హోమ్ / విద్య / కెరీర్ గైడెన్స్ / వీడియో రెజ్యూమ్‌ ఇలా
పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

వీడియో రెజ్యూమ్‌ ఇలా

వీడియో రెజ్యూమ్స్‌ షూట్‌ చేసే సమయంలో ఎలాగా బిహేవ్‌ చేయాలో తెల్సుకుందాం.

కంప్యూటర్స్‌ కంటే స్మార్ట్‌ఫోన్‌లకు గిరాకీ పెరిగినట్లు.. ప్రస్తుతం రెజ్యూమ్‌ స్థానాన్ని వీడియో రెజ్యూమ్‌లు భర్తీ చేస్తున్నాయి. అవును ఇపుడున్న కాంపిటీషన్‌ వరల్డ్‌లో వీడియో రెజ్యూమ్స్‌ను బడా బడా కంపెనీలు ప్రిఫర్‌ చేస్తున్నాయి. ఇంతకీ వీడియో రెజ్యూమ్స్‌ షూట్‌ చేసే సమయంలో ఎలాగా బిహేవ్‌ చేయాలో తెల్సుకుందాం.

ఫారిన్‌ కంపెనీలు వీడియో రెజ్యూమ్స్‌కే అధిక ప్రాధాన్యత ఇవ్వటానికి కారణం విద్యార్థి లేదా ఉద్యోగి ప్రెజంటేషన్‌ స్కిల్స్‌ అందులోనే కనిపిస్తాయి. కేవలం మూడు నిమిషాల్లో అతని మాటతీరు, బాడీ లాంగ్వేజ్‌, ఇంగ్లీష్‌ భాషలో కమ్యూనికేషన్‌, విద్యార్హతలు, అనుభవం.. ఇట్టే అర్థమవుతుంది. దీంతో కంపెనీలకు వీడియో రెజ్యూమ్స్‌ వల్ల ఉద్యోగుల్ని ఎంపిక చేసే ప్రక్రియ సులువవుతుంది.

 • వీడియో రెజ్యూమ్స్‌ ఎలా రూపొందించాలి, అసలు ఎలా ఉంటాయి అని తెలుసుకునేందుకు నెట్‌లో వీడియో రెజ్యూమ్స్‌ చూడాలి.
 • మొదట ఎలా మాట్లాడాలో పేపరుపై రాసుకోవాలి. రాసిన విషయాన్ని గుర్తుంచుకుని పదే పదే గట్టిగా అద్దం ముందు ప్రాక్టీసు చేసుకోవాలి.
 • వీడియో షూట్‌ చేసేముందు డల్‌ లైటింగ్‌ లేకుండా చూసుకోవాలి. ఆకర్షణీయంగా కనిపించేట్లు వీడియోను సెట్‌ చేసుకోవాలి.
 • కెమెరాకు ఎదురుగా ఉండాలి. దిక్కులు చూడటం, పైకి, కిందికి చూడటం వంటివి చేయకూడదు.
 • చుట్టు పక్కల ఎలాంటి శబ్దాలు లేకుండా జాగ్రత్తపడాలి.
 • ఫేస్‌ టు ఫేస్‌ ఇంటర్వ్యూ చేస్తున్నట్లు భావించి తొలుత మీ పేరు చెప్పి వీడియో రెజ్యూమ్‌ను స్టార్ట్‌ చేయాలి. ప్రొఫెషనల్‌గా డ్రెసప్‌ కావాలి. గుండెలోంచి మాటలు రావాలి, అంతేకానీ స్ర్కిప్ట్‌ అప్పజెప్పినట్లు ఉండకూడదు.
 • ఉంటే స్లో, లేకుంటే ఫాస్ట్‌గా మాట్లాడకూడదు. సాధారణ వేగం ఉండాలి.
 • సొంత అభిప్రాయాలు, సెల్ఫ్‌ డబ్బాకంటే ప్రొఫెషనల్‌ విషయాలు ఏం నేర్చుకున్నారో సూటిగా చెప్పాలి.
 • విదార్హతలతో పాటు మీ రంగంలో ఉన్న అనుభవాన్ని ఖచ్చితంగా చెప్పాలి.
 • మిమ్మల్ని వాళ్ల కంపెనీలో తీసుకుంటే సమర్థంగా పనిచేస్తారనే విషయాన్ని కాన్ఫిడెంట్‌గా చెప్పాలి.
 • చివరగా స్మైలింగ్‌ ఫేస్‌తో రిక్రూటర్‌కు థ్యాంక్స్‌ చెప్పాలి.
 • అన్నిటికంటే ముఖ్యమైన విషయం మూడు నిమిషాల్లో వీడియో రెజ్యూమ్‌ కంప్లీట్‌ కావాలి. అంతలోపే మీ క్రియేటివిటీ, ప్రతిభ, సామర్థ్యం నిరూపించుకోవాలన్నమాట.

 

ఆధారము: ఆంధ్రజ్యోతి

2.95789473684
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు