హోమ్ / విద్య / కెరీర్ గైడెన్స్ / మిమ్ములనుమీరు పరిచయము చేసుకునే పద్దతి
పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

మిమ్ములనుమీరు పరిచయము చేసుకునే పద్దతి

మిమ్ములనుమీరు పరిచయము చేసుకునే పద్దతి

మీ ఉద్యోగ దరఖాస్తు (కరికులం వైట్ –CV) మిమ్మల్ని  మీ పనిచేసే సామర్ధ్యతను , ఉద్యోగము పట్ల మీయొక్క ద్రుక్కోణాన్ని  తెలియచేసే ఒక అస్త్రము. దాన్ని మీ ఎంప్లాయర్  ఒక పావు నిముషము చూస్తాడు . అంత తక్కువ సమయములో  మీగురించి వివరాలు అతనికి అందాలి.  మీ CV  ద్వార్రా  మిమ్మల్ని మీరు మార్కెటింగ్  చేసుకో బోతున్నారు.  కనుకనే CV ని   చాలా జాగ్రత్తగా అన్నిరూపురేఖలతో తయారుచేయవలసిన అవసరము ఎంతైనా వుంది.  ఎందరో ఉద్యోగాభిలాషుల ఆశలు CV స్తాయిలోనే అంతరించిపోతూ వుంటాయి. దీనికి  ముఖ్య కారణాలు రెండు.

 1. మీరు చేరాలను కున్న ఉద్యోగానికి మీరు పొందిన తర్ఫీదుకు సంబంధంలేకపోయి వుండవచ్చు.
 2. మీరు మిమ్మల్ని మీ CV లో  సరిగ్గా ప్రదర్సింప లేక పొవటము.

పై కారణాల వల్ల మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసే అధికారి  మీకు  దరఖాస్తుచేసుకున్న ఉద్యోగానికి   తగిన అర్హతలుకలిగిలేరన్న అభిప్రాయము తో CV స్తాయి లోనే మిమ్మల్నినిరాకరించే అవకాశాలున్నాయి. ఇటువంటిపరిస్తితులు రాకుండావుండటానికి మీరు మీ CV ని ఎంతో శ్రద్దతో రూపకల్పన కలిగించవలసి వుంటుంది.మీకువున్న పరిగ్నానము, అభిరుచులు, వ్యక్తిత్వము, మీఆశయాలు మొదలైనవిఎంతొ బాగా  హైలైట్ చేయబడాలి.

ప్రతిమంచి CV లోను వుండవలసిన   నాలుగు (4) ముఖ్యాంశాలు.

 • పేరు, చదువు, లింగము,అనుభవము, అభిరుచులు,  వివిధ భాషలతోపరిచయము, వయసు,  చిరునామా, మొదలగునవి.
 • .పరి గ్నానము :   మీకు మాత్రమే చెందిన  ప్రత్యేకతలు మీరుఏరంగములో ప్రవీణులో  ఆవివరములు ప్రత్యేకముగా పొందుపరచవలసి వుంటుంది.
 • నైపుణ్యత: ఏ ఉద్యోగానికయినా  దానికి సంబంధించిన నైపుణ్యత, విద్యార్హత,  మొదలైనవి వుంటాయి. నిజానికి అవి ప్రతి ఉద్యోగానికి వేర్వేరుగా వుంటాయి. కాని,అన్ని ఉద్యోగాలకు  కావలసి న సాఫ్ట్ స్కిల్లులు  , కమ్యూ నికేషన్  స్కిల్లులు, టైం మానేజ్మెంట్  నలుగురిలో కలసి పనిచేసే మెళకువ,  (Team Work)  సమశ్యలను నైపుణ్యత తో   పరిష్కరించే శక్తి మొదలైనవి.
 • ప్రవర్తన: ఏ మనిషి  కైనా  తనదైన ప్రవర్తనవుంటుంది.కానీ సాధారణముగా ఉద్యోగముఇచ్చే వాళ్ళు తమ ఉద్యోగస్తుల దగ్గర నుంచి ఆశించే ప్రవర్తన ,ఎనలైటికల్ స్కిల్స్,  సమర్ధత,  నిర్ణయం తీసుకోగల సత్తా  నిజాయతీమొదలైనవి.ఈ విషయాలన్నీ ద్రుష్టీ లో వుంచుకుని, మీ CV ని తయారుచేయాలి. అది మిమ్మల్ని అద్దంలో చూపించేలా వుండాలి. అటువంటి CV లో  ఈక్రింద పొందు పరచిన సంగతులు తప్పకుండా వుండే లా చూసుకోన్డి.

వ్యక్తిగత వివరాలు: పేరు, చిరునామా, టెలిఫొన్ నంబరు, e mail id,  మొదలైనవి.

విద్య అర్హతలు : స్కూలు, కాలేజీ,యూనివర్సిటీలవివరాలు, పొందిన మార్కులు, విభాగము,  సంవత్సరాలతో సహా తెలియపరచవలెను. విద్యార్ధి దశలో పాల్గొన్నకార్యక్రమములు, ప్రాజెక్టులు, పొందిన బహుమతులు మొదలైనవి రాయటము మరవద్దు.

పూ ర్వ అనుభవము (ఏదైనాఉంటె): ఇంతకు ముందు పనిచేసినస్తలాలు, నిర్వర్తించిన ఉద్యోగ విధులు, వాటి తేదీలతోసహా పొందుపరచండి.  పొందిన ప్రొమోషన్లు, సత్కారాలు,  కూడా రాయటము మరవకండి.

భాషా పరిచయం: ఏ ఏ భాషలు తెలుసో  వ్రాయటము, చదవటము, వచ్చో ఆ వివరాలు తెలియపరచండి.

పరిచయాలు:సమాజములో  కాస్తపేరున్న వ్యక్తుల రిఫరెంసులు  ఏదైనాఉంటె  అది కూడా వ్రాయండి. ఊద్యోగము ఇచ్చె ముందుఉపయోగ పడుతుంది

అభిరుచులు: మీ CV లో చివరిగా మీ మీ అభిరుచులు, హాబీలు రాస్తేబాగుంటుంది.

ఒక CV రాసే టప్పుదు (గుర్తుంచుకోవలసిన ) చేయతగిన చేయ తగని పనులు:

 1. సంక్షేపముగా, సమగ్రముగా: CV పెద్దదిగా, పుస్తుకము లాగా  వుండకూడదు.  అంటే కేస్ స్టడీ కధలు గాధలతో నింపకండి. సంక్షిప్తముగా 2 లేక3 పేజీలలో పూర్తి చేయండి.
 2. మార్పులు, చేర్పులు: అప్ల్యిచేస్తున్నఉద్యోగానికి తగునట్లుగా  మీ CV ని మారుస్తూ వుండండి.  ప్రతీ సారీ మీరుచేరబోతున్న కంపనీ కి ,ఉద్యోగానికి సంబంధించిన  అన్నివివరాలు సేకరించి దానికి తగ్గట్టు గా  CV ని మార్చండి.
 3. క్లుప్తత: మీ CV లో పొందుపరచిన  విషయాలు  క్లుప్తముగా, సూటీగా  వుండెటట్లు  చూసుకోవాలి.,
 4. తప్పుడు సమాచారము: ఎ ప్పుడూ తప్పుడు సమాచారము CV లొ పొందు పరచకండి.   ఇంటర్వ్యూ  సమయములో కానీ  వెరిఫికేషన్ స్తాయిలో కాని మీరు తప్పుడు ,లేక  అసత్యసమాచారము ఇచ్చినట్లుతేలితే  దానిపరిణామాలు దారుణముగావుంటాయి.
 5. విషయాల అమరిక: మీ CV లో విషయాలు చూడగానే అర్ధ మయ్యే టట్లూ గా  వుండాలి. సమాచారమంతా ఒకే చోట గుప్పించినదిగావుండకూడదు. పెద్దపెద్ద పేరా గ్రాఫులు, కాకుండా చిన్న చిన్న  పాయింట్ల లాగా వుండే విషయము  తొందరగా ద్రుష్టి లో పడుతుంది.
 6. అక్షరాల  సైజు:  CV అంతా ఒకేవిధముగా వుండెటట్లు చూడండి.లెటర్స్  ఇటాలియన్, బోల్డ్  వంటివి అవసరమయినచోటవాడి మీరు ముఖ్యమనుకున్న విషయాలను ఎదుటి వాళ్ళ ద్రుష్టికి వచ్చే టట్లు  చూడండి.
 7. కవరింగ్ లెటర్ : కవరింగ్ లెటర్ పొందుపరచటము  మరువకండి.
 8. పరిచయ పత్రిక: మీగురించి అవతల వ్యక్తికి  సమాచారము అందచేసే  ఒక పరిచయ పత్రిక  లాంటిది  మీ CV ఇంటర్వ్యూ  స్తాయి లో మీగురించి పూర్తిగా తెలియపరచగలుగుతారు.

పై పాయింట్లను ద్రుష్టి లో వుంచుకుని  మీరు మీ CV ని  తయారుచేస్తే  ఇంటర్వ్యూ చేసేవారికి, అది చదివిన కొద్ది సేపట్లో  మీరు సదరు ఉద్యోగానికి తగిన వ్యక్తి అనే భావన కలుగుతుంది.

ఆధారం : సముద్రాల అనురాధ , అడ్వకేట్ ద్వారా తయారు

3.0
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు