హోమ్ / విద్య / కెరీర్ గైడెన్స్ / ర‌త్నంలాంటి కెరీర్ .. జెమాల‌జిస్ట్
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

ర‌త్నంలాంటి కెరీర్ .. జెమాల‌జిస్ట్

రత్నాల వినియోగం ఈ ఆధునిక యుగంలోనూ విపరీతంగా పెరుగుతోంది..ఈ నేపథ్యంలో రత్నాల పరిశ్రమ శరవేగంగా విస్తరిస్తూ..ఉద్యోగార్థులకు మంచి కెరీర్‌గా మారుతోంది

రత్నాలు భారతీయ సంస్కృతిలో ఒక భాగం.. ప్రాచీన కాలం నుంచి వజ్రాలు, కెంపులు, పచ్చలు వంటి వాటిని జ్యోతిశ్శాస్త్ర ప్రాధాన్యత మేరకు ధరించడం ఆనవాయితీగా వస్తోంది.. అంతేకాకుండా రత్నాలను శక్తికి, శ్రేయస్సుకు ప్రతీకగా భారతీయులు పరిగణిస్తారు..దీంతో రత్నాల వినియోగం ఈ ఆధునిక యుగంలోనూ విపరీతంగా పెరుగుతోంది..ఈ నేపథ్యంలో రత్నాల పరిశ్రమ శరవేగంగా విస్తరిస్తూ..ఉద్యోగార్థులకు మంచి కెరీర్‌గా మారుతోంది.. రత్నాలు లేదా విలువైన లోహాలను అధ్యయనం చేయడాన్ని జెమాలజీ అంటారు. ఇది జియోసైన్స్‌లోని ఒక విభాగం. కొనుగోళ్లు, గ్రేడింగ్, మూల్యాంకనం, ప్రాసెస్ వంటి విధానాలు రత్నాల పరిశ్రమలో కీలక అంశాలు. పెరుగుతున్న డిమాండ్, అవసరాల మేరకు సంబంధిత విధులు నిర్వహించే మానవ వనరులు కావాలి. ఇటువంటి విధులను నిర్వర్తించే వారిని జెమాలజిస్ట్‌లు అంటారు.

విధులు

జెమాలజిస్ట్‌లు రత్నాల నాణ్యత, వాటిలో ఏవైనా నష్టపరిచే అంశాలు ఉన్నాయా అనే విషయాలను పరిశీలిస్తారు. ఒక రత్నం లేదా ముక్కలుగా చేసిన రత్నాన్ని ఆభరణాల తయారీలో ఉపయోగిస్తారు. వీటిని నాణ్యమైన లోహాల నుంచి సేకరిస్తారు. మరికొన్ని రకాల రాళ్లు, అంబర్/జెట్ వంటి సేంద్రియ లోహాలను కూడా నగలను రూపొందించడంలో వినియోగిస్తారు.

పెరిగిన అవకాశాలు

నగలు, రాళ్లతో చేసిన ఆభరణాలకు డిమాండ్ పెరిగింది. దీంతో జెమాలజిస్ట్‌ల అవసరం కూడా అధికమైంది. సంప్రదాయ నగలకు తోడు బ్రాండెడ్ జ్యూయలరీ ప్రవేశంతో వీరికి అవకాశాలు మరింత పెరిగాయి. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎగుమతుల్లో 70 శాతం భారత్ నుంచే ఉంటున్నాయి. భారత్‌కు చెందిన జెమ్ కట్టర్స్, క్రాఫ్ట్‌మ్యాన్స్‌కు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. దీన్నిబట్టి జెమాలజిస్ట్‌లకు ఉన్న డిమాండ్ అర్థం చేసుకోవచ్చు.

అవకాశాలకు వేదికలు

మైనింగ్ పరిశ్రమ, జ్యూయలరీ మేకింగ్, డిజైనింగ్ యూనిట్స్, జ్యూయలరీ షాప్స్, షోరూమ్స్, జెమ్ ఎక్స్‌పోర్టింగ్ ఆర్గనైజేషన్స్, జెమ్ కటింగ్, పాలిషింగ్ పరికరాల తయారీ యూని ట్లు, జెమ్ టెస్టింగ్ లేబొరేటరీలు, ఆక్షన్ హౌసె స్, జెమ్‌స్టోన్ గ్రేడింగ్, క్వాలిటీ సర్టిఫైయింగ్ ఏజెన్సీస్‌లో ఉపాధి పొందొచ్చు.

వేతనాలు

పొందిన శిక్షణ, చేస్తున్న పనిని బట్టి వేతనం ఉంటుంది. జెమాలజిస్ట్‌గా ప్రాథమిక శిక్షణను తీసుకుంటున్న వారికి నెలకు రూ.10 వేల -20 వేల వరకు చెల్లిస్తారు. ఆ తర్వాత నెలకు రూ. 30 వేల వరకు సంపాదించవచ్చు. సొంతంగా కూడా ప్రాక్టీస్ చేయవచ్చు. రిటైల్ అవుట్‌లెట్ ఏర్పాటు చేస్తే ద్వారా నెలకు ఆరంకెల ఆదాయాన్ని కూడా పొందొచ్చు.

ప్రవేశం ఇలా

సంబంధిత రంగంలో డిగ్రీ పూర్తి చేయడం ద్వారా జెమాలజిస్ట్‌గా స్థిరపడొచ్చు. దేశంలోని చాలా సంస్థలు గ్రాడ్యుయేట్ జెమాలజిస్ట్ డిగ్రీని అందిస్తున్నాయి. దీనికి అర్హత గ్రాడ్యుయేషన్. ప్రాక్టికల్స్, థియరీ కలయికగా ఉండే ఈ కోర్సును పూర్తి చేస్తేనే గ్రాడ్యుయేట్ జెమాలజిస్ట్ క్రెడెన్షియల్స్ లభిస్తాయి. ఆరు నెలల వ్యవధితో ఉండే ఈ కోర్సు ఫీజు ప్రైవేట్ ఇన్‌స్టిట్యూట్‌లలో రూ. లక్ష, ప్రభుత్వ ఇన్‌స్టిట్యూట్‌లలో రూ. 50 వేలు. విదేశాల్లోనైతే రూ.4-8 లక్షల వరకు ఉంటుంది.

నైపుణ్యాలు

రాళ్లు, లోహాలు వంటి విషయాల్లో ఆసక్తి ఉండాలి. రాళ్లతోపాటు వాటిని గుర్తించే, మూల్యాంకనం చేసే ప్రక్రియలో ఉపయోగించే పరికరాలపై అవగాహన అవసరం. వినియోగదారులతో వ్యవహారం కాబట్టి చక్కని కమ్యూనికేషన్ స్కిల్స్, నిజాయితీ ఉండాలి. డిజైన్, నాణ్యత అంశాల పట్ల జ్ఞానాన్ని కలిగి ఉండాలి. సునిశిత పరిశీలన, చొరవ, ఏకాగ్రత, సృజనాత్మకత, బాధ్యతాయుతంగా వ్యవహరించగలగడం వంటి లక్షణాలు ఉండాలి.

కోర్సులు, సంస్థలు

జెమాలాజికల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా-ముంబై
వెబ్‌సైట్: http://giionline.com/
సెయింట్ జేవియర్స్-ముంబై
వెబ్‌సైట్: http://xaviers.edu/
ఇంటర్నేషనల్ జెమాలాజికల్ ఇన్‌స్టిట్యూట్-న్యూఢిల్లీ
వెబ్‌సైట్: www.igiworldwide.com
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ-న్యూఢిల్లీ
వెబ్‌సైట్: www.nift.ac.in/delhi

విదేశీ ఇన్‌స్టిట్యూట్‌లు

జెమాలజికల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అమెరికా
వెబ్‌సైట్: www.gia.edu
ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జెమాలజికల్ సెన్సైస్- బ్యాంకాంక్
వెబ్‌సైట్: www.aigsthailand.com

ఆధారము: ఆంధ్ర ప్రభ లో ప్రచురితమైన కథనం ఆధారంగా

3.03225806452
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు