హోమ్ / విద్య / కెరీర్ గైడెన్స్ / హార్డ్‌వేర్‌ జాబ్‌ ష్యూర్‌
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

హార్డ్‌వేర్‌ జాబ్‌ ష్యూర్‌

హార్డ్‌వేర్‌ జాబ్‌ ష్యూర్‌

కంప్యూటర్స్‌, ల్యాప్‌టాప్స్‌, టాబ్లెట్స్‌, మొబైల్స్‌... ఇవన్నీ మన జీవితంలో ఒక భాగంగా మారిపోయాయి. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ రంగంలో వచ్చే పదేళ్లలో కోటి యాభై లక్షల మంది హార్డ్‌వేర్‌ ప్రొఫెషనల్స్‌ అవసరమవుతారని ఒక అంచనా. ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీల్లోనే కాకుండా సొంతంగా ఉపాధి పొందడానికి ఆస్కారం ఉన్న ఇందులో కెరీర్‌ను ఎంచుకుంటే భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది.

కంప్యూటర్‌ మొరాయిస్తే హార్డ్‌వేర్‌ గురించి తెలిసిన వ్యక్తి చేయి పడాల్సిందే. మొబైల్‌ పాడైతే సర్వీసింగ్‌ సెంటర్‌కు పరుగెత్తాల్సిందే. కంప్యూటర్ల మధ్య నెట్‌వర్క్‌ సక్రమంగా ఉండాలంటే నెట్‌వర్క్‌పై అవగాహన ఉన్న వ్యక్తి ఉండాల్సిందే. ఇవన్నీ హార్డ్‌వేర్‌ ఇంజనీరింగ్‌ తెలిసిన వారు మాత్రమే చేయగలుగుతారు. కంప్యూటర్‌ హార్డ్‌వేర్‌ ఇంజనీర్‌ అంటే కంప్యూటర్‌ విడిభాగాల్లో తలెత్తిన సమస్యను పరిష్కరించడమే కాదు. రీసెర్చ్‌, డిజైనింగ్‌, డెవల్‌పమెంట్‌, ఎనాలసిస్‌, కంప్యూటర్‌ విడిభాగాల పనితీరును పరీక్షించడం వంటివన్నీ హార్డ్‌వేర్‌ ఇంజనీర్‌ పరిధిలోనే ఉంటాయి. కొంతకాలం క్రితం వరకు మహిళలు ఈ రంగం పట్ల ఆసక్తి కనబరిచే వారు కాదు. కానీ ఇప్పుడు చాలా మార్పు వచ్చింది. మహిళలు సైతం హార్డ్‌వేర్‌ ఇంజనీరింగ్‌ను కెరీర్‌గా ఎంచుకుంటున్నారు.

ఎవరు చదవొచ్చు?

కంప్యూటర్‌ హార్డ్‌వేర్‌ ఇంజనీర్‌గా స్థిరపడాలంటే బ్యాచ్‌లర్‌ డిగ్రీ ఇన్‌ కంప్యూటర్‌ ఇంజనీరింగ్‌ కోర్సు చదవాల్సి ఉంటుంది. మాస్టర్‌ డిగ్రీ కూడా చదవొచ్చు. ప్రైవేటు సంస్థలలో కంప్యూటర్‌కు సంబంధించి నిర్వహణ, విడిభాగాల పనితీరును పరీక్షించడం, మార్చడం వంటివి నేర్చుకోవచ్చు. ఇలా అనుభవంతో సొంతంగా కంప్యూటర్‌, ల్యాప్‌టాప్‌ రిపేరింగ్‌ సెంటర్‌లు నెలకొల్పి ఉపాధి పొందవచ్చు. అదే కంప్యూటర్‌ ఇంజనీరింగ్‌ పూర్తి చేసిన వారికి కార్పొరేట్‌ కంపెనీల్లో ఉద్యోగావకాశాలు ఉంటాయి. కంప్యూటర్‌ హార్డ్‌వేర్‌ ఇంజనీరింగ్‌ చదివిన వారు డిజైన్‌ ఇంజనీర్‌గా, ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌, నెట్‌వర్క్‌ ఇంజనీర్‌, సిస్టమ్‌ ఇంజనీర్‌, ఫీల్డ్‌ సర్వీస్‌ ఇంజనీర్‌గా వివిధ హాదాల్లో స్థిరపడవచ్చు.
ఉద్యోగ, ఉపాధి అవకాశాలు

ప్రతి సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో, కంప్యూటర్‌ ఆధారిత సంస్థల్లో హార్డ్‌వేర్‌ ఇంజనీర్‌ల అవసరం, నెట్‌వర్క్‌ ఇంజనీర్ల అవసరం తప్పనిసరిగా ఉంటుంది. కంప్యూటర్‌ విడిభాగాల తయారీ సంస్థలు, ఇండసి్ట్రయల్‌ ప్లాంట్స్‌, రీసెర్చ్‌ ల్యాబరేటరీలు, సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు, ఇతర పెద్ద పెద్ద సంస్థల్లో ఉద్యోగావకాశాలుంటాయి. హార్డ్‌వేర్‌ ఉత్పత్తుల డిజైన్‌, డెవల్‌పమెంట్‌లో ఉద్యోగాలు పొందవచ్చు. లేదంటే కంప్యూటర్ల నిర్వహణ, హార్డ్‌వేర్‌ సమస్యలను పరిష్కరించడం వైపు దృష్టిపెట్టవచ్చు. ప్రైవేటు సంస్థల్లో హార్డ్‌వేర్‌ ఇంజనీర్‌లకు ఉద్యోగావకాశాలు పుష్కలంగా ఉంటాయి. సొంతంగా కంప్యూటర్‌ హార్ట్‌వేర్‌ సెంటర్‌ పెట్టుకుని కాంట్రాక్ట్‌ బేసి్‌సపై కంపెనీల కంప్యూటర్ల నిర్వహణ బాధ్యతలు తీసుకోవచ్చు.
జీతభత్యాలు

కార్పొరేట్‌ కంపెనీల్లో ఉద్యోగం లభిస్తే వేలల్లో జీతం ఉంటుంది. ఫ్రెషర్‌ హార్డ్‌వేర్‌ ఇంజనీర్‌లకు నెలకు రూ. 25 నుంచి 30 వేల వేతనం లభిస్తుంది. అనుభవాన్ని బట్టి ఏడాదికి 5 నుంచి 6 లక్షల వరకు లభిస్తుంది. అనుభవం, బాధ్యతలు, కంపెనీ సైజుపై జీతభత్యాలు ఆధారపడి ఉంటాయి. ప్రైవేటుగా హార్డ్‌వేర్‌ సెంటర్‌ పెట్టుకుంటే ఆదాయం స్కైలిమిట్‌గా ఉంటుంది. హార్డ్‌వేర్‌ ఇంజనీర్‌లకు విదేశాల్లోనూ ఉద్యోగావకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
పరీక్షలు

ఇండియన్‌ ఇనిస్టిట్యూట్స్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఐఐటీ), నేషనల్‌ ఇనిస్టిట్యూట్స్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఎన్‌ఐటీ)లు బ్యాచిలర్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌(బి.ఈ), బ్యాచిలర్‌ ఆఫ్‌ టెక్నాలజీ(బి.టెక్‌) కోర్సులను నిర్వహిస్తుంటాయి. ఐఐటీ-జెఈఈ పరీక్షలో ర్యాంకు సాధించడం ద్వారా హార్ట్‌వేర్‌ ఇంజనీరింగ్‌లో చేరవచ్చు. ఇంజనీరింగ్‌లో చేరాలనుకుంటున్న విద్యార్థుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎమ్‌సెట్‌ పరీక్ష నిర్వహిస్తుంది. ఇందులో ర్యాంకు సాధించి ఇంజనీరింగ్‌ అభ్యసించవచ్చు.
చేయాల్సిన పనులు

  • కంప్యూటర్‌ టెక్నాలజీతో అప్‌డేట్‌గా ఉండటం
  • కంప్యూటర్‌లో హార్డ్‌వేర్‌ సమస్య తలెత్తితే వెంటనే పరిష్కరించడం
  • కంప్యూటర్‌ మాడిఫికేషన్స్‌, డాటా అనలైజ్‌ చేయడం
  • విడిభాగాల పనితీరును పరీక్షించడం, మార్చడం
  • కొత్త ఉత్పత్తుల తయారీలో పాలుపంచుకోవడం
  • కంప్యూటర్‌ విడిభాగాలను అసెంబుల్‌ చేయడం
  • సిస్టమ్‌ డిజైనర్లకు, యూజర్లకు అవసరమైన ట్రెయినింగ్‌, సపోర్టు ఇవ్వడం
  • రిక్వైర్‌మెంట్‌కు తగిన హార్ట్‌వేర్‌ విడిభాగాలను తెప్పించడం
నెట్‌వర్క్‌ ఇంజనీర్‌

కార్పొరేట్‌ కంపెనీల్లో నెట్‌వర్క్‌ ఇంజనీర్‌ల పాత్ర కీలకంగా ఉంటుంది. కంప్యూటర్‌ ఆధారిత కంపెనీల్లో వీరికి ఉద్యోగావకాశాలుంటాయి. ఒక్కో కంపెనీల్లో వేల మంది పనిచేస్తుంటారు. వారు ఉపయోగించే కంప్యూటర్లన్నీ ఒక నెట్‌వర్క్‌తో కనెక్ట్‌ చేయబడి ఉంటాయి. దానిని లోకల్‌ ఏరియా నెట్‌వర్క్‌(ఎల్‌ఏఎన్‌)అని పిలుస్తారు. నెట్‌వర్క్‌ ఇంజనీర్‌ ఈ విభాగంలో సమస్యలు తలెత్తకుండా చూడాల్సి ఉంటుంది. సర్వర్‌ నిర్వహణ కూడా చూడాల్సి ఉంటుంది. ఒకవేళ సమస్యలు తలెత్తితే వెంటనే పరిష్కరించాల్సి ఉంటుంది. వీరికి కూడా జీతభత్యాలు కంపెనీని బట్టి ఆధారపడి ఉంటాయి.
సెల్‌ఫోన్‌ రిపేరింగ్‌

సొంతంగా ఉపాధి పొందాలనుకునే వారికి ఇది బెస్ట్‌ ఆప్షన్‌. రెండు, మూడు నెలలు సెల్‌ఫోన్‌ రిపేరింగ్‌లో శిక్షణ తీసుకోవడం ద్వారా స్వయం ఉపాధి పొందవచ్చు. ఈ రంగంలో ఉపాధి అవకాశాలకు కొదవలేదు. తక్కువ పెట్టుబడితో ఉపాధిని కల్పించుకోవచ్చు. పలు ప్రైవేటు సంస్థలు సెల్‌ఫోన్‌ రిపేరింగ్‌లో శిక్షణను అందిస్తున్నాయి. శిక్షణ పొందిన అభ్యర్థులు సెల్‌ఫోన్‌ కంపెనీల సర్వీ్‌ససెంటర్లలోనూ ఉద్యోగాలు పొందవచ్చు. ప్రారంభంలో నెలకు రూ.10 వేల వేతనం లభిస్తుంది. అనుభవాన్ని బట్టి జీతం పెరుగుతుంది. ప్రతి మొబైల్‌ కంపెనీ సర్వీస్‌ సెంటర్‌లను నిర్వహణ చూస్తూ ఉంటుంది. ఇవి అన్ని ఏరియాల్లోనూ ఉంటాయి. కొద్దిగా ప్రయత్నిస్తే ఉద్యోగం పొందవచ్చు.
ఆధారము: ఆంధ్రజ్యోతి
2.89523809524
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు