অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

సామాజిక సేవ.. ఉపాధికి దోవ

సామాజిక సేవ.. ఉపాధికి దోవ

కష్టాల్లో ఉన్న వారిని గుర్తించి వారికి తగిన సహాయం అందేలా చేసి, వారిలో మనోధైర్యం నింపడం ఒక గొప్ప అనుభూతినిస్తుంది. అలాంటి అనుభూతిని సోషల్‌ వర్కర్‌గా పనిచేస్తున్న వారు రోజూ పొందుతారు. ఉద్యోగంతో పాటు సంతృప్తి కావాలనుకునే వారు సోషల్‌ వర్క్‌ను కెరీర్‌గా ఎంచుకోవచ్చు. దీన్ని కెరీర్‌గా ఎంచుకున్న వారికి ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు కొదవలేదు. ఆ విశేషాలు ఇవి...

తంలో సోషల్‌వర్క్‌ అంటే బాగా డబ్బున్న వాళ్లు చేసే పని అనుకునే వారు. కానీ ఇప్పుడు సోషల్‌ వర్క్‌ కెరీర్‌గా మారింది. చాలా విశ్వవిద్యాలయాల్లో గ్రాడ్యుయేట్‌, పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ లెవెల్‌లో సోషల్‌ వర్క్‌ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. కెరీర్‌లో స్థిరపడటంతో పాటు సంతృప్తి కూడా ఉండాలని కోరుకునే వారికి ఇది బెస్ట్‌ కెరీర్‌ ఆప్షన్‌. 2014 నుంచి 2024 వరకు సోషల్‌ వర్క్‌ రంగంలో ఉద్యోగావకాశాల్లో 12 శాతం వృద్ధి ఉంటుందని అంచనా. ఇతర రంగాలతో పోలిస్తే ఇందులో పెరుగుదల వేగంగా ఉంటుంది. ఈ కెరీర్‌ను ఎంచుకున్న వారు ప్రజలకు కనీసం సామాజిక అవసరాలు, సహాయం అందేలా చూడటం ప్రధాన లక్ష్యంగా పనిచేస్తారు. ఈ కెరీన్‌ను ఎంపిక చేసుకునే వారికి సహనం చాలా అవసరం. కమ్యునికేషన్‌ స్కిల్స్‌ కూడా బాగుండాలి. ప్రజలతో ఇంటరాక్ట్‌ అయి వారి అవసరాలను తెలుసుకోవాల్సి ఉంటుంది.

అర్హతలు, కోర్సులు

ఇంటర్మీడియెట్‌(10+2) ఉత్తీర్ణులైన వారు మూడేళ్ల బ్యాచ్‌లర్‌ డిగ్రీ ఇన్‌ సోషల్‌ వర్క్‌(బీఎస్‌డబ్యు) కోర్సులో చేరవచ్చు. డిగ్రీ పూర్తి చేసిన వారు మాస్టర్‌ డిగ్రీ ఇన్‌ సోషల్‌ వర్క్‌(ఎమ్‌ఎ్‌సడబ్యు)లో చేరవచ్చు. డిగ్రీ ఏ సబ్జెక్టుతో పూర్తి చేసినా ఎమ్‌ఎస్‌డబ్ల్యులో చేరవచ్చు. ఇది రెండేళ్ల కోర్సు. మాస్టర్‌ డిగ్రీలో హ్యుమన్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌, మెడికల్‌ అండ్‌ సైకియాట్రిక్‌ సోషల్‌ వర్క్‌, ఫ్యామిలీ అండ్‌ చైల్డ్‌వెల్‌ఫేర్‌, రూరల్‌ అండ్‌ అర్బన్‌ కమ్యూనిటీ డెవల్‌పమెంట్‌, స్కూల్స్‌ సోషల్‌ వర్క్‌లలో ఇష్టమైన దానికి సబ్జెక్టుగా ఎంచుకోవచ్చు. సర్టిఫికెట్‌, డిప్లొమా కోర్సులు : సర్టిఫికెట్‌ ఇన్‌ సోషల్‌ వర్క్‌, సర్టిఫికెట్‌ ఇన్‌ రిహాబిలిటేషన్‌ కౌన్సిలింగ్‌, అడ్వాన్స్డ్‌ సర్టిఫికెట్‌ ఇన్‌ సోషల్‌ వెల్ఫేర్‌ అడ్మినిసే్ట్రషన్‌, పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ సర్టిఫికెట్‌ ఇన్‌ సోషల్‌ వెల్ఫేర్‌ అడ్మినిస్ట్రేషన్‌, డిప్లొమా ఇన్‌ పర్సనల్‌ మేనేజ్‌మెంట్‌, డిప్లొమా ఇన్‌ హాస్పిటల్‌ అడ్మినిసే్ట్రషన్‌ వంటివి ఉంటాయి.

ఉద్యోగావకాశాలు

సోషల్‌ వర్క్‌ను కెరీర్‌గా ఎంచుకునే వారికి ఉద్యోగావకాశాలు పుష్కలంగా ఉంటాయి. ప్రైవేటు రంగంలో, ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు లభిస్తాయి. చైల్డ్‌, విమెన్‌ అండ్‌ ట్రైబల్‌ వెల్ఫేర్‌, ఎడ్యుకేషన్‌, హెల్త్‌, రూరల్‌ డెవల్‌పమెంట్‌ వంటి విభాగాలలో ఉద్యోగాలు లభిస్తాయి. ఎన్‌జీవోలు సోషల్‌ వర్క్‌ కెరీర్‌గా ఎంచుకున్న వారికి ఉద్యోగాలు అందించడంలో ముందు వరసలో ఉంటాయి. ప్రతి కార్పొరేట్‌ సంస్థ సామాజిక బాధ్యతగా సోషల్‌ సర్వీ్‌సను ఎంచుకుంటుంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఫౌండేషన్‌ను ఏర్పాటు చేసి సహాయం అందిస్తుంటాయి. వీటిలో సోషల్‌ వర్క్‌ చదివిన అభ్యర్థులను ఎంపిక చేసుకుంటాయి. యునెస్కో, యునిసెఫ్‌ వంటి వాటిలో కూడా ఉద్యోగావకాశాలుంటాయి. కౌన్సెలింగ్‌ సెంటర్స్‌, ఎడ్యుకేషన్‌ సెక్టర్‌, హెల్త్‌ ఇండసీ్ట్ర, హ్యూమన్‌ రైట్స్‌ ఎజెన్సీస్‌, ఓల్డ్‌ ఏజ్‌ హోమ్స్‌ వంటి వాటిలోనూ అవకాశాలుంటాయి. విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్లుగా స్థిరపడొచ్చు. ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రొగ్రామ్‌ కో-ఆర్డినేటర్‌, ప్రాజెక్ట్‌ కో-ఆర్డినేటర్‌, సీనియర్‌ మేనేజర్‌ - హ్యూమన్‌ రిసోర్స్‌, సబ్‌ రీజనల్‌ ట్రెయినింగ్‌ కో-ఆర్డినేటర్‌గా ఉద్యోగాలు పొందవచ్చు.
జీతభత్యాలు

ప్రైవేటు రంగంలో కార్పొరేట్‌ సంస్థల ఆధ్వర్యంలో నడిచే ఆర్గనైజేషన్‌లలో చేరితే జీతభత్యాలు బాగానే ఉంటాయి. ప్రాథమిక దశలో నెలకు ఏడు వేల నుంచి పది వేల వరకు వేతనం లభిస్తుంది. కంపెనీని బట్టి జీతభత్యాలు ఆధారపడి ఉంటాయి. అనుభవాన్ని బట్టి జీతం పెరుగుతుంది. ప్రభుత్వ ప్రాజెక్టులు, ఎన్‌జీవోల్లో చేరితే నెలకు పదివేల వేతనం సులభంగా లభిస్తుంది. ప్రైవేటు సంస్థల్లో పాతిక వేలకు పైగా జీతం లభిస్తుంది. ఇంటర్నేషనల్‌ ఆర్గనైజేషన్స్‌ అయితే అంతకన్నా ఎక్కువ లభిస్తుంది.

ఎలాంటి నైపుణ్యాలు ఉండాలి?
 • మంచి కమ్యునికేషన్‌ స్కిల్స్‌ ఉండాలి. అప్పుడే ఎదుటి వారితో మాట్లాడి, వారి అవసరాలను గుర్తించి తగిన సహాయం చేయగలుగుతారు.
 • ఒత్తిడితో కూడిన, కఠినమైన సందర్భాల్లో సోషల్‌ వర్కర్స్‌ పనిచేయాల్సి ఉంటుంది. కాబట్టి ఓపికగా ఉండాలి. సానుభూతితో వ్యహరించాలి. రిలేషన్‌షిప్‌ డెవలప్‌ చేసుకోవాలి.
 • రకరకాల గ్రూప్స్‌తో కలిసి పనిచేయాల్సి ఉంటుంది. కాబట్టి కొలీగ్స్‌, క్లయింట్స్‌తో స్నేహపూర్వకంగా ఉండాలి.
 • మల్టిపుల్‌ క్లయింట్స్‌కు ఒకేసారి సహాయం చేయాల్సి వస్తుంది. పేపర్‌వర్క్‌, డాక్యుమెంటేషన్‌ పూర్తి చేయాల్సి ఉంటుంది.
 • సమస్యను సులభంగా పరిష్కరించే నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలి. అప్పుడే సోషల్‌ వర్కర్‌గా రాణించగలుగుతారు.

 

ఏం చేయాల్సి ఉంటుంది?

 • సహాయం కోసం ఎదురుచూస్తున్న వ్యక్తులు, గ్రూపులను గుర్తించాలి.
 • వాళ్ల అవసరాలు, సందర్భం, బలం, బలహీనత, లక్ష్యాలను అంచనా వేయాలి.
 • వారి జీవితంలో మార్పు వచ్చేందుకు అవసరమైన సహాయం చేయడం, అనారోగ్యం, విడాకులు, నిరుద్యోగం వంటి వాటిలో మార్పు తీసుకొచ్చేందుకు కృషి చేయాలి.
 • చిన్న పిల్లల సంరక్షణ కోసం కృషి చేయడం, ఆపద సమయంలో స్పందించడం వంటివి కూడా ఉంటాయి.
 • చైల్డ్‌ అండ్‌ ఫ్యామిలీ సోషల్‌ వర్కర్స్‌ : పిల్లలు నిరాదరణకు గురవుతున్న చోట వీరి అవసరం ఉంటుంది. నిరుపేద కుటుంబాలకు అవసరమైన సహాయాన్ని అందించడం వంటివి చేయాల్సి ఉంటుంది.
 • క్లినికల్‌ సోషల్‌ వర్కర్స్‌ : ఎమోషనల్‌ డిజార్డర్స్‌, డిప్రెషన్‌, యాంగ్జయిటీ వంటి వాటితో బాధపడుతున్న వారిని గుర్తించి వారికి తగిన చికిత్స అందేలా చూడటం, హెల్త్‌కేర్‌ ప్రొఫెషనల్స్‌తో చికిత్స ఇప్పించడం చేయాల్సి ఉంటుంది.
 • స్కూల్‌ సోషల్‌ వర్కర్స్‌, హెల్త్‌కేర్‌ సోషల్‌ వర్కర్స్‌ సహాయం కోసం ఎదురుచూస్తున్న వ్యక్తులను గుర్తించి స్పందించాల్సి ఉంటుంది.

 

ఆధారము: ఆంధ్రజ్యోతి

 © 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate