హోమ్ / విద్య / కెరీర్ గైడెన్స్ / సీవీల్లో రిక్రూటర్లు చూసే అంశాలివే...
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

సీవీల్లో రిక్రూటర్లు చూసే అంశాలివే...

సీవీల్లో రిక్రూటర్లు చూసే అంశాలివే...

‘ రెజ్యూమెలు రెండు పేజీలు ఉండాలి.. ఏఏ అంశాల పట్ల ఆసక్తి ఉందో తెలపాలి.. సీవీకి ఫోటోను జత చేస్తే జాబ్‌ గ్యారెంటీ’’.. వంటి మాటలు ఉద్యోగ అన్వేషణలో ఉన్న వారికి సుపరిచితమైనవి. అయితే సీవీల్లో రిక్రూటర్లు చూసే అంశాలకూ.. అభ్యర్థులు పొందుపరిచే అంశాలకూ పొంతన లేక చాలామంది నిరుద్యోగులుగానే ఉండిపోతున్నారు. అసలు సీవీల్లో ఉండాల్సిన అంశాలేమిటి..? అనే టాపిక్‌పై సుమారు 2000మంది ఉద్యోగులను, నిరుద్యోగులను, 480 మంది రిక్రూటర్లను ఓ సంస్థ సర్వే చేసింది. సీవీ ఎప్పుడూ రెండు పేజీలు ఉండాలని 83 శాతం మంది అనుకుంటుంటారు. అయితే ఈ అభిప్రాయాన్ని 32 శాతం మంది రిక్రూటర్లు మాత్రమే అమోదిస్తున్నారు. దీంతో పాటు సీవీల్లో ఫోటో ఉండాలని చాలామంది అనుకుంటుంటారు. అయితే ఈ ఫోటోలు సీవీల పట్ల వ్యతిరేక భావం ఏర్పరుస్తాయని 74 శాతం మంది రిక్రూటర్లు తేల్చిచెప్పారు.

సీవీల్లో ఉండాల్సినవిగా రిక్రూటర్లు చెబుతున్నవి:
1. సీవీల్లో స్పెల్లింగ్‌ తప్పు లేకుండా చూసుకోవాలి.
2. గ్రామర్‌ మిస్టేక్స్‌ కూడా లేకుండా చూసుకోవాలి.
3. గతంలో సాధించిన విజయాలను తెలపాలి.
4. సీవీల్లో ఉపయోగించే భాష ఎప్పుడూ ప్రొఫెషనల్‌ టోన్ లోనే ఉండాలి.

5. గతంలో నిర్వహించిన బాధ్యతాయుతమైన పదవుల గురించి వివరించాలి.


సీవీల్లో తక్కువ ప్రాధాన్యం ఉండే అంశాలు:
1. సీవీ ఎప్పుడూ రెండు పేజీలే ఉండాలి.
2. విదేశాల్లో పనిచేసిన అనుభవం.
3. వాలంటీర్‌గా పనిచేసిన అనుభవం.
4. భాష ఎప్పుడూ థర్డ్‌ పర్సన్ లో ఉండాలి.

 

ఆధారము: ఆంధ్రజ్యోతి

3.01941747573
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు