Accessibility options
Accessibility options
Government of India
Contributor : Telugu Vikaspedia28/05/2020
Skip the lengthy reading. Click on 'Summarize Content' for a brief summary powered by Vikas AI.
“యుజ్” అనే సంస్క్రుత పదము నుండి పొందబడిన యోగ వ్యక్తియొక్క స్మ్రుతి / జాఇ+నము , లేదా ఆత్మను పరమాత్మత తో కలిపే ఒక పురాతనమైన శాస్త్రము. ఒక వేళ మీరు మత పరమైన భావనతోలేక పోయినా, యోగ మీయొక్క శరీరానికి మనస్సుకు అనేక విధములైన/ అపారమైన లాభాలను కలిగిస్తుంది. ఒక అనుభవజుఇ+ డయిన యోగ గురువు శిక్షణలో ప్రజలు వారియొక్కశరీరాలను వివిధ భంగిమలలో తిప్పుతూ, వంచుతూ, అనేక రకములుగ శ్వాస పీల్చుతూ, అనేక క్లిష్టమైన భంగిమలు చేస్తూ వారువారి యొక్క శరీరము, మనసు,ఆత్మ యొక్క పూర్తి శక్తిని గ్రహించుకో గలుగుతారు.
యోగ లో చాలా విధములు వున్నవి. వాటిలో:
కాని ప్రస్తుత సమయములో’ “యోగ “ గురించి మాత్లాడితే అవి ముఖ్యముగా ఆసనములు/ శారీరిక అభ్యాసము, పలు విధములైన శ్వాస పీల్చుకొని విడుచు విధానములు, ఆధ్యాత్మికఆచరణలు, ఇవికాక సంభందిత వేరువేరు శాఖలు.
ప్రస్తుత రోజులలో మనుషులు సమయములేకుండా అస్తవ్యస్తముగా,విశ్రాంతిలేకుండా వున్నపరిస్తితులలో, యోగ వారిని తిరిగి వారు నిత్య జీవితములోసరిగా వుండే టట్లుగా చేయగల శక్తిగా పాపులర్ అయ్యింది. యోగ అనేక శారీరిక మానశిక లాభాలను అందచేస్తుంది.
యోగాలో చాలా పాపులర్ అయిన శాఖలు: హట యోగ, క్రియా యోగ, బిక్రమ యోగ మొదలైనవి.
యోగ యొక్క లాభములు చలా స్తాయిలలో వున్నాయి. ముందుగా యోగ మీ అంతరాత్మను జాగ్రుత పరచి మీ శారీరిక బలమును, మనో బలమును పెంచుటకు సహాయ పడుతుంది. శ్వాస తీసుకుని విడిచే సాధన తోను, శారీరిక సాధన / ఆసనములతో, మీరు మీధ్యానమును ఆ సమయములో మీయొక్క శారీరిక శక్తి మీద కేన్ద్రీకరించుతారు. ఎవరై తే యొగ ను అధ్యయనము చేస్తారో వారుయొగ చేయని వారికంటె, వారిశరీరమునుగురించి తెలుసుకున్న వారు గాను, సంత్రుప్తి చెందిన వారు గాను అయి వుంటారు. అట్లాటి వారు వారి శరీరమును గురించిబాగా తెలుసుకొన్నవారై, సంత్రుప్తి చెంది, తక్కువ విమర్సనాత్మకమైన వారయి వుంటారు.
యోగ చేయుట వలన ఆ సాధకులు వారు చేసే ప్రతి పనిలోను చాలా జాగరూకులై వుంటారని, భోజనము తీసుకోవటమూ తోసహా, అని పరిసోధన చేసిన వారు తెలుసుకున్నారు. వారు అందులోపాల్గొన్న వారి కొరకు ఒక ప్రశ్నావళిని వారి భోజన అలవాట్లను తెలుసుకొనుటకు తయారుచేశారు. దానిలో :
తినేభోజనము ఎట్లా, ఏ రుచిగా, ఏ విధమైనవాసనతో వుంటుంది
నిండుగా వున్నప్పుడు తినుట
వాతావరణ మార్పులతో కూడిన వాసనలతొ, మొదలయిన పరిస్తితులలో తినుట
ఇతర విషయములలో ధ్యానము మళ్ళించినసమయములోతినుట
చాలా దుఖములో, క్లిష్టపరిస్తితులలో తినుట.
పై విషయముల అధ్యనము ప్రకారము, ఎవరయితే యోగ సాధన చేస్తారో వారు వారిభోజనము గురించి చాలా జాగురూకులై వుంటారు. సంవత్సరముల యోగ సాధన, వారములో ఎన్ని నిముషములు సాధన చేసేది, మొదలయినవి వారి జాగురూకతకు సూటిగా దోహద పడతాయని తెలుస్తున్నది..
ఒక శాస్త్ర్రీయ అధ్యనము ప్రకారము ఎవరయితే యోగ సాధన కనీసము వారములొ 30 నిముషములు కనీసము నాలుగు సంవత్సరములు చెస్తారో అటువంటి వారు వారిమధ్య మవయసులో తక్కువ బరువుకలిగిన వారై వుంటారు. మరియు ఎవరయితే ఎక్కువ బరువువున్నారో వారు యోగ సాధనవల్ల బరువుతగ్గించుకోగలిగినవారయితారు. .
యోగ మన టెంషన్లను,ఏన్గ్జైటీలను శాంత పరచి మన సాధన శక్తిని పెంచుతుంది. ఒకే చోట కూర్చుని పనిచేసే కొంతమంది మీద చేసిన అధ్యయనము ప్రకారము వారానికి180 నిముషములు 8 వారములు యోగ సాధన చేస్తే,వారిలో కండర బలము, ఫ్లెక్జిబిలిటీ, సహన బలము, హ్రుదయ ఉచ్వాశ,నిశ్వాసముల ఫిట్నెస్ చాలా పెరిగాయని తెలిసినది.
యోగ సాధన వలన హ్రిదయ సంబంధిత బాధలు తగ్గుతాయని, రక్తపోటులో ని అవకతవకలు సరి అయితాయని చాలా అధ్యనముల వలన నిశ్చయమైనది. యోగ సాధకులయొక్క లిపిడ్ ప్రొఫైల్ ను పెంచి వారియొక్క బ్లడ్ షుగర్ లెవెల్ ను తగ్గిస్తుంది( ఇంసులిన్ తీసుకునే వారు కానివారిలో). సహజముగానే చాలా దేశములలో హ్రిదయ సంభంధిత రోగులను మంచి స్తితికి తెచ్చే ప్రోగ్రాములో యోగ ఒక భాగమైనది.
డిప్రషన్ , ఆర్ధరైటస్ లాటిరోగములను సరిచేయుటలొ, మరియు క్రానిక్ కేన్సర్ రోగులు బతికే పరిస్తితులు పెంచుటలో, యోగ చాలా సహాయ పడుతుందని కనుగొనట మైనది.
మీరు మీ 12 వ క్లాసు చదువుతో యోగా ఇన్స్ట్రక్టర్ గా అవచ్చు . కానీ యోగాలో డిప్లమా లేదా డిగ్రీ వుంటే మీకు చాలా ఉద్యోగ అవకాశములు దొరుకుతాయి.మీ ఉన్నత విద్య పూర్తి చేసుకున్నతరువాత మీ అవకాశముల కొరకు పాఠశాలలకు, హాస్పటళ్ళకు , ప్రభుత్వ కేన్ద్రాలకు దరఖాస్తు చేసుకొనుటకు అర్హులవుతారు.
భారత దేశములో చాలా పబ్లిక్,ప్రైవేటు కాలేజీలు ,విద్యా సంస్థలు ,మరియు యూనివర్సిటీలు అన్ని స్తాయిలలో యోగ కోర్సులు అందిస్తున్నాయి. – బి ఎ,/ బి ఎస్ సి,/ ఎం ఎ,/ ఎం ఎస్ సి, ఎం ఫిల్, మరియు పి ఎచ్ డి.
మీరు బి ఎ లేదా బి ఎస్ సి యోగ థెరపి ప్రోగ్రాం లో చేరటానికి మీరు కనీసము 17సంవత్సరముల వయస్సు కలవారై వుండాలి. మరియు మీ 12 వ క్లాసు ఫిజిక్స్ , కెమిస్ట్రీ , బయాలజీ సబ్జక్టులతో కనీసము50% ఏగ్రిగేట్ మార్కులతో పాసయివుండాలి. ఎం ఎస్ సి లేదా ఎం ఎ ఈ ఫీల్డ్ కోర్సులలోచేరటానికి మీరు మొదత ఈ ఫీల్డ్ లో బి ఎస్ సి లేదా బి ఎ డిగ్రీలు పూర్తి చేసిన వారై వుండాలి.
చాలా మంది సాంకేతిక నైపుణ్యులు, మంచి వ్రుత్తి లో వున్నవారు, వారి ఉన్నత ఉద్యోగ అవకాశములను కూడా వదులుకొని యోగా ట్రైనర్లు అవుతున్నారని మనము తరచుగా వింటూఉంటాము. మరి కొంత మంది వారి ముఖ్య ఉద్యోగములో కొనసాగుతూనే పార్ట్ టైం యోగా ట్రైనర్లుగా వుండటానికి ఎన్నుకుంటారు ఎందుకంటే, యోగావల్ల వారు ఆరోగ్యముగా ఉంటూ, వారియొక్క పరిజాఇ+నముతో ను, అనుభవముతోను ఇతరులకు మంచిచేయాలనే ఉద్దేశ్యముతో. ఉదాహరణకు: భరత్ కుమార్ యొక్క యోగా ట్రైనింగ్ ప్రోగ్రాం లో చాలామంది యోగా ట్రైనర్లు ఇదివరలో న్యాయవాదులు, మెకానికల్, టెల్కం ఇంజనీర్లు , వ్రుత్తిపరమైన న్రుత్యకారులు,వ్యాపార వేత్తలు ఉన్నారు.శ్రీశ్రీ రవిశంకర్ గారిఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫెసిలిటీస్ లో మీరు చాలా మంది పార్ట్ టైం యోగా ట్రైనర్లను చూస్తారు వారు ఉదయము సాయంత్రము మాత్రమే క్లాసులు తీసుకోవటానికి ఆప్ట్ చేస్తారు.
మీనక్షి అధికారి అనే ఒక టి వి జర్నలిస్ట్ యోగా ని గురించి ఈ విధముగా ప్రస్తావించినది-“ముందు రోజుల్లో ఇది ఆరోగ్యరక్షణకు ముఖ్యమైనది.”
యోగా సైంస్ అనేక ఉద్యోగ, రీసర్చ్, ట్రైనింగ్, మరియు పని అవకాశాలకు దారి కల్పిస్తుంది. వీటిలోకొన్ని:
అసిస్టెంట్ ఆయుర్వేదిక్ డాక్టర్,
క్లినికల్ సైకాలజిస్ట్,
రీసర్చ్ ఆఫీసర్- యోగ మరియు నాచురోపతి.
థెరపిస్ట్ మరియు నాచురోపత్స్ .
ట్రైనర్/ ఇంస్ట్రక్టర్ హెల్త్ క్లబ్.
యోగ ఎరబిక్ ఇంస్ట్రక్టర్.
యోగ ఇంస్ట్రక్టర్ లేక టీచర్
యోగ థెరపిస్ట్.
జిమ్లు , పాఠ శాలలు, పెద్ద సంస్తలు, ఆరోగ్య కేమ్ద్రాలు, హౌసింగ్ సొసైటీలు, యోగా ట్రైనర్లను , థెరపిస్ట్ లను తరచుగా వారి యోగా థెరపీ కి, యొగా ట్రైనింగ్ కోసరమని ఉపయొగించుకుంటూ ఉంటారు. హాస్పటళ్ళు , హెల్త్ రిసార్ట్ లు మరియు యోగా సెంటర్లు యోగాలో అనుభవముఉన్న, ట్రైనింగ్ అయిన వారిని బోధనకొరకు, రీసర్చ్ కొఅకు, మేనేజ్ మెంట్ కోసరమని, పరిపాలనా అవసరాలకు కూడా వినియోగించుకుంటారు. భారత దేశములో చాలా విదేశీ రాయబార బ్రుందాలు, దౌత్య కార్యాలయాలు యోగ ఇంస్ట్రక్టర్లను మంచి జీతముల మీద ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. ఎప్పటినుంచి అయితే ఐక్యరాజ్య సమితి జూన్ 21 వ తారీకును యోగాదినముగా ప్రకటించినదో , అప్పటి నుంచి యోగా టీచర్లకు, యోగా ఇంస్ట్రక్ట ర్లకు ఉద్యోగ అవకాశములు అకస్మాత్తుగా అన్నిసమయాలకన్నా ఎక్కువ అయినవి.
ఈ మధ్యనే ప్రభుత్వము పాఠశాలలో యోగా ఇంస్ట్రక్టర్లను తప్పకుండా తీసుకొనవలెనని ఆదేశాలను జారీ చేసినది. ఇదికాక ప్రభుత్వము యోగాని అభివ్రుధ్ధి పరచే ఉద్దేశ్యముతోను, యోగా రంగములో అవకాశములను అభివ్రుధ్ధి చేసేన్దుకు రీసర్చ్ సెంటర్లను,సంస్తలను,ఒక కౌంసిలును స్తాపించినది.
కొంతమంది సెలబ్రటీలు, కీర్తి మంతులు వారి శిక్షణ కొరకు పర్సనల్ ట్రైనర్ లలా మీ సేవలనువారువాడుకోవచ్చు. లేదా, టెలివిజన్చానళ్ళు తమ దర్శకుల కోసరమని వారి చానళ్ళలో యోగ ప్రోగ్రాములుప్రారంభింపవచ్చు.
స్వయం ఉపాధి(సెల్ఫ్ఎంప్లాయిమెంట్ ) యోగ రంగములో ఒక పెద్ద అవకాశమై ఉన్నది. విదేసీయాత్రికులు తరచుగా భారత దేశానికి శాంతిగాగడిపి వేళ్ళాలని, యోగ స్పెషలిస్త్ ల కోసరమని వస్తారు. యోగ థెరపి ఒక ప్రత్యేకమయిన జబ్బుల కొరకు, ప్రత్యేకముగా జీవన విధానముల జబ్బులకు చాలా డిమాండ్ లో వున్నది. ముఖ్యముగ గమనించవలసినది ప్రపంచములో అన్ని దేశాలు యోగ దినాన్ని పాటిస్తున్నారు, మరియు ఐక్యరాజ్య సమితి 21 జూన్ ను యోగ దినముగా పాటించటానికి చేసిన రెజల్యూశన్ ను 177 దేశాలు కో స్పాంసర్ చేశాయి. దీని వలన మీరు విదేశాలలో కూడా మంచి ఊద్యొగ అవకాశములు పొందవచ్చు. కాని మీకు లాభదాయకమైన ఊద్యోగఅవకాశము వస్తే మీరు ఆ అవకాశమును ఉపయోగించుకునేముందు అది సరి అయినదా కాదా అని నిర్ధారణచేసుకొనండి.
యోగ మీకు డబ్బును ఒక చిన్న భాగముగానేఅందిస్తుంది.చాలామంది యోగ లైన్ లోకి యోగ వారిని ఆరోగ్యముగా వుంచుతుందని, మనశ్శాంతిని అందచేస్తుందని వస్తారు. ఇది ఏ ఉపాధిలోనయినా అరుదుగా దొరికేఅవకాశము. కొత్తగా యోగ లో ట్రైనింగ్ అయిన వారు నెలకు 10,000/- నుంచి15000/- రూపాయలవరకు ఆర్జించవచ్చు. ఎం ఎ లేక పి ఎచ్ డి డిగ్రీ పొందిన వారు మంచి పే స్కేళ్ళతో ప్రభుత్వ ఉద్యొగములు పొందవచ్చు. మీ ఆదాయము మీ యొక్క ఎక్స్పీరియంస్ తొ పెరుగుతుంది. అది ముఖ్యముగామీ కమ్మమ్యూనికేషన్ స్కిల్ మీద మీ సోషల్ నెట్ వర్కింగ్ మీద ఆధారపడిఉంటుంది. ప్రైవేటు సెక్టర్లో ఉద్యోగాలు చాలా స్ట్రెస్ తో కూడినవిఅయి వుంటాయి,అటువంటి సంస్తలు వారి ఉద్యోగస్తులకు వర్క్ షాప్ లను అనుభవమున్న యోగ ప్రొఫెషనల్ ద్వారా జరిపించటానికి నెలకు ఒక లక్ష రూపాయల వరకు ఇవ్వవచ్చు..
ఆధారం: పత్రికా సమాచార కార్యాలయం, రచయించినది: డాక్టర్ పూర్విప్రకాష్.
ఈ విభాగం లో 10వ తరగతి పూర్తిచేసిన వారికీ జాబు లో చేరుటకు గైడెన్స్ ఇవ్వబడినది
ప్రతి మానవుడు తనంతట తాను మంచి జీవితాన్ని అనుభవించడానికి అవకాశాలు ఉండాలి. దురదృష్టవశాత్తు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చాలామంది పిల్లలకు ఈ అవకాశం లేకుండానే వయోజనులైపోతున్నారు. దీనికి కారణం ప్రాథమిక పాఠశాల దరిదాపులకు వెళ్ళే మౌలికమైన హక్కులకు దూరమవ్వడమనే చెప్పాలి.
ఈ అంశం వ్యవసాయ విద్య గురించి సమాచారాన్ని అందిస్తుంది.
ప్రపంచంలోనే అత్యధిక మందికి ఉపాధి కల్పిస్తున్న మూడో అతిపెద్ద వ్యవస్థ. ఇటువంటి రైల్వే శాఖలో ఇంజనీర్‌గా కెరీర్‌ను ప్రారంభించే అవకాశం మన ముంగిట నిలిచింది.
వాణిజ్య విద్య
ఫ్యాషన్ ప్రపంచంలోకి నిఫ్ట్ స్వాగతం!
Contributor : Telugu Vikaspedia28/05/2020
Skip the lengthy reading. Click on 'Summarize Content' for a brief summary powered by Vikas AI.
93
ఈ విభాగం లో 10వ తరగతి పూర్తిచేసిన వారికీ జాబు లో చేరుటకు గైడెన్స్ ఇవ్వబడినది
ప్రతి మానవుడు తనంతట తాను మంచి జీవితాన్ని అనుభవించడానికి అవకాశాలు ఉండాలి. దురదృష్టవశాత్తు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చాలామంది పిల్లలకు ఈ అవకాశం లేకుండానే వయోజనులైపోతున్నారు. దీనికి కారణం ప్రాథమిక పాఠశాల దరిదాపులకు వెళ్ళే మౌలికమైన హక్కులకు దూరమవ్వడమనే చెప్పాలి.
ఈ అంశం వ్యవసాయ విద్య గురించి సమాచారాన్ని అందిస్తుంది.
ప్రపంచంలోనే అత్యధిక మందికి ఉపాధి కల్పిస్తున్న మూడో అతిపెద్ద వ్యవస్థ. ఇటువంటి రైల్వే శాఖలో ఇంజనీర్‌గా కెరీర్‌ను ప్రారంభించే అవకాశం మన ముంగిట నిలిచింది.
వాణిజ్య విద్య
ఫ్యాషన్ ప్రపంచంలోకి నిఫ్ట్ స్వాగతం!