ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఖమ్మం జిల్లా మరియు చత్తీస్ ఘఢ్ కి చెందిన దంతెవాడ జిల్లాలలో నెలకొన్న అలజడుల నేపధ్యం లో పిల్లల బాగు కై ఎన్.సి.పీ.సీ.ఆర్., పోషకాహార సమస్యలను అధిగమించడానికి అంగన్ వాడీలను స్థాపించమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చేసిన సిఫార్సులను మరియు ఆరోగ్య పరిరక్షణకు ”ఆషా” లను ( అధీకృత సామాజిక ఆరోగ్య కార్యకర్తలు - ఎక్రెడిటెడ్ సోషల్ హెల్త్ యాక్టివిస్ట్స్ ) నియమించమని చేసిన సిఫార్సుల అమలును కనుగొంది. చత్తీస్ గఢ్ లో పాఠశాల మానేసిన పిల్లలు తిరిగి పాఠశాలలో చేర్పించడానికి ఆర్ .బి.సి. (రెసిడెంషియల్ బ్రిడ్జి కోర్సు) లను ప్రవేశ పెట్టింది. తిరిగి ఫిబ్రవరిలో ఎన్. సి. పీ. సీ. ఆర్. ఖమ్మం లో పర్యటించినప్పుడు పోషకాహార లోపం తగ్గు ముఖం పట్టినట్లు, ప్రత్యామ్నాయ బోధనా కేంద్రాలు (ఆల్ట ర్నేట్ లెర్నింగ్ సెంటర్స్ ) మరియు ఆర్ .బి.సి లు పిల్లలను పనులు మాన్పించి చదువులో పెట్టినట్లు మరియు అధిక శాతం పిల్లలకు టీకాలు వేయించడం జరిగినట్లు గమనించారు. అయినప్పటికీ, ఆరోగ్య కార్యకర్తలను పర్యవేక్షించి క్రమ పరచ వలసిన అవసరం ఉన్నట్లు ఈ బృందం గుర్తించింది. యుక్త వయసు బాలికలు ఇంకా పాఠశాలలకు రావడం లేదు. నిర్వాసిత ప్రజలు ఒటరు కార్డులు, రేషన్ కార్డులు లేక పోవడం వలన మరింత అభద్రతకు లోను అవుతున్నారు. అంతే కాక మంచి నీటి కొరత పోషణ మరియు ఆరోగ్య అభివృధ్ధికి సవాలు గా పరిణమించింది. ఎన్. సి. పీ. సీ. ఆర్. బృందం దంతెవాడ జిల్లా సుక్మా బ్లాకు లోని గ్రామాలు సందర్శించినప్పుడు పిల్లలను పాఠశాలలకు లేదా ఆర. బి.సి. లకి పంపేటట్లు వారి తల్లితండ్రులను ఒప్పించడానికి బాల అధికార సురక్ష సమితులు (బి. ఏ.ఎస్ . ఎస్ . లు) ఏర్పడినట్లు తెలుసుకున్నారు. కొంతమంది మహిళా బాస్ సభ్యులను ఏవో గొడవలతో సంబంధమున్న వారిగా ఎంచి అరెస్టు చేసినప్పటికీ, వారి విడుదల తరువాత కూడా పిల్లలను పాఠశాలలో చేర్పించే కార్యక్రమాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ ప్రాంతంలో విద్యకున్న ఆవశ్యకతను గుర్తించి ప్రభుత్వం ఎనిమిదవ తరగతి దాటిన విద్యార్ధులకు 500 మందికి సరిపడే ఆశ్రమ పాఠశాలలను మరియు వసతి గృహాల నిర్మాణానికి అనుజ్ఞ ఇచ్చింది. బాలల హక్కుల పరిరక్షణలో బాస్ (బి.ఏ.ఎస్ . ఎస్ .) సభ్యులు అత్యంత నిబధ్ధత కనపర్చారు. ఇటీవల ఆరు మంది పిల్లలలను బాల కార్మికులుగా హైదరాబాదుకు తరలించినప్పుడు, బాస్ సభ్యులు వారి సొంత డబ్బులు పోగు చేసి, అక్కడకు వెళ్ళి ఎం. వి. ఫౌండేషన్ అన్న స్వఛ్ఛంద సంస్థ సహయంతో విడిపించి తీసుకు వచ్చారు. చురుకుగా పర్యవేక్షించే బాస్ వలన, గ్రామాల్లోని పాఠశాలల్లో పూర్తి స్థాయిలో పిల్లలు హాజరౌతున్నారు. మరియు అంగన్ వాడి కార్య కర్తల విధి నిర్వహణకు కూడా తోడ్పాటు లభిస్తోంది.
జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషను (నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ - ఎన్ . సి. పీ. సీ. ఆర్. ) జరిపిన విచారణలో హెచ్ .ఐ.వి. బాధిత బాలలు ఎదుర్కొంటున్న సమస్యల్లో తగిన ఆశ్రయం, సంరక్షణ లేకపోవడం, మరియు ఆస్తి హక్కు నిరాకరణ ప్రముఖమైనవిగా వెల్లడైంది. జాతీయ, రాష్ట్ర స్థాయిలలో జరిపిన ఈ విచారణలో దాదాపు వంద మందికి పైగా హెచ్ . ఐ. వి. మరియు ఎ యి డ్స్ బాధిత బాలలు హక్కుల నిరాకరణ పరిశీలింప బడింది. వీరిలో చాలామంది అనాధలే.
ఎన్ . సి. పీ. సీ. ఆర్. అధ్యక్షురాలైన శాంతా సిన్హా అధ్యక్షత వహించిన న్యాయ శాస్త్ర మండలి సమక్షంలో గుజరాత్, ఒరిస్సా, పశ్చిమ బెంగాల్ , యూ.పి. మరియు డిల్లీకి చెందిన పిల్లలు ఫిబ్రవరి నెలలో డిల్లీలో జరిగిన జాతీయ విచారణలో పాల్గొన్నారు. ఈ జ్యూరీలో ఎన్ . సి. పీ. సీ. ఆర్. సభ్యురాలైన దీపా దీక్షిత్, ఎన్ . సి. పీ. సీ. ఆర్. మెంబర్ సెక్రటరీ లవ్ వర్మ, సినీ నిర్మాత నందిత దాస్ , నాజ్ ఫౌండేషన్ కు చెందిన అంజలీ గోపాలన్ , పోషకాహార నిపుణురాలు వీణాశత్రుఘ్న , పిల్లల వైద్యులు డా. శివానంద కూడా ఉన్నారు.
బాధితులలో సమస్యలను పైకి చెప్పుకున్న వాళ్ళలో వినీత్ ఒకడు. వినీత్, అతని తల్లి హెచ్. ఐ. వి. కలిగి ఉన్నారు. అతని తండ్రి మరణించాడు. పాఠశాలలో చాలా వివక్షను ఎదుర్కొంటున్నానని జ్యూరీకి వినీత్ చెప్పాడు. ఉపాధ్యాయులు తనకు ప్రత్యేకంగా ట్యూషన్లు చెప్పడానికి నిరాకరిస్తున్నారుట. దీనివల్ల వినీత్ ధైర్యాన్ని కోల్పోయి మానసిక ఒత్తిడికి లోనౌతున్నాడు.
ఈ సమస్యకు పరిష్కారం చూపకపోతే, అతను తెలివి గల వాడైనప్పటికీ బడి మానివేసే ప్రమాదం ఉంది. రాష్ట్ర ఎ యి డ్స్ నివారణ సంఘాన్ని పాఠశాల అధికారులను, సంబంధిత ఉపాధ్యాయులను కూడా కలవమనీ, కలిసి వారికి ఎ యి డ్స్ తో బాధ పడుతున్న వారి (పి.ఎల్ .హె చ్ .ఐ. వి. – పీపుల్ లివింగ్ విత్ హెచ్ . ఐ. వి. / ఎ యి డ్స్ ) పట్ల వివక్ష చూపరాదని వెలువడిన ప్రభుత్వ జీ.ఓ. గురించి తెలియచెప్పమనీ జ్యూరీ ఆదేశించింది. అంతే కాక వినీత్ ఇకపైన ఎటువంటి వివక్షకు గురి కాకుండా చూడాలని ఎ యి డ్స్ కంట్రోల్ సంఘాన్ని కోరింది. పాఠశాల కనుక జ్యూరీ ఆదేశాలను పాటించకపోతే పాఠశాలను మూసివేయాల్సి ఉంటుందని కూడా హెచ్చరించింది.
హెచ్ . ఐ. వి. తో బాధ పడుతున్న ఆరేళ్ళ చంద్రాణి తాత అమ్మమ్మలతో పాటు ఉంటున్న అనాధ బాలిక. చంద్రాణి ఏ. ఆర్. టి. కి నమోదు కాబడినప్పటికీ, ఆస్పత్రిలో సి.డి.4 మెషిన్ పనిచేయక పోవడం వలన సి.డి.4 పరీక్ష ఇంకా జరగలేదు.
చంద్రాణికి తరచు వచ్చే ఇన్ఫెక్షన్ల వల్ల బాధ పడుతోంది. పాఠశాలలోనూ, బంధువులలోనూ తీవ్ర వివక్షకు గురౌతోంది. అందు వలన తను ఎంతో విచారానికి, మానసిక ఒత్తిడికి లోనౌతోంది. ఆమె తాత అమ్మమ్మలు ఆమె సంరక్షణ బాధ్యత తీసుకోలేక చంద్రాణిని ఏదైనా సంస్థలో చేర్చాలనుకుంటున్నారు.
ప్రభుత్వ అస్పత్రిలో సి.డి.4 మెషిన్ పనిచెయ్యని కారణాలను పరిశీలించమని, వీలైనంత త్వరగా చంద్రాణికి సి.డి.4 పరీక్ష జరిపించమని జ్యూరీ నాకో ( ఎన్ . ఏ. సీ. ఓ. ) ను నిర్దేశించింది. క్షీణిస్తున్న ఆమె ఆరోగ్యం దృష్ట్యా ఆమెకు త్వరగా ఏ. ఆర్. టి. మొదలు పెట్టమని, సంబంధిత రాష్ట్ర ఎ యి డ్స్ నివారణ సంఘాన్నిఆదేశించింది. ఈ ఆరేళ్ళ చిన్నారిని వెను వెంటనే సంస్థలో చేర్పించాలని సూచించింది.
డిల్లీలో జరిగిన ఈ జాతీయ స్థాయి విచారణలో చర్చకు వచ్చిన ముఖ్య అంశాలు: పోషణ మరియు ఆరోగ్య సదుపాయాలు, హెచ్ . ఐ. వి. కలిగి ఉన్న కారణంగా పిల్లల పట్ల, వారి కుటుంబాల పట్ల చూపబడుతున్న వివక్ష, వ్యక్తిగత జీవితానికి భంగం కలిగించడం మరియు ఎ యి డ్స్ బాధితులను (పి.ఎల్ .హె చ్ .ఐ. వి.) అందరితో కలుపుకుని తోడ్పాటు నందించాలని ప్రజలకు అవగాహన లేకపోవడం.
ఈ సదస్సులో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, నాకో (జాతీయ రాష్ట్ర ఎ యి డ్స్ నివారణ సంస్థ) మరియు నాకో కు చెందిన వివిధ రాష్ట్రాల ప్రతినిధులు స్పందించి విచారణకు వచ్చిన ప్రతి కేసు కు సంబంధించిన విధి విధానాలను మరియు కార్యక్రమాల పరిస్థితుల మీద బహిరంగ చర్చలు జరిపారు.
ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు
చివరిసారిగా మార్పు చేయబడిన : 5/28/2020
జాతిని సవాలు చేస్తున్న బాలకార్మిక సమస్య ఇంకనూ కొనస...
“నా వరకు చదువు నేర్పడంలోనే మానవాళికి ముక్తి అనిపిస...
మంచి వాతావరణం నుంచి వచ్చిన పిల్లలు మంచి ప్రవర్తనతో...
బాలలపై వేధింపులు పై అధ్యయనం- స్త్రీ మరియు శిశు సంక...