రభుత్వ  కళా శాలల యొక్క వివిధ డిపార్టమెంట్లు

అవకాశములు ఉద్యొగ ప్రగతి

భూ శాస్త్రములో డిగ్రీలేక డిప్లమా కోర్సులు పైన చెప్పబడిన యూనివర్సిటీలనుంచి గాని, ఇతర  విద్యా సంస్తలనుంచి కాని పూర్తి చేసుకున్న తరువాత  వారివారివిద్యా అర్హతల ప్రకారము, ఇష్టప్రకారము ,ఈక్రింద వివరించిన, సంస్తలలో  వారు వారికి తగిన   ఉద్యోగ ప్రయత్నములు చేయ వచ్చును.

 

సైంటి ఫిక్ ఆఫీసర్ – సైంటీ ఫిక్ ప్రభుత్వసంస్తలు లేక ఎన్ జి ఓ లు

ఇ సి లేక ఎఫ్ ఎ ఇ   కంసంటెంసీలలో ఇ ఐ ఎ స్తడీల కోసరమని

అసిస్టెంట్ మేనేజర్ – వివిధ  కార్పొరేట్ గ్రూపులలో

జిఆలజిస్ట్-  సెంసిటివ్ ఏరియాలలో, లేక స్పెషల్ రీజన్ లలో

కంసల్టెంట్ – కంసల్టేన్సీలలో , ఎన్ జి ఓ ల లో  లేక అటువంటి  గ్రూపులలో

రైటర్ / ఆధర్ – పుబ్లిషింగ్ హౌస్ లలో లేక ఫ్రీ లాంస్

సైంటిఫిక్ జర్నలిస్ట్ / ఎడిటర్-  వివిధ మాగజీన్ లలో, న్యూస్ లెటర్స్, జర్నల్స్

అసిస్టెంట్ డైరెక్టర్ / డెప్యుటీ డైరెక్టర్ – ప్రభుత్వ సంస్తలు/ మినిస్ట్రీలు

జె ఆర్ ఎఫ్/ఎస్ ఆర్ ఎఫ్/ ఆర్ ఎ /ఎస్ ఆర్ ఎ – ప్రతిష్ట  గల సంస్తలు,ఎన్ ఐ ఐ టిలు/ ఐ ఐ టిలు/ఐ ఐ ఎస్సి లు/ టి ఐ ఎఫ్ ఇ ఆర్ లు వగయిరా

టెక్నికల్ ఆఫీసర్ లేక స్పెషలిస్ట్ – వివిధ  ఏజంసీలలోనూ/ సంస్తలలోను

పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్  ( పి డి ఎఫ్)

మైనింగ్ ఇంజనీర్ – ఆయిల్ ఎక్స్ప్ల్రేరేషన్  సెక్టర్

ఓషనో గ్రాఫర్ -  వివిధ డ్రిల్లింగ్ప్రోగ్రాములకు /మిషన్లు

ఎక్స్పిడైనర్- ఆర్కిటిక్, అంటార్టికా, సదరన్ ఓషన్, హిమాలయన్ స్టడీస్

ఇవికాక అభ్యర్ధులు అనేక పోస్ట్ లు / ఉద్యోగముల కొసరము ప్రయత్నము చేయ వచ్చును.

భూ శాస్త్రము ఉత్సాహ వన్తులైన విద్యార్ధులకు, రీసర్చ్ చేయువారికి  ఒక త్వరిత గతిన పెరుగుతున్న అధ్యయనశాఖ . ఈ శాఖలో విద్యపూర్తి చేసుకున్న తరువాత వారివారివిద్యా అర్హతలను బట్టి దేశములో విదేశములలోను  మంచి ఉద్యోగ అవకాశములు పొందగలుగు

ఆధారం: ఎంప్లోయమేంట్ న్యూస్

3.0462962963
రేటింగ్ చేయుటకు చుపించిన నక్షత్రము పైన క్లిక్ చేయండి
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు