హోమ్ / విద్య / కెరీర్ గైడెన్స్ / ల్యాబ్‌ జాబ్‌ల హవా
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

ల్యాబ్‌ జాబ్‌ల హవా

వైద్యరంగం.. వేగంగా విస్తరిస్తున్న రంగాల్లో ఇదొకటి. ప్రైవేటు హాస్పిటల్స్‌, నర్సింగ్‌హోమ్స్‌, బ్లడ్‌బ్యాంక్స్‌, పెథాలజీ ల్యాబొరేటరీలు వేగంగా పెరుగుతున్నాయి. అదే సమయంలో మెడికల్‌ ల్యాబ్‌ టెక్నీషియన్స్‌కు డిమాండ్‌ పెరుగుతోంది. డిమాండ్‌ ఉన్న కోర్సుల్లో మెడికల్‌ ల్యాబ్‌ టెక్నీషియన్‌ కోర్సు ముందు వరుసలో ఉంటుంది. ఈ కోర్సు పూర్తి చేస్తే ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు సులభంగా లభిస్తాయి. ఉద్యోగంలో త్వరగా స్థిరపడాలని కోరుకునే వారు ఈ కోర్సును ఎంపిక చేసుకోవచ్చు. ఆ విశేషాలు ఇవి..

వైద్యరంగం.. వేగంగా విస్తరిస్తున్న రంగాల్లో ఇదొకటి. ప్రైవేటు హాస్పిటల్స్‌, నర్సింగ్‌హోమ్స్‌, బ్లడ్‌బ్యాంక్స్‌, పెథాలజీ ల్యాబొరేటరీలు వేగంగా పెరుగుతున్నాయి. అదే సమయంలో మెడికల్‌ ల్యాబ్‌ టెక్నీషియన్స్‌కు డిమాండ్‌ పెరుగుతోంది. డిమాండ్‌ ఉన్న కోర్సుల్లో మెడికల్‌ ల్యాబ్‌ టెక్నీషియన్‌ కోర్సు ముందు వరుసలో ఉంటుంది. ఈ కోర్సు పూర్తి చేస్తే ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు సులభంగా లభిస్తాయి. ఉద్యోగంలో త్వరగా స్థిరపడాలని కోరుకునే వారు ఈ కోర్సును ఎంపిక చేసుకోవచ్చు. ఆ విశేషాలు ఇవి..

ఆసుపత్రికి వెళితే వైద్యుడు ముందుగా రాసేది టెస్టులే. పరీక్షలు చేయించి రిపోర్టులు వచ్చాకే చికిత్స మొదలుపెడతాడు. ఆ పరీక్షలన్నీ చేసి రిపోర్టులు అందించడంలో కీలకపాత్ర పోషించింది ల్యాబ్‌ టెక్నీషియన్‌. వ్యాధి ఏ స్థాయిలో ఉంది. బ్యాక్టీరియా కారకమా? వైరస్‌ కారకమా తెలుసుకుని రిపోర్టులు అందజేసేది టెక్నీషియనే. వీళ్లు ముందుగా ఫ్లూయిడ్‌, టిష్యూ, రక్తం సేకరించి, విశ్లేషించడం జరుగుతుంది. మైక్రో ఆర్గానిజం స్ర్కీనింగ్‌, కెమికల్‌ అనాలసిస్‌, సెల్‌ కౌంట్‌ వంటివి కూడా ఇందులో భాగంగా ఉంటాయి. ఈ పరీక్షలన్నీ నిర్వహించడానికి టెక్నీషియన్స్‌, ప్రొఫెషనల్స్‌, టెక్నాలజిస్టులు అవసరమవుతారు. ఈ కెరీర్‌కు డిమాండ్‌ ఎప్పుడూ ఉంటుంది. శాంపిల్‌ తీసుకోవడం, టెస్టింగ్‌, రిపోర్టు తయారు చేయడం, మెడికల్‌ ఇన్వెస్టిగేషన్స్‌ను డాక్యుమెంటేషన్‌ చేయడం వంటి పనులన్నీ ల్యాబ్‌ టెక్నీషియన్స్‌ చేస్తుంటారు. డయాగ్నస్టిక్‌ సెంటర్‌లో బ్లడ్‌బ్యాంకింగ్‌, హెమటాలజీ, ఇమ్యునాలజీ, మైక్రోబయాలజీ, మైక్రోబయాలజీ, సైటోటెక్నాలజీ, యూరిన్‌ అనాలసిస్‌, కోయాగ్యులేషన్‌, పారాసైటాలజీ, డ్రగ్‌ ఎఫికసీ టెస్ట్‌, సీరాలజీ, బ్లడ్‌ శాంపిల్‌ మ్యాచింగ్‌ వంటి విభాగాలుంటాయి. టెక్నీషియన్స్‌ శాంపిల్స్‌ తీసుకుని, పరీక్షించి కచ్చితమైన విలువలను తీసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం అనలైజింగ్‌ మెషిన్స్‌, ఎక్వి్‌పమెంట్‌, టూల్స్‌ను ఉపయోగించాల్సి ఉంటుంది. మెడికల్‌ టెక్నాలజిస్టులు మెడికల్‌ ప్రొఫెషన్‌లో భాగంగా ఉంటారు. వీరికి అకడమిక్‌ స్కిల్స్‌తోపాటు టెక్నికల్‌ స్కిల్స్‌ అవసరమవుతాయి.

ఉపాధి అవకాశాలు

ల్యాబొరేటరీ టెక్నీషియన్‌ కోర్సులు చదివిన వారికి వివిధ రంగాల్లో ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లోని డయాగ్నస్టిక్‌ సెంటర్స్‌లో కొలువు సంపాదించుకోవచ్చు. ప్రైవేటు హాస్పిటల్స్‌ అవకాశాలు విరివిగా ఉంటాయి. హెల్త్‌కేర్‌ ఆడ్మినిస్ట్రేటర్‌గా, ల్యాబొరేటరీ మేనేజర్‌గా, ల్యాబొరేటరీ ఇన్‌ఫర్మేషన్‌ సిస్టమ్‌ అనలిస్ట్‌గా, ఎడ్యుకేషన్‌ కన్సల్టెంట్‌గా, కోఆర్డినేటర్‌గా ఉద్యోగావకాశాలను పొందవచ్చు. బయోటెక్నాలజీ కంపెనీల్లో మాలిక్యులర్‌ డయాగ్నస్టిక్స్‌గా, విట్రో ఫర్టిలైజేషన్‌ ల్యాబొరేటరీలలో, రీసెర్చ్‌ ల్యాబ్‌లలోనూ ఉపాధి అవకాశాలు పొందవచ్చు.

 

జీతభత్యాలు
మెడికల్‌ ల్యాబ్‌ టెక్నీషియన్‌గా స్థిరపడిన వారికి జీతభత్యాలు బాగానే ఉంటాయి. ప్రైవేటు ఆసుపత్రుల్లో ప్రారంభంలోనే 6 వేల నుంచి 10 వేల వరకు లభిస్తుంది. ల్యాబ్‌ టెక్నీషియన్స్‌తో పోల్చితే ల్యాబ్‌ టెక్నాలజిస్టుకు జీతం ఎక్కువగా ఉంటుంది. అనుభవం, పనిచేస్తున్న సంస్థ ఆధారంగా జీతభత్యాలు లభిస్తాయి. డయాగ్నొస్టిక్‌ సెంటర్‌లో రక్త, మూత్ర పరీక్షలు చేసే టెక్నీషియన్స్‌ మాత్రమే కాకుండా ఇతర టెక్నీషియన్లు చాలా మంది ఉంటారు. స్పెషలైజేషన్‌ను బట్టి సంబంధిత ఫీల్డ్‌లో టెక్నీషియన్‌గా స్థిరపడవచ్చు.

సీటీస్కాన్‌ టెక్నీషియన్‌
అనస్థీషియా టెక్నీషియన్‌
ఎమ్‌ఆర్‌ఐ టెక్నీషియన్‌
ఎక్స్‌రే టెక్నీషియన్‌
పెథాలజీ టెక్నీషియన్స్‌
రీనల్‌ డయాలసిస్‌ టెక్నీషియన్‌
రేడియాలజీ టెక్నీషియన్‌

ఎంఎల్‌టి(మెడికల్‌ ల్యాబొరేటరీ టెక్నాలజీ)

ఈ కోర్సు బిఎస్సీ డిగ్రీలో భాగంగా చదవాల్సి ఉంటుంది. డిప్లొమా, అండర్‌ గ్రాడ్యుయేట్‌ లెవెల్‌ విద్యార్థులు ఈ కోర్సును ఎంపిక చేసుకోవచ్చు. ఇంటర్‌మీడియెట్‌ సైన్స్‌ విద్యార్థులు బీఎస్సీ ఎంఎల్‌టి కోర్సును చదవచ్చు.

బీఎస్సీ(ఎంఎల్‌టి) కోర్సును అందిస్తున్న ఇన్‌స్టిట్యూట్ల వివరాలు

నిజాం ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌, గాంధీ మెడికల్‌ కాలేజ్‌, ఉస్మానియా మెడికల్‌ కాలేజ్‌, డా.ఎన్‌టీఆర్‌ యూనివర్సిటీ ఆఫ్‌ హెల్త్‌సైన్సెస్‌, దక్కన్‌ కాలేజ్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌, మెడిసిటి ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌, షాదాన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌, అపోలో కాలేజ్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌, డా.రెడ్డీ ఫౌండేషన్‌ ఫర్‌ హెల్త్‌ ఎడ్యుకేషన్‌ వంటి సంస్థలు ఎంఎల్‌టి కోర్సును అందిస్తున్నాయి. ఎస్‌ఆర్‌ఎల్‌ ర్యాన్‌బాక్సీ వంటి సంస్థలు పదవ తరగతి పాసైన విద్యార్థులకు డిప్లొమా మెడికల్‌ ల్యాబ్‌ టెక్నీషియన్‌ కోర్స్‌(డీఎంఎల్‌టీసీ)ను ఆఫర్‌ చేస్తున్నాయి. కోర్సు వ్యవధి ఏడాది ఉంటుంది

డిప్లొమా హెల్త్‌ ఇన్‌స్పెక్టర్‌ కోర్స్‌(డీహెచ్‌ఐసీ)

పదవ తరగతి పాసైన విద్యార్థులు మూడేళ్లకోర్సుగా చదవాల్సి ఉంటుంది. ఇంటర్‌ పూర్తి చేసిన వారు రెండేళ్లు చదవాల్సి ఉంటుంది. ఈ కోర్సును ప్రైవేటు సంస్థలు ఆఫర్‌ చేస్తున్నాయి. ఈ కోర్స్‌ పూర్తి చేసిన వారికి ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయి. స్టేట్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ హెల్త్‌ సర్వీసెస్‌, హోటల్స్‌, పబ్లిక్‌ హెల్త్‌ డిపార్టుమెంట్స్‌, పుడ్‌ అండ్‌ డ్రగ్స్‌ డిపార్టుమెంట్స్‌, పెస్ట్‌ కంట్రోల్‌ ఎజెన్సీలలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందవచ్చు.

ఉద్యోగావకాశాలు
బ్లడ్‌ బ్యాంకుల్లో ల్యాబ్‌ టెక్నీషియన్‌గా స్థిరపడవచ్చు.హాస్పిటల్స్‌, నర్సింగ్‌హోమ్స్‌, డయాగ్నస్టిక్‌ ల్యాబొరేటరీలలో టెక్నీషియన్‌గా, వాక్సిన్‌ తయారీ సంస్థల్లో, డైరీ పరిశ్రమల్లో, ఫార్మస్యూటికల్‌ ల్యాబ్‌, పబ్లిక్‌ హెల్త్‌ ల్యాబ్స్‌లో టెక్నీషియన్‌గా ఉద్యోగాలు పొందవచ్చు. సొంతంగా డయాగ్నస్టిక్‌ సెంటర్‌ను పెట్టుకోవచ్చు.

ఆధారము: ఆంధ్రజ్యోతి

 

 

 

 

 

2.97
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు