హోమ్ / విద్య / కెరీర్ గైడెన్స్ / సంక్షోభ సమయంలో
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

సంక్షోభ సమయంలో

ఇప్పుడు మీరు చేస్తున్న ఉద్యోగంతో సంతోషంగా లేరా? దీనికన్నా ఎంతో మెరుగైన ఉద్యోగం కోసం కలలు కంటున్నారా? మీ నుంచి అవుననే సమాధానమే వస్తే, మీరు ఉద్యోగపరమైన సంక్షోభంలో ఉన్నారని, మరో ఉద్యోగంలోకి మారాల్సిన అనివార్యత ఉందని అర్థం. ఈ స్థితిలో మీరు అనుసరించాల్సిన మార్గాలు..

ఇప్పుడు మీరు చేస్తున్న ఉద్యోగంతో సంతోషంగా లేరా? దీనికన్నా ఎంతో మెరుగైన ఉద్యోగం కోసం కలలు కంటున్నారా? మీ నుంచి అవుననే సమాధానమే వస్తే, మీరు ఉద్యోగపరమైన సంక్షోభంలో ఉన్నారని, మరో ఉద్యోగంలోకి మారాల్సిన అనివార్యత ఉందని అర్థం. ఈ స్థితిలో మీరు అనుసరించాల్సిన మార్గాలు..

  • ఉద్యోగంలో నుంచి ఎప్పుడు మారాలనుకుంటున్నారనేది మీకు మీరు వేసుకోవాల్సిన మొదటి ప్రశ్న. అయితే, మారాలనుకున్న క్షణం నుంచే మనలో ఒక తీవ్రమైన ఆందోళన మొదలవుతుంది. మీ శక్తినంతా ఎవరో తోడేస్తున్నట్లు అనిపిస్తుంది. కాకపోతే ఈ పరిణామాలు తాత్కాలికమే. ఒకసారి మనసు ఈ స్థితిని అధిగమించగానే, మీరు కొత్త జాబ్‌లోకి వెళ్లడానికి అన్ని విధాలా సిద్ధమైపోతారు.
  • మిమ్మల్ని మీరే ఇంటర్వ్యూ చేసుకోండి. వాస్తవానికి మీ మీద మీరు సంధించుకున్న ప్రశ్నల ఆధారంగానే మీ జీవన ప్రమాణాలు ఆధారపడి ఉంటాయి. మీరు మనస్పూర్తిగా ప్రేమిస్తున్న ఇష్టపడుతున్న ఉద్యోగమేమిటో తేల్చుకోండి. మీకు స్ఫూర్తిదాయకంగా ఉండేది మీలో చైతన్యాన్ని నింపే ఉద్యోగమేమిటో తెలుసుకోండి .


  • మీ మనసును విశాలం చేయండి. మీకు బాగా ఆసక్తి ఉన్న రంగాలు ఏమిటో ఒక స్పష్టతకు రండి. ఆ రంగంలో విజేతలుగా ఉన్నవారిని కలవడానికి ప్రయత్నించ ండి. వారి నుంచి సలహాలు, సూచనలు తీసుకోండి.


  • ఒకసారి మీ విశ్లేషణ పూర్తయి కొత్త కెరీర్‌ విషయంలో ఒక నిర్ణయానికి వచ్చాక మీ కొత్త వ్యాపారానికి శ్రీకారం చుట్టండి. ఈ విషయంలో వయసు కూడా పెద్ద విషయమేమీ కాదు. ఎందుకంటే 60 ఏళ్ల తర్వాత కూడా కొత్త కెరీర్‌ ప్రారంభించి గొప్ప విజయాల్ని సాధించిన వారున్నారు.


  • ఏదైనా కొత్త కెరీర్‌లోకి వెళుతున్నప్పుడు ఇప్పటిదాకా చేసిన ఉద్యోగానుభవం ఎంతో కొంత ఉపకరించేదానిలోకే వెళ్లాలి. పూర్తిగా సున్నా నుంచి ప్రారంభం కావడం ఇన్నేళ్ల అనుభవాన్ని వృథా చేసుకోవడమే అవుతుంది.


  • కొత్త కెరీర్‌లో తొలుత మనమేదో ఒక మూలన పడిపోయినట్లు అనిపించవచ్చు. అది తాత్కాలికమే. వాస్తవానికి గతంలోని అనుభవం మిగతా వారికన్నా ఎత్తుగా కాకపోయినా ఎవరికీ తీసిపోని స్థితికే చేరుస్తుంది.

ఆధారము: ఆంధ్రజ్యోతి

2.93069306931
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు